సమస్యాపూరణం.2
సమస్య. "నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా యేమిచెప్పంగనే."
(దుర్వ్యసన పరుడయిన భర్తతో తనబ్రతుకు ఛిద్రమయిందని అన్నతో ఘోషిస్తున్న సోదరి)
ఆశల్గంటిని వానితో బ్రతుకు నాహ్లాదంపు భాగ్యమ్ముగా,
క్లేశమ్మాయెను జీవితమ్ము గనగా- ఖేదాలు భేదాలతో,
పాశమ్మింతియె చాలుచాలు భవితన్ భావింప సంక్లిష్టమౌ,
"నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా !యేమిచెప్పంగనే,"
సురభి శంకరశర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి