28, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రీమద్భాగవతం - 33/42*

 *శుక్రవారం 28 ఆగస్టు 2926*

*శ్రీమద్భాగవతం - 33/42* 

*గోపాలురకు వైకుంఠ దర్శనం, పంచాధ్యాయి – దివ్య రాసలీల & గోపికాగీత*

ఓం నమో భగవతే వాసుదేవాయ!

భాగవత అధ్యయనం లో ఈరోజు రమణీయ రాసలీల ఘట్టం స్మరించి తరించే ప్రయత్నం చేద్దాం రండి.

వరుణ పాశాలు - వైకుంఠ దర్శనం 

ఒక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నందమహారాజు ఎంతో భక్తితో ఏకాదశి ఉపవాసం పూర్తి చేశాడు. మరుసటి రోజు ద్వాదశి ఘడియలు దాటిపోకముందే స్నానం చేసి పూజ ముగించాలనే తొందరలో, తెల్లవారకముందే అర్ధరాత్రి వేళలోనే నదిలోకి దిగాడు. అది రాక్షసులు తిరిగే అశుభ సమయం కావడంతో, జలాలకు అధిపతి అయిన వరుణ దేవుని సేవకుడు అయిన అసురుడు ఒకడు నందుడిని బంధించి వరుణ లోకాలకు తీసుకుపోయాడు.

ఉదయం చూసేసరికి నందుడు కనిపించక గోకులమంతా కన్నీరుమున్నీరైంది. నందుడిని ఎవరో జలరాక్షసులు పట్టుకుపోయారని తెలిసి ప్రజలంతా శ్రీకృష్ణుడి దగ్గరకు పరుగుతీశారు. వెంటనే శ్రీకృష్ణుడు దివ్య దృష్టి తో అంతా తెలుసుకుని,సరాసరి వరుణుడి లోకానికి చేరుకున్నాడు.

జగన్నాథుడైన శ్రీకృష్ణుడే స్వయంగా తన లోకానికి వచ్చేసరికి వరుణ దేవుడు ఆనందంతో, భయభక్తులతో స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, అర్ఘ్య పాధ్యాదులు ఇచ్చి"స్వామీ! నా సేవకుడు అజ్ఞానంతో చేసిన తప్పును క్షమించి, నీ తండ్రిని స్వీకరించు" అంటూ నందుడిని ఎంతో మర్యాదతో అప్పగించాడు.

తిరిగి ఇంటికి వచ్చిన నందుడు, దేవతలే శ్రీకృష్ణుడి పాదాలపై పడి మొక్కుతున్న ఆ అద్భుతాన్ని గోపాలురందరికీ చెప్పాడు. అది విని గోపాలురు ఆశ్చర్యపోయి... "మనతో ఆడుతూ పాడుతూ తిరిగే ఈ చిన్నారి కృష్ణుడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు పరమాత్ముడు! మరి ఆయన నివసించే ఆ పరమ లోకం ఎలా ఉంటుంది? మనలాంటి సామాన్యులకు అది చూసే భాగ్యం దక్కుతుందా?" అని తమలో తాము పరితపించసాగారు.

వారి మనసులోని అమాయకమైన, నిష్కల్మషమైన భక్తిని శ్రీకృష్ణుడు గుర్తించాడు. వారందరినీ యమునా నదిలోని పవిత్రమైన బ్రహ్మహ్రధం అనే  మడుగు వద్దకు తీసుకెళ్లి, నీటిలో మునిగి లేవమని చెప్పాడు.

గోపాలురు ఆ నీటిలో మునిగి పైకి లేవగానే... వారి కళ్ళముందు భౌతిక ప్రపంచానికి అతీతమైన దివ్య లోకం సాక్షాత్కరించింది. కోట్ల సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ లోకంలో, చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో వెలిగిపోతున్న పరమాత్ముడిని దేవతలు, మునులు స్తుతిస్తుండటం చూసి గోపాలురు పరవశించిపోయారు. ఆ దేవదేవుడే తమ కళ్లముందు చిరునవ్వుతో ఉన్న కృష్ణుడని గ్రహించి, ఆనందభాష్పాలతో శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించారు. (పూర్వం అక్రూరుడు ఇదే హ్రధం లో మునిగి స్వామి దర్శనం పొందాడు.)

శరత్కాల వేణుగానం & గోపికల ఆగమనం 

ఇది వరకు గోపికలు కాత్యాయనీ వ్రతం చేసిన సందర్భంగా వారితో మీ వ్రతం ఫలించింది రాబోవు శరత్కాలంలో మీతో రాసక్రీడ జరిపి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు కదా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం సంసిద్ధుడు అయ్యాడు స్వామి..

నిర్మలమైన ఆకాశం, పూర్ణచంద్రుని వెన్నెల కురుస్తున్న శరత్ పూర్ణిమ రాత్రి వేళ, శ్రీకృష్ణుడు తన యోగమాయను ఆశ్రయించి యమునా నదీ తీరాన వేణునాదం ప్రారంభించాడు. ఆ దివ్య నాదం భౌతికమైనది కాదు అది పరమాత్మ జీవులను తన వైపు పిలిచే ప్రణవ నాదం!

ఆ వేణుగానం విన్న మరుక్షణమే గోపికలు తాము చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేశారు — పాలు కాచేవారు పాలను అలాగే వదిలారు, పిల్లలకు పాలిచ్చేవారు పక్కన పెట్టారు, భోజనం వడ్డించేవారు చేతి పాత్రలను విడిచిపెట్టారు.

* లోకనిందలను, బంధువుల అడ్డుకట్టలను, చివరకు దేహస్మృతిని సైతం విస్మరించి బృందావనం వైపు పరుగెత్తుకు వచ్చారు. కొందరు గృహాలలో బంధించబడిన గోపికలు తీవ్రమైన కృష్ణ ధ్యానంలో తమ ప్రాకృత దేహాలను త్యజించి సూక్ష్మరూపంలో పరమాత్మను చేరుకున్నారు.

సహింపశక్యము గాని తీవ్రమైన కృష్ణవిరహతాపముచే వారిలోని అశుభసంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన, అచ్యుతుని ఆలింగనమువలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలును క్షయమయ్యెను. అంతేగాక, ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసికొన్నవారలు త్రిగుణముల కార్యమగు దేహములను విడిచి పెట్టి, వెంటనే సమస్తకర్మబంధములనుండి విముక్తిని పొంది, భగవంతునిలో ఐక్యము నొందిరి.

2. శ్రీకృష్ణుని పరీక్ష & గోపికల నిశ్చల ప్రేమ 

గోపికలు ఎదుటకు రాగానే శ్రీకృష్ణుడు లోక ధర్మాన్ని పరీక్షించడానికి ఇలా అన్నాడు:

 "గోపికలారా! మీకు స్వాగతం. కానీ అర్ధరాత్రి వేళ అడవికి రావడం స్త్రీలకు ధర్మం కాదు. మీ భర్తలు, పిల్లలు వెతుకుతుంటారు. వెంటనే మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి!"పైగా ఇక్కడ సింహాలు, పులులు తిరుగుతూ ఉంటాయి. గృహాలలో మీకోసం పసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఆవు దూడలు అంబా అంటూ అరుస్తూ ఉంటాయి.మీరు నాపై నిష్కపట ప్రేమతో వచ్చారు బహు సంతోషం కానీ కుటుంబ పాలన మీ ధర్మం కదా.నా పక్కన ఉంటేనే నాపై భక్తి వస్తుంది అనుకోవద్దు, ఎల్లపుడు నా లీలలు స్మరిస్తూ,నా రూపం ధ్యానిస్తూ,నా నామం పలుకుతూ ఉండటం వల్ల అనన్య భక్తి కుదురుతుంది మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు.

ఆ మాటలు విన్న గోపికల ముఖాలు వెల వెల పోయాయి, నోట మాట రాలేదు, గోపికలు శ్రీకృష్ణునీ పొందటం కోసం తమ ఐహిక సుఖ భోగాలు, సకల కోరికలు త్యజించి ఉన్నారు, అందువల్ల తమకు అత్యంత ప్రీతి పాత్రుడు అయిన శ్రీకృష్ణుడు అలా పలికే సరికి

గోపికలు కన్నీళ్లతో గద్గద స్వరంతో ఇలా సమాధానమిచ్చారు:

 "స్వామీ! పూజ్యులైన కృష్ణ ప్రభూ మీరు ఇలా పరుషంగా మాట్లాడటం ఏ మాత్రం తగదు మేము మా సర్వస్వం వదిలేసి నిన్నే నమ్ముకుని,నీ పాదములను ఆశ్రయించడానికి వచ్చిన భక్తురాండ్రము, దయతో మమ్మల్ని విడిచి పెట్టకు 

లౌకిక భర్తలు, బంధువులు దేహానికి సంబంధించిన వారు మాత్రమే. కానీ సమస్త ప్రాణులకు ఏకైక నిజమైన పతి, ఆత్మ నీవే! సమస్తాన్ని త్యజించి నీ పాదపద్మాలను ఆశ్రయించిన మమ్మల్ని తృణీకరించకు."

ప్రభూ! సురలోకమును (సమస్త దేవతలను) రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై (వామనుడై) అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి ఇది ముమ్మాటికి నిజము. 

దుఃఖనివారకా! మేము తనివిదీర నిన్ను భజించుటకై ఎంతో ఉవ్విళ్లూరుచున్నాము. అందుకై మా ఇండ్లు వాకిండ్లను విడిచిపెట్టి నీ పాదములను ఆశ్రయించితిమి. అట్టి మా యెడ ప్రసన్నుడవు కమ్ము. పరమపురుషా! మనోహరమైన నీ ఈ చిఱునవ్వులను దర్శించుటకై నిరీక్షించుచు మన్మథతాపములకు లోనైతిమి. అందువలన మమ్ము

నీ దాసీలనుగా స్వీకరించి మా తాపములను చల్లార్చుము.అని అనేక రకాలుగా వేడుకున్నారు

శ్రీకృష్ణుడు సనకాదిమహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమపారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాపవచనములను శ్రద్దగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభువు ఆ గోపికలపై జాలిగొని, చిఱునవ్వును చిందించుచు అందఱిలోను శ్రీకృష్ణరూపుడై వారితో క్రీడించెను.

.🌟సౌభాగ్య మదం & శ్రీకృష్ణుని అంతర్ధానం 

గోపికలు మహాత్ముడైన కృష్ణభగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందారు. వారి మనోరథములన్నియును ఈడేరెను. అంతట వారు ఈ లోకములోని స్త్రీలలో తమ యంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియు తలంచుచు పొంగిపోసాగిరి. 

అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలయొక్క సౌభాగ్య మదమును, దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించుటకై వారి మధ్య నుండి **అంతర్ధానమయ్యాడు (మాయమయ్యాడు)!**

4. గోపికల విరహం & గోపికాగీత 

కృష్ణుని వియోగంతో గోపికలు పిచ్చివారయ్యారు. బృందావనంలోని చెట్లను, లతలను, జింకలను, పూలను "మా శ్యామసుందరుడు ఏడి?" అని వేడుకుంటూ వెతికారు. కృష్ణుని లీలలనే తాము స్వయంగా అభినయించారు (తాండవం, పూతనా వధ, గోవర్ధనోద్ధరణం మొదలైనవి).

చివరకు అలసిపోయి యమునా సైకత తీరాన కూర్చుని, కన్నీటి ధారలతో కృష్ణుని కోసం పరమ పవిత్రమైన **'గోపికాగీత'** ను గానం చేశారు:

 **"జయతి తేఽధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్ర హి |**

**దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే ||"**

**"తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్ |**

**శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాః ||"**

**తాత్పర్యం:** "ఓ ప్రాణనాథా! నీ పాదస్పర్శతో వ్రజభూమి వైకుంఠమైంది. నీ కథామృతం సంసార తాపాలలో కాలిపోయే మానవులకు పరమ సంజీవని. నీ వియోగంలో ఒక్క క్షణం కూడా మాకు యుగంలా గడుస్తోంది. దర్శనమిచ్చి మా ప్రాణాలను కాపాడు!"చాలా అద్భుతమైన స్తుతి చేశారు (దాదాపు 19 శ్లోకములు ఉంటుంది)

5. శ్రీకృష్ణ పునరాగమనం & మహారాస మహోత్సవం

గోపికల అహంకారం పూర్తిగా నశించి నిష్కల్మష శరణాగతి మిగిలిన క్షణంలో... పీతాంబరధారియై, మురళీధరుడై, చిరునవ్వు చిందిస్తూ శ్రీకృష్ణుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు!

అప్పుడు ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది, తాపత్రయమునుండి బయట పడినట్లుగా, గోపికలు అందఱును శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవుచు, తమ విరహతాపములనుండి విముక్తలై ఎంతయు మనశ్శాంతినీ 

పొందిరి.

పిమ్మట శ్రీకృష్ణ పరమాత్మ వారిని యమునా నదితీరాన గల ఇసుక తిన్నెల వద్దకు తీసుకు పోయి ఆనందించాడు.

ప్రియమైన గోపికలారా! మీ ప్రేమ నిష్కపటమైనది. నాపై మీరు చూపిన ప్రేమకు మీ అమాయికమైన కృత్యములకు ప్రత్యుపకారము చేయుటకు నేను సమర్థుడనుకాను. దేవతల ఆయుర్దాయమును పొందినప్పటికినీ మీ ఋణము తీరేదికాదు. మీరు నన్ను చేరుటకై విడదీయరాని, దృఢమైన ఇండ్లు - వాకిండ్లు అనే సంకెళ్ళను పూర్తిగా తెగగొట్టితిరి. 

నిర్మలమైన మీ ప్రేమభావమును నాయందే సమర్పించితిరి. కావున, మీరు మీ సాధుస్వభావముతో, నిష్కపటమైన ప్రేమతో నన్నుఋణవిముక్తుని చేయవచ్చును. కాని, నేను మాత్రము మీ ఋణమును తీర్చుకొనలేను. కాదు, కాదు ఎప్పటికీ నేను మీకు ఋణగ్రస్తుడనయ్యే ఉండెదను.(సర్వస్య శరణాగతి యే రాసలీల)

* **రాస మండలం:** యమునా నదీ తీరాన వేలాది గోపికలు గుండ్రంగా వలయంగా (రాస మండలంగా) ఏర్పడ్డారు.

* **శ్రీకృష్ణుని విస్తరణ:** ప్రతి ఇద్దరు గోపికల మధ్య ఒక శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు! వందలాది మంది గోపికలు ఉండగా, ప్రతి గోపికా **"శ్రీకృష్ణుడు నా పక్కనే ఉండి నాతోనే నాట్యం చేస్తున్నాడు"** అని భావించేలా స్వామి అనేక రూపాలను ధరించాడు.

* **దివ్య నాట్యం:** దేవతలు విమానాలలో నిలిచి పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు గానం చేయగా, పరమశివుడు ఈ రాసలీలను తిలకించడానికి గోపికా రూపం (గోపేశ్వర మహాదేవుడు) ధరించి వచ్చాడు. ఆ రాత్రి బ్రహ్మదేవుని ఒక కల్ప కాలమంత సుదీర్ఘంగా విస్తరించింది.(లీల చాలా పెద్దగా ఇక్కడ అంతా ఇవ్వలేను ఈ వేదిక పై అవసరం కూడా లేదు ఇది ఎవరికి వారు చదువుకుని అనుభవించాల్సిన లీల)

పరీక్షిత్తు మహారాజు కు మనకు వచ్చే శంకే రాగా శుకమహర్షి స్పష్టం చేశారు: *"రాజా! శ్రీకృష్ణుడు ఆప్తుడు, నిష్కాముడు, ఆత్మారాముడు. ఆయన చేసినది ప్రాకృత కామక్రీడ కాదు. ఆయన పరమాత్మ, గోపికలు జీవాత్మలు. జీవాత్మ పరమాత్మతో లీనమయ్యే పరమ ఆధ్యాత్మిక బ్రహ్మానంద తాదాత్మ్యమే రాసలీల!"*

అగ్ని హేయములు, అహేయములు అగు పదార్దములను అన్నింటిని భక్షించుచున్నను ఆయనకు ఎట్టి మాలిన్యమూ అంటుటలేదు గదా! తేజోమూర్తుల శక్తిసామర్థ్యములు కూడా అట్టివే. సామాన్యుడు (సమర్థుడు కానివాడు) ఇట్టి కార్యమును గూర్చి మనస్సులోగూడ సంకల్పింపరాదు మూర్ఖత్వముతో అట్లు చేసినచో, అతడు నశించుట తథ్యము. సర్వేశ్వరుడైన శంకరుడు సముద్రమునుండి పుట్టిన హాలాహల విషమును పానము చేసినట్లు అసమర్థుడు చేసినచో తత్క్షణమే అతడు భస్మమగును. 

ఒక పసివాడు తన ప్రతిబింబములతో ఆడుకొనునప్పుడు అతనిలో ఆనందహేల తప్ప ఎట్టి వికారములును ఉండవు. అట్లే శ్రీకృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడించుచున్నప్పుడు ఆ స్వామిలో' ఎట్టి వికారములకు తానే లేకుండెను. ఏలయన, గోపికల హృదయములలో శ్రీకృష్ణభగవానుడే ప్రతిబింబించుచుండెను. అనగా భగవంతునకును, భక్తులకును మధ్యగల అవినాభావ సంబంధములు అట్టివి.

పరమేశ్వరుడు సకలప్రాణులను అనుగ్రహించుటకొరకే మానవదేహమును ధరించెను. కావున, ఆ దేహమునకు తగినట్టి లీలలనే ప్రకటించును. అట్టి లీలావైభవములను విన్నవారు భగవత్పరాయణులు అగుదురు. 

గోకులవాసులగు జనులకు శ్రీకృష్ణునియెడల దోషబుద్ధి కలుగనేలేదు. ఏలనన, ఆయన యోగమాయచే మోహితులైనవారికి తమ తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లుగా తోచెను. 

ఇంతలో బ్రాహ్మముహూర్తము ఆయెను. వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులగు గోపికలు వెళ్ళుటకు అనుమతి నిచ్చెను. ఆ ప్రభువు ఆజ్ఞమేరకు తమ తమ ఇండ్లకు వెళ్ళిరి.

 పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు వ్రజభామినులతో నెఱపిన ఈ రాసలీలలను గూర్చి పదేపదే శ్రద్ధగా వినినవారు, వాటిని ప్రస్తుతించినవారు ఆ పరమాత్ముని పాదపద్మములపై ప్రగాఢమైన భక్తికి నోచుకొందురు. తత్ప్రభావముచే వారు తమ జీవితకాలమున జితేంద్రియులు అగుదురు. అతి శీఘ్రముగా కామవికారాది హృద్రోగములనుండి విముక్తులగుదురు.

📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:

1. **మధుర భక్తి పరాకాష్ఠ:** గోపికల ప్రేమ దేహ సంబంధమైనది కాదు; అది ఆత్మ సమర్పణ రూపమైన అత్యున్నత భక్తి.

2. **అహంకారం ఉంటే హరి దక్కడు:** భగవంతుని సన్నిధిలో ఉన్నా సరే, అహంకారం తలెత్తితే పరమాత్మ వెంటనే దూరమవుతాడు; సంపూర్ణ శరణాగతితో మాత్రమే ఆయనను తిరిగి పొందగలం.

3. **రాసలీలా శ్రవణ ఫలం:** ఎవరైతే ఈ రాసలీలను శుద్ధ మనస్సుతో వింటారో, వారి హృదయంలోని కామ వికారాలన్నీ నశించి పరమ భక్తి లభిస్తుందని భాగవత ఫలశ్రుతి.

....సశేషం

🙏🌹🙏

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

వాహ్ రే డబ్బు!

  వాహ్ రే డబ్బు!

నీకు ఎన్ని పేర్లు?

గుడిలో ఇస్తే, 

( ముడుపు )

                       స్కూల్లో

                    ( ఫీజు )

పెళ్లిలో ఇస్తే,

( కట్నం )

                  విడాకులు ఇస్తే

              ( భరణం )

నువ్వు ఎవరికైనా ఇస్తే,

          ( అప్పు )

                     కోర్టులో

                   ( జరిమానా )

ప్రభుత్వం తీసుకుంటే,

      ( పన్ను )

                రిటైర్ అయ్యాక వస్తే

                   ( పింఛను )

కిడ్నాపర్లకు ఇస్తే

   ( విమోచన ధనం )

          హోటల్లో సేవకు ఇస్తే

                 ( టిప్పు )

బ్యాంకు నుండి తీసుకుంటే,

     ( రుణం )

              కష్టపడే వారికి

                 ( జీతం )

కింది ఉద్యోగులకు

    ( కూలీ )

       అక్రమంగా తీసుకుంటే

             ( లంచం )

మరి నాకు ఇస్తే,

   ( గిఫ్ట్ )

            నేను డబ్బుని.

నన్ను నువ్వు చనిపోయాక పైకి తీసుకెళ్లలేవు,

కానీ బతికి ఉండగా నేను నిన్ను చాలా పైకి తీసుకెళ్లగలను.

             నేను డబ్బుని.

నన్ను ఇష్టపడండి, కానీ ఆ ఇష్టం వల్ల జనాలు మిమ్మల్ని అసహ్యించుకునేంత వరకు కాదు.

             నేను డబ్బుని.

నేను దేవుడిని కాదు, కానీ జనాలు నన్ను దేవుడి కంటే తక్కువగా చూడరు.

        నేను డబ్బుని.

నేను ఉప్పు లాంటి వాడిని. అవసరం తప్పనిసరి, కానీ అవసరానికి మించితే జీవితపు రుచే చెడిపోతుంది.

         నేను డబ్బుని.

చరిత్రలో నా దగ్గర లెక్కలేనంత సంపద ఉన్నా, చనిపోయాక వారి కోసం ఏడ్చేవారు ఎవరూ లేని వారి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

         నేను డబ్బుని.

నేనేమీ కాను, కానీ జనాలు నీకు ఎంత గౌరవం ఇస్తారో నేనే నిర్ణయిస్తాను.

         నేను డబ్బుని.

నేను నీ దగ్గర ఉంటే నీవాడిని.

నీ దగ్గర లేకపోతే, నీవాడిని కాను, కానీ నేను నీ దగ్గర ఉంటే అందరూ నీవారే.

            నేను డబ్బుని.

నేను కొత్త కొత్త బంధుత్వాలను సృష్టిస్తాను, కానీ అసలైన, పాత బంధాలను చెడగొడతాను.

            నేను డబ్బుని.

నేనే అన్ని గొడవలకు మూలం

అయినా ఎందుకో తెలియదు అందరూ నా వెంటే ఎందుకు పిచ్చిగా పరుగెడతారు?

                🔴

ఒక నిజం ఇది కూడా.........

మారుతున్న కాలం సార్ ...

ముందు "వయసు"లో పెద్దవారికి

    గౌరవం ఉండేది...।

ఇప్పుడు "ఆదాయం"లో పెద్దవారికి

  _గౌరవం ఉంటుంది._🚩

పంచాంగం 28.08.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 28.08.2026 Friday,

స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర శతభిషం నక్షత్రం అతిగండ యోగః బవ తదుపరి బాలవ కరణం.

రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

శ్రాద్ధ తిథి: పాడ్యమి.

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ।। 43 ।।

ప్రతిపదార్థ:

తత్ర — అక్కడ; తం — అది; బుద్ధి-సంయోగం — జ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి; లభతే — పొందును; పౌర్వ-దేహికమ్ — పూర్వ జన్మల నుండి; యతతే — పరిశ్రమించును; చ — మరియు; తతః — ఆ తరువాత; భూయః — మరల; సంసిద్ధౌ — పరిపూర్ణత కొరకు; కురు-నందన — అర్జునా, కురు వంశస్తుడా.

తాత్పర్యము: 

ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.

వివరణ:

ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు, వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మనం పూర్వ జన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలు ఏవైనా ఉన్నా – వైరాగ్యము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, సహనము, ధృఢ సంకల్పము, మరియు ఇతర దైవీ గుణములు అన్నీ – ఆయనకు తెలుసు. కాబట్టి సరైన సమయంలో మన పూర్వ జన్మల పరిశ్రమ ఫలితాన్ని, ఆయా సంపాదన అనుగుణంగా, తిరిగి ఇస్తాడు మరియు మన ఆధ్యాత్మికతను లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక ప్రాపంచిక ధృక్పథంలోనే ఉన్న కొందరు అకస్మాత్తుగా పూర్తి ఆధ్యాత్మికతలో ఎందుకు అయిపోతారో, ఇది మనకు తెలియచేస్తున్నది. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు, వారికి పూర్వ జన్మల సాధన ఫలితం లభిస్తుంది.

ఒక యాత్రికుడు విరామం కోసం దారిలో ఉన్న ఒక హోటల్లో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ, తను లేచినప్పుడు, తను ఇప్పటికే వచ్చిన దూరాన్ని తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. అదే విధంగా, భగవంతుని కృప వలన, పూర్వ జన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో, అక్కడి నుండి పురోగమించటానికి, తాను ఇంతకు క్రితమే సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని, వ్యక్తి నిద్ర లేచినట్టుగా, యోగి తిరిగి పొందుతాడు. అందుకే ఇటువంటి యోగి ఎన్నటికీ దారితప్పడు.

సంపాదన

  సంపాదన , దాచుకోవటం , కూడబెట్టడం అంటే .. 

ఆస్తులు , డబ్బు , పదవి కానే కాదు.. 

నీ ధర్మాన్ని దాచుకోవడం , నీ ధర్మాన్ని కూడబెట్టడం , నీ సంతానాన్ని పెంచుకోవడం 

సనాతన ధర్మ పరిరక్షణ అనే సంకల్పాన్ని చేపట్టడం.. 

అప్పుడే .. నీ పరుగుకి , పరువుకి , సమాజానికి మేలు జరుగుతుంది.. 

జై శ్రీరామ్..

మీ 

హిందూ జన సంఘ్ 

తెలుగు రాష్ట్రాలు

*రాఖీ పౌర్ణమి

  288ఫ4:

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`28తేదీ,శుక్రవారం..`

               *రాఖీ పౌర్ణమి*

                ➖➖➖✍️

'రాఖీ’, ‘రక్షా బంధన్’ లేదా ‘రాఖీ పౌర్ణమి` అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో *శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ* అని కూడా పిలుస్తారు. 

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. 

కొంతకాలం క్రితం వరకూ ఉత్తర , పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతటా జరుపుతున్నారు. 

అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. 

రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు , అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. 

చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. 

అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.

*రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే..*

పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. 

భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. 

సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. 

అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. 

సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. 

శచీదేవి ప్రారంభించిన 

ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

*రాఖీపౌర్ణమి చరిత్ర:*

*ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం:*

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. 

శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. 

అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. 

దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. 

అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి చీరలిచ్చి ఆమెను కాపాడుతాడు.

*శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి:*

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. 

శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. 

అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ *”యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల"* 

*భావం:-*

“ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను.)”

*అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ:*

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. 

జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. 

ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. 

ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. 

అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి , అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. 

పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. 

దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.

*హయగ్రీవావతారం:*

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు..

పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. 

ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. 

అయితే ఆమె అదిసాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. 

ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. 

ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. 

విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. 

చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా 

ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే 

ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. 

అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. 

అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. 

దేవతలు అంతటా వెదికారు కానీ 

ఆ తల కనిపించలేదు. 

బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. 

అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. 

దేవతలు అలాగే చేశారు. 

ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. 

ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. 

ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. 

దేవీ శక్తి మహిమను , శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. 

అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷

 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`

                     ➖▪️➖

కుంభకోణం - తంజావూరు

  🕉 మన గుడి : నెం 1585

⚜  తమిళనాడు : కుంభకోణం - తంజావూరు

💠 తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న బాణపురీశ్వరర్ ఆలయం, శివుడికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక  ఆలయం. 

ఇక్కడి ప్రధాన దైవం, బాణపురీశ్వరర్ , సౌందరనాయకి అమ్మవారితో పాటు పూజించబడతారు. 

💠 కుంభకోణ ఆలయ చరిత్ర ప్రకారం శివుడిచే బాణం వేయబడిన అమృత కలశం గాథతో కూడా ఈ ఆలయానికి సంబంధం ఉంది.

 ఇక్కడ కలశం లేదా బాణీ తేలుతూ ఉంటుంది కాబట్టి శివుడిని బాణపురీశ్వరర్ అని పిలుస్తారు.

🔔 స్థల పురాణం 

💠 కుంభకోణం మరియు మహామాహం ఉత్సవం యొక్క ఆవిర్భావంతో నేరుగా సంబంధం ఉన్న 12 ఆలయాలలో ఇది ఒకటి. ఆ పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు సమస్త జీవుల బీజాలను, అలాగే వేదాలను మరియు పురాణాలను ఒక కుండలో ఉంచాడు, దానికి అమృత కలశం అని పేరు వచ్చింది.

💠 ఈ రకమైన కుండను సంస్కృతంలో కుంభం అని, తమిళంలో కుడం అని అంటారు. దీనిని పువ్వులు, బిల్వం, శుభ వస్త్రం, చందనం, మరియు యజ్ఞోపవీతం వంటి వివిధ వస్తువులతో అలంకరించేవారు, దాని పైన ఒక కొబ్బరికాయను ఉంచేవారు. ఈ రోజు మనం గృహ కార్యక్రమాలలో మరియు ఆలయాలలో చూసే కలశాల మాదిరిగానే, వీటన్నింటినీ కలిపి కట్టేవారు. 

💠 ఆ కుండను మేరు పర్వతం పైన ఉంచారు. జలప్రళయం భూమిపై ఉన్న సమస్త జీవులను నాశనం చేసింది.  బ్రహ్మ తయారుచేసిన కుంభం కూడా స్థానభ్రంశం చెంది, సంవత్సరాల తరబడి వరద నీటిపై తేలియాడుతూ ఉంది. 

చివరకు, అది ఒక ప్రదేశంలో స్థిరపడింది (దీనినే ఆధునిక కుంభకోణంగా పరిగణిస్తారు). 

💠 శివుడు, ఒక వేటగాడి వేషంలో, తన విల్లు మరియు బాణంతో (బాణం) ఆ కుంభాన్ని పగలగొట్టాడు. ఆ కుంభాన్ని పగలగొట్టిన బాణాన్ని సంధించడానికి ఆయన నిలబడిన ప్రదేశమే బనతురై (ఇది తరువాతి కాలంలో వచ్చిన పేరు). 

ఆ తర్వాత, శివుడు ఇక్కడ స్వయంభూ మూర్తి లింగంగా వెలశాడు.

💠 ఒకప్పుడు వ్యాస మహర్షి నంది చేత శపించబడ్డాడు, కాబట్టి అతను పరిహారం కోసం విష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ మహర్షిని శపించింది నందియే కాబట్టి, కుంభకోణం సృష్టి సమయంలో శివుడు బాణం సంధించడానికి నిలబడిన బనతురైలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని విష్ణువు అతనికి సలహా ఇచ్చాడు. 

💠 ఆ మహర్షి అలా చేసి, తన శాపం నుండి విముక్తి పొందాడు. బయటి ప్రాకారం యొక్క పశ్చిమ భాగంలో, వ్యాసుడు ప్రతిష్ఠించిన వ్యాస లింగాన్ని చూడవచ్చు.

💠 ఆధునిక బెంగాల్‌లోని వంగదేశానికి చెందిన రాజు సూరసేనన్, తన రాణి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండటంతో ఇక్కడ పూజలు చేశాడు.

రాజు తన పరివారంతో ఇక్కడికి వచ్చి శివుడిని పూజించగా, రాణి నయమైంది. 

అతను సందర్శించినప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉండటంతో, తన కృతజ్ఞతకు గుర్తుగా ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టాడు.

💠 ఇక్కడి అమ్మవారికి సోమ కళాంబాల్ అనే ప్రత్యేకమైన పేరు ఉంది. ఆమె నాలుగు చేతులతో, ఒక చేతిలో రుద్రాక్ష మాల మరియు తామర పువ్వును ధరించి, మిగిలిన రెండు చేతులను అభయ, వరద హస్తాలలో ఉంచి చిత్రీకరించబడింది. ఇక్కడ సోమ కళాంబికైని పూజిస్తే బద్ధకం నయమవుతుందని నమ్ముతారు.

💠 ఈ ఆలయం కుంభకోణం యొక్క మూలంతో ముడిపడి ఉన్నందున, అంటే దివ్య అమృత కలశం నుండి ఉద్భవించినందున, ఇక్కడ పూజించేవారు ఆ అమృతాన్ని పానం చేసిన పుణ్యాన్ని పొందుతారని నమ్ముతారు!

💠 ఈ ఆలయంలో గర్భగుడి, అంతరాల, అర్ధ మండపం మరియు ముఖ మండపం ఉన్నాయి. 

ఈ ఆలయం 3 అంచెల రాజగోపురంతో తూర్పు ముఖంగా ఉంది. 

బలిపీఠం, ద్వజస్థంభం మరియు ఋషభం రాజగోపురం తర్వాత ఉన్నాయి. 

వినాయకుడు, మురుగన్ మరియు ద్వారపాలకులు గర్భగుడి ప్రవేశానికి ఇరువైపులా ఉన్నాయి.

💠 నిత్య పూజలతో పాటు ప్రదోషం, సంకదహర చతుర్థి, వినాయగర్ చతుర్థి, మహా శివరాత్రి మొదలైన రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

💠 భక్తులు సమర్పించే నైవేద్యాలలో పాలు, తేనె, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీరు మరియు విభూతి వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా శివునికి అత్యంత విలువైన బిల్వ పత్రాలను సమర్పిస్తారు. 

దైవ అనుగ్రహం కోసం నెయ్యి లేదా నూనె దీపాలను వెలిగిస్తారు.

💠 కుంభకోణం (2 కి.మీ)  మయిలాడుతురై (38 కి.మీ.) తంజావూరు (42 కి.మీ.)

రచన

©️ Santosh Kumar

సమస్యా పూరణం.

  సమస్యా పూరణం.

సమస్య. "నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా యేమిచెప్పంగనే."

(ఆశా అనేపేరుగల ఆమెతో

మనువు)

"ఆశా" కన్యక కేమిలోటు కనగా నందమ్ము సద్బుద్ధులున్

రాశీభూత గుణాఢ్యగా వెలుగు సద్రాగంబు దీపింపగా

పాశమ్మిట్టుల పెండ్లిరూపమగుచున్ బంధించె దైవమ్ము, తా

"నాశా"ర్థమ్మున నాకు దక్కె మనువన్నా !యేమిచెప్పంగనే.

సురభిశంకరశర్మ.

సమస్యాపూరణం

  సమస్యాపూరణం.2

సమస్య. "నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా  యేమిచెప్పంగనే."

(దుర్వ్యసన పరుడయిన భర్తతో తనబ్రతుకు ఛిద్రమయిందని అన్నతో ఘోషిస్తున్న సోదరి)

ఆశల్గంటిని వానితో బ్రతుకు నాహ్లాదంపు భాగ్యమ్ముగా,

క్లేశమ్మాయెను జీవితమ్ము గనగా- ఖేదాలు భేదాలతో,

పాశమ్మింతియె చాలుచాలు  భవితన్ భావింప సంక్లిష్టమౌ,

"నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా !యేమిచెప్పంగనే,"

సురభి శంకరశర్మ.