25, సెప్టెంబర్ 2022, ఆదివారం

నిజకర్మల ద్వారా లభించిన విత్తంతో

 

“మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్! 

 యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం||”

“ఓయీ మూఢుడా! ‘ధనం రావాలి’, ‘రావాలి’ అన్న దురాశను విడిచిపెట్టు .. సత్యంతో నిండిన బుద్ధితో మనస్సును తృష్ణారహితంగా చేసుకో! నీ నిజకర్మల ద్వారా లభించిన విత్తంతో తృప్తిపడి మనస్సును ఆనందింప చేసుకో!”

“ఎంతసేపూ ‘డబ్బు’ .. ’డబ్బు’” ..! అదే మూఢుల ‘పరిజ్ఞానం’. ఈ మూఢుల పరిజ్ఞానాన్ని వెంటనే వదిలిపెట్టేయాలి. ఈషణత్రయంలో ధనేషణ అన్నిటికన్నా దారుణమైనది. ఈ ధన తృష్ణను సత్యమైన బుద్ధితో వధించాలి. కష్టపడి చెమటోడ్చి, నిజాయితితో సంపాదించిన ధనంతో చక్కగా వినోదంలో ఓలలాడవచ్చు. అంతేకానీ అన్యాయార్జితమైన, అక్రమమైన ధనం మనిషి మానసిక ఆధ్యాత్మిక పతనానికి రాచబాట వేస్తుంది. సద్భుద్ధి అనేది ‘ధ్యానం’ ద్వారానే, అంటే ‘భజగోవిందం’ ద్వారానే సాధ్యం.”

దేవి నవరాత్రులు ప్రారంభం

 🎻🌹🙏26-09- 2022 నుంచి  రేపటి నుండి ఆశ్వయుజ మాసం దేవి నవరాత్రులు ప్రారంభం ..!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌷ఆశ్వయుజమాసం యొక్క విశిష్టత🌷


🌿త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన..,


🌸సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !


🌿జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...


🌸ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. 


🌿దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !


🌸ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను 

ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి .


🌿దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి శోకాలు దరిచేరవు. 


🌸దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. 


🌿కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.


🌸ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది.


🌿 అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 


🌸అలాగే, ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 


🌿పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.


🌸పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.


🌿ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , 


🌸వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 


🌿ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొoతం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !


🌿ఈ మాసం లో చేసే పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.


🌸అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.


🌿తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...

కరుణామయి..ఆ తల్లి !!!..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వివిధ దేశాలకు సంకల్పం*

 *వివిధ దేశాలకు సంకల్పం*                                



*Sankalpam for US / U*


క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే ,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే , మిన్నిసోటా జీవ నది తీరే ,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,

( Above is for Bloomington city in Indiana state . pla make required changes to your city) 



*Australia* 


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో:  దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్


*UK region*


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే , ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్  నదీ తీరే , లండన్   నగరేౌ


*Africa* 


ప్లక్ష ద్వీపె , వింధ్యస్య నైరుతి దిక్భాగె , తామ్ర ఖండె , కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె 


*SINGAPORE* 


మేరొ: ఆగ్నేయ దిక్భాగే,

మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,

పూర్వ సముద్ర తీరే,

సింహపురి మహా ద్వీపే,

సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,

వసతి గృహే/ 

లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...And so on.....

 



*Middle East*


జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య  పస్చిమ  దిక్భాగె , అరబీ మహాసాగర పస్చిమ తటె , కతార్ దెసె , దొహా నగరె .......... గ్రుహె 


*South Korea*


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె , మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె , కొరియా నామ ద్వీపె వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ


*Mumbai*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె , ముంబాయి నగరె ....   లక్ష్మి నివస / స్వ     గ్రుహె 


*Delhi* 


మెరొహ్ దక్షిణ పార్స్వె , వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , ఆర్య వర్తైక ప్రదెశె , యమునా తటె , ధిల్లీ నగరె ... గ్రుహె  


*VARANASI*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , అశీ వరుణయొర్ మధ్యె , మహాస్మశానె , ఆనందవనె , త్రికంటక విరాజితె , అవిముక్త వారణాశీ క్షెత్రె , ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె , వసతి గ్రుహె , విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత , గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ ,


*Bengaluru* 


శ్రీసైలస్య నైరుతి ప్రదెశె , తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె , శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె , ..... గ్రుహె ..... సమస్త దెవతా .....


*Chennai*


...శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే కృష్ణ కావేరి మధ్య ప్రదేశ...


*Vishakhapatnam* 


శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే.....                                *ఓం నమః శివాయ*

హారతులు

 *హారతులు ఎన్ని రకాలు*   సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాసీ్త్రయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. ఇవి పలురకాలు

1ఏక హారతి

ప్రతిదీ ఒకేవిధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధగుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.

2,నేత్రహారతి

దివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయి.

3,బిల్వహారతి

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.

4,పంచహారతి

ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి.

5,సింహ హారతి

ఇది ప్రతి ఒక్కరూ విజయశిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.

6,రుద్ర హారతి

రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.

7,చక్రహారతి

చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.

8,నవగ్రహ హారతి

మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.

9,కుంభహారతి

ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.

10,నృత్యహారతి

పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.

11,రథహారతి

ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.

12,వృక్షహారతి

సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.

13,నాగహారతి

సంతాన లోపాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి.

14,ధూపహారతి

భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి

15,అఖండ కర్పూర హారతి

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి

16,నక్షత్ర హారతి

ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి.

🙏🙏🙏🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : పట్టాభిషేకము


శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేకమంది సంస్థానాధీశులకు గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడడం వల్ల అనూచానంగా వారికి చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజ చిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజ లాంఛనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టణానికి వచ్చినప్పుడు చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం జరగనే లేదు.


ఆ ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు, పండితులు ఉత్సాహపడ్డారు. 1907మే 9వ తేదీన స్వామివారిని మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ, మల్లెపూలతోనూ, అభిషేకం చేశారు. కంచికామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచి కామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు ఒడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణము చేశారు. పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది. 


ఆరోజు రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేక దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈవిధంగా స్వామివారి 87ఏళ్ల ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అక్షరాలు వేరైన

 తే గీ.

అమ్మహృదిలోని మాధుర్యమంత యొదిగి

అత్త్వమై ఆంధ్రభాషాది నమరి మెఱసె

అదియె ఆసుపత్రి ముఖాన నలరుచుండి

తల్లి పిల్లల రక్షణే తమ విథి యని

తెలుప గర్వించె నలుదెసల్ తెలియగాను

తే.గీ.

దేశభాషలేవైన సందేశమొకటె

అక్షరాలు వేరైన నారంభమొకటె

తల్లిబిడ్డల హృదిలోని తనివి యొకటె

అందుకే దైవరూపాలు అక్షరములు

*~శ్రీశర్మద* 

జీవితం నాకు నేర్పింది

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                    🌹జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దు అని...ముందుకు సాగిపోమ్మని..ఎవరి మీద ఆధార పడవద్దు అని..ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని నీకు నువ్వే తోడు అని..ఎదుటి వారికి నీడగా ఉండమని..🌹మనసు చెడుతో నిండిపోయినప్పుడు మాంచి చెప్పేవారు శత్రువు గాను చెడు చెప్పే వారు శ్రేయోభిలాషులు గాను కనబడతారు🌹అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు...మనది కాని రోజున మౌనంగా ఉండాలి.. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది🌹కొందరి కోసం మనం బరించలేని బాధని కూడా భరిస్తాం ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు..!🌹 కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది.. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది.. మనం నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరు ముందు నటించాల్సిన అవసరం లేదు🌹🌹🌹మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిడ్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593

9182075510

944🙏🙏🙏🙏🙏

గుండె ఆరోగ్యానికి

 కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ కార్డియాలాజీ    డాక్టర్  శాంత గారు

 ఇచ్చిన సలహాలు:(ప్రశ్నలు -జవాబులు)


 *ప్రశ్న 1* : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 

 *జవాబు* : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.

2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం

3)ధూమ పానం మానడం.

4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.

5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.


 *ప్రశ్న 2.* కొవ్వును కండగా మార్చుకొగలమా ?


 *జవాబు* : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.

కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.

కొవ్వు కండగా మారదు.


 *ప్రశ్న 3 :* ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 


 *జవాబు* : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.


 *ప్రశ్న 4 :* గుండె పోటు వంశ పారం పర్యమా?

 *జవాబు* : అవును 

.

 *ప్రశ్న 5 :* గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?

ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )


 *జవాబు :* జీవితం పట్ల మీ వైఖరి మారాలి.

ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.


 *ప్రశ్న6* : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?


 *జవాబు* : నడక మంచిది.

జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.


 *ప్రశ్న 7:* మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?


 *జవాబు* : మదర్ తెరెసా !


 *ప్రశ్న 8:* లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?

 *జవాబు* : చాలా తక్కువ

.


 *ప్రశ్న 9 :* కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? 

(నా వయసు 22).

30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?


 *జవాబు* : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.


 *ప్రశ్న 10* : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?


 *జవాబు* : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.

ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.


 *ప్రశ్న 11:* మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?

 *జవాబు* : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.


 *ప్రశ్న 12:* గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?

చెడ్డ ఆహారం ఏది?


 *జవాబు :* పళ్ళు , కాయగూరలూ మంచివి.

నూనెలు చెడ్డవి.


 *ప్రశ్న 13:* ఏ నూనె మంచిది ?

సన్ ఫ్లవర్,

వేరుశనగ నూనె,

ఆలివ్ ఆయిల్ ?


 *జవాబు* : అన్ని నూనెలూ చెడ్డవే.


 *ప్రశ్న 14:* ఏమేమి టెస్టులు చేయించుకోవాలి 

ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?


 *జవాబు* :

రొటీన్ షుగర్,

బి.పి,కొలెస్టరాల్ చాలు .

ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.


 *ప్రశ్న 15* : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?


 *జవాబు* : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.

ఒక *ఆస్ప్రిన్* మాత్ర నాలుక కింద పెట్టండి .

 *సోర్బిట్రేట్* మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .

వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.

మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ . 


 *ప్రశ్న : 16 :* గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 


 *జవాబు* : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.


 *ప్రశ్న 17:* యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?

( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )


 *జవాబు* : యువతలో అవేర్నెస్ పెరిగింది.

అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.

జీవన విధానం ( బద్ధకం ),

జంక్ ఫుడ్,

వ్యాయామం లేక పోవడం, 

పొగ తాగడం.

మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.


 *ప్రశ్న 18 :* బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా? 


 *జవాబు* : ఉంటారు.


 *ప్రశ్న 19 :* దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.

వాస్తవమా?


 *జవాబు* : వాస్తవమే!

దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. 


 *ప్రశ్న 20* : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. 

ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?


 *జవాబు* : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది

ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి.

కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.


 *ప్రశ్న 21:* ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? 

( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )


 *జవాబు* : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.


 *ప్రశ్న 22* : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 


 *జవాబు* : లేదు.


 *ప్రశ్న 23* : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?


 *జవాబు* : లేదు 


 *ప్రశ్న 24 :* మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?


 *జవాబు :* వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.


 *ప్రశ్న 25 :* భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!


 *జవాబు* : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.


 *ప్రశ్న 26 :* అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?


 *జవాబు* : నో.


 *ప్రశ్న 27 :*  గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?


 *జవాబు* : వెల్లకిలా పడుకోవాలి .

నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.

అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.


 *ప్రశ్న 28 :* లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?


 *జవాబు :* కావు.

కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.


 *ప్రశ్న 29 :* మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.

ఇంట్లో నడవడం,

మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?


 *జవాబు* : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.


 *ప్రశ్న 30 :* షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?


 *జవాబు* : ఉంది.

షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.


 *ప్రశ్న 31* : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?


 *జవాబు* : 

ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.


 *ప్రశ్న 32 :* రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?


 *జవాబు* : నో .


 *ప్రశ్న 33 :* Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?


 *జవాబు* :

కొన్ని వందలు ఉన్నాయి .

మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.

కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).

ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.


 *ప్రశ్న 34 :* డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?


 *జవాబు* : నో 

.


 *ప్రశ్న 35 :* ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?


 *జవాబు* : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)


 *ఆఖరు ప్రశ్న :* గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 


 *జవాబు* :

ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.

ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.

జంక్ ఫుడ్ తినకండి.

స్మోకింగ్ మానండి.

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ ).


మీకు ఇతరులకు మేలు చెయ్యాలి అనే హృదయం ఉంటే మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు, బందువులకు షేర్ చేయండి.🙏🌹


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.

మన మహర్షుల చరిత్ర.

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *మన మహర్షుల చరిత్ర..*              


*🌹ఈ రోజు 34,వ తండి మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


🌸 పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు.  అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి,  జ్ఞాని, మహర్షి అయ్యాడు. 


🌸 సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు . పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు . తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో,


🌸 "ఓ పరమేశ్వరా! యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్టాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు."


🌸 నువ్వు అజుడివి, అనాదినిధనుడివి, విభుడివి , ఈశానుడివి, అత్యంతసుఖివి , అనఘుడివి.  నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను అన్నాడు.


🌸 పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక పరమేశ్వరా! కామ క్రోధాలు నువ్వే, ఊర్థ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు.


🌸 పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణగతివి అన్నీ నువ్వే.  జనన మరణాలు కలిగించేది నువ్వే.


🌸 దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే . రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా మాసాలు భుజాలుగా, ఋతువులే వీర్యముగా, మాఘమాసం ధైర్యంగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు.


 🌸 ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వత్సా!  నువ్వు తేజశ్శాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. 


🌸 నీకేం కావాలో అడగమన్నాడు.   ఈశ్వరా!  నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు.  ఎప్పుడూ నాకు నీ పాదాల దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు తండి మహర్షి. 


🌸తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.  ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు.


🌸 ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు.    వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.


🌸 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు.  దీన్నే *'తండికృత శివసహస్రనామస్తోత్రం'* అన్నారు . 


🌸 ఆ వెయ్యి నామాల గురించి తండి మహర్షి ఉపమన్యుకి చెప్పాడు.

అందులో నామాలు మనం కూడా పలుకుదాం.  అన్నీ ఎలాగూ చెప్పుకోలేం కదా ... 


🌸 స్థిరుడు, స్థాణువు, ప్రభువు, భీముడు, ప్రవరుడు, వరదుడు , వరుడు, సర్వాత్మ, జటి చర్మా శిఖండి, ఖచరుడు, గోచరుడు మొదలైనవి.  ఇలా వెయ్యి నామాలు జపిస్తే అనుకున్న పనులు జరిగి ముక్తి పొందుతారు. 


🌸 చూశారా!  మనకి కష్టం లేకుండా, ముక్తి వచ్చే ఉపాయం తండి మనకి చెప్పాడు. వాళ్ళందరు అంతంత తపస్సులు చేసి మన కోసం శివసహస్రనామస్తోత్రం ఇచ్చి మనం సులభంగా ముక్తి పొందేలా చేశాడు, తండి మహర్షి!


🌸 ఇదండీ తండి మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

పద్యం

 🌹🌻 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే

ఈ పద్యం గురించి మీకు తెలుసా🌻🌹


🌻అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్..


🌻విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి..


🌻ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 


🌻కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు...


🌻అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను...


🌻అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు.


🌻అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


🌻అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ...


🌻సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


🌻తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


🌻బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి


🌻చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


🌻మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి...


🌻ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


🌻రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


🌻అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


🌻మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి...


🌻అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


🌻ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’...మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు...


🌻మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది...


🌻ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


🌻కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి


🌻ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు..

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ.🌹🌻మిత్రులందరికీ శుభోదయ శుభాకాంక్షలు

జోగులాంబ దేవాలయం - ఆలంపూర్

 జోగులాంబ దేవాలయం - ఆలంపూర్


🔔🔔🔔🔔🔔🔔


శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకటాక్షాలను చూపుతున్నారు.


స్థల పురాణం



అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.


విశిష్టరూపం



పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.


విశిష్ట నిర్మాణం



అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.


ప్రత్యేక పూజలు



శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖయ్లో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.


విశేషరోజులు :



ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలవూబహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు...

శ్రీ కంచి కామాక్షీ స్తోత్రం .

 #శ్రీ కంచి కామాక్షీ స్తోత్రం ...


కాంచీనూపురరత్నకంకణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకంచుకాంచితకుచాం కస్తూరికాచర్చితామ్ | కల్హారాంచితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౧॥


కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాంకురామ్।

కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౨ ॥


కాదమ్బప్రమదాం విలాసగమనాం కల్యాణకాంచీరవాం కల్యాణాచలపాదపీఠలసితాం కాన్త్యా స్ఫురన్తీం శుభామ్ | కల్యాణాచలకార్ముకప్రియతమాం కాదమ్బమాలాశ్రయం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౩॥


గంధర్వామరసిద్ధచారణవధూధ్యేనాం పదానాంచితాం గౌరీం కుంకుమపంకపంకితకుచద్వన్ద్వాభిరామాం శుభామ్ |

గమ్భీరస్మితవిభ్రమాంకితముఖీం గఙ్గాధరాలిఙ్గితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౪॥


విష్ణుబ్రహ్మముఖామరేన్ద్రవిలసత్కోటీరపీఠస్థలాం లాక్షారంజితపాదపద్మయుగలాం రాకేన్దుబిమ్బాననామ్ | వేదాన్తాగమవేదవేద్యచరితాం విద్వజ్జనైరావృతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౫॥


మాకన్దద్రుమమూలదేశమహితే మాణిక్యసింహాసనే దివ్యాం దీపితహేమకాన్తివిలసత్ వస్త్రావృతాం తాం శుభామ్ |

దివ్యాకల్పితదివ్యదేహభరితాం దృష్టిప్రమోదాన్వితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౬॥


ఆధారాదిసమస్తచక్రనిలయామాద్యన్తశూన్యాముమాం ఆకాశాదిసమస్తభూతనివహాకారామశేషాత్మికామ్।

యోగీన్ద్రైరపి యోగినీశతగణైరారాధితామమ్బికాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౭॥


హ్రీంకారప్రణవాత్మికాం ప్రణమతాం 

శ్రీవిద్యవిద్యామయీం ఐం క్లీం సౌం రుచి మన్త్రమూర్తినివహాకారామశేషాత్మికామ్ ।

బ్రహ్మానన్దరసానుభూతిమహితాం బ్రహ్మప్రియంవాదినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౮॥


సిద్ధానన్దజనస్య చిన్మయసుఖాకారాం మహాయోగినీం మాయాంవిశ్వవిమోహినీం మధుమతీం ధ్యాయేత్ శుభాం బ్రాహ్మణీమ్ |

ధ్యేయాం కిన్నరసిద్ధచారణవధూ ధ్యేయాం సదా యోగిభిః కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ॥ ౯॥


కామారికామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కఙ్కణచూడహస్తాం ।

 కాంచీనివాసాం కనకప్రభాసాం కామాక్షిదేవీం కలయామి చిత్తే ॥ ౧౦॥


|| ఇతి శ్రీ కామాక్షీస్తోత్రం సమ్పూర్ణం ||

భావగ్రాహీ జనార్ధన

 *భావగ్రాహీ జనార్ధన*


బాల్యంలో నేను చదువుకున్న ఒక శ్లోకంలో ప్రాచీనులు భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో చెప్పారు. 


ఒక పండితుడు "విష్ణవే నమ:" అని నమస్కారం చేస్తున్నాడు. పాపం, ఇంకొకయానకి ఉకారాంత శబ్దం తెలీదు. రామ శబ్దం ఒక్కటే తెలుసు. ఆయన "విష్ణాయ నమ:" అని నమస్కారం చేస్తున్నాడు. భగవంతుడు ఇద్దరినీ అనుగ్రహించాడు. 


ఈ పండితుడికి భగవంతుడు తనని అనుగ్రహించాడని సంతోషం లేదు, ఆ మూర్ఖుడిని అనుగ్రహించాడని బేజారు. అపశబ్ద ప్రయోగం చేసిన మూర్ఖుడిని కూడా ఎందుకు అనుగ్రహించాడు అని? నేను వ్యాకరణ బద్ధంగా సరైన విధంగా నిన్ను ప్రార్థించాను. నన్ను అనుగ్రహించావు. అది సరే. అపశబ్ద ప్రయోగం చేసిన అతనికి కూడ ఎందుకు దర్శనం ఇచ్చావు అని అడిగితే, భగవంతుడు ఇలా అన్నాడు, "నాకు వ్యాకరణంతో పని లేదు, నేను భక్తిని చూస్తాను".


మూర్ఖో వదతి విష్ణాయ

విద్వాన్ వదతి విష్ణవే

ఉభయో సదృశ్యం పుణ్యం

భావగ్రాహి జనార్ధన:


ఇద్దరికి ఒకేరకమైన పుణ్యం దొరికింది. ఎందుకంటే భగవంతుడు భావగ్రాహి. మన మనసులో భక్తి చూస్తాడు కానీ మనం వ్యాకరణ పండితులమా!!? తర్క పండితులమా!!? అనేది చూడడు.


-మహాస్వామివారు*

మహాలయ అమావాస్య*

 *మహాలయ అమావాస్య*


*సెప్టెంబర్ 25 ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా...* 


భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, ఆశ్వయుజ అమావాస్యలు చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.


‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’


ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది, అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము.


*మహాలయమంటే :-*


మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.


*అమావాస్య అంతరార్థం:-*


‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.


మత్స్యపురాణగాథ: పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. ఆమె వారిలో  ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది. దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది.  మావసుడు,  అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’  అనగా ప్రియురాలు అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’  కాని ఆమె  ‘‘అమావస్య’’  లేక ‘‘అమావాస్య’’ అయింది. తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది. అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు పితులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము, ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది. – జననీ జనకులను ప్రేమానురాగాలను అందించి, మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య.


రేపు మహాలయ అమావాస్య రోజున కూరగాయలు దానం చేయండి*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ , పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం , కూరగాయలు , ఉప్పు , పప్పు , పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం.


ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం , గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు , మనకు మనసు నిండుతాయి.


భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.


అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.


ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.


ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని , దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు , బురద , చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.


అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.


పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పాడ్యమితో అరంభమైన పితృపక్షం , మహాలయ పక్షమం అమావాస్యతో ముగుస్తుంది.

దౌర్భాగ్యమేధావులారా

 దౌర్భాగ్యమేధావులారా ! ఇదే శాస్ర్తమో చెప్పండి !!!


‘‘మీరు సంస్కృతపండితులు కనుక సంస్కృతం కావాలి అని అంటున్నారు. అంతేకానీ ఈ రోజుల్లో సంస్కృతం ఎందుకు కావాలండీ?‘‘ అని ఒక రాజకీయపార్టీ అభిమాని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు 30 ఏళ్ళ క్రితం ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది.


‘‘మీరు ఏం చేస్తుంటారు?‘‘ అని ఆయన్ను అడిగితే ఆయన న్యాయవాద వృత్తి చేస్తున్నాను అన్నారు.


‘‘మీకు భారత రాజ్యాంగం కంఠస్థం అయిందా? టైటిల్ పేజీ నుంచీ ఎండ్ పేజీ వరకూ మొత్తం పొల్లు పోకుండా అప్పచెప్పండి.‘‘ అని అడిగారు. 


ఆయనకు ఆంధ్రవ్యాసుల వారి ప్రశ్న అర్థం కాలేదు. 


ఆంధ్రవ్యాసుల వారే తిరిగి ఇలా అన్నారు.


‘‘ మీరే కాదు డాక్టర్లను కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను. రోగాలు, రోగ లక్షణాలు, మందులు ఉన్న మెటీరియా ఆఫ్ మెడికాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలరా? అంత వరకూ ఎందుకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని ఎవరైనా మొదటి నుంచీ చివరి వరకూ అప్పచెపగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ భారతీయ శాస్త్రాలన్నీ భారతీయ పండితులకు కంఠతా వచ్చు. ఇదే భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్నతేడా. భారత దేశంలో డిక్షనరీలు కూడా కంఠతా వచ్చు. అమరకోశం అటువంటిదే.  ప్రపంచంలో ఏ భాషకూ లేని ప్రాభవం భారత దేశంలో సంస్కృతానికి ఉంది.


అంత వరకూ ఎందుకు గణిత శాస్ర్తం ఖగోళశాస్ర్తం కలబోసిన ఆర్యభటీయం, సూర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాలన్నీ పండితులకు నోటికి వచ్చు. నేడు గణితంలో పిహెచ్ డి చేసిన వారికి కూడా తమ గణిత సూత్రాలు నోటికి రావు. ఇదే నేటి దౌర్భాగ్యం. విద్యకు అతి ముఖ్యమైంది ధారణ. తమ శాస్త్ర గంథాలు అక్షరం పొల్లు పోకుండా ధారణ లేని వారికి శాస్త్రాలు ఎలా ఒంటపడతాయి? ఈ కారణం చేతనే నేడు వైద్యవృత్తి నుంచీ పాఠశాల ఉపాధ్యాయుడి వరకూ అందరికీ పుస్తకం చూడనిదే ఏ వృత్తి బాధ్యతా నిర్వర్తించలేక పోతున్నారు. పూర్వం వైద్యం, గణితం, నిర్మాణరంగం, కెమిస్ట్రీ, వృక్షశాస్త్రం అన్నీ కూడా కంఠతా వచ్చేవి. నేడు అది లోపించింది. ఇదే విద్యా బోధనలో కూడా ప్రధానమైన అడ్డంకి. ధారణ లేని, ధారణ చేయలేని చదువులు తయారయ్యాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు వచ్చి ఆత్మహత్యలకు హత్యలకు దారితీస్తున్నాయి. చదువు వల్ల మానసిక సమస్యలు రావడం అనేది సంస్కృత  శాస్త్రాల వల్ల లేదు. ఎప్పుడైతే మనదైన విద్యావ్యవస్థను నాశనం చేసుకొన్నామో మన పతనం అప్పుడే మొదలైంది. 


విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఆధునిక ప్రపంచం విలువ ఇస్తోంది. కానీ భారతీయులు పెరిగే విజ్ఞానాన్ని గుర్తుంచుకోవడానికి ఛందస్సులు ఉపయోగించి శ్లోకాల రూపంలో సమస్త గ్రంథాలు రచించేవారు. దీని వల్ల విజ్ఞానం బుర్రలో ఉండేది. నేడు పుస్తకాల్లో ఉంటోంది. ఏ పుస్తకంలో ఏముందో గుర్తుపెట్టుకొన్నవాడు మేధావి నేడు. గతంలో పుస్తకాలే బుర్రలో పెట్టుకొన్నవాడు మేధావి. ఇదే సంస్కృతభాష లోని మహిమ. నేటి ఆధునిక కాలంలో ప్రధాన లోపం ధారణలేని, ధారణ చేయలేని దౌర్భాగ్యస్థితి.‘‘


దశాబ్దాల క్రితం ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన అంశాన్ని నిరూపించే అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకువస్తున్నాము. దీనికి ఉదాహరణగా భాస్కరాచార్య రచించిన లీలావతి గణితంలోని ఒక సూత్రం దాని ఆధారంగా కొన్ని లెక్కలు పరిశీలిద్దాం. 

ఇష్ట కర్మసూత్రం (సప్పోసిషన్) ఇలా చెప్పాడు.


ఉద్దేశకాలావవదిష్టరాశిః శృణోహ్యతోం2శౌ రహితో యుతో వా!

ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశీర్భవేత్ప్రోక్తమితీష్టకర్మ!!


భావం: నీకు ఇష్టం వచ్చిన సంఖ్య అనుకో, దాన్ని ఇచ్చిన సమస్య ప్రకారం సాధించు. దాన్ని గుణించి భాగాహరించి, వివిధ భిన్నాలతో పెంచి లేదా తగ్గించగా వచ్చిన సారాంశాన్ని, దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. దీన్నే ఇష్టకర్మ సూత్రం అంటారు. 


పై సూత్రం అర్థం కావడానికి ఉదాహరణ కూడా ఇచ్చాడు.


పంచఘ్నః స్వత్రిభాగోనో దశభక్తః సమన్వితః!!

రాశిత్రయంశార్ఘపాదైః స్యాక్తో రాశిద్రవ్యూనసప్తతిః!!  


భావం:ఒక సంఖ్యను 5 చేత హెచ్చవేయగా వచ్చిన దానిలో నుంచీ మూడో వంతు తీసి వేయగా వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించి, దానికి మూడో వంతు, సగం వంతు, పావువంతులు కలిపితే రెండు తక్కువగా 70 వచ్చింది. ఇప్పుడు చెప్పు ఆ సంఖ్య ఎంత.


ఈ లెక్క మీరు చేయగలిగితే నేడు ఉన్న అనేక ప్రభుత్వ, రైల్వే, బ్యాంకు ఉద్యాగాల పోటీ పరీక్షల్లో విజేతలు కావడం చాలా తేలిక. ఇది వేద గణితం ద్వారా ఎలా సాధించాలో తెలుసుకుందాం. 


ఇక్కడ ఇచ్చిన ఇష్టకర్మ సూత్రం ప్రకారం ఇక్కడ ఇచ్చిన లెక్క సాధించాలంటే ఏదో ఒక సంఖ్య అనుకోండి.


నేను 3 అనుకుంటున్నాను.


1)ఇప్పుడు ఈ 3ను 5 చేత హెచ్చవేస్తున్నాను. = 15

2) దీనిలో నుంచీ మూడో వంతు తీసి వేయమన్నాడు కనుక 15లో మూడో వంతు 5 కనుక తీసివేస్తే = 10 వచ్చింది

3)వచ్చిన దాన్ని  పదిచేత భాగాహరించమన్నాడు. అంటే 10/10 =1 వచ్చింది.

4) దీనికి మూడో వంతు, సగం, పావు వంతులు కూడినది కలపాలి. అంటే (1+ 3  (1/3+1/2+1/4) )చేయాలి. = 17/4 వస్తుంది.

5) ఇప్పుడు సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. 

68ని 3చేత హెచ్చవేసి 17/4తో భాగాహరించాలి.

(68x3)/(17/4) = 68x3 x4/17 = 48


ఇక్కడ ఇచ్చిన గణిత సమస్యకు సమాధానం 48.


కావాలంటే 3 స్థానంలో 48ని ప్రవేశపెట్టి పైన చెప్పిన సోపానాలు అన్నీంటి ద్వారా 68 వస్తుంది.


ఇది గణిత వేదం అంటే. 


ఇక్కడ అతి ముఖ్యమైంది ఏమిటంటే కేవలం గణిత సూత్రమే కాదు. ఉదాహృత గణితసమస్య కూడా శ్లోకం రూపంలో ఉంది. పూర్వం జ్యోతిష పండితులు భగవద్గీత మాదిరిగా ఈ గణిత సూత్రం, ఈ గణిత సమస్య కూడా కంఠతా పట్టి ధారణ చేసేవారు. కనుక జీవితంలో తాము చదువుకున్న చదువు మరిచిపోవడం అంటూ జరిగేది కాదు. 


లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.


గణిత సమస్య:


  కామిన్యా హారవల్యాః సురతకలహతో మౌక్తికానాం తృటిత్వా

భూమౌ యాతాస్త్రిభాగః శయనతలగతః పంచమాంశో2స్య ద్రష్టః

భాత్తః షష్ఠః సుకేశ్యా గణక దశమకః సంగృహీతః ప్రియేణ

హృష్టం షట్కం చసూత్రే కథయ కతిపథైమౌక్తికైరేష హారః


భావం:


మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో  ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?  


ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం. 


1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.

2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.

3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.

4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.

5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.

ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48

సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12

6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. 


దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు.  సారాంశం =12

సూత్రం ప్రకారం దత్తసంఖ్య x ఇష్ట సంఖ్య / సారాంశం = 6x60/12 = 30 ముత్యాలు.

ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో  సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.


ఇది వేదగణితం. 


ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా? 


ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?


మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది.  మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి. 


అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.


(ఆంధ్రవ్యాసుల వారి సంభాషణ ఆధారంగా)

గమనించే లక్షణం

 🙏ముక్తి - వైరాగ్యం - అభ్యాసం🙏


అందరిలోనూ ఆత్మ ఉనికితో పాటు ఆత్మజ్ఞానం కూడా సమానంగానే ఉంది' అని శ్రీరమణ భగవాన్ అంటున్నారు. మనం ప్రస్తుతం సత్యం అనుకుంటున్నదంతా మాయ. సత్యం కాని విషయాల యెడల జ్ఞానం మిథ్యాజ్ఞానంగా ఉండి మనకి అవిద్యగా కనిపిస్తుంది. అంతే తప్ప ఆత్మానుభవం కానివారే లేరని భగవాన్ స్పష్టం చేస్తున్నారు. అనుభవానికి వస్తూ ఉన్న ఈ ఆత్మ ఉనికిని తెలుసుకోవడమే మనం చేయాల్సిన సాధన. అందుకు అడ్డుగా ఉన్న త్రిగుణాలు, వాసనా వికారాలు తొలగించాలి. మన సంసారం అని భావించేదంతా జన్మ జన్మలలో మనం పోగుచేసుకున్న సంస్కారాలే. అవే మన స్వస్వరూప దర్శనానికి అడ్డుగా ఉన్నాయి. అంతే తప్ప భౌతిక జీవనం దైవ దర్శనానికి ఏ రకంగానూ అడ్డం కాదు. జ్ఞానులు, యోగులకు కూడా భౌతిక జీవనం తప్పలేదు కదా! సత్యాసత్యాలు ఒకేసారి అనుభవంగా ఉంటున్నా మన వాసనా బలం దేహస్మృతికే ప్రాధాన్యతను ఇవ్వడంవల్ల మనకి సత్యం అర్థం కావడం లేదు. బాహ్యంగా కనిపించే ఫలాన్ని గౌరవిస్తాం తప్ప మూలమైన విత్తనాన్ని పరిగణనలోకి తీసుకోనట్లే ఇది కూడా.


మనలో ఉన్న వాసనాబలమే పరమశాంతికి ప్రధాన అవరోధం. ఈ వాసనలు ఉన్నంత కాలం దైవధ్యానానికి అవసరమైన చిత్త ఏకాగ్రత సాధ్యం కాదు. మనలో వాసనావికారాలు ధ్యాన సాధననే కాదు, ఏ లౌకిక విషయ ఫలాన్ని కూడా అందనివ్వవు. ఈ వాసనలను రూపుమాపటానికి మనకి రెండు ఆయుధాలు కావాలి ఒకటి వైరాగ్యం, రెండవది అభ్యాసం. మనకి ఏది ముఖ్యమో తెలుసుకొని మిగిలిన వాటిని వదిలివేయడమే వైరాగ్యం. మన మనసుని కలుషితం చేసే విషయాలను వివేకంతో గుర్తించటం ద్వారా ఈ వైరాగ్యం సిద్ధిస్తుంది. ఏది మనకు శాశ్వత శాంతినిస్తుందో దాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే మానవజన్మ పరమావధి ఆ ఉన్నతిని, దివ్యత్వాన్ని చేరుకోవటమే. దీనినే ఆధ్యాత్మిక సాధన అంటాం. 


 భజన, మంత్రజపం, ధ్యానం, దేవతారాధన వంటి ఏదో ఒక రూపంలో మన సాధన సాగుతూ ఉండాలి. అభ్యాసం విధిగానూ, వైరాగ్యం నిషేధంగానూ భావించాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణం అంతా ఈ రెండింటి సమన్వయంతోనే ఉంది. ఏ ఒక్కటి లోపించినా ఫలం అందదు. ఈ విధి, నిషేధాలు రెండూ అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తి అలవాట్లు, మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. మనస్సుకున్న వ్యసనాలను వైరాగ్యంతో వదిలి, మనకు శాంతినిచ్చే సాధనను స్వీకరించాలి. ఈ ప్రయత్నంలో మనకు అండగా నిలిచేది 'గురువు అనుగ్రహం'. ఒక బలహీనుడు యుద్ధంలో బలవంతుడికి లోబడినట్లే స్థిరమనస్కులైన సత్పురుషుల సహచర్యంతో మన బలహీనమైన మనస్సు ఓడిపోయి వారి వద్దనున్న శాంతిని పొందగలుగుతుంది. దేవాలయాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ జరిగేది అదే! సద్గురువుల స్పర్శ, దర్శనాలే కాదు, స్మరణకూడా అంతటి ఫలాన్ని, శాంతిని ఇస్తాయి. గురువు అనుగ్రహం ప్రత్యేకంగా ఉండదు. వారి ఉనికే అనుగ్రహం. 


వైరాగ్యం లేని అభ్యాసం మనసుని కుదరనివ్వక భారం అవుతుంది. అలాగే అభ్యాసం కొనసాగించని వైరాగ్యం కేవలం నైరస్యంగా ఉండిపోతుంది. ఆధ్యాత్మికత నిరంతరం ఉత్సాహంగా సాగాలే కానీ నైరస్యంతో ఉండిపోవడం కాదు. విద్యార్థి టి.వి. చూసే అలవాటు మాని వేయగానే సరిపోదు. పాఠ్యపుస్తకాలు చదివితేనే పరీక్ష పాసయ్యేది. అలాగనీ టి.వి ముందు కూర్చొని పాఠ్యపుస్తకాలు చదివితే బుర్రకెక్కవు. కాబట్టి వదలాల్సింది వదలటం ఎంత ముఖ్యమో పట్టుకోవాల్సింది పట్టుకోవడం కూడా అంత ముఖ్యమే. 


ఆధ్యాత్మిక సాధనలో ప్రాథమికాంశం అయిన వైరాగ్యం సిద్ధించేందుకు విచారణ మార్గం ఎంతో సహకరిస్తుంది. నిరంతరం అదే ధ్యాసలో ఉంటే విచారణ మార్గమే సాధన కూడా అవుతుంది. చీకటి వెలుతురు నుండి వేరుగా లేనట్లే, మాయ దైవానికి వేరుకాదు. వెలుతురు స్థాయిని బట్టి చీకటి హెచ్చుతగ్గులు ఉన్నట్లే మనలో దైవచింతన స్థాయిని బట్టి మాయ మనని ఆవరిస్తుంది. దీపం పెద్దదిచేస్తే చీకటి తగ్గినట్లే దైవచింతన పెరిగే కొద్ది ఈ మాయ మాయమైపోతుంది. జగత్తు, మనదేహం ‘శాశ్వతం' అని భావించే ఈ మాయ ఈశ్వరుని యందలి విభ్రమ శక్తి మాత్రమే. కరెంటుతో పాటే షాక్ లక్షణం ఉన్నట్లే ఈశ్వరునిలోనే ఈ మాయగుణం కూడా ఇమిడి ఉంది. మాయకు సొంతంగా ఉనికి, శక్తి ఉండదు. అలా ఉండి ఉంటే అది ఈశ్వరుని పూర్ణత్వానికి భంగం అవుతుంది. ఈ మాయను మనం యుద్ధం చేసి జయించలేం. దానిని పూర్తిగా అవగాహన చేసుకోవడమే మనం దానిపై సాధించే విజయం. కడవలో నీళ్ళు ఎందుకు తగ్గిపోతున్నాయనే సంశయం దానికున్న రంధ్రాన్ని గమనించే వరకే ఉంటుంది. గారడి వాడి కిటుకులు తెలిసిన తర్వాత అవి చూస్తూ ఉన్నా మనని భ్రాంతికి లోను చేయవు. సినిమాలో సన్నివేశాలకు ఏడ్చే పిల్లాడికి, 'అవి ఉత్తుత్తి బొమ్మలే నాన్న, నిజంకాదు!' అని తల్లి చెప్పడంతో వాడిబాధ పోతుంది. అందుకే భగవంతుడి మాయను వివేకంతోనూ, దైవచింతనతోనే దూరం చేసుకోవాలి. మాయను అర్థం చేసుకోనంతకాలం అది మనని ఆడిస్తూనే ఉంటుంది. అశాశ్వతమైన దాన్ని సత్యం అనుకోవడమే 'మాయ'. ఈ దేహం దాని చుట్టు ఉన్న బంధాలు, బంధుత్వాలు అన్నింటినీ వదలనక్కరలేదు. శాశ్వతం కాదని తెలుసుకొని జీవిస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది. 


మనకి కనపడే ప్రతి దృశ్యం అశాశ్వతమని, ఒక శాశ్వత సత్య వస్తువు అంతర్లీనంగా ఉండటమే ఏ దృశ్యానికైనా కారణమని గ్రహించాలి. సినిమా తెరపై బొమ్మలు మారతాయి. ఆధారం అయిన తెర స్థిరంగా ఉంటుంది. మిరపకాయ పుట్టుక నుండి దానిలో కారం ఉన్నట్లే ఈశ్వరునితో పాటే ఆయన శక్తి కూడా ఆరంభం నుండే ఉంది. ‘సాంబ’ అంటే 'సహ అంబ' అని అర్ధం. శివుడు అంతర్లీనంగా ఉండి ఆయన శక్తిగా మనకి వ్యక్తం అవుతూ ఉంటారు. ప్రతిశక్తి వెనుక ఈశ్వరుడున్నాడని గుర్తించాలి. మనం చూసే ప్రతి శక్తి ఆయన అనుగ్రహమే. ఆ శక్తే ఆత్మగా ప్రాణంగా ఉండి మనని నడిపిస్తుంది. దీపం ఒకే చోట ఉన్నా దాని వెలుతురు విస్తరించినట్లే ఈశ్వరశక్తి ఎల్లెడలా విస్తరించి వ్యక్తం అవుతుంది. మూలమైన ఆ ఈశ్వరజ్యోతిని చూడడమే మన గమ్యం. మనలోనే ఉండి మన ఉనికికి కారణంగా ప్రతిబింబించే ఆ ఈశ్వరుడు లేక పోతే ఈ ప్రపంచం ఉన్నా అది మనకు లేనట్లే కదా! ఈ ప్రపంచాన్ని శివానుగ్రహమైన శక్తిగా చూసిన రోజు మాయకు ఆస్కారం ఎక్కడిది. 


అద్దం ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిబింబం తప్పనట్లే ప్రతి కర్మకి ఫలం తప్పదు. దాన్నే మనం ప్రారబ్దం అంటాం. ఈ ప్రారబ్దమే మనని నడిపిస్తుంది. కర్మ ఫలదాత ఈశ్వరుడేనన్న సత్యాన్ని గుర్తించిననాడు మన ప్రారబ్దం మనని బాధించదు. మనకి ఈ ప్రారబ్దాన్ని అందించే ఈశ్వరుడు మనలోనే ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటే ఆత్మానందం మన సొంతం అవుతుంది. ఒక తలపు మరో మరపుకి కారణం. అలాగే ఈ దేహపరమైన తలపులే మన నిజ స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వరూపం అయిన చైతన్యాన్ని గుర్తించటం లేదు కానీ అది లేనినాడు మన దేహంగాని, ఉనికి కాని లేవు. కనుకనే మనం ఉన్నట్లు మనకి ఎప్పుడూ గుర్తుంటుంది. చివరికి ప్రేమించే భార్యా పిల్లల్ని మర్చి పోయినా మనని మనం మర్చిపోలేం కదా! అదే ఆత్మ వైభవం. 


 మన 'స్వస్వరూప దర్శనానికి' అడ్డుగా ఉన్న సంస్కారాలు,వాసనలు నశించేందుకు గురువు బోధనలు ఆచరించాలి. వివేకంతో అనుసరించాలి. సముద్రం ఒడ్డున గుంటతవ్వి రాగి చెంబు దాచుకున్న ఓ సాధువుని చూసి అది ఆచారం అనుకొని అందరూ అలానే చేశారట. మనది అలాంటి మూర్ఖపు అనుకరణ కాకూడదు. ఆ దైవం సృష్టిగా, ప్రపంచంగా మారి మనలో నుండి 'నేను' గా వ్యక్తం అవుతాడు. మనం దీనికి వ్యతిరేక దిశలో ఆలోచించి ముందు నేను, తర్వాత ప్రపంచం, చివరకి ఈశ్వరుడని అనుకుంటున్నాం. అలాకాక మన ప్రతి ఆలోచన ఈశ్వరుడితో మొదలు కావాలి. వాస్తవానికి మనం చేసే సంకల్పాలన్ని మనవి కావు. ఈశ్వరుడివే. కేవలం వాటిని మనం గమనించడం చేత అవి మనవే అనుకోవడము అహంకారం. 


అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది గనుక అదంతా మన ప్రతిభ అనుకుంటున్నాం. గొంతు దిగిన ముద్ద జీర్ణం అవడంలో మన ప్రమేయం ఎంత ఉంటుందో ఆలోచిస్తే ఈ అహంకారం పోతుంది. దేవాలయ గోపురం అంత ఎత్తుగా ఉండేది దైవం ముందు మనం చిన్నవారిమని చెప్పడానికే. ఒక విత్తనం నాటడం మన సంకల్పం అయితే వేల ఫలాలు రావడం మన సంకల్పం కాదుగా! అందుకే మనది సంకల్ప శక్తి కాదు. కేవలం గమనించే లక్షణం మాత్రమే. దాన్నే సంకల్పం అని భ్రమిస్తున్నాం. మన చేతిలో ఉన్నదల్లా ప్రార్ధన మాత్రమే. అదే మనకి శాంతినిస్తుంది. 


🙏

Saagaravasi