20, ఆగస్టు 2024, మంగళవారం

నిప్పుకు చెదలు పట్టవు

 *🔥నిప్పుకు చెదలు పట్టవు..!!🔥*


*మోసగాళ్లకు బ్రాహ్మణ జాతి ఎప్పటికి అండగా ఉండదు...!!!🫣*


*బ్రాహ్మణ జాతి మద్దతు టివి5 మూర్తి గారికే..👍*

-------------------------------------

నిఖార్సైన జర్నలిస్టు మన టివి5 మూర్తి..! అదే మన దేవగుప్తాపు మూర్తి శర్మ...!!


సమాజం పట్ల బాధ్యత..!

అవనీతి అనకొండల వేట..!

అరాచక వాదుల మీద ప్రత్యక్ష యుద్దం..!


ఒకనాడు..శాంభవి పేరు తో పునర్జన్మల వల వేసిన వారి ముసుగు తీసేసారు మన మూర్తిగారు...

నకిలీ స్వాముల మార్ఫింగ్ ఫొటోల మోసం బయటపెట్టారు..!

మూడురాజధానుల ముదనష్టపు నిర్ణయాల మీద దక్షిణాఫ్రికా వెళ్ళి మరీ డొల్లతనం వెలికితీసారు..!

ఒకటా రెండా మొత్తం జీవితం అంతా పోరాటమే..!


తెలుగురాష్ట్రాల ప్రజల తరుపున స్వరాన్ని ఏకంగా భాస్వరంలా మండించారు..!

ఈ క్రమంలో రాళ్ళ దాడులు.. పోలీసు లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు..!

దూషణ, భూషణ తిరస్కారాలు..!

ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు లొంగని కక్కుర్తి పడని వైఖరి మన మూర్తి గారిది..!


ఆయన మాటల తూటాలు అక్రమార్కులకు  దిగుతాయి లోతుగా గుండెల్లో..!

అందుకే ఈ ఉలికిపాటు..!

ఎదురుదాడి..!

అసత్య, అన్యాయ ఆరోపణలు..!

🔥నిప్పుకు🔥 చెదలంటుతాయా..!


అయినా ఎవరు ఎవర్ని గురించి మాట్లాడుతున్నారు..!

ఒక రకంగా బెదిరిస్తున్నారు..!

ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు..!

అసలు సోయలో ఉన్నారా..!

వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా వ్యక్తుల పరువు మర్యాదలు ప్రస్తుతం బజారున పెట్టినపుడు ఆ తర్వాత వారి పరిస్ధితి ఏంటి..!?


పసిబిడ్డలతో #పూజలు చేసినపుడు ఏమయింది ఈ చింతన..!?

నగ్న పూజలు,యోని పూజలు చేసేటప్పుడు గుర్తు రాలేదా పాపపు పనులు చేస్తున్నామని ఈ వేణుకు...??

ఒకటా రెండా కొన్ని వందల పచ్చి మోసాలు..!

బతుకు తెరువుకి..కూటికోసం కోటి విద్యలు అని సరిపెట్టుకునేలా ఉందా ఈ వేణు వ్యవహారం..! సమాజంలో అనేక మంది బాధితులు బయటకొచ్చి బహిరంగంగా ఇతని లీలలు వెల్లడిస్తున్నారు..!


రాజకీయ నాయకులకు జాతకాలు,పూజలు అంటూ బ్లాక్ మెయిలింగ్... రాజకీయాలు, నాయకులు, ఎన్నికలు నోటికొచ్చినట్లు అంచనాలు..! అవి

తారుమారైతే తప్పయింది.. క్షమించండి... మళ్ళీ వాగను అంటూ వేడుకోలు..!

కుక్కతోక వంకర..!

మళ్ళీ మొదటికొచ్చిన వ్యవహారం..!

ఒక సినీ నిశ్చితార్ధం..!

దాని మీద ఈయన కారుకూతలు..! జనాలు ఇతన్ని

నడిబజార్లో నిలబెట్టి తోలుతియ్యక పొబట్టే సోషల్ మీడియాలో ఎగిరెగిరి

పడుతున్నారు ఈ వేణు,అతని భార్య వాణి..! వీళ్ళకి బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ నాయకులు ఇప్పుడు కావాలా మీకు... ఏ రోజైనా ఒక పేద బ్రాహ్మణుడు కుటుంబానికి సాయం చేశారా ఈ వేణు వాణి... ఒక్కరికైన సాయం చేసామని చెప్పే దమ్ముందా..?? సోషల్ మీడియా ఇంటర్వ్యూలో వేణుకి పబ్బులు ఉన్నాయి అని చెప్తాడు, మాంసం తింటా అని, వ్యభిచారం చేస్తానని చెప్తాడు ఇంత ఎదవ పనులు చేసే వీడికి ఇప్పటికిప్పుడు మీకు బ్రాహ్మణ కులం, బ్రాహ్మణత్వం కావాలా...?? నకిలీ జ్యోతిష్యం చెపుతూ బ్రాహ్మణ జాతికి చెడ్డ పేరు తెస్తూ, మీరు చేస్తున్న వెదవ పనులను డైలీ సోషల్ మీడియాలో,న్యూస్ చానల్స్ లో గబ్బు గబ్బు పట్టిస్తున్న, సమాజంలో కొన్ని కోట్ల మంది మీ వెధవ పనులను వీక్షిస్తున్నా సరే మీలో మార్పు తెచ్చుకోరా..?? బ్రాహ్మణ జాతి విలువలను నాశనం చేస్తున్నందుకు "వేణు వీణ" మీరు ఇకనైనా పశ్చాత్తాపంతో సిగ్గుపడండి, బుద్ధి తెచ్చుకోండి. తక్షణమే బ్రాహ్మణ సమాజానికి, తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పండి. మీరు చేస్తున్న పాపకర్మలను ఇప్పటికైనా సరే ఇలా కడిగేసుకోండి.. భగవంతుడు ఇలా మీకు మంచి అవకాశం కల్పించాడు. లేదు ఇదే పాపకర్మల్ని మీరు పట్టుకొని వేలాడుతారా.. అయితే మీకు భగవంతుడి శిక్ష తప్పదు. నెక్స్ట్ జరిగేది అదే.


నకిలీ జ్యోతిష్యుడు వేణుని నిలదీసి కడిగేసిన మూర్తిగారి మీద అసత్య ఆరోపణలతో ప్రతిదాడి చేస్తారా..!

చాలా తప్పు చేస్తున్నారు..! ఇప్పటికే

ఆల్రడీ చాలా చేసేసారు.‌!

ఎంత నీచానికి దిగజారాలో అంత కంటే ఎక్కువగా వేణు వీణ దిగజారారు..!

ఉభయులు ఎంత వగచినా..శోకాలు పెట్టినా, శాపాలు పెట్టినా మీకైతే కారాగారము తప్పదు.


దేశ విదేశాల్లో ఉన్న వేణు బాధితులందరూ స్వచ్ఛందంగా బయటకు రావాలి..!

వారికి జరిగిన మోసం మీద పోలీసులకు పిర్యాదు చెయ్యాలి..! భయపడాల్సిన పనిలేదు...!!


విలువలు వలువలు గా ధరించిన వ్యక్తిని కించపరచటం..బెదిరించటం అయింది.

ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తారా..!


టివి5 మూర్తిగారు సమాజంలో మీరు చేస్తున్న తప్పుడు పనులను నిగ్గదీసి అడిగారు..! మిమ్మల్ని

నిలువెల్లా కడిగారు..! ఇకనైనా మారండి పంతానికి పోతే నష్టపోయేది వేణు వాణి మాత్రమే.. ఇదే వాస్తవం, యదార్థం కూడా... మీరు బ్రాహ్మణ సంఘాలు నాయకుల మద్దతు అడిగారు కదా.. భార్యాభర్తలైన మీ ఇద్దరికీ ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణ సమాజం అండగా ఉండదు. బ్రాహ్మణ జాతి ఎప్పుడైనా సరే ధర్మానికి, నీతికి కట్టుబడి ఉంటుంది. పురాణ ఇతిహాసాల్లో బ్రాహ్మణ జాతి ధర్మం గురించి చెబుతూ ఆధ్యాత్మిక చింతనతో బ్రాహ్మణ జీవనాన్ని నీతిగా, నిజాయితీగా బతకమని, అయాచిత సంపాదనకు ఆశపడకుండా దూరంగా ఉండమని శాస్త్రం చెప్పింది. అలానే బ్రాహ్మణ జాతిలో 95% మంది దాదాపు పాపభీతితో జీవనం సాగిస్తారు. అందువల్ల వేణు లాంటి నకిలీ జ్యోతిష్యులకు, సజాతి ధర్మం వీడి, పరజాతి ధర్మంలో బతికే వాళ్లకు బ్రాహ్మణ జాతి సంఘాలు నాయకులు ఎప్పటికి అండగా ఉండరు. అందువల్ల నికార్సైన నిజాయితీ గలిగిన వ్యక్తి టీవీ5 మూర్తి గారికి బ్రాహ్మణ జాతి, సంఘాలు, నాయకులు తప్పకుండా అండగా ఉంటారు.


ఇక ఈ దొంగ జోతిష్యుల బెడద వదిలించాల్సిన 

పని చట్టానిదే..!


🔥నిప్పుకు🔥 చెదలంటుతాయా..!! మాడి మసైపోతాయి..🫵 తస్మాత్ జాగ్రత్త...!!!


*సిరిపురపు శ్రీధర్ శర్మ*

రాష్ట్ర అధ్యక్షులు

*బ్రాహ్మణ చైతన్య వేదిక*

దొంగలు పడ్డారు

 దొంగలు పడ్డారు !


౼౼౼౼౼౼౼౼౼౼౼


ఒక కవి ఇంట్లో


దొంగలు పడ్డారు!


ఆరు వారాల నగలు


మూడు లక్షల నగదు


ఐదు పుస్తకాలు పోయాయి!!


పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.


పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....


ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...


పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..


ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...


" పోద్దురు బడాయి "


" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.


" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.


కవి గారికి


నమస్కారములు...


బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా ,వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..


ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...


ఇట్లు


దొంగతనాలు మానిన దొంగ


ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..


ఆయన భార్య ముఖంలో ఆలోచనలు


లక్ష్మీదేవి గొప్పదా?


సరస్వతీ దేవి గొప్పదా?


------------------'-------------------------------------------------


ఎంత చక్కని కధ. రచయిత కు అభినందనలు.


*కావున విద్యార్థులకు పుస్తకాపాఠనాన్ని ఒక నిధిగా..*


*పుస్తక అన్వేషణనే ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్పాటు అందించగలరని నా యొక్క మనవి...*


🙏🏼🙏🏼🙏🏼

సేకరణ: మీ సురేశ్ బాబు

*శ్రీ గరుత్మంతుడి కధ -8

 _*శ్రీ గరుత్మంతుడి కధ -8 వ భాగం*_

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఈ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు. నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది, దానిని ఎలా తప్పించుకోవాలి, వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి.పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది. దక్షిణ మార్గంలో వైతరణినది ఉంటుంది. దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయ కూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించే వారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

రక్తసంeeeబంధాల

 **రక్తసంeeeబంధాల రమణీయ  రక్షాబందనం**

**ఆత్మీయతానుబంధాలే ఇంధనం **

@@@@@         @@@@@         @@@#

**అక్కాతమ్ముళ్లకు అన్నాచెల్లెళ్లకు అరుదైన పండగే రక్షాబంధనం **

**అక్కునచేర్చుకునే అక్కలు చిరునవ్వుతో ఎదురొచ్చే చెల్లెమ్మల అనుబంధమే చందనం **

**కన్నవారికి చెయ్యాలి అభివందనం **

**తోబుట్టువులను గుర్తుచేసుకోవాలి ప్రతిదినం **

**అరమరికలులేని కుటుంభం నందనవనం **

**అక్కాచెల్లెళ్లకు అన్నాతమ్ముడు పలుకుతారు ఆహ్వానం **

**ఆత్మీయత ఆప్యాయతలతో మనజీవితం అవుతుంది పావనం **


**అక్షరాలతో అక్కలకు అభిషేకం చేస్తున్నా **

**ఆపేక్షని అనుబందాన్ని చూస్తున్నా **

**అందరిని అలరించి ఆకట్టుకునేలా రచనలు రాస్తున్నా **

**తాళ్లులేకుండా పదాలతో బంధిస్తున్నా **

**నాకు చేతనైనంత సాయం న్యాయం అందిస్తున్నా **

**వారుచూపిన అలవికాని అనురాగంతో చిరునవ్వు చిందిస్తున్నా **

**నాకు సొంత అక్కలు ముగ్గురు కానీ దేవుడిచ్చిన అక్కలు ఆకాశంలో చుక్కలంతమంది ఉన్నారు **

**రాఖీ అంతులేనిప్రేమకు అందరూ బాకి **

**మంచిని తప్ప ఏం కట్టుకుపోతాం చివరికి **

**మంచివారి అండ కావాలి మనకి **

**మంచిని మందిలోచెప్పు చెడుని చెవిలో చెప్పు ఈమాట తెలియాలి అందరికి **

**ఈమెసేజి అక్కాచెల్లెమ్మలకు ఎనర్జి **

**అవునా కాదా ?**

**బొమ్మిన వెంకట రమణ **

**83746 01678 **

**మీ అందరి ఆదరాభిమానాలతో 101 సార్లు వృద్దులకు అనాథలకు అన్నదానం చెయ్యడం జరిగింది 2525 కేజీల రైస్ అందించాం **

మానవత్వంలో

 **మానవత్వంలో దైవత్వం దాగుంటుంది **

**మంచినిపంచితేనే జీవితం బాగుంటుంది **

@@@@@@         @@@@@        @@@@@

**దైవం మానుషరూపేణా అంటారు **

**ఆపదలోఆదుకున్నవారినే అలా అంటారు **

**ఫలితంపొందినవ్యక్తికి జీవితాంతం గుర్తుంటారు **

**ఆకలిని ఆనవాల్లేకుండా చెయ్యాలని చాలామంది అనుకుంటారు **

**కానీ ఆచరణలో వెనకుంటారు కొందరు **

**నాఫ్రెండ్స్ డైమండ్స్ కాబట్టి కొందరు ముందుంటారు ఆకలితీర్చుతుంటారు **

**మానవత్వంలో దైవత్వముందని నమ్ముతుంటారు **


**వృద్దులకు అనాథలకు కడుపునింపటం మా అదృష్టంగా భావిస్తున్నాం **

**మానవతామూర్తుల దయ కరుణ ఉదాహరణంగా నిస్వార్థసేవలను అందిస్తున్నాం **

**చేతనైనంత చేయగలిగినంత మంచిని పంచుతున్నాం **

**కొందరిలో దానగుణాన్ని దయార్ద్ర హృదయాన్ని పెంచుతున్నాం **

**మంచులాకరిగే మంచిమనసుని మైనస్ చేసుకోవద్దని చెబుతున్నాం **

**మనంచేసిన మంచితనం మనకుటుంభాలకు మేలుచేస్తుందని నమ్ముతున్నాం **

**మనషిర్డిసాయి హెల్పింగ్ హాండ్స్ తరపున మణికొండ వృద్దాశ్రమంలో 101 సారి అన్నదానం చేస్తున్నాం **

**నిరుపేదలకు 2525 కేజీల రైస్ ఇచ్చి ఉన్నాం **

**నూతనజంటలమీద కళ్యాణకవితలు రాయబడును అదృష్టజంటలకే అరుదైన సువర్ణవకాశం **

**ఈరోజు నాఫ్రెండ్ ప్రసన్న జన్మదినం నాసంష్ఠ అధ్వర్యంలో వృద్దుల సమక్షంలొ జరుగుతుంది **

**బొమ్మిన వెంకట రమణ **

**83746 01678 **

Panchaag


 

*శ్రీ మహాలక్ష్మి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 415*




⚜ *కర్నాటక  :- గురవనహళ్లి  - తుముకూరు*


⚜ *శ్రీ మహాలక్ష్మి ఆలయం*



💠 కర్ణాటక భారతదేశంలో నాల్గవ అత్యంత ప్రసిద్ధ హాలిడే డెస్టినేషన్.  

గొరవనహళ్లిలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం వంటి అలంకరించబడిన ఆలయాల కారణంగా ఈ రాష్ట్రం చాలా ప్రసిద్ధి చెందడానికి ఒక కారణం.  

పేరు సూచించినట్లుగా, ఈ ఆలయం విష్ణువు భార్య మరియు శ్రేయస్సు మరియు సంపద యొక్క దేవత అయిన మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది.


💠 ఈ ఆలయం వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంది మరియు ఇది అబ్బయ్య అనే పేద వ్యక్తితో ప్రారంభమవుతుంది.   

అబ్బయ్య అనే అణగారిన వ్యక్తి మహాలక్ష్మి విగ్రహాన్ని పొందే వరం పొందాడని చెబుతారు.  ఇంట్లో మహాలక్ష్మిని పూజించి అబ్బయ్య ధనవంతుడయ్యాడు.  

అతను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు మరియు అతని ఇంటికి ‘లక్ష్మీ నివాస్’ అనే ట్యాగ్ వచ్చింది.  

అలాగే అబ్బయ్య సోదరుడు తోటడప్ప అబ్బయ్యతో పాటు అతని స్వచ్ఛంద సేవలో చేరాడు.  


💠 అబ్బయ్య మరణించిన తర్వాత తోటడప్ప అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.  ఒకరోజు అతని కలలో, మహాలక్ష్మి తన కోసం ఆలయాన్ని నిర్మించమని అతనికి చెప్పింది.

అలా తోటడప్ప మహాలక్ష్మికి గుడి కట్టించాడు. 


💠 తోటడప్ప మరణించిన తరువాత, చౌడయ్య ఈ మందిరంలో మహాలక్ష్మి దేవికి పూజలు నిర్వహిస్తున్నాడు.  

కానీ 1910 సంవత్సరం నుండి ఆలయం పాడుబడిన స్థితిలో ఉంది.

1925లో గొరవనహళ్లి చేరుకున్న కమలమ్మ ఆలయ నిర్మానుష్య స్థితిని చూసింది.  అమ్మవారికి పూజలు నిర్వహించడం ప్రారంభించింది.  మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆమె ఆ స్థలం నుండి వెళ్ళేసరికి ఆలయం ఒక అనామక స్థితిలో ఉంది.  

అయితే 1952లో కమలమ్మ మళ్లీ గొరవనహళ్లి వచ్చి గొరవనహళ్లి మహాలక్ష్మి ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించారు.  అప్పటి నుంచి కమలమ్మ ఆలయంలో నిత్య పూజలు నిర్వహించారు.


💠 గొరవనహళ్లిలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం 1900 లలో విలక్షణమైన దక్షిణ భారత వాస్తుశిల్పానికి ఒక అందమైన ఉదాహరణ.  

ఈ ఆలయం రెండు వైపులా చిన్న తోరణాలతో పెద్ద, బహుళ వర్ణ గోపురం కలిగి ఉంది.  ఆలయానికి ఇరువైపులా వరండాలు కూడా ఉన్నాయి.  


💠 ప్రధాన దేవత గర్భగృహ లేదా గర్భగుడిలో కొలువై ఉంటుంది.  నాగ్ దేవ్ మరియు మరికాంబ వంటి ఇతర దేవతలు కూడా ఆలయంలో కొలువై ఉన్నారు.


💠 ఆలయం ఏడాది పొడవునా ప్రజలకు తెరిచి ఉంటుంది.  మంగళవారాలు మరియు శుక్రవారాలు ముఖ్యంగా పవిత్రమైనవిగా భావిస్తారు.  మీరు పూజకు హాజరు కావాలనుకుంటే, ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు అభిషేకం మరియు కుంకుమ అర్చన మరియు 9:30, 12:30 మరియు రాత్రి 7:30 గంటలకు మహా మంగళారతి నిర్వహిస్తారు.  ఆలయాన్ని మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మూసివేస్తారు.  ఈ ఆలయంలో లక్షదీపోత్సవ అతి ముఖ్యమైన పండుగ.


💠 దూరం: బెంగళూరు నుండి 90 కి.మీ.

Panchaag


 

కృష్ణ తత్వం

 🔔 *కృష్ణ తత్వం* 🔔


అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురమ్ |

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ||


*అందంగా ,చిరునవ్వు తో, అందరికి ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడు వెనక ఎన్ని కష్టాలు*


 *శ్రీకృష్ణుని జీవితం... దారుణమైన ముళ్ళబాట*


సుఖంగా, హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు.

పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.


కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.

కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.


అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా!


జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.


రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి.


చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.


తులసి దేవి మహత్యం అందరికి తెలియడం కోసం తులాభారం సన్నివేశం లో త్రాసులో కూర్చున్నాడు.


తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో  రథసారథి గా ఉండి తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.


కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె!

కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు.

యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.


చివరికి తన అవతారం చాలింపు కూడ ఎవరూ చూసేవాలు కూడ లేకండా ఒంటరిగానే ముగిసింది.


భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడినాడు.


ఎవరు ఎన్ని నిందలు వేసిన ధర్మ రక్షణ కొరకే తన జీవితాన్ని కొనసాగించాడు.


తన జీవితాన్ని తామరాకుపై నీటిబొట్టులాగా గడిపినాడు.


ధర్మరక్షణ కొరకు తాను చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని చూడలేదు.


ఆవేశం కాదు ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి.


నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కాని, కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు.


https://youtu.be/hfTvKjrsPc0


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

సంకల్పములు

 🙏🙏🌹🙏🙏

సంకల్పములు :

🌹🌹🌹🌹🌹

1.మృగ సంకల్పము : ఆహార నిద్ర భయ మైధున విషయ చింతనలు మాత్రమే ఉండి ధర్మాచరణ లేక, ఇతరులకు


కీడుచేయు పశుతుల్యులైన వారి సంకల్పము మృగ సంకల్పమనబడును.         2. మనుష్య సంకల్పము : తన సామాన్య ధర్మమును పోషించుచు, ఇతరులను చెరపక యుండువారి సంకల్పము  

మనుష్య సంకల్పము అనబడును.


3. దేవ సంకల్పము : దైవిక సంబంధమగు

కార్యములను చేయవలెననెడి సంకల్పము. కొంత అంతఃకరణ శుద్ధి ఉండుట దేవ సంకల్పమనబడును.         4. ఋషి సంకల్పము : విషయ వాసనాతీతమైన స్థితిలో కలిగే సంకల్పము, జీవ కారుణ్యము, లోక కళ్యాణము, శాంతి కలిగించే సంకల్పము ఋషి సంకల్పము.


5. ఈశ్వర సంకల్పము: త్రిమూర్తుల సృష్టి, స్థితి లయములలో, లోకపాలన, నియతి పాలన సంబంధించిన విశుద్ధ సంకల్పము ఈశ్వర సంకల్ప మనబడును.


6. నిస్సంకల్పము : దృశ్యములేవీ తోచకుండుట, ఆత్మాకారమై యుండుట, కేవల జ్ఞేయ స్వరూపమైయుండుట నిస్సంకల్పమనబడును. నిస్సంకల్పుల ఆజ్ఞలు దేవతలకు, త్రిమూర్తులకు శిరోధార్యము.

🙏🙏🙏🙏🙏

బ్రాహ్మణుడి లక్షణాలు

 🌹 *బ్రాహ్మణుడికి ఉండవలసిన  లక్షణాలు*🌹


*దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||*

*తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||*


ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.

ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.

ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.

అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.


పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, 

ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. 


*బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :*


* *యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :*


కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.


* *నిత్య సంధ్యావందనం :*


నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.


* *శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :*


బ్రాహ్మణులకు శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. 


* *పవిత్రద్రవ్య ధారణ :*


ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.


* *ప్రశాంతంగా ఉండుట :*


ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకు అర్హుడు కాడు.


* *స్పష్టంగా మాట్లాడుట :*


మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు.  సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.


* *చెడు వ్యసనములు లేకుండుట :*


మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.


*సమ భావన :*


ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.


కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.


కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. 


బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి.


*(సరర్వేజనా:సుఖినోభవంతు)(సమస్త సన్మంగళానిభవంతు)*


‌             🌹🌹🌹🌹🌹

మంగళవారం*🍁 🌹 *ఆగష్టు,20, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

  🌹 *ఆగష్టు,20, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*

                   

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి   : పాడ్యమి* రా 08.32 వరకు ఉపరి *విదియ* 

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం  : శతభిషం* రా 03.09 తె వరకు


*యోగం  : అతిగండ* రా 08.55 వరకు ఉపరి *సుకర్మ* 

*కరణం  : బాలువ* ఉ 10.15 *కౌలువ* రా 08.32 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 09.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*రా 08.44 - 10.10*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.36*


*వర్జ్యం         : ప 12.10 - 01.36*

*దుర్ముహుర్తం   : ఉ 08.24 - 09.14 రా 11.02 - 11.46*

*రాహు కాలం:మ 03.20 - 04.54*

గుళిక కాలం     :*మ 12.11 - 01.45*

యమ గండం   : *ఉ 09.01 - 10.36*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *కుంభం* 

సూర్యోదయం :*ఉ 05.52* 

సూర్యాస్తమయం :*సా 06.29*

*ప్రయాణశూల  :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.52 - 08.24*

సంగవ కాలం   :      *08.24 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.55 - 01.26*

అపరాహ్న కాలం :*మ 01.26 - 03.58*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ పాడ్యమి*

సాయంకాలం  :  *సా 03.58 - 06.29*

ప్రదోష కాలం  :  *సా 06.29 - 08.46*

నిశీధి కాలం     :*రా 11.48 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.07*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

*_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


♦️సర్వస్వభూతం గృష్ణీష్వ 

పరిష్వంగంమ యాకృతం

వరం దదామి పింగాక్ష 

సర్వకార్యపరో భవ 

త్వన్మంత్ర జాపినాం నిత్యం

త్వన్నామస్మృతికారిణాం

త్వద్రూప పూజకానాం చ 

సర్వకార్యపరో భవ♦️ 


👉నా సర్వస్వంగా నేను సంభావించి

(సీతకు మాత్రమే ఇచ్చిన)

 #నాకౌగిలిని నీకు ఇచ్చుచున్నాను...


అంతేకాదు... 

నీకు కొన్ని వరములు కూడా ఇస్తున్నాను. 

నీ నామాన్ని జపించేవారికి... 

నిన్ను సదా స్మరించేవారికి... 

నీ రూపాన్ని అర్చించేవారికి... 

నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు...

అని భావం.

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

_*శ్రీ గరుత్మంతుడి కధ -7

 _*శ్రీ గరుత్మంతుడి కధ -7 వ భాగం*_

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


*శ్రీహరి_దశావతారములు*


పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.


*1_మత్స్యావతారము :*


వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృత మాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయ బోతే, ‘ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి… నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రం లోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు “నీవెవరవు?” అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. “శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?” అని రాజు ప్రశ్నించాడు.


అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. “రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును” అని చెప్పెను. 


ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయి నప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశాను సారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.


సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.


*2_కూర్మావతారము:*

దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాల సముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.

దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదల య్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫల మయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.

అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము క్రింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులును, అమృతమును పుట్టెను.అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించి నది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.


*జయ_విజయులు:*

జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వార పాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యె దరనిశపించారు.


అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.

ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంత వక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.


*౩_వరాహావతారము:*


శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు.మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు. 


అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. “దేవా… సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, భూమిని తీసుకొని నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు…. అని బ్రహ్మ వివరించాడు.

ఆ పలుకులు విని యజ్ఞవరాహ మూర్తి యను సర్వేశ్వరుడు, సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.


రణ రంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయక పోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.


అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.  


*4_నృశింహావాతారము :*


*దశభుజ_పంచముఖ_నరసిమ్హుడు*


సోదరుని హిరణ్యాక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్య పాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలో గాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధముల చేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.


ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింప సాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు – “కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును” అని వారికి అభయమిచ్చాడు.


హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదను చూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతి యైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.


ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతము లందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కుల కప్పగించాడు.


గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.


ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి – నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు “సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు” అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధో పాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి – “గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి.” అని వివరించాడు.


హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.


క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి – నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.


ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా

అప్పుడు ప్రహ్లాదుడు “చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు” అని చెప్పాడు.0ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను. అయితే “ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?” అని రాజు ప్రశ్నించాడు. “బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడై యుండేవాడు ఈ స్తంభము నందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. “సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డు పడతాడా?” అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు. బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. “మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరి మూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. 


మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహ స్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

“స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు” అని కోరాడు ప్రహ్లాదుడు. “నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావన మైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి” అని ఆశీర్వదించాడు స్వామి.


హిరణ్యకశిపుని వధానంతరం భీకర రౌద్రపూరితమైన నృసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింప చేయలేక పోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడి శాంతించాడు. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకముల కరిగిరి.


*5_వామనావతారం :*

బలిచక్రవర్తి అజేయ బల పరాక్రమాలు కలవాడు. మాహాదాత.అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడు కున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.


*6_పరశురామావతారం :*


శ్రీహరి తన అంశముతో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరుబది యొక్క సారులు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.


*7_శ్రీరామావతారం :*


రావణకుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతాలక్ష్మనులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొని పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణాది రాక్షసులను సంహరించెను. అయోధ్యకు వచ్చి పట్టము గట్టుకొనెను. లోకాపవాదమునకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రయమునకు జేరెను. అప్పటికే గర్భవతియైన సీత అక్కడ లవకుశులు అను ఇద్దరు కుమారులను కనెను. రాముడు పదునోక్కవేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీత సమేతుడై అయోధ్య పురవాసులతో సహా పరమపదమునకు వేంచేసేను.


*8_బలరాముడుగా*_అలంకరించారు. అనంతరం రామయ్యను కల్యాణ మంటపంలోని ప్రత్యేక వేదిక వద్దకు మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ తోడ్కొని వచ్చి ఆశీనులను చేశారు.


*9_శ్రీకృష్ణావతారం :*


ఇరువది యెనిమిదవ ద్వాపరయుగములో అధర్మప్రవ్రుత్తులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారము నెత్తెను. దేవకీవసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్యక్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షషులను సంహరించెను. మధురాపురమునకు బోయి కంసుని సంహరించి, మాతా మహుని రాజమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిన్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరకుని జంపి 16౦౦౦ మందిని వాని చెరనుండి విడిపించెను. ద్వారక నగరమును నిర్మించి భార్యాపుత్రబంధుమిత్ర పరివారముతో నూటపాతిక యేండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మాపరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించుచుండగా ముసులము వంకతో వారిని గూడ సంహరించి తానూ పరమపదమునకు చేరెను.


*10_కల్క్యావతారము:*

బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తించురు. ప్రజలు కూడ అన్యాయ ప్రవర్తనులై వేదకర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగంలో విష్ణుయశునుడికి శ్రీహరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును.

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*శ్రీ గరుత్మంతుడి కధ -6

 *శ్రీ గరుత్మంతుడి కధ -6 వ భాగం* 

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️


*దానములు_ధర్మములు:*


దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.


సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :


*శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||*

*కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||*


తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.


దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల ని ఇస్తుంది ....

🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏

శ్రీ గరుత్మంతుడి కధ -5

 _*శ్రీ గరుత్మంతుడి కధ -5 వ భాగం*_ 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తనసవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండే వాడు. ఒకరోజు ఇలా త్రిప్పు తుండగా గరుత్మంతుడు సూర్య మండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది.ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.


దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.


*గరుత్మంతుని_దాస్యవిముక్తి*


తాబేలును ఏనుగును మోసుకు వెళుతున్న గరుత్మంతుడు - రాజ్మానామా నుండి గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయే టట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది.


*సర్పాలకు_ద్విజిహ్వత్వం*


అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై ఉంచి నప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.


*ఉపసంహారం*


ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి ఉండిన్నీ, తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*శ్రీ గరుత్మంతుడి కధ -4

 _*శ్రీ గరుత్మంతుడి కధ -4 వ భాగం*_

*అనూరుని_శాపం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.


*వినత_కద్రువల_పందెం*


వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.


*సంతానానికి_కద్రువ_శాపం*


కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో  మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.


తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు

 



#రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు

రామాయణం ఒక భూగోళ శాస్త్రము. 

సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:

ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;

నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,

అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)

తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)

యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.

తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )

అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)

తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)

ఋషభము అని పర్వతము

మధుర జలధి (జపనీస్ సి )

ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)

13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము

ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )

తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)

అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.

దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.

నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా

దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,

పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక

మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)

అది దాటాక భూమి సరిహద్దు

పశ్చిమ దిక్కుకు సుషేణుడు

వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము

మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ

60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు

మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)

10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )

తరువాత సరిహద్దు

ఉత్తర దిక్కుకు శతవాలి

ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము

దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )

లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు

అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.

ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.

🚩🕉️☀️🙏#జైశ్రీరామ్🙏☀️🕉️🚩

*శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 414*


⚜ *కర్నాటక  : తిప్పతురు - తుముకూరు*


⚜ *శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం*



💠 పూర్వకాలంలో దేవుళ్ళు మనుషులతో మాట్లాడేవారనీ, ఇప్పుడు అంతా పాప పంకిలం అవ్వడం వళ్ళ మనతో మాట్లాడడం మానేశారనీ బాధపడుతూ ఉంటాము .

అయితే మనతో కూడా ఓ సారి మాట్లాడితే బాగుంటుంది కదా !


💠 పూర్వకాలంలో భక్తులు మాట్లాడాలనుకుంటే, దేవుడే స్వయంగా దిగివచ్చి, మనం ఏ మిత్రునితో మాట్లాడుతున్నట్టు మాలాడేవారట .

అటువంటి అవకాశం ఇక ఈలోకంలో లేనట్టేనా..!  

ఈ కలికాలంలో అంతులేని సమస్యలతో బాధపడే జనానికి కనీసం వారి ప్రశ్నలకయినా అమ్మలాంటి , ఆ అమ్మల గన్నమ్మ,ఆ దేవదేవి మనకు సమాధానం చెప్పే క్షేత్రం ఈ భువి మీద ఉన్నది .


💠 దేవుడు ఉన్నడా  ఉంటే నీతో మాట్లాడాడా  అని ఎవరయినా సవాల్ చేస్తే ఈసారి ఆ మాట్లాడాను . కావాలంటే నీతో కూడా మాట్లాడించనా అని అడగండి ధైర్యంగా ! మరేం ఫర్వాలేదు .


💠 ఆ చౌడేశ్వరీ దేవి మనకి తోడుగా ఉంది. అడిగిన ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం స్వయంగా ఇస్తుంది. కానీ ఒక్కటే సమస్య.

మీకే భాషొచ్చినా సమస్యలేదు.

ఆ దేవికి అర్థమవుతుంది. 

కానీ ఆ దేవి మాత్రం కన్నడంలోనే జవాబు చెబుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 


💠 కర్ణాటక రాష్ట్రంలో, తుమకూరు జిల్లాలోని  తిప్పటూరులో స్వయంభువైన మహిమాన్విత పరాశక్తి వుంది. ఆమె దాసరిఘట్టలోని చౌడేశ్వరీదేవి.


💠 ఇక్కడికి వచ్చినవారి సమస్యలకు స్వయంగా సమాధానం ఇవ్వడం ద్వారా పరిష్కారాన్ని చూపే దేవత ఈ చౌడేశ్వరీ మాత .


💠 దేశవిదేశాల నుండి అనేకమంది భక్తులు ఈ దేవీ దర్శనానికి తమ సమస్యలకు సమాధానాల కోసం వస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన టికెట్ కూడా తీసుకోవాలి .


💠 ఆ తర్వాత చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని బియ్యం పిండి మీద వుంచుతారు. దేవీ విగ్రహం మీద ఒక కలశాన్ని వుంచుతారు.

అమ్మకి ప్రశ్నని చెప్పి, ఆమె సమాధానం కోసం సిద్ధం చేసిన కలశాన్ని కదిలించి తిప్పుతారు. వెంటనే అక్షరరూపంలో వచ్చిన సమాధానాన్ని పూజారులు తెలుపుతారు


💠 ఈ విధంగా వేల కొలది భక్తులు సమాధానాలు తెలుసుకున్నారు. 

వారికి సరియైన సమాధానాలు కూడా దొరికాయట .ఈ తల్లి చెప్పే భవిష్యత్తు ఎప్పుడూ తప్పు కాదు అనేది ఇక్కడి వారి నమ్మకం.


💠 ఈ దేవి ఇక్కడ వెలసిన విధానం కూడా ఆశ్చర్యకరమైన కథతో కూడుకొని ఉన్నదే !  వందల సంవత్సరాలకు ముందు కర్ణాటక రాయచూరు జిల్లాలో, తుంగా నదీ సమీపంలో నందవరం అనే సామ్రాజ్యం వుండేది.


 💠 ఈ ప్రదేశాన్ని పరిపాలించే రాజు గారికి అనేక మంత్ర శక్తులు ఉండేవి. 

ఆయన మహా శివ భక్తుడు . 

తన అపూర్వమైన శక్తి వల్ల ప్రతి నిత్యం ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి, కాశీకి వెళ్లి ,గంగా స్నానం చేసి సాయంకాలం సమయంలో మళ్ళీ సాయంత్రం తన సామ్రాజ్యానికి తిరిగివచ్చేవారట.


💠 ఆ రాజుగారు అలా నిత్యం ఎక్కడికి వెళ్లొస్తున్నారా అని రాణిగారికి అనుమానం. దైవదర్శనానికా లేక ఎవరైనా దేవి దర్శనానికా అని ఆమె సందేహాలు ఆమెవి . 

దాంతో ఆయనకీ నిజం చెప్పక తప్పింది కాదు.


💠 నిజం తెలుసుకొని భర్తతో పాటు తానుకూడా ఆవిధంగా ఒక్కరోజులోనే కాశీ దర్శనం చేసుకోవాలని ఆమె కూడా కోరుకుంది. రాజు సరే నన్నారు .

తనతో తీసుకెళ్లారు కానీ ఆమెకి స్త్రీలకి సహజమైన రుతుక్రమం అదే సమయంలోనే వచ్చింది. ఆ దోషం వలన రాజు తన శక్తులనికోల్పోయాడు.


💠 అక్కడ చండీ హోమం చేస్తున్న బ్రాహ్మణుల గుంపును చూసి, వారి దగ్గరికి వెళ్లాడు.

అతని అశాంతికి గల కారణాలను తెలుసుకున్న బ్రాహ్మణులు, రాణిని శుద్ధి చేసి, తమ రాజ్యానికి తిరిగి రావడానికి తగిన సమయంలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా తాము సంపాదించిన దానిలో నాలుగింట ఒక వంతు పుణ్యంగా రాజుకు అందజేస్తామని వాగ్దానం చేశారు.  .  వారు తమ సహాయానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తారని వారు రాజును అడిగారు.  వారు తనను సంప్రదించినప్పుడల్లా వారి ధార్మిక కార్యాల నిమిత్తం వారికి జహాగీర్లను ఇస్తానని రాజు వాగ్దానం చేశాడు. 


💠 ఆ విధంగా రాజు బ్రాహ్మణుల నుండి అధికారాన్ని పొంది తన రాజ్యానికి తిరిగి వచ్చాడు.  

అతను మళ్ళీ మంత్రశక్తిని ఉపయోగించుకోలేదు.

సంవత్సరాలు దొర్లాయి.  


💠 కాశీలో భయంకరమైన కరువు వచ్చింది.  రాజు వాగ్దానాన్ని గుర్తుచేసుకున్న బ్రాహ్మణులు నందవరానికి వెళ్లి అతనిని కలిశారు.  

వారు అతని వాగ్దానాన్ని గుర్తు చేశారు.  

రాజు తన వాగ్దానాన్ని పూర్తిగా మరచిపోయాడు.  

అతను బ్రాహ్మణులను దుర్భాషలాడాడు మరియు వారు అసంతృప్తిని పొందారు. 


💠 అప్పుడా పండితోత్తములు, రాజన్న మాటలకి ఆ చౌడేశ్వరీదేవె సాక్ష్యమని , తాము నిజం చెబితే, ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పాలనీ అంటారు.

ఆ మాటకి కట్టుపడ్డ చౌడేశ్వరీ మాత , ఇప్పుడున్న ప్రాంతంలో వచ్చినిలిచిందనీ ఆ బ్రాహ్మణులకి సాక్ష్యం గా నిలవడమే కాకుండా, తనని నమ్మిన భక్తులకి సమస్యలకి స్వయంగా సమాధానమిస్తూ అనుగ్రహిస్తున్నదనీ స్థల ఐతిహ్యం .

ఇదీ స్వయంగా సమాధానం ఇచ్చే చౌడేశ్వరీ మాత కథ.కర్ణాటక వెళితే, తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి రండి.


💠 బెంగుళూరు నుంచి తుమకూరు సుమారు 72కి.మీ దూరం , తుమకూరు నుంచి తిప్పటూరుకి 74 కి.మీ ల దూరం.

దోమ‌ల దినోత్స‌వం .


*నేడు ప్ర‌పంచ దోమ‌ల దినోత్స‌వం ..*

*ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా?*

ఈ ప్రపంచంలో మనం దేనినీ తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే అది మనకు ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3700 రకాల దోమలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యక్తికి దోమలు కుట్టిన అసహ్యకరమైన అనుభవం ఉంది. దోమ కుట్టినప్పుడు ఆ శరీర భాగానికి దురద మరియు వాపు వస్తుంది. ఒక వ్యక్తిని కుట్టడం ద్వారా ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రమాదకరమైన వ్యాధులు మరియు వైరస్‌లను వ్యాప్తి చేసే దోమలు ఉన్నాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.


గణాంకాల ప్రకారం మలేరియాతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 4,35,000 మంది దాకా చనిపోతున్నారు. ఐతే.. ఏటా 21.9 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. అంటే.. కరోనా కంటే మలేరియానే ప్రమాదకరం అనుకోవచ్చు. చాలా మంది మలేరియాను తేలిగ్గా తీసుకుంటారు. అందుకే ఎక్కువ మంది దాని బారిన పడుతున్నారు. ప్రస్తుతం మలేరియా 100కు పైగా దేశాల్లో ఉంది. ఎండ ఉండే దేశాల్లో ఇది బాగా ఉంది. మొత్తం మలేరియా కేసుల్లో 70 శాతం 11 దేశాల్లో నమోదవుతున్నాయి. వాటిలో ఇండియాతోపాటూ... ఆఫ్రికా ఖండ దేశాలు ఉన్నాయి..


దోమల వల్ల మలేరియా సంక్రమిస్తుందని 1897లో సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ఆందుకు గానూ ఆయనకు గౌరవసూచకంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్ వంటి వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును రూపొందించారు. ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా, ఈ కీటకాల నుంచి మనల్ని, చుట్టూ ఉన్నవారిని అ రక్షించుకోవచ్చు.

దేవాలయాలు - పూజలు 16*

 *దేవాలయాలు - పూజలు 16*


సభ్యులకు నమస్కారములు.


*ప్రదక్షిణ (1)* 

 దేవాలయాలు -  పూజలు సందర్భంగా దైవ  *ప్రదక్షిణలకు* గూడా ఎనలేని ప్రాముఖ్యత గలదు. ఇంకా చెప్పాలంటే  *ప్రదక్షిణ రహిత* దేవాలయ పూజలు అసంపూర్తిగా  మిగిలిపోతాయి. ప్రదక్షిణ అను పదానికి సామాన్య అర్థం పరిక్రమమం లేదా భ్రమణ లేదా తిరగడం. వలయాకారంగా కుడి వైపు తిరగడం. భగవద్ ఉపచారాలలో ప్రదక్షిణం కూడా అత్యంత ప్రాముఖ్యత కల్గిఉన్నది.  ప్రదక్షిణ పదం  యొక్క అర్థాలను గమనిద్దాము.  సంస్కృతంలో దక్షిణ అంటే *కుడి*  *ప్ర*  కున్న నానర్థలలో  గతి = త్రోవ, నడక, దిక్కు, మార్గము అన్ని వెరసి ప్రదక్షిణ అంటే కుడి  వైపు నడక. శ్రీ రమణ మహర్షుల వారి విశ్లేషణ ప్రకారం.. *ప్ర*  అను అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం, *ద* అంటే కోరికలను తీర్చగలరు, *క్షి* అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని (నాశనాన్ని) తెలియజేస్తుంది, *న* అంటే అజ్ఞానము నుండి విముక్తి. 


ప్రదక్షిణలో ఉన్న మూలార్థము తెలుసుకుందాము. ఆలయంలో ఉన్న దైవం విశ్వ శక్తి కేంద్ర బిందువు కు ప్రతీక. ఆయన చుట్టూ కట్టబడి ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతము. ప్రదక్షిణ సంప్రదాయంగా పరమాత్ముని చుట్టూ వలయాకారంగా, సవ్య దిశలో చేయడంవలన,  జన్మ జన్మలలో చేసిన దుష్కర్మ ఫలితాల విరగడ జరుగుతుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా, ప్రతి రోజూ దేవాలయ సందర్శనచేసి అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల దుష్కర్మ  ఫలితాలను గూడా  నివారించు కొనవచ్చును.


 *పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమణము వలన జరుగు కర్మ క్షయమే ప్రదక్షిణల పరమార్థం*. 


*వైష్ణవ ఆలయాలలో ప్రదక్షిణలు*  దేవాలయాలలో ప్రవేశించిన తరువాత పాద ప్రక్షాళన చేసికొని ధ్వజ స్తంభం ఉన్న చోటున కొంచెం 30° ఉత్తరాభిముఖంగా సాష్టాంగ దండ ప్రణామం మొగవారికి మాత్రమే అవకాశం వుంది. స్త్రీ మూర్తులకు, బాలికలకు సాష్టాంగ నమస్కార నియమము లేదు. భక్తులు మొదటగా ప్రదక్షిణలు అనంతరం గరుడాళ్వారుకు నమస్కారం చేసి,

ఆలయం కుడివైపు నుండి ముఖ మండపంలో ప్రవేశించి క్షేత్ర పాలకుడైన హనుమంతుడు/గరుత్మంతుని దర్శించి తరువాత ద్వార పాలకులుగా ఉన్నజయ విజయులుకు నమస్కారం చేసి తదుపరి ఆ క్షేత్ర అమ్మవారి ని దర్శించి తరువాత  గుడిలోని ప్రధాన దేవుణ్ణి దర్శించి విన్నపాలు అనంతరం తీర్థం శఠగోపం మరియు ప్రసాదాలదైవత్వం స్వీకరించిన తర్వాత ఓ రెండు నిమిషాలు ఆ గుడి దేవుని విశేషాలు కూర్చుని తలచుకుని ఆనందించే ప్రయత్నం చేస్తారు. ఆయనకు  (భగవంతుని) కృతజ్ఞతలు తెలిపి తిరిగి భక్తులు తమ తమ దైనందిన జీవితంలో ప్రవేశిస్తారు.


*శివాలయాలలో ప్రదక్షిణలు* చండీశ్వరుడున్న శివాలయాలలో ప్రదక్షిణ విధానాన్ని చండీ ప్రదక్షిణ అంటారు. శివాలయాలలో ప్రదక్షిణలకు ఒక ప్రత్యేక నియమము పాటించాల్సి ఉంటుంది. ముందుగా శివ లింగానికి లేదా చిత్తరువుకు నమస్కారం చేసి సోమ సూత్రం వరకు మాత్రమే ప్రదక్షిణ చేసి తిరిగి శివ లింగ దర్శనమునకు రావల్సి ఉంటుంది. ఈ ప్రదక్షిణ *అర్ధ వృత్తాకారంలో మాత్రమే ఉంటుంది*. 

వృత్తాకార ప్రదక్షిణలు 

ఈ దేవాలయాలలో సంప్రదాయము కాదు.


ధన్యవాదములు.

*(సశేషం)*