_*శ్రీ గరుత్మంతుడి కధ -5 వ భాగం*_
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తనసవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండే వాడు. ఒకరోజు ఇలా త్రిప్పు తుండగా గరుత్మంతుడు సూర్య మండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది.ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.
*గరుత్మంతుని_దాస్యవిముక్తి*
తాబేలును ఏనుగును మోసుకు వెళుతున్న గరుత్మంతుడు - రాజ్మానామా నుండి గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయే టట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది.
*సర్పాలకు_ద్విజిహ్వత్వం*
అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై ఉంచి నప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.
*ఉపసంహారం*
ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి ఉండిన్నీ, తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి