15, జులై 2021, గురువారం

శుక్రనీతి

 శుక్రనీతి

ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి, అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయమే వచ్చి వాటిని చేజిక్కించుకుని చక్కగా పోయేవాడు. ఒక రోజు అనుకోకుండా ఈ రోజసుడు అనే పిల్లి పోయి పోయి ఆ వలలో చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కాబట్టి ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది.

--ఆహారం కోసం అటూఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా!’ అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి. వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస,గుడ్లగూబ

జారుకున్నాయి.


-'నేను నీ ప్రాణాలను రక్షించాను కదా! మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి,’ అని అడిగింది పిల్లి. ‘ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా! నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను,’ అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.

-మర్రిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. 

-వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ఎలుక మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాము,’ అంటూ పిలిచింది.


-దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులం అయిన మనమిద్దరి మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు.


-శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని విడువకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు. బదులుగా నేను నిన్ను రక్షించావు. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు!’ అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారుమాటాడకుండా వెనుదిరిగిపోయింది.

జగన్నాధుడి_56రకాల_మహాప్రసాదాలు

 #జగన్నాధుడి_56రకాల_మహాప్రసాదాలు తెలుసుకుందాం....

పదాల ఉచ్చారణ అర్థం చేసుకొని చదవగలరు.....


1. సాధ అన్నా(తెలుపు అన్నం) సాధారణ బియ్యం నీరు

 2. కనికా - బియ్యం, నెయ్యి మరియు చక్కెర(పొంగలి లాగా)

 3. దహి పాఖల్ - పెరుగు బియ్యం మరియు నీరు(దద్ధోజనం లాగా)

 4. అడా పాఖల్ - బియ్యం, అల్లం మరియు నీరు

 5. తాలి ఖేచెడి - పప్పు, చక్కెర మరియు నెయ్యితో బియ్యం 

 6.ఆజ్య అన్నం - నెయ్యితో కలిపి వండిన బియ్యం

 7. ఖేచెడి - లెంటిల్‌తో కలిపిన వండిన బియ్యం

 8. మిథా పాఖల్ - బియ్యం, చక్కెర మరియు నీరు

 9. ఒరియా పఖల్ - బియ్యం, నెయ్యి, నిమ్మ మరియు ఉప్పు

 స్వీట్స్

 10. ఖాజా - గోధుమలతో తయారవుతుంది

 11. గజా - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 12. లాడు - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 13. మగజ లాడు

 14. జీరా లాడు

 15. జగన్నాథ్ బల్లవ్ - గోధుమ, చక్కెర మరియు నెయ్యి

 16. ఖురుమా - గోధుమ, చక్కెర మరియు ఉప్పుతో తయారు చేస్తారు

 17. మాతాపులి - నెయ్యి, అల్లం మరియు ఒక రకమైన బీన్స్ ను మందపాటి పేస్ట్ లోకి తయారు చేస్తారు

 18. కాకర - నెయ్యి మరియు గోధుమలతో తయారు చేస్తారు

 19. మారిచి లాడు - గోధుమ మరియు చక్కెరతో తయారవుతుంది

 20. లుని ఖురుమా - గోధుమ, నెయ్యి మరియు ఉప్పుతో తయారు చేస్తారు

 (సునా వేశ సమయంలో బాహుద యాత్రకు తిరిగి రావడం, రసగోల్లను భోగాస్ గా అర్పిస్తారు, కానీ మరే రోజున భోగో కోసం రసగోల్లలను అనుమతించరు)

 కేకులు, పాన్కేక్లు మరియు పట్టీలు

 21. సువార్ పితా - గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 22. చాడై లాడా - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు

 23. జిల్లి - బియ్యం పిండి, నెయ్యి మరియు చక్కెర

 24. కాంతి - బియ్యం పిండి మరియు నెయ్యి

 25. మాండా - గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 26. అమాలు - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు

 27. పూరి - గోధుమ మరియు నెయ్యితో తయారు చేసి, చిన్న సన్నని పాన్ కేక్ లాగా లోతుగా వేయించాలి

 28. లూచి - బియ్యం, పిండి మరియు నెయ్యితో తయారు చేస్తారు

 29. బారా - పెరుగు, నెయ్యి మరియు ఒక రకమైన బీన్స్

 30. దహి బారా - ఒక రకమైన బీన్స్ మరియు పెరుగుతో చేసిన కేక్

 31. అరిసా - బియ్యం పిండి మరియు నెయ్యితో చేసిన ఫ్లాట్ కేక్

 32. త్రిపురి - బియ్యం, పిండి మరియు నెయ్యితో చేసిన మరో ఫ్లాట్ కేక్

 33. రోసపాక్ - గోధుమలతో చేసిన కేక్ మరియు

 పాల సన్నాహాలు

 34. ఖిరి - పాలు, బియ్యంతో చక్కెర

 35. పాపుడి - పాలు క్రీమ్ నుండి మాత్రమే తయారుచేస్తారు

 36. ఖువా - స్వచ్ఛమైన పాలు నుండి తయారుచేయడం చాలా గంటలు నెమ్మదిగా ఉడకబెట్టడం వంటి మృదువైన కస్టర్డ్‌కు

 37. రసబాలి - పాలు, చక్కెర మరియు గోధుమలతో తయారవుతుంది

 38. టాడియా - తాజా జున్ను, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు

 39. ఖేనా ఖాయ్ - తాజా జున్ను, పాలు మరియు చక్కెరతో తయారు చేస్తారు

 40. బాపూడి ఖాజా - పాలు, చక్కెర మరియు నెయ్యి క్రీమ్

 41. ఖువా మండా - పాలు, గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు

 42. సరపుల్లి - ఇది తయారుచేయడానికి అత్యంత ప్రసిద్ధ మరియు కష్టతరమైన పాల వంటకం.  ఇది స్వచ్ఛమైన పాలతో గంటలు నెమ్మదిగా ఉడకబెట్టి పెద్ద పిజ్జా ఆకారపు పాన్లో వ్యాపిస్తుంది.

 కూరగాయలతో కూర

 43. డాలీ

 44. బిరి డాలీ

 45. ఉరిడ్ దళ్

 46. ​​ముగదళ్

 47. దలామా - ఒరియా హోమ్‌లో విలక్షణమైన వంటకాల్లో ఇది ఒకటి.  ఇది దహ్ల్ మరియు వెజిటబుల్ కలయిక.  సాధారణంగా వంకాయ, బీన్స్, చిలగడదుంప మరియు టమోటాలు, టమోటాలు ఆలయ సన్నాహాలలో ఉపయోగించబడవు.  కొబ్బరికాయలు మరియు ఎండిన కూరగాయల బోధి అని పిలుస్తారు, ఇది ఒక ముష్ గదిలాగా కనిపిస్తుంది మరియు ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

 48. మౌర్

 49. బేసర్

 50. సాగ్ - ఒక చిటికెడు వంటకం

 51. పొటాల రాస

 52. గోతి బైగనా

 53. ఖాటా

 54. రైతా - పెరుగు మరియు ముల్లంగితో కూడిన వంటకం వంటి పెరుగు.

 55. పిటా

 56. బైగిల్ని

మహాప్రసాదం మానవ బంధాన్ని పటిష్టం చేస్తుంది, కర్మలను పవిత్రం చేస్తుంది.


సేకరణ

ఋణానుబంధము

 🍀🌺🍀🎉🙏👍


*ఋణానుబంధము*

                   ➖➖➖✍️


ఇతరులతో పూర్వజన్మలో  మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే 

ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. 

ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో  జరుగుతుంది.  


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి  ఏర్పడే సంబంధాల  మీద మోజు కలుగదు. 


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


--  *మనం పూర్వ జన్మలో  ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు*.


--  ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలోని  మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


--  *మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు  అపకారం చేసే వారిగా ఎదురవుతారు.*


-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు . 


*ఉదాహరణకు ఒక జరిగినకథ:-*


*కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం  అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో  పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.  ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...*

*పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు  ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా  ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను  బాధలు  పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు.* 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


*ఒకసారి సత్యసాయిబాబా  బస చేసిన అతిథిగృహం  బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో    ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా  దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు  స్వామి.*


*ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి  వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి  పిలిచి నీ చేతి సంచి  ఏది అని అడిగితే,  పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు *”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు  చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో  నువ్వు అతని బియ్యం  బస్తాను మోయాల్సి ఉంటుంది!”*   అన్నారు.


*ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో  లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా  స్వీకరించిన వన్నీ  కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి.* 


కొత్త వాళ్ల నుంచి పెన్ను  లాంటి వస్తువులను  తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే  నాకు ఫలానాది తీసుకురా  అని చెప్పడం, ఇలాంటివి అనేక  సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  

అవి కర్మ బంధాలవుతాయి  అని తెలియక మన  జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


*ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే  అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.*


కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా  మనం తప్పించుకో గలమా.......✍️


                         🌷🙏🌷


   🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు*!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కళామాలా

 794. 🔱🙏  కళామాలా ​🙏🔱

నాలుగు అక్షరాల  నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *కళామాలాయైనమః* అని చెప్పాలి.

కళ = కళలను, 

మాలా = మాలగా ధరించినది.

కళ' అంటే అంశము, లేదా - 'విభాగము' అని సాధారణ అర్ధం. ఈ 'కళ, అనే పదం చంద్రుని విషయంలోను, లలితకళల విషయంలోను వాడుతూ ఉంటాము. అమ్మవారు చంద్ర సంబంధమైనది కాబట్టి 'కళ' అనే పదాన్ని చంద్రసంబంధమైనదిగా అర్థం చెప్పకుంటే - చంద్రునికి ఉన్న పదహారు కళలను మాలగా ధరించినది అని అర్ధం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడశ కళాప్రపూర్ణ.

'కళ' అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చెప్పుకుంటే లలిత కళలు 64 ఉంటాయి. కాబట్టి - 64 లలితకళలను మాలగా ధరించునది' అనే అర్థం చెప్పుకోవాలి.

“కళ' అంటే విభాగం అన్నారు కదా అని 'కళ'కు శకలం' అనే పదం అర్ధం చెప్పుకోకూడదు. కుండబద్ధలయితే ఏర్పడే ముక్కలు కుండ యొక్క విభాగాలే అయినా అవి సమాన పరిమాణాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్టవమైన సంబంధం కూడా ఉండదు. అందుచేత ఈ కుండ పెంకుల్ని 'శకలాలు' అనాలి.

పళ్ళెంలో మైసూరు పాకును కత్తితో ముక్కలుగా కోసినపుడు ఏర్పడే భాగాలు గూడా విభాగాలే కాని - ఇవి కుండ బ్రద్దలైతే ఏర్పడే పెంకుల్లాంటివి కావు. ఈ ముక్కలు అన్నీ సమానపరిమాణాల్లో ఒక నిర్దిష్టమైన ఆకారాల్లో, ఒక సౌష్టవ పద్ధతిలో కోయబడి ఉంటాయి. కాబట్టి, వీటిని 'శకలాలు' అని కాకుండా - 'కళలు' అని అనవచ్చును. 15 తిథులలోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని 'కళలు' అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్యాదేవతలుంటారు. . ఈ పదహారు నిల్యాదేవతలచే నిత్యమూ  ఆరాధింపబడే ది కాబట్టి - అమ్మవారు వాటిని మాలగా ధరించినట్లుగా ఈ నామంలో ఉత్ప్రేక్షించబడింది.

64 విద్యాకళలు, 64 వృత్తికళలు, సూర్యకళలు, అగ్నికళలు, మొదలైన వన్నిటినీ అమ్మవారు మాలగా ధరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లు ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి.

వివిధ కళలను మాలగా ధరించినది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం కళామాలాయైనమః 🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

Find out missing pair letters

 Each word has two + two blanks.

You need to fill up with the same pair of letters to form a word.


For example:

S _ _ ur _ _ e.


The missing pair letters are A T.

The word is Saturate.


Here's an opportunity to sharpen our brain! Lets see who completes all 25.


1. _ _ i _ _

2. V_ _ lat_ _ n

3. H_ _ dw _ _ e

4. _ _ rses _ _e

5. P_ _ sev _ _ e

6. S _ _tim _ _ t

7. _ _da _ _ ted

8. C _ _kb _ _ k

9. Lo _ _i _ _

10. D_ _ tingu_ _ h

11. P_ _ dl _ _

12. S _ _ur _ _ e

13. _ _ p _ _ zard

14. Who _ _ sa _ _

15. _ _ at _ _

16._ _ od_ _ rk.

17. _ _ ma _ _ 

18. _ _ y _ _ rd

19. H _ _ rtbr _ _ k

20. B _ _ evol _ _ t

21. C _ _ diti _ _ 

22. An _ _ cipa _ _ on

23. _ _ rri _ _ lum

24. E _ _ agi _ _ 

25. Inc _ _ p _ _ ate

26. Tr _ _ bad_ _ r

27. A_ _ a_ _ a

28. _ _ s_ _ de

29. A_ _ mo _ _

30. Ba_ _ pa_ _

పార్వతి కోపం

 🎻🌹🙏ఓసారి పరమేశ్వరుడు

వస్తానన్న సమయానికి రాలేదు *

> పార్వతికి కోపం వచ్చింది *

భర్తను నిలదీయాలనీ ఇంట్లోకి

రానివ్వకూడదనీ నిశ్చయించుకుంది *


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


తలుపులు బిడాయించి. శివుడు ఎప్పుడు వస్తాడా.

ఎప్పుడు అడగాల్సిన నాలుగు మాటలు.

అడగాలా అని ఎదురుచూస్తోంది.


ఇంతలో శివుడు వచ్చాడు.


అప్పుడు ఆ భార్యాభర్తల మధ్య

జరిగిన సంభాషణ ఎలా సాగిందంటే.


శివుడు తలుపు కొట్డగానే *


"కాస్త్వం" ( ఎవరు నువ్వు ) అంది.

దానికి శివుడు " శూలీ "

{ శూలం ధరించినవాణ్ణి } అన్నాడు.

శూలీ అంటే తలనొప్పి అని కూడా అర్థముంది.

పార్వతి దానిని ముందుకు తెస్తూ

" మృగయ బిషజం " ( వైద్యుణ్ణి వెతుక్కో )

అని వెటకారమాడింది !

పార్వతి కోపాన్ని గ్రహించిన శివుడు.

" నీలకంఠే ప్రియాహం " ( పియా నేను నీలకంఠుణ్ణి ) అంటూ ఆలిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

నీలకంఠం అంటే నెమలి కూడా !

వెంటనే ( నెమలివా అయితే అరవ్వేం )

అని మళ్ళీ ఇరుకనపెట్టింది.


ఓపిక నశించిన శివుడు ....


* పశుపతి * అని గద్దించినంత పని చేశాడు.

పశుపతి అంటే ఎద్దు అని మరో అర్థం !

" నైవదృశ్యే విషాణే " ( కొమ్ములెక్కడ ! )

అని మరో ప్రశ్న సాధించింది పార్వతి.


ఎలాగైనా భార్యను ప్రసన్నం చేసుకోవాలని.

" స్థాణుర్ముగే " ( ఓ ముగ్దా ....

నేను అంతటా నిండి ఉన్నవాడిని స్థాణువును )

అని మళ్ళీ పరిచయం చేసుకున్నాడు శివుడు !


స్థాణువు అంటే చెట్టు.

అన్న అర్థాన్ని తీసుకుంది పార్వతి !

" నవదితి తరుః " ( చెట్టు ఎక్కడ )

అని మరోసారి పరిహాసించింది.


చివరి ప్రయత్నంగా *


" జీవితేశశ్వివాయః

( నీ జీవితేశ్వరుడైన శివుడిని ) 

అని బదులు పలికాడు !


పార్వతి ఇంకా శాంతించలేదు.


శివా అంటే మృగం అనే అర్థం కూడా ఉంది.

" గచ్ఛాటవ్యాం ( ఇక్కడికి ఎందుకచ్చావ్.

అడవుల్లో తిరుగు ) అని గేళి చేసింది.


చివరగా .......

" ఇతి హత వచః పాతువశ్చంద్ర చూడః "

( ఇలా మాటల్లో ఓడిన శివుడు రక్షించుగాక )

అంటూ వింత శ్లోకం ముగించింది ఆ తల్లి.


సర్వ జగత్తుకూ మాతపితరులైన

పార్వతీపరమేశ్వరుల సంవాదం కూడా.

మనకు దీవనే అవుతాయి *..సేకరణ..🌞🙏🌹🎻

భగందర వ్యాధి ( Fistula )

 భగందర వ్యాధి ( Fistula ) గురించి సంపూర్ణ వివరణ  - 


   కొందరిలో ఆసనం వద్ద చిన్న గుల్ల ( కురుపు ) లేచి చీముపట్టి ఆ చీము బయటకి వెడలును . రోజులు గడుస్తున్న కొలది మలద్వారం పక్కన ఆసనం లోపలి వరకు చిన్న నాళము ఏర్పడును . ఇది కొంతకాలం తరువాత పైన మానినట్లు కనిపించినా లోపలి వైపు మానదు . వేడి చేయు పదార్ధాలు తినినప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి పుండు పగిలి రక్తం , చీము వస్తుంటుంది. ఈ దశలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది చాలా మొండి వ్యాధి . ఇది కాలం గడిస్తున్న కొలది ప్రమాదకరంగా మారును . 


               ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్దకం , రక్త కాలుష్యము , సూక్ష్మ జీవులు . ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అల్లోపతి వైద్య విధానంలో ఈ వ్యాధికి ఔషధాలతో చికిత్స లేదు . సర్జరీ ఒక్కటే మార్గం . కాని నేను చాలా మంది రోగులలో గమనించిన విషయం సర్జరీ తరువాత కూడా కొంతకాలానికి మరలా సమస్య తిరగబెడుతుంది. బహుశా  సరైన ఆహారనియమాలు పాటించకపోవడం కూడా కారణం కావచ్చు . 


    ఆయుర్వేదం నందు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కలదు. శరీరం నందలి వ్యర్ధపదార్ధాలను బయటకి వెడలింపచేస్తూ సరైన ఔషధాలను ఇస్తూ చికిత్స చేయవలెను . ఈ వ్యాధి నందు ఔషధ సేవన ఎంత ముఖ్యమో ఆహారవిహారాదులు అంతే ముఖ్యము . ఈ సమస్య అత్యంత మొండివ్యాది. సరైన కాలంలో సరైన చికిత్స అందనిచో మలద్వారం పక్కన ఏర్పడిన కురుపు నుంచి చీము , రక్తం కూడ వచ్చును. ఇంతకు ముందు చెప్పినట్లు లొపలికి నాళంలా ఏర్పడి దాని ద్వారా కూడా మలం బయటకి వచ్చును. కావున వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటకి రావడానికి ప్రయత్నించవలెను . 


          భగందర సమస్యతో ఇబ్బంది పడువారు నన్ను సంప్రదించగలరు.  


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                  అనువంశిక ఆయుర్వేదం 


                        9885030034

కవిగానే పుడతా.--తనికెళ్ల భరణి....

 "మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!".....


ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు..... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని.... ఆయనే తనికెళ్ల భరణి....


ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....


"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.


వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.


గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.


కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.


తెలుగుకు ఆ శక్తి ఉంది....


అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.


"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.


అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"


ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య.


ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం. 

 

మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి.  మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.


మా తెలుగు తల్లికి మల్లెపూదండ.... మా కన్నతల్లికి మంగళారతులు....


సేకరణ:-