11, ఫిబ్రవరి 2024, ఆదివారం

⚜ శ్రీ శుద్ధమహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 328


⚜ జమ్మూకాశ్మీర్  : పట్నిటాప్


⚜ శ్రీ శుద్ధమహాదేవ్ మందిర్ 



💠 మత విశ్వాసాల ఆధారంగా, శివుడు తన డమరుకం, నాగుపాము, రుద్రాక్ష మాలను, మరియు త్రిశూలాలను చాలా ఇష్టపడతాడని మనందరికీ తెలుసు, అతను వాటిని ఎప్పుడూ తన నుండి వేరు చేయడు.  

ఇవన్నీ శివుని రూపంలో చేర్చబడ్డాయి, అయితే అతని విరిగిన త్రిశూలాన్ని స్థాపించిన భోలేనాథ్ ఆలయం కూడా ఉందని మీకు తెలుసా.  అవును, శివునికి అనేక ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నప్పటికీ, పట్నితోప్ సమీపంలో ఉన్న శివుడి సుధ్ మహాదేవ్ ఆలయం శివుని ప్రధాన ఆలయాలలో ఒకటి.  

ఈ ఆలయం పురాణ గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.



💠 ఈ ఆలయం యొక్క అతి పెద్ద లక్షణం ఏమిటంటే, ఇక్కడ ఒక భారీ త్రిశూలం యొక్క మూడు ముక్కలు భూమిలో పాతిపెట్టబడ్డాయి, ఇది పురాణాల ప్రకారం శివునికి చెందినది.

  

💠 ఒక శతాబ్దం క్రితం స్థానిక నివాసి రాందాస్ మహాజన్ మరియు అతని కుమారుడు దీనిని పునర్నిర్మించారు.  

ఈ ఆలయంలో పురాతన శివలింగం, నంది విగ్రహాలు మరియు శివ కుటుంబం ఉన్నాయి.


💠 జమ్మూ ప్రాంతంలో అత్యంత గౌరవప్రదమైన ఆలయం, సుద్ మహాదేవ్ 2800 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు. 

పట్నితోప్ సమీపంలోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి చన్హాని పట్టణంలో ఉంది మరియు సంవత్సరం పొడవునా పెద్ద సంఖ్యలో శివ భక్తులు సందర్శిస్తారు.


💠 పురాణాల ప్రకారం, సుద్ మహాదేవ్‌కు కొద్ది దూరంలో ఉన్న గౌరీ కుండ్ అనే నీటి బుగ్గ వద్ద స్నానం చేసిన తరువాత, పార్వతీ దేవి శివుని పూజిస్తుంది. 

ఇక్కడ శివలింగం కనీసం 3000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు.

ఈ ఆలయంలో స్థానిక శివుడు మరియు పార్వతి యొక్క నల్ల పాలరాతి విగ్రహం కూడా ఉంది .

శివుని త్రిశూలం ఇక్కడ భద్రపరచబడింది.


⚜ స్థల పురాణం ⚜


💠 పురాణాల ఆధారంగా, పార్వతి మాత జన్మస్థలం మంటలై అని చెబుతారు.  

అమ్మ తరచుగా ఇక్కడికి వచ్చి పూజలు చేసేది.  ఒకసారి ఆమె పూజకు ఇక్కడికి వచ్చినప్పుడు సుధాంత్ అనే రాక్షసుడు కూడా ఆమెను అనుసరించాడు.  


💠 పురాతన కాలంలో ఆ రాక్షసుడు  దేవతలను మరియు ఈ ప్రాంత నివాసులను ఇబ్బంది పెట్టేవాడని నమ్ముతారు.

అతను కూడా శివ భక్తుడు మరియు పూజలు చేయడానికి వచ్చాడు.  

పూజ పూర్తయిన తర్వాత పార్వతి తల్లి కళ్ళు తెరుస్తుంది.  అకస్మాత్తుగా తన ఎదురుగా ఉన్న అతనిని చూసి అరుస్తాది.

ఈ శబ్దం శివునికి చేరుతుంది.  

సమాధిలో మునిగిపోయిన శివుడు, తల్లి పార్వతికి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉందని భావించి, ఆమెను రక్షించడానికి తన త్రిశూలాన్ని విసిరాడు.

త్రిశూలం వచ్చి సుధాంత్ రాక్షసుడిని గుండెల్లో 

గుచ్చుకుంది.


💠 శివుడు తనకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాడని గ్రహించాడు.

ఆ తర్వాత అక్కడ శివుడు ప్రత్యక్షమై సుధాంత్‌కి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నాడు, అయితే సుధాంత్ తన ప్రాణాలను తన ఇష్ట దైవం చేతిలో అర్పించి మోక్షాన్ని పొందాలనుకున్నాడు.  

అప్పుడు శివుడు ఈ రోజు నుండి ఈ ప్రదేశాన్ని మీ పేరుతో కలిపి సుద్ మహాదేవ్ అని పిలుస్తారు అని వరం ఇచ్చాడు.  

అలాగే, శంకర్ భగవానుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కలుగా చేసి అక్కడ పాతిపెట్టాడు, ఇది నేటికీ చూడవచ్చు.


💠 సుధాంత్ అనే రాక్షసుడి అస్థికలను ఇక్కడ ఉంచినట్లు చెప్పబడే దేవాలయ సముదాయంలో ఒక స్థలం కూడా ఉంది.


💠 ఆలయంలో త్రిశూల ముక్కలు ఉన్నాయి.

ఈ త్రిశూలాలను ఆలయ ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో పాతిపెట్టారు మరియు ఇక్కడికి వచ్చే భక్తులు వాటికి జలాభిషేకం కూడా చేస్తారు. 


💠  ఆలయం వెలుపల, పాప్ నాష్ని బౌలి (దిగుడు బావి) ఉంది, దీనిలో 12 నెలల పాటు పర్వతాల నుండి నీరు వస్తూ ఉంటుంది.  ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది.  

చాలా మంది భక్తులు స్నానాలు చేసిన తర్వాతనే ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 ఆలయ ప్రధాన మందిరంలో శివుడు, అతని భార్య పార్వతి మరియు అతని కుమారుడు గణేశుడు ఉన్నారు.

ప్రధాన మందిరానికి ఎదురుగా గోరక్‌నాథ్, కాల భైరవ్ మరియు భయాంకర్ భైరవ్ ఆలయాలు ఉన్నాయి. 

గణేశుడి యొక్క ఒక చిన్న మందిరం కూడా ఉంది, ఇక్కడ అతని విగ్రహాలు వివిధ భంగిమలలో ఉన్నాయి.


💠 ఆలయం ముందు భీంసేనుడిదిగా భావించే గడ్డ ఉంది. ఆలయంలో జోగి సరూప్ నాథ్ మొదట వెలిగించిన జ్వాల అఖండ జ్యోతి మరియు ధూని యొక్క బూడిద ఎప్పటికీ తొలగించబడదు.


  💠సుధ్ మహాదేవ్ కంటే కొన్ని కిలోమీటర్లు ముందుకు మంతలై (1450 మీటర్లు) చుట్టూ పచ్చని దేవదారు అడవులు ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఇది శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం,


💠 యాత్రికులు పౌర్ణమి రాత్రి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

అసద్ పూర్ణిమ పండుగ సందర్భంగా, సుధ్ మహాదేవ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 

ఈ 3 రోజుల పండుగ ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతుంది మరియు ఇది పట్నిటాప్‌లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. 

ఈ పండుగ సందర్భంగా నృత్యం మరియు సంగీతం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి; ప్రజల కోసం చిన్న జాతర కూడా నిర్వహిస్తారు.


💠 అత్యంత గౌరవనీయమైన ఈ శివాలయం పట్ని. టాప్ నుండి 42 కి.మీ మరియు జమ్మూ నుండి 112 కి.మీల దూరంలో ఉంది.

భూసురుని దౌత్యంబు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *86వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*భూసురుని దౌత్యంబు* 


వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు. ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” 

ఇలా పలికి, రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈవిధంగా చెప్పసాగాడు. “శ్రీకృష్ణా! ఓ భక్తవత్సల! దుష్ట రాక్షసేంద్ర సంహార! బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజా! సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు...ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. ఓ అనంతా! అభవా! కృష్ణా! బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా. ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. పరమేశ్వరా! ముల్లోకాలకు శుభం కలిగించువాడ! భక్తజన కల్పవృక్షమా! దీనులైన మమ్మల్ని కాపాడు. ఓ లక్ష్మీనాథ! శ్రీకృష్ణా! నీ ఆజ్ఞ ఉల్లంఘించటం ఆ బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు. దుఃఖనాశకుడా! శ్రీకృష్ణా! పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు ఇలా లోకంలో అవతరించడం మావంటి భయపీడితులను రక్షించుటకే కదా. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో.... (విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.)


 ధర్మజు రాజసూయారంభంబు 


శరశ్చంద్ర చంద్రికలాంటి శరీరకాంతులతో శిఖముడిలోని కెంపు కాంతుల పంతమాడుతుండగా; శరత్కాలమేఘం మీది మెరపుతీగలాగ తెల్లని దేహం మీద బంగారుమొలత్రాడు ప్రకాశిస్తుండగా; నిండుచంద్రునిలోని మచ్చలాగ నిండు దేహంపై జింకచర్మం విలసిల్లుతుండగా; కల్పవృక్షము కొమ్మకు ఉన్న పుష్పగుచ్ఛాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతుండగా; పుణ్యనదీజలాలతో నిండిన కమండలం మరొక చేతిలో విరాజిల్లుతుండగా; తెల్లని జందెం మెడలో మెరుస్తుండగా; నారదమహర్షి నందనందనుడి దగ్గరకు విచ్చేసాడు. ఈలాగున తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివినుండి దిగివచ్చిన సూర్యునిలా నారదముని వచ్చాడు. కృష్ణుడు తక్కిన యాదవులు అందరూ సాదరంగా లేచి నిలబడ్డారు. ఆ మురాంతకుడైన శ్రీకృష్ణుడు నారదుడికి వినయంగా నమస్కరించాడు. బంగారుసింహాసనం ఆసీనుడిని చేసాడు. తగిన గౌరవమర్యాదలతో పూజించి ఇలా అన్నాడు."ఓ మునీంద్రా! నారదా! ఎక్కడనుండి ఇక్కడికి విచ్చేశారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి....పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు. “శ్రీకృష్ణభగవాన్! నీవు జగత్తు సృష్టించేవాడవు; మాయా మయుడవు; సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి సంపన్నుడవు. అరణికఱ్ఱలో అగ్ని అంతర్లీనంగా ప్రకాశించే రీతిన నీవు ప్రవర్తిస్తుంటావు. గుర్తింపసాధ్యంకాని నీ అశేషమాయా విశేషాలను ఎన్నోమార్లు కన్నాను. నీ సంకల్పంతోటే ఈ ప్రపంచం పుడుతుంది. నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ప్రమాణమూలంగాతోచే పదార్థాలన్నీ నీ రూపాలే. నీ రూపం ముక్తిసాధనరహస్యం తెలుసుకోలేక సంసారంలోపడి మాయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్ధరించడానికి సమర్థమైనది. నీ దివ్యలీలావతారాల కీర్తిని ప్రదీప్తం జేస్తూ ముక్తిమార్గాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా.” అని నారదుడు తిరిగి ఇలా అన్నాడు. “ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు.


పరికించి చూస్తే, భక్తవత్సలుడవూ; పరమపురుషుడవూ; రక్షకుడవూ; యజ్ఞభోక్తవూ; ఫలప్రదాతవూ; ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది. ఓ కలువల వంటి కన్నులున్న కన్నయ్యా! విశ్వజ్యోతీ! నీ నామస్మరణం చేసినా, విన్నా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నీ దర్శనమాత్రం చేతనే భక్తలకు ఇహపరసౌఖ్యాలు సంసిద్ధిస్తాయి. శ్రీకృష్ణా! నీ కీర్తిదిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాలనుండి ప్రభవించిన పవిత్రజలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానదీ రూపంతోనూ, స్వర్గంలో మందాకినీ నామంతోనూ ప్రవహిస్తూ ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలంమీద ఉన్న మహారాజులు మునీశ్వరులూ అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు.”ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు...

“వివేక, వాక్చాతుర్యాలు కల ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన, చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను.”ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. ఆ సమయంలో.....స్వచ్ఛముగా రచింపబడిన తళతళ ప్రకాశించే గరుడధ్వజంతోనూ దిగ్గజాలను సైతం బెగ్గడిల్ల చేసే బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ మంచి వేగం కలిగిన మేఘపుష్పం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే నాలుగు గుఱ్ఱాలతోనూ ఉదయసూర్యుని కాంతిని ధిక్కరించే దిగంత విశ్రాంత కాంతులతోనూ విలసిల్లే రథాన్ని దారకుడు సిద్ధముచేసి తీసుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ బాక తప్పెట నిస్సాణ మున్నగు వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. ఉగ్రసేన మహారాజుకీ, అన్న బలరాముడికీ, గురువులకూ, పెద్దలు అందరికీ చెప్పి, ఆదరంతో వారు తనను సాగనంపగా చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వందిమాగధుల, సూతజనుల పొగడ్తలూ; బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ అతిశయిస్తుండగా; పుర స్త్రీలు మేడలమీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా; శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. ఇలా విలాసంగా వ్యాహాళిగా బయలుదేరిన శ్రీకృష్ణుడు ఫలపుష్పభరితమైన తీయని మామిడిచెట్లు మద్ధిచెట్లుతో అలరారే ఉద్యానవనాలలో విడిది చేసాడు. అలా శ్రీకృష్ణులవారు ప్రయాణమైన ఆ సమయంలో...శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలుచిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపూల హారాలు ధరించి; పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని; కంకణాలూ, కడియాలూ, ఉంగరాలూ, కుండలాలూ మున్నగు బంగారు ఆభరణాలు ధరించి; అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని; అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని; ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు. పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా (తోడు వస్తుండగా)...ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో...నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు.


అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి (ఇంద్రప్రస్థనగరానికి) బయలుదేరాడు. ఆ సమయంలో....మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరలూ విజయధ్వజాలూ విలసిల్లాయి. కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ. ఆయుధాల తళతళలూ సూర్యూడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి.ఈవిధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. 


పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట 


శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు.

ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకితశరీరుడై, ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా, ఆనందపారవశ్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయీడు. వాయుసుత, ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రి పుత్రులు ఐన నకులసహదేవులు నళిననాభునికి నమస్కారం చేసారు. అటుపిమ్మట, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకూ వందనం చేసి, వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు....అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్థచంద్రునిమీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి; బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళ మీద గంతులు వేస్తున్నాయి; పగడపుకాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు, చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి; ఒకదానికొకటి ఒరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి; సన్నని నడుములు వణుకుతున్నాయి నడచేటప్పుడు మెట్టెలూ అందెలూ గల్లుగల్లున మ్రోగుతున్నాయి; జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తున్నాయి; పైటలు జారిపోతున్నాయి. ఇలా మనోహరంగా బయలుదేరి, పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో, ఒకరి నొకరు పిలుచుకుంటూ, పెద్దలూ ఇంటివారూ వద్దంటున్నా వినకుండా, ఎత్తైన మేడలు ఎక్కి, ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. పరీక్షిన్మహారాజా! “జగత్తునే కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు, అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు; బ్రహ్మాది దేవతలకుకూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం, గోవులను పాలించే గొల్లపిల్లవాడు అయ్యాడు; వేదశాస్త్రాలు వెదకినా కనుగొనలేని ఘనుడు, వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు; వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు, వెన్నదొంగ అయ్యాడు; శ్రీమహాలక్ష్మికిసైతం మనసు ఇవ్వని భగవానుడు, గొల్లపడచుల హృదయాలను కొల్లగొట్టాడు” అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు.అంతేకాకుండ....“గొల్లపిల్లలతో కలసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు; చల్లలు అమ్ముకోటానికి వెళ్ళే గోపికాకాంతల కొంగులుపట్టి సరసాలాడాడు; ముద్దుపెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు; ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేసాడు; సమాధినిష్ఠలో మునిగి అష్టాంగయోగంలో ఉన్నయోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు” అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు.

అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడలమీద నిలుచుండి, తామరరేకులవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొన్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ, సంతోషంతో అతనిపై కీర్తనులు పాడుతూ, మందారపుష్పాలూ, లాజలూ చల్లారు. అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు.


ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. ఓ రాజా! శ్రీకృష్ణుడు కూడ ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి, అర్జునుడితో కలసి సరసవినోదవిహార కార్యక్రమాలతో కొన్నినెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణుడు హస్తినలో ఉన్న కాలంలో..


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 19*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*య ఏనం వేత్తి హంతారం*

*యశ్చైనం మన్యతే హతం ।*

*ఉభౌ తౌ న విజానీతో*

 *నాయం హంతి న హన్యతే ।।*


*భావము:* 

ఆత్మ ఇతరులను చంపును అని అనికోనేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకొనేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.

 

*వివరణ:* 

మనలను మనము ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కల్పింపబడింది. రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తున్నది.

జో సపనే సిర కాటఇ కోయి, బిను జాగే న దూరి దుఃఖ హోయి.

"మన తల తెగిపోతున్నట్టుగా కల గంటే, ఆ నొప్పి మనం నిద్రలేచే వరకు అనుభూతి లోనే ఉంటుంది." కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవము మనము నిద్ర లేచి ఆ భ్రాంతి ని పోగొట్టుకోనేవరకు బాధిస్తునే ఉంటుంది. అదేవిధంగా, మనము ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడుతాము. జ్ఞానోదయం అయిన వారికి మాయ తొలిగిపోయి ఈ మరణం యొక్క భయం నశిస్తుంది.

ఎవరూ కూడా ఎవరినీ చంపలేరు అన్నప్పుడు, మరి హత్య చేయడం దండించవలసిన నేరం ఎలా అవుతుంది? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, శరీరం జీవాత్మ యొక్క వాహనం. ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్టే, అది నిషిద్ధం. వేదములు స్పష్టంగా "మా హింస్యాత్ సర్వభూతాని” “ఏ ప్రాణినీ హింసించకు.” అని ఉపదేశిస్తున్నాయి. నిజానికి, వేదాలు జంతువులను చంపటం కూడా నేరం గా పరిగణిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో నియమాలు మారుతాయి, హింస కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకి, పాము కాటు వేయటానికి వస్తున్న సమయంలో, మారణాయుధాలతో దాడి చెయ్యబడ్డప్పుడు, జీవనాధారం లాక్కోబడినప్పుడు, ఆత్మ రక్షణ కొరకు హింస అనుమతించబడింది. ఈ ప్రస్తుత పరిస్థితిలో, అర్జునుడికి సరియైనది ఏమిటి, హింసనా లేదా అహింసనా? ఎందుకు? శ్రీ కృష్ణుడు, భగవద్గీత ఉపదేశము ద్వారా అతనికి విపులముగా విశదీకరిస్తాడు. ఈ వివరణలో భాగంగా, ఉపదేశ విషయం తేటతెల్లం చేయటానికి అమూల్యమైన దివ్య జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సూర్యనారాయణ స్వామి

మాఘమాసం సందర్భంగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు సూర్యనారాయణ స్వామి వారిని ప్రధాన దేవతగా ఆరాధన చేస్తూ, ఈ సౌర పంచాయతన యాగం సంకల్పం చేసినాము!!!


ప్రతీరోజూ సూర్యనమస్కారములు, గణపతి, దుర్గా, విష్ణు,రుద్ర సూక్తములు పారాయణ చేయుట,పంచాయతన దేవతలకు అభిషేకం, హోమములు చేయుట జరుగును....

పై కార్యక్రమములు భక్తులు గోత్ర, నామములతో చేయుటకు రోజుకు రూ.100/- ధర్మవిరాళంగా నిర్ణయించినాము!!

ఈ ధర్మ కార్యక్రమంలో పాత్రులు కాగలరు !!


మరిన్ని వివరాలకు 9848070830 నెంబర్ కు వాట్సప్ మెసేజ్ చేయగలరు!!


యువజన పురోహిత సంఘం, కాకినాడ

కలబందతో వైద్యం -

 కలబందతో వైద్యం  - 


 *  కలబంద మట్టలలోని జిగురు లొపలికి తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించును.


 *  లోపలి జిగురుని నీళ్లతో శుభ్రముగా కడిగి పటికపంచదార పొడితో తినిన చలువచేయును .


 *  సారా పటిక ని ఒక గుంట గంటె లో వేసి పొయ్యి మీద పెడితే పొంగుతుంది . చల్లారాక దానిని పొడిచేసి ఆ పొడిని కలబంద జిగురుపైన ఒత్తుగా చల్లి ఒక గుడ్డలో కట్టి దానితో దానితో కండ్లపైన అద్దుచుండిన కండ్ల ఎరుపులు , నీరు కారడం , పుసి కారడం నొప్పులు మానును . 


 *  కలబంద రసంలో పసుపు కలిపి లొపలికి తీసుకున్న స్ప్లీన్ వృద్ధి చెంది కడుపు పెద్దగా అయ్యే రోగం నివృత్తి అగును. 


 *  కలబంద రసంలో పాలు మరియు నీరు కలిపి ఇచ్చిన సెగరోగం మరియు గర్భాశయంలో పుండు నివారణ అగును.


 *  కలబంద గుజ్జుని పసుపు తో కలిపి కట్టిన వ్రణాలు మానును . 


 *  కలబంద మట్టని కొంచం తొక్కి పసుపుతో నూరి కట్టిన పైకి కనిపించకుండా లోపల తగిలిన దెబ్బలు అనగా కవుకు దెబ్బలు నయం అగును. నొప్పి కూడా హరించును . 


 *  కలబంద వేరు రసంతో సీసముని భస్మం చేయుదురు.



      ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchanag


 

మోక్ష మాధుర్యం

మోక్ష మాధుర్యం.


ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.

సాధువుకి  మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ,  " ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !!" అన్నాడు యజమాని.  వెంటనే ఆ సాధువు  " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ " అలా ఎలా కుదురుతుంది ? పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు ఏమీ మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.

ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు. మాటలలో సాధువు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.  దానికి యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి... వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి, సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .

అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.

ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి, " ఏమిటి నీ పిచ్చి మోహం? కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను" అన్నాడు.. దానికి యజమాని  " ఆ మాట మాత్రం  వినలేను.. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు. ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు  కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు. ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాము గా పుట్టాడు ...

మంత్రజలం చల్లి, " ఇంక ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ?  నాతో....................." అన్నాడు

"ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా"  అన్నాడు యజమాని దీనంగా..

సాధువు  వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో  " మీ నాన్న ఆ చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు..అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,, కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు  కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.


గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. (నారాయణార్పణం).

వర్ణమాలతో

 *వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం.*


*తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి...*


*అ :- అరుదైన అమ్మాయి*

*ఆ :- ఆకతాయి అబ్బాయి*

*ఇ :- ఇద్దరికి*

*ఈ :- ఈడు జోడి కుదిరి*

*ఉ :- ఉంగరాలను తొడిగి*

*ఊ :- ఊరంతా ఊరేగించారు*

*ఋ :- ఋణాల కోసం*

*ఎ :- ఎ వరెవరినో అడుగుతూ ఉంటే*

*ఏ :- ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి*

*ఐ :- ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి*

*ఒ :- ఒకరికి ఒకరు వియ్యంకులవారు*

*ఓ :- ఓర్పుతో ఒప్పందం చేసుకొని*

*ఔ :- ఔదార్యాని ఇరు కుటుంబాలకు*

*అం :- అందించాలని కోరుకుంటూ*

*అ :- అ : అంటూ*

*క :- కలపతో తయారయిన పత్రికలపై కలంతో రాసిచ్చి*

*ఖ :- ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను*

*గ :- గడప ముందుకు తీసుకొచ్చి*

*ఘ :- ఘనమైన ఏర్పాట్లు చేయించి*

*చ :- చాపుల (బట్టలు)నింటిని కొని*

*ఛ :- ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని*

*జ :- జరిపిస్తూ*

*ఝ :- ఝాము రాత్రి దాక*

*ట :- ట పకాయలను కాలుస్తూ*

*ఠ :- ఠీవిగా (వైభవంగా)*

*డ :- డ ప్పులతో*

*ఢ :- ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది*

*ణ :- కంక ణా లు చేతికి కట్టుకొని*

*త :- తట్టలో తమలపాకులు పట్టుకొని*

*థ :- థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో*

*ద :- దగ్గరి బంధువులను పిలిచి*

*ధ :- ధ నవంతులను కూడా పిలిచి*

*న :- న అనే నలుగురిని పిలిచి*

*ప :- పది మందిని పలకరిస్తూ*

*ఫ :- ఫంక్షన్ కి రావాలని చెప్తూ*

*బ :- బ లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి*

*భ :- భటువులని (ఆభరణాలు) కొని*

*మ :- మంగళ స్నానాలు చేయించి, రాజసూయ*

*య :- యాగం లాంటి పెళ్లికి*

*ర :- రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి*

*ల :- లక్షణమైన*

*వ :- వధూవరులను మీరు*

*శ :- శతమానం భవతి అని*

*ష :- షరతులు లేకుండా ఆశీర్వదించడానికి*

*స :- సప్తపది (పెళ్లి) వేడుకలో*

*హ :- హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో*

*ళ :- క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని*

*క్ష :- క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి*

*ఱ :- ఱండి*


*🌾 వర్ణమాల పెళ్లి...🌾*

దయతో నీవు కరుణించు

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శివానందలహరీ – శ్లోకం – 85*

. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ*

*న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః*

*అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం*

*కథయ కథమహం తే కల్పయానీందుమౌళే !!*



*తాత్పర్యము:*

చంద్ర శేఖరుడవైన ಓ పరమేశ్వరా! నేను పాలసముద్రాన్ని మథించగల సమర్థుడను కాను. అందువల్ల నీకు ఆహారంగా కాలకూట విషాన్ని సమర్పించలేను. నేను పాతాళలోకాన్ని భేదించగల శక్తి కలవాడిని కూడా కాను. అందువల్ల నీకు ఇష్టమైన సర్పమును తెచ్చి నీకు అలంకారముగా సమర్పించలేను. నేను అడవులలో తిరిగి వేటాడే నేర్పుగల వేటగాడిని కాను. అందువల్ల వేటాడి తెచ్చి నీకు వస్త్రముగా గజచర్మాన్ని కానీ, వ్యాఘ్ర చర్మాన్ని కానీ సమర్పింపలేను. మరి నీకు ఏవిధంగా ఆహారము, భూషణము, వస్త్రము సమర్పించగలనో చెప్పు. ( ఇటువంటివేవీ నేను ఇవ్వలేకపోయినా నాయందు దయతో నీవు కరుణించు).


. *🙏ఓం నమః శివాయ🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

ముత్తయిదువ లక్షణాలు:*

 2912a-5.0902c-6.120224-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



        *ముత్తయిదువ లక్షణాలు:* 

                      *మరియు*

                  *ఉపయోగాలు*

                  ➖➖➖✍️


*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*


*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*

*2). చేతులకి గాజులు*

*3). మెడలో మంగళసూత్రం*

*4). తలలో పువ్వులు*

*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య* 

       *సింధూరం కానీ కుంకుమ కానీ..*


*1). మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*


*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..*


*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..*


*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.*


*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.*


*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.*


*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.*


*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.*


*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.*


*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*


*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!*


*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.*


*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.*


*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.*


*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.*


*అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.*


*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.*


*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*


*దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.*


*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని! మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.*


*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.*


*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.*


*4). ఇక నాల్గవది తలలో పూవులు..*


*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.*


*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*


*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.*


*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.*


*ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

Horse cart


 

New technology


 

*11-02-2024 / ఆదివారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*11-02-2024 / ఆదివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

వృషభం


నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మిధునం


సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

సింహం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు.

---------------------------------------

కన్య


ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

---------------------------------------

తుల


విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.

---------------------------------------

వృశ్చికం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు. నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు


రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.

---------------------------------------

మకరం


సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

కుంభం


దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------

మీనం


సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

దయచేసి సహాయం చేయండి.

 దయచేసి సహాయం చేయండి. 

సబ్యులకు నమస్కారం నేను చాలా  పేదవాడిని. నేను నా పెద్ద కుమార్తె వివాహం చేయాలని అనుకుంటున్నాను. దైవానుగ్రహంతో ఒక మంచి సాఫ్టువేరు ఇంజనీరు దొరికాడు.  వివాహానికి ముహుతంకూడా కుదిరింది.  కానీ చేతిలో డబ్బులు లేకపోవటంతో నేను మిమ్మలను వేడుకుంటున్నాను. ఇక పేదవానికి సహాయపడితే భగవంతుడు మీకు తప్పకుండ మేలుచేస్తాడు. నాకు నా కుమార్తె పెండ్లి చేయటానికి చాలా ద్రవ్యం కావలసి వున్నది.  ఖర్చులు ఈ క్రింది విధంగా వున్నాయి. 

కల్యాణ మండపానికి రూ. 10 లక్షలు 

మండప డెకరేషనుకు రూ. 10 లక్షలు 

కేటరింగుకు రూ. 15 లక్షలు 

పెండ్లి కుమారుని కట్నానికి రూ. 30 లక్షలు 

పెండ్లి కుమారుడికి కారు క్రింద  రూ. 30 లక్షలు  

పెండ్లి కుమారుడికి డ్రస్సుల క్రింద  రూ. 20 లక్షలు   

అత్తమామల మరియు ఇతరులకు అప్పగింతలకు రూ. 30 లక్షలు 

పెండ్లి చేయించిన బ్రాహ్మణునికి రూ. 5 లక్షలు

ఆడబిడ్డల కట్నాలు ముగ్గురుకి ఒక్కొక్కరికి రూ. 12 లక్షలు (15 లక్షలు అడిగితె బ్రతిమిలాడితే తగ్గించారు)

ఫొటోగ్రాఫరులకు రూ. 15 లక్షలు

ఇతర సాదారుకర్చులక్రింద  రూ. 30 లక్షలు 

ఈ విధంగా ఖర్చులు వున్నాయి కాబట్టి దయచేసి మన గ్రూపు సభ్యులు అందరు స్పందించి వారి వారి స్థితిని పట్టి నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. ధన రూపేణ సహాయం చేయలేని వారు క్రింది వస్తువులను బహుమతులుగా ఇచ్చి కూడా సహాయం చేయగలరు. 

1. మిక్సీ, 2వ్వాషింగ్ మిషను, 3అంట్లుతోమే మేషను, 4. ఎయిర్ కండిషనర్ ఇవ్వలేని వారు ఎయిర్ కూలరు 5. ఇల్లు ఊడిచే మిషను. ఇంకా సోపాలు, కుర్చీలు, స్టీలు సామానులు, మంచాలు, ప్యానులు కూడా ఇవ్వవచ్చు.  ఎవిరి స్తోమతకు తగినట్లుగా వారు ఇవ్వగలరు. గ్రూపు సభ్యులు అందరు తప్పకుండ పెండ్లికి రాగలరు. గురుతుంచుకోండి మీరు కానీసం ఒక లక్షకు తక్కువకాకుండా సహాయపడగలరు.  మీ సహాయాన్ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటాను. 

ఇది చదివితే మీకు హాస్యంగా అని పింఛ వచ్చు.  కానీ ఇటీవల చాలా పోస్టులు ఈ కోవకు చెందినవిగానే కనపడుతున్నాయి.