17, అక్టోబర్ 2026, శనివారం

భారత ప్రస్తుత ఘన చరిత్ర 3*

 *


సభ్యులకు నమస్కారములు 


ఈ దేశం ఇంకా పురోగమించాలి. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పురోగమనంతో బాటు దేశంలోని సాంస్కృతిక, సాంప్రదాయ, శాంత, సౌజన్య మరియు సహకార స్వభావాలు కూడా పరిరక్షింపబడాలి మరియు పెంపొందాలి. భారతీయ ప్రాచీన శాస్త్రవిజ్ఞాన సంపద అధ్యయన, పరిశోధన *ప్రయోజనాల రూపంలో విస్తరించాలి*. పాఠ్య పుస్తకాల ప్రణాళికలు మారాలి. దేశ ఘన చరిత్రను, హైందవ మహనీయుల మరియు మహా వీరుల చరిత్రలను నేటితరం/బాల/ యువతరం తెలుసుకునేలా చేయాలి. అవినీతిని, అరాచకాలను రూపుమాపాలి. *ఇందుకు ప్రజలు, అధికారులు, నాయకులు సహకరించాలి*. ఈలాంటి ఎన్నో లక్ష్యాలు నెరవేరాలంటే *ప్రస్తుత ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి పదికాలాల పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ ప్రేమికులైన ప్రతి ఒక్కరు కోరుకోవాలి*.


అన్నింటికి మించి ఒక యోగికి ఉండవలసిన స్థితప్రజ్ఞత, ఆధ్యాత్మిక దృష్టి, ధర్మ స్పృహ మెండుగా ఉండడం గొప్ప ఘనతగా ప్రపంచ నాయకులందరికి గోచరిస్తున్నది. *ప్రస్తుత భారత దేశ ప్రధాని* యొక్క నిస్వార్థమైన ఈ లక్షణం ఒక రాజ యోగిగానో, రాజర్షి గానో అభివర్ణించేలా చేస్తోంది. 


ఈలాంటి నాయకుని పాలనను అనుభవిస్తూ, కనిపిస్తున్న సత్యాన్ని స్పష్టంగా తోటివారికి చెప్పకుంటే నిస్సందేహంగా అది దోషమే అవుతుంది. *ఇది ఒక పార్టీకో, ఒక రాజకీయ సంస్థకో చెందిన అంశం కాదు. దేశంపై, ధర్మంపై అభిమానమున్న ప్రతి వ్యక్తి కర్తవ్యం, యావత్ భారత దేశ ప్రజల కర్తవ్యం*.


దేశాన్ని అల్లకల్లోలం చేయాలని, అధిక జనుల అభిమానమున్న బలవంతమైన ప్రభుత్వాన్ని చికాకు పర్చాలని, ఉద్యమాల పేరిట అనేక శక్తులు ఏకమవుతున్నాయి... *ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ భారత దేశాన్ని, హైందవత్వాన్ని నిందించడం*.. ఇందులో ఎందరో దేశద్రోహులు, నేరగాళ్లు. తస్మాత్ జాగ్రత్త.


రంధ్రాన్వేషణలు లేవు, నిందారోపణలు లేవు. వ్యక్తుల నామధేయాలు లేవు, పార్టీల ప్రస్తావనలు లేకుండా కూర్చబడిన రచన. ఇది ప్రస్తుత భారత దేశ నగ్న దృశ్యము.


ధన్యవాదములు

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: