🕉 *మన గుడి : నెం 414*
⚜ *కర్నాటక : తిప్పతురు - తుముకూరు*
⚜ *శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం*
💠 పూర్వకాలంలో దేవుళ్ళు మనుషులతో మాట్లాడేవారనీ, ఇప్పుడు అంతా పాప పంకిలం అవ్వడం వళ్ళ మనతో మాట్లాడడం మానేశారనీ బాధపడుతూ ఉంటాము .
అయితే మనతో కూడా ఓ సారి మాట్లాడితే బాగుంటుంది కదా !
💠 పూర్వకాలంలో భక్తులు మాట్లాడాలనుకుంటే, దేవుడే స్వయంగా దిగివచ్చి, మనం ఏ మిత్రునితో మాట్లాడుతున్నట్టు మాలాడేవారట .
అటువంటి అవకాశం ఇక ఈలోకంలో లేనట్టేనా..!
ఈ కలికాలంలో అంతులేని సమస్యలతో బాధపడే జనానికి కనీసం వారి ప్రశ్నలకయినా అమ్మలాంటి , ఆ అమ్మల గన్నమ్మ,ఆ దేవదేవి మనకు సమాధానం చెప్పే క్షేత్రం ఈ భువి మీద ఉన్నది .
💠 దేవుడు ఉన్నడా ఉంటే నీతో మాట్లాడాడా అని ఎవరయినా సవాల్ చేస్తే ఈసారి ఆ మాట్లాడాను . కావాలంటే నీతో కూడా మాట్లాడించనా అని అడగండి ధైర్యంగా ! మరేం ఫర్వాలేదు .
💠 ఆ చౌడేశ్వరీ దేవి మనకి తోడుగా ఉంది. అడిగిన ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం స్వయంగా ఇస్తుంది. కానీ ఒక్కటే సమస్య.
మీకే భాషొచ్చినా సమస్యలేదు.
ఆ దేవికి అర్థమవుతుంది.
కానీ ఆ దేవి మాత్రం కన్నడంలోనే జవాబు చెబుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
💠 కర్ణాటక రాష్ట్రంలో, తుమకూరు జిల్లాలోని తిప్పటూరులో స్వయంభువైన మహిమాన్విత పరాశక్తి వుంది. ఆమె దాసరిఘట్టలోని చౌడేశ్వరీదేవి.
💠 ఇక్కడికి వచ్చినవారి సమస్యలకు స్వయంగా సమాధానం ఇవ్వడం ద్వారా పరిష్కారాన్ని చూపే దేవత ఈ చౌడేశ్వరీ మాత .
💠 దేశవిదేశాల నుండి అనేకమంది భక్తులు ఈ దేవీ దర్శనానికి తమ సమస్యలకు సమాధానాల కోసం వస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన టికెట్ కూడా తీసుకోవాలి .
💠 ఆ తర్వాత చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని బియ్యం పిండి మీద వుంచుతారు. దేవీ విగ్రహం మీద ఒక కలశాన్ని వుంచుతారు.
అమ్మకి ప్రశ్నని చెప్పి, ఆమె సమాధానం కోసం సిద్ధం చేసిన కలశాన్ని కదిలించి తిప్పుతారు. వెంటనే అక్షరరూపంలో వచ్చిన సమాధానాన్ని పూజారులు తెలుపుతారు
💠 ఈ విధంగా వేల కొలది భక్తులు సమాధానాలు తెలుసుకున్నారు.
వారికి సరియైన సమాధానాలు కూడా దొరికాయట .ఈ తల్లి చెప్పే భవిష్యత్తు ఎప్పుడూ తప్పు కాదు అనేది ఇక్కడి వారి నమ్మకం.
💠 ఈ దేవి ఇక్కడ వెలసిన విధానం కూడా ఆశ్చర్యకరమైన కథతో కూడుకొని ఉన్నదే ! వందల సంవత్సరాలకు ముందు కర్ణాటక రాయచూరు జిల్లాలో, తుంగా నదీ సమీపంలో నందవరం అనే సామ్రాజ్యం వుండేది.
💠 ఈ ప్రదేశాన్ని పరిపాలించే రాజు గారికి అనేక మంత్ర శక్తులు ఉండేవి.
ఆయన మహా శివ భక్తుడు .
తన అపూర్వమైన శక్తి వల్ల ప్రతి నిత్యం ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి, కాశీకి వెళ్లి ,గంగా స్నానం చేసి సాయంకాలం సమయంలో మళ్ళీ సాయంత్రం తన సామ్రాజ్యానికి తిరిగివచ్చేవారట.
💠 ఆ రాజుగారు అలా నిత్యం ఎక్కడికి వెళ్లొస్తున్నారా అని రాణిగారికి అనుమానం. దైవదర్శనానికా లేక ఎవరైనా దేవి దర్శనానికా అని ఆమె సందేహాలు ఆమెవి .
దాంతో ఆయనకీ నిజం చెప్పక తప్పింది కాదు.
💠 నిజం తెలుసుకొని భర్తతో పాటు తానుకూడా ఆవిధంగా ఒక్కరోజులోనే కాశీ దర్శనం చేసుకోవాలని ఆమె కూడా కోరుకుంది. రాజు సరే నన్నారు .
తనతో తీసుకెళ్లారు కానీ ఆమెకి స్త్రీలకి సహజమైన రుతుక్రమం అదే సమయంలోనే వచ్చింది. ఆ దోషం వలన రాజు తన శక్తులనికోల్పోయాడు.
💠 అక్కడ చండీ హోమం చేస్తున్న బ్రాహ్మణుల గుంపును చూసి, వారి దగ్గరికి వెళ్లాడు.
అతని అశాంతికి గల కారణాలను తెలుసుకున్న బ్రాహ్మణులు, రాణిని శుద్ధి చేసి, తమ రాజ్యానికి తిరిగి రావడానికి తగిన సమయంలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా తాము సంపాదించిన దానిలో నాలుగింట ఒక వంతు పుణ్యంగా రాజుకు అందజేస్తామని వాగ్దానం చేశారు. . వారు తమ సహాయానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తారని వారు రాజును అడిగారు. వారు తనను సంప్రదించినప్పుడల్లా వారి ధార్మిక కార్యాల నిమిత్తం వారికి జహాగీర్లను ఇస్తానని రాజు వాగ్దానం చేశాడు.
💠 ఆ విధంగా రాజు బ్రాహ్మణుల నుండి అధికారాన్ని పొంది తన రాజ్యానికి తిరిగి వచ్చాడు.
అతను మళ్ళీ మంత్రశక్తిని ఉపయోగించుకోలేదు.
సంవత్సరాలు దొర్లాయి.
💠 కాశీలో భయంకరమైన కరువు వచ్చింది. రాజు వాగ్దానాన్ని గుర్తుచేసుకున్న బ్రాహ్మణులు నందవరానికి వెళ్లి అతనిని కలిశారు.
వారు అతని వాగ్దానాన్ని గుర్తు చేశారు.
రాజు తన వాగ్దానాన్ని పూర్తిగా మరచిపోయాడు.
అతను బ్రాహ్మణులను దుర్భాషలాడాడు మరియు వారు అసంతృప్తిని పొందారు.
💠 అప్పుడా పండితోత్తములు, రాజన్న మాటలకి ఆ చౌడేశ్వరీదేవె సాక్ష్యమని , తాము నిజం చెబితే, ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పాలనీ అంటారు.
ఆ మాటకి కట్టుపడ్డ చౌడేశ్వరీ మాత , ఇప్పుడున్న ప్రాంతంలో వచ్చినిలిచిందనీ ఆ బ్రాహ్మణులకి సాక్ష్యం గా నిలవడమే కాకుండా, తనని నమ్మిన భక్తులకి సమస్యలకి స్వయంగా సమాధానమిస్తూ అనుగ్రహిస్తున్నదనీ స్థల ఐతిహ్యం .
ఇదీ స్వయంగా సమాధానం ఇచ్చే చౌడేశ్వరీ మాత కథ.కర్ణాటక వెళితే, తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి రండి.
💠 బెంగుళూరు నుంచి తుమకూరు సుమారు 72కి.మీ దూరం , తుమకూరు నుంచి తిప్పటూరుకి 74 కి.మీ ల దూరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి