🎻🌹🙏ఓసారి పరమేశ్వరుడు
వస్తానన్న సమయానికి రాలేదు *
> పార్వతికి కోపం వచ్చింది *
భర్తను నిలదీయాలనీ ఇంట్లోకి
రానివ్వకూడదనీ నిశ్చయించుకుంది *
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
తలుపులు బిడాయించి. శివుడు ఎప్పుడు వస్తాడా.
ఎప్పుడు అడగాల్సిన నాలుగు మాటలు.
అడగాలా అని ఎదురుచూస్తోంది.
ఇంతలో శివుడు వచ్చాడు.
అప్పుడు ఆ భార్యాభర్తల మధ్య
జరిగిన సంభాషణ ఎలా సాగిందంటే.
శివుడు తలుపు కొట్డగానే *
"కాస్త్వం" ( ఎవరు నువ్వు ) అంది.
దానికి శివుడు " శూలీ "
{ శూలం ధరించినవాణ్ణి } అన్నాడు.
శూలీ అంటే తలనొప్పి అని కూడా అర్థముంది.
పార్వతి దానిని ముందుకు తెస్తూ
" మృగయ బిషజం " ( వైద్యుణ్ణి వెతుక్కో )
అని వెటకారమాడింది !
పార్వతి కోపాన్ని గ్రహించిన శివుడు.
" నీలకంఠే ప్రియాహం " ( పియా నేను నీలకంఠుణ్ణి ) అంటూ ఆలిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
నీలకంఠం అంటే నెమలి కూడా !
వెంటనే ( నెమలివా అయితే అరవ్వేం )
అని మళ్ళీ ఇరుకనపెట్టింది.
ఓపిక నశించిన శివుడు ....
* పశుపతి * అని గద్దించినంత పని చేశాడు.
పశుపతి అంటే ఎద్దు అని మరో అర్థం !
" నైవదృశ్యే విషాణే " ( కొమ్ములెక్కడ ! )
అని మరో ప్రశ్న సాధించింది పార్వతి.
ఎలాగైనా భార్యను ప్రసన్నం చేసుకోవాలని.
" స్థాణుర్ముగే " ( ఓ ముగ్దా ....
నేను అంతటా నిండి ఉన్నవాడిని స్థాణువును )
అని మళ్ళీ పరిచయం చేసుకున్నాడు శివుడు !
స్థాణువు అంటే చెట్టు.
అన్న అర్థాన్ని తీసుకుంది పార్వతి !
" నవదితి తరుః " ( చెట్టు ఎక్కడ )
అని మరోసారి పరిహాసించింది.
చివరి ప్రయత్నంగా *
" జీవితేశశ్వివాయః
( నీ జీవితేశ్వరుడైన శివుడిని )
అని బదులు పలికాడు !
పార్వతి ఇంకా శాంతించలేదు.
శివా అంటే మృగం అనే అర్థం కూడా ఉంది.
" గచ్ఛాటవ్యాం ( ఇక్కడికి ఎందుకచ్చావ్.
అడవుల్లో తిరుగు ) అని గేళి చేసింది.
చివరగా .......
" ఇతి హత వచః పాతువశ్చంద్ర చూడః "
( ఇలా మాటల్లో ఓడిన శివుడు రక్షించుగాక )
అంటూ వింత శ్లోకం ముగించింది ఆ తల్లి.
సర్వ జగత్తుకూ మాతపితరులైన
పార్వతీపరమేశ్వరుల సంవాదం కూడా.
మనకు దీవనే అవుతాయి *..సేకరణ..🌞🙏🌹🎻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి