🙏🙏🌹🙏🙏
సంకల్పములు :
🌹🌹🌹🌹🌹
1.మృగ సంకల్పము : ఆహార నిద్ర భయ మైధున విషయ చింతనలు మాత్రమే ఉండి ధర్మాచరణ లేక, ఇతరులకు
కీడుచేయు పశుతుల్యులైన వారి సంకల్పము మృగ సంకల్పమనబడును. 2. మనుష్య సంకల్పము : తన సామాన్య ధర్మమును పోషించుచు, ఇతరులను చెరపక యుండువారి సంకల్పము
మనుష్య సంకల్పము అనబడును.
3. దేవ సంకల్పము : దైవిక సంబంధమగు
కార్యములను చేయవలెననెడి సంకల్పము. కొంత అంతఃకరణ శుద్ధి ఉండుట దేవ సంకల్పమనబడును. 4. ఋషి సంకల్పము : విషయ వాసనాతీతమైన స్థితిలో కలిగే సంకల్పము, జీవ కారుణ్యము, లోక కళ్యాణము, శాంతి కలిగించే సంకల్పము ఋషి సంకల్పము.
5. ఈశ్వర సంకల్పము: త్రిమూర్తుల సృష్టి, స్థితి లయములలో, లోకపాలన, నియతి పాలన సంబంధించిన విశుద్ధ సంకల్పము ఈశ్వర సంకల్ప మనబడును.
6. నిస్సంకల్పము : దృశ్యములేవీ తోచకుండుట, ఆత్మాకారమై యుండుట, కేవల జ్ఞేయ స్వరూపమైయుండుట నిస్సంకల్పమనబడును. నిస్సంకల్పుల ఆజ్ఞలు దేవతలకు, త్రిమూర్తులకు శిరోధార్యము.
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి