16, అక్టోబర్ 2026, శుక్రవారం

17అక్టోబరు26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     🍁 *స్థిరవారం*🍁            

 *🌹17అక్టోబరు26🌹*  

  *దృగ్గణిత పంచాంగం* 

              

       *ఈనాటి పర్వం* 

     *దేవీ త్రిరాత్ర వ్రత*

          *ప్రారంభః*

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*


*తిథి       : సప్తమి* *పూర్తిగా రోజంతా రాత్రితో సహా*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : మూల* ఉ 09.47 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం  : అతిగండ* రా 11.03 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం   : గరజి* రా 07.11 ఉపరి *వణజి* *రాత్రంతా పూర్తిగా*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ10.30-12.30 సా04.30-05.30*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.16*

*వర్జ్యం            : ఉ 07.59 - 09.47 & రా 08.35 - 10.24*

*దుర్ముహూర్తం  :ఉ 06.00 - 07.34*

*రాహు కాలం   : ఉ 08.56- 10.25*

గుళికకాళం     : *ఉ 06.00 - 07.28*

యమగండం    : *మ 01.21 - 02.49*

సూర్యరాశి : *కన్య*                         

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.09* 

సూర్యాస్తమయం :*సా 05.53*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:* 

ప్రాతః కాలం    : *ఉ  06.00 - 08.21*

సంగవ కాలం        : *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం    : *10.42 - 01.03*

అపరాహ్న కాలం : *మ 01.03- 03.24*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ శుద్ధ సప్తమి*

సాయంకాలం  : *సా 03.24 - 05.45*

ప్రదోష కాలం     : *సా 05.45 - 08.12*

రాత్రి కాలం       : *రా 08.12 - 11.28*

నిశీధి కాలం       : *రా 11.28 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


  *🌹ఓం నమో వేంకటేశాయ🙏*

*🪷ఓం శ్రీ పద్మావతీయై నమః 🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

స్వర్ణభస్మం

  స్వర్ణభస్మం ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ .

      

కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు .

                

      ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.  

    

      మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .

         

.       మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును.

                   

      ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో            

" గజపుటం " అంటారు .

                 

      ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి.  ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు .  ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను.

            

       దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది.  అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.  

     

                  విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి  ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను .

              ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు.

          

.       మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు.  ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు.

           

  ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును.

           

   మరికొన్ని ఉపయోగాలు కూడా మీకు వివరిస్తాను.


   *  స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును .

*  శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును.

* వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము .

* స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును.

*  ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది.

*  ఇది అత్యంత శ్రేష్టమైనది  బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును.

*  ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును .

*  రక్తాన్ని  శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును.

*  పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది .

*  క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును .

*  వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును.

*  రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును .

*  జ్వరములను హరించును .

*  ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును .

*  పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను .

*  స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు.

* ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు .

.*  శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును.

*  రక్తపోటు ( BP ) సమస్య నివారించును .

*  ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త  వాతరోగములను హరించును .

       

    పైన చెప్పిన యోగాలు మాత్రమే కాకుండా మరికొన్ని ఔషధాలలో స్వర్ణాన్ని కలపడం ద్వారా ఔషధ బలం పెరిగి ఫలితం త్వరగా రావటం నేను గమనించాను. స్త్రీలకు , పిల్లలకు దీనికి మూలికాలేహ్యములలో కలిపి ఇవ్వవచ్చు. ముఖ్యముగా స్త్రీలలో గర్భశయ దోషాలు , నెలసరి సమస్యల నివారణ జరిగింది. ముత్యభస్మమునకు దీనికి కలిపి ఇవ్వడం వలన స్త్రీలలో శరీరబలం పెరిగి స్త్రీలు ఎదుర్కొనే క్యాల్షియం సమస్య నివారణ అగును. శరీరకాంతి పెరుగును . ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో శిశువుకు చేయు స్వర్ణప్రాసన గురించి చాలా చక్కగా వివరించారు . పుష్యార్కయోగం అనగా గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన శిశువునకు స్వర్ణప్రాసన చేయించవలెను .

            స్వర్ణప్రాసన అనగా ప్రస్తుతం చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించి ఆ తరువాత ఆవునెయ్యి తగిలించి తరువాత స్వర్ణభస్మానికి తగిలించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించి లొపలికి ఇవ్వవలెను. కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో  పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయవలెను అని ఉన్నది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడించుచున్న బ్రహుస్పతితో సమానమైన తెలివితేటలు కలవారు , ఏకసంధాగ్రాహుకులుగా తయారగును .

         ప్రస్తుత పరిస్థితుల్లో  రోగనిరోధక శక్తి క్షీణించి వైరస్ లకు సంబంధించిన అనేక మహమ్మరులు ప్రభలుతున్న ఈ సమయాలలో  రోగనిరోధకశక్తి పెరగడానికి స్వర్ణభస్మ సేవన చేయుట అత్యంత ప్రధానం. ఈ స్వర్ణభస్మం కొంచం ఖరీదు ఎక్కువుగా ఉండును. అవకాశం ఉన్నవారు , ధనమును వెచ్చించ గలిగినవారు తప్పక స్వర్ణభస్మ సేవన చేయదగిన సూచన . అనుభవ వైద్యుల సలహా ప్రకారం మాత్రమే వాడగలరు . 


   

భృగువారం🌹* *🪷16అక్టోబరు26🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹భృగువారం🌹*

 *🪷16అక్టోబరు26🪷*  

  *దృగ్గణిత పంచాంగం* 

                

         *ఈనాటి పర్వం* 

 *🪷శ్రీ సరస్వతీ దేవి🪷* 

          *అలంకారం*   

       *మూలా నక్షత్రం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*


*తిథి : షష్ఠి* రా.తె 05.54 వరకు ఉపరి *సప్తమి*

*వారం  :శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* ఉ 06.47 వరకు ఉపరి *మూల*

*యోగం : శోభన* రా 10.06 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* సా 04.38 *తైలవ* రా.తె 05.54 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు;*

*ఉ09.30-10.30 సా04.30-05.30*

అమృత కాలం : *రా 02.35 -04.23*

 అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.16*

*వర్జ్యం   : మ 03.47 - 05.35*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.08 మ 12.16 - 01.03*

*రాహు కాలం  :ఉ10.25 - 11.53*

గుళికకాళం      :*ఉ 07.28 -08.56*

యమగండం   : *మ 02.49 - 04.17*

సూర్యరాశి : *కన్య*                     

చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*  

సూర్యోదయం :*ఉ 06.09* 

సూర్యాస్తమయం :*సా 05.54*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం        : *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం    : *10.42 - 01.03*

అపరాహ్న కాలం  : *మ 01.03-03.25*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ శుద్ధ షష్ఠి*

సాయంకాలం   : *సా 03.25 -05.46*

ప్రదోష కాలం     :  *సా 05.46-08.13*

రాత్రి కాలం         :*రా 08.13 - 11.28*

నిశీధి కాలం     : *రా 11.28 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.11*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                 *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            *🌷ఓం శ్రీ🌷* 

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

నవదుర్గలు

 🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹


    *భృగువారం 16 అక్టోబరు 2026*


*నవదుర్గలు /షట్చక్రాలు / శ్రీ చక్రం -మానవశరీరం*

              

```

*అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితినే అమ్మవారు లేక మూలప్రకృతి అంటారు.


*#ఆధ్యాత్మికత స్థితులు/చక్రాలు*


*ఆధ్యాత్మికత =ఇచ్ఛాశక్తి +జ్ఞానశక్తి +క్రియాశక్తి = పార్వతి + సరస్వతి + లక్ష్మీ= ధ్యానం + జ్ఞానం + సేవ.*


        *నవ రాత్రులనగా*


*1) మూలాధారచక్రం - (శైలపుత్రీ)- మొదటి రోజు పృధ్వీ🌎తత్త్వము:- అనగా అన్నమయ శరీరమునకు సంబంధించినది.


 *2)స్వాధిష్టానచక్రం - (బ్రహ్మచారిణీ) - రెండవ రోజు జల తత్త్వము:- ప్రాణమయ శరీరమునకు సంబంధించినది. రెండవ రోజు పూజ కోరికలు ధర్మయుక్తము అవడానికి.


*3)మణిపూరకచక్రం -  (చంద్రఘంట) మూడవ రోజు అగ్ని  తత్త్వము:-  మనోమయ కోశమునకు సంబంధించినది. మనలో భావాలు అగ్నితో పునీతమవుతాయి. అక్కరలేని భావాలు ఉండవు.


*4)అనాహతచక్రం - (కూష్మాండ) నాల్గవ రోజు వాయు తత్త్వము:-  దైవీ పరమైన భావాలు కలుగుతాయి. పంచభూతముల యందు స్వామిత్వము వస్తుంది. అంతర్లోకాలకి తీసుకొని వెడుతుంది.


*5)విశుద్ధచక్రం - (స్కందమాత) అయిదవ రోజు ఆకాశతత్త్వము. మన హృదయము లోపల ఆకాశము దర్శనమిస్తుంది. అమ్మవారిని 'దహరాకాశరూపిణి' అంటాము గదా!


*6)ఆజ్ఞా చక్రం - (కాత్యాయనీ) ఆరవ రోజు  మనసు మీద గూడా స్వామిత్వము వస్తుంది. మనసు మృదువుగా తయారయితే సప్తమి రోజు పూజ అనుభూతి నిస్తుంది.


*7)సహస్రార చక్రం  - (కాలరాత్రీ)  ఏడవ రోజు మనసును దాటి బుద్ధి లోకాలలోకి ప్రవేశం జరుగుతుంది. అపుడు మూలా నక్షత్రము రోజు పూజ చేసుకోవాలి.


*8)ఊర్ధ్వ సహస్రారచక్రము -(మహాగౌరీ) (బ్రహ్మరంధ్రము) ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పూజ. అనగా అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. మహిషాసురుడు అంటే అహం కారంతో కూడిన స్వభావము.

 

*9)బిందు చక్రం - (సిద్ధిదాత్రీ) అహంకారం తగ్గిపోతే  అమ్మవారి మహత్యం తొమ్మిదవ రోజు తెలుస్తుంది. తొమ్మిది, పది రోజులు పరమాత్మ  దివ్య చైతన్యంతో కూడి ఉంటుంది. అదే మహర్నవమి. విజయదశమి.


*10)నిర్వాణచక్రం - (మహిషాసురమర్ధిని /దుర్గాదేవి /రాజరాజేశ్వరీ దేవి )


*మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.


*1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)


*2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.దీన్ని సాలోక్యముక్తి అంటారు.)


*3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి.)


*4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైనరూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)


*5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ.ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.లభిస్తాయి.)


*శరన్నవరాత్రులు - శ్రీ త్రిపురసుందరి*


*దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షస శక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’.


*నవరాత్రుల పూజ తరవాత దశమితో పండగలు ముగుస్తాయి. ‘నవ’ సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. తొమ్మిది పూర్ణ శక్తి. నక్షత్రాలలో మొదటిదైన ‘అశ్వని’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ‘ఆశ్వయుజం’. ఒక విధంగా – నక్షత్రగణనతో ఇది సంవత్సరానికి మొదటి మాసం. ఈ తొమ్మదిరోజులు విశ్వ చైతన్య శక్తిని (పరాశక్తని – ఆదిశక్తిని) ఆరాధించేవారు పూర్ణంగా సంవత్సరారాధన ఫలాన్ని పొందుతారు. యోగపరంగా అంతర్ముఖావలోకనమే రాత్రి. ఆ సాధనలో విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని గమనించ గలుగుతాం.


అదే మనలోనూ సంచరిస్తోందని తెలుసుకున్నాక – మన అహంకారాలు, సంకుచిత దృష్టులూ అంతరిస్తాయి. ఆ అపరమిత శక్తినే వైష్ణవి, జగజ్జనని, శ్రీమాత, దుర్గ, లక్ష్మీ, సరస్వతి మొదలైన వివిధ నామాలతో భావించడం ఈ సాధనల విశేషం. మనలోని పరమిత శక్తిని ఆ అఖండ శక్తితో అనుసంధానం చేస్తే – ఈ వ్యష్టి చైతన్యం వ్యాప్తమై అనంతమైన శక్తులను జాగృతం చేసుకుంటుంది. ఆ శక్తిని ‘త్రిపురసుందరి’ అన్నారు. ఈ నామంలో ఎంతో వైశిష్ట్యం ఉంది. ఈ ప్రపంచమంతా ‘త్రిపురం’, ‘పురం’ అంటే చోటు అని అర్ధం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. ‘దేశం’ (స్థానం) లోకం. అదికాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిపి పురం.


*ఈ విశ్వమంతా త్రిపురమే. మనమున్న చోటు నడిమిభాగం. దానికిపైన ఊర్ధ్వలోకాలు ... కింద అధోలోకాలు. ఈ ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు – మూడు లోకాలు. అలాగే భూత, భవిష్య, వర్తమానాలు. వ్యాపించిన గుణాలు సత్త్వ, రజస్తమో గుణాలు. జరిగే పనులు – సృష్టి, స్థితి, లయలు. ముగ్గురు వేల్పులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓంకారం మూడు అంగాలు – అ, ఉ, మ. వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు – ఋక్, యజు, స్సామములు.


*ఇలా అన్నీ ‘త్రి’పురాలే. ఇక మనలో భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. జాగ్రత్, స్వప్త సుషుప్తులు మూడు. యోగపరమైన నాడులు మూడు – ఇడా పింగళ సుషుమ్న. ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే – త్రిపుర సుందరి.


*ఇంతకీ ఏమిటీ సౌందర్యం? చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యమనే సౌందర్యమున్నప్పుడే జీవిలో ‘నేను’ అనే స్ఫురణ. అటుపై బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియశక్తి పనిచేస్తాయి. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కనుక దీనిని ‘ఆదిశక్తి’, ‘పరాశక్తి’ అని భావించారు. ఆ సౌందర్యాన్ని అమ్మా అని పిలిస్తే ‘సుందరి’. ఆ శక్తి అనుగ్రహమే అంతా అని తెలియనివాడు అంతా తన నిర్వాకమే అనుకుంటాడు. మన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో వ్యాపించిన ఆ శక్తిని పరాశక్తిగా గుర్తించని అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే త్రిపురసుందరిని తెలుసుకోగలం.


*త్రి-పురా, ఈ మాటా చాలా అద్భుత శబ్ధం. ‘పురా’ అంటే చోటు అనేకాకా ‘పూర్వము’ అని కూడా అర్ధం. ఈ మూడుచోట్లు (మూడు లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరా) కలుగక ‘పూర్వమే’ ఉంది ఆ సౌందర్యం. మూడింటికీ పూర్వమున్నదీ, మూడు నశించినా తాను నశించనిది ‘త్రిపురం’. పదార్ధంకన్నా ముందున్నది శక్తి. అందుకే అది ‘త్రిపురా’, ‘పురాణాత్ పురా’ – ‘నిండినది’ అని కూడా ‘పురా’ శబ్ధానికి అర్ధం.


*త్రి కూడిని విశ్వంలో నిండినది ఇదే. ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది ‘లలిత’ జీవరాశి అంతా ఆ శక్తినే ‘ఆశ్రయించు కున్నది, ఆ శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ శబ్ధానికి ఆశ్రయమనేకాక, శోభ, కాంతి, ఐశ్వర్యం అనే అర్ధాలున్నాయి. ఈ వివరణను చూస్తే సౌందర్యానికన్నా ఐశ్వరమేమున్నది.



 *చైతన్యమే లేకపోతే శోభ, కాంతి ఉండవు. అందుకే సౌందర్యలహరియే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి, దుష్టత్వం వీటిని సమూలంగా నాశనంచేసే దివ్యత్వమే దుర్గాదేవి.


          *🪷సేకరణ🪷*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*