2, జులై 2020, గురువారం

'ధ్రియతే' ఆపై ధర్మం


వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.

శక్తి ఉనికి వక పరిశీలన.

శక్తి ఉనికి వక పరిశీలన. యిది పుట్టుక తెలియదు అది సూక్మమైనది అణువు అణువు కన్నా సూక్మమైనది. దీని ఉనికి తెలియుట శబ్దము ప్రమాణము అది వినికిడి వలననే శక్తి లక్షణము తెలియును. దానిని భాషా పరంగా వస్తు తత్వాన్ని బట్టి గుర్తులుగా అనగా చిహ్నంగా తెలిపారు. అంతకు ముందు లిపి లేనప్పుడు వాక్కు రూపమే బాల్యంలో కొన్ని పదములు లిపి లేకుండానే అభ్యాసం తల్లి వడినుండే. దీని ప్రకారమే శక్తి లక్షణం వినికిడి వలననే. అచ్చులు అనగా అఆఇఈ లు కచటతప లు కలిపి శబ్ద లక్షణం పూర్ణమైనపూర్ణమైనట్లు తెలిసినది. భాష ముఖ్యం. కొన్ని పదములు శక్తి చాలా సూక్మమైన అర్ధం దాగి యుండును ఆ ఈ ఊ ఏ ఓ లు వీటి దీర్ఘ స్వరమేగదా శక్తి వ్యాప్తమే లక్షణమని దాని ఫలితమే ధాతు లక్షణము గల ప్రకృతి గా మనకు గోచరించుచున్నది. వినికిడి అనగా శ్రవణం శక్తి లేని జీవి ప్రకృతి తత్వం తెలియదు.శ్రవణం నక్షత్ర శక్తి భూమికి మధ్యన గల డిగ్రీ ద్వారా అనగా మకర రేఖను గల ఆశ్రయించిన గమన శక్తి యే కాంతి రూపంగా మనము ప్రభావితం చేసి శబ్ద రూపంలో తెలియుచున్మది. శ్రవ  అణి  ౦ పూర్ణునిగా తెలియును. శృతి శ్రవా...విష్ణ సహస్రం.శ నగా ఈశ  శక్తి చైతన్యమే రుద్రశక్తిగా శ్రవణ వింటున్నాం. అది ప్రణవ రూపమైన ఓం అనే శక్తి. రెండుగా మారిన పదార్ధాలు శక్తి ఆర్ అనే వ్యాసార్ధం వలననే తెలియుచున్నది. రెండుగా మారిన గాని తెలియదు. అదియే ఆర్ అనే ఆంగ్ల శక్తి రుద్ర శక్తి. రాహు శక్తి శబ్దం పుట్టుకకు మూల భాగమని ఆదిలో శబ్దం వలననే చైతన్యం శ్రవణం వలన మననం శ్రవణమే లేనియెడల మనస్సు లేదు అది లేని బుధ్దిలేదు. బుధ్ది లేని కర్మ లేదు. కర్మ లేనిదే  జీవం లేదు. జీవం లేనిదే సృష్టికి మూలం లేదు. కనుక శబ్ద శ్రవణశక్తియే అన్నింటికి మూలం. విన్నా మన్నా కన్నా శబ్దమే ప్రాధాన్యం. శబ్దమే మనిషికి శక్తి.అది విషు విష్ణు వ్యాప్తి అని తెలియుచున్నది. భాష శక్తి మంత్రము. మనస్సుతో అనిన గాని శబ్ద లక్షణము తెలియదు. అందుకే నమః శివాయ తో మెుదలుకావాలి.అక్షర అభ్యాసం.మననంతో మాత్రమే శబ్ద లక్షణము తెలియును. ఎందుకనగా శబ్దం యెుక్క మూలం ప్రణవం తో ప్రాణము అనుసంధానం. ముందుగా శబ్ద లక్షణము దేహంలో గల శక్తి ద్వారా తెలుసుకొని పలుకుచున్నారు. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.

రామభక్త తులసీదాస్

 ఒక మహాభక్తుడు తీర్థయాత్రలు చేస్తూ పండరీపురం చేరుకున్నాడు.

 చంద్రభాగా నదిలో  స్నానమాచరించి అక్కడే నదీతీరాన కూర్చుని కొంతసమయం ధ్యానం చేసి; విఠలుని దర్శనానికై దేవాలయం వైపు నడవసాగాడు.
అంతలో  ఒక అంధుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగుపరుగున వెళుతున్నాడు.

  దివ్యభావపారవశ్యంలో ఉన్న  ఆ భక్తుడికి ఎదురుగా వస్తున్న  వ్వక్తిని సరిగా గమనించలేదు

.ఆ అంధుడు భక్తున్ని  ఢీకొని కిందపడిపోయాడు.వెంటనే ఆ భక్తుడు అతణ్ణి  పైకి లేపి క్షమించమని అడిగాడు.

అతడు అంధుడని భక్తునికి తెలియదు. ఎంత సేపు పిలిచినా కళ్ళు తెరవకపోవడంతో నాయనా ! కళ్ళు తెరవు అనగానే కళ్ళు తెరిచాడు.

    అంధుడు ఆశ్చర్యంతో తన ముందు నిలబడివున్న  భక్తున్ని  చూసి పట్టరాని సంతోషంతో  "స్వామీ! మీ దయ వల్ల నా అంధత్వం తొలిగిపోయింది .నాకు దృష్టిని ప్రసాదించిన  మీరు మహ్మతులు అని కన్నీరు కారుస్తూ భక్తుడికి ప్రణమిల్లాడు.

ఆ భక్తుడు ఎంతటి పరమపావనుడో అతని వాక్క ఎంతటి శక్తిమంతమో కదా!

అతనే  రామభక్త తులసీదాస్... హనుమాన్ చాలీసా రచించిన మహాభక్త కవి

కేశవ నామాల విశిష్టత

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ

 కేశవాయనమః,,నారాయణాయనమః,,
మాధవాయనమః
 
    అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.

*1. ఓం కేశవాయనమః*
(శంఖం _చక్రం_గద_పద్మం)

    బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

*2. ఓం నారాయణాయనమః* (పద్మం_గద_చక్రం_శంఖం)

    నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.
    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ,     ప్రాతఃకాలానికీ     నియామకుడు.

*3. ఓం మాధవాయ నమః*
(చక్రం_శంఖం_పద్మం_గద)

    ‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
    ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.

*4. ఓం గోవిందాయ నమః*
(గద_పద్మం_శంఖం_చక్రం)

    వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,
    శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.

*5. ఓం విష్ణవే నమః*
(పద్మం_శంఖం_చక్రం_గద)

జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.
ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,సింహరాశికీ,పాలకూ నియామకుడు.

*6.ఓం మధుసూదనాయ నమః* (శంఖం_పద్మం_గద_చక్రం)

    “మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని
    ‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు

*7. ఓం త్రివిక్రమాయ నమః* (గద_చక్రం_శంఖం_పద్మం)

    మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.
    వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.

*8. ఓం వామనాయ నమః*
(చక్రం_గద_పద్మం_శంఖం)

అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.  
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ  జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు.

*9. ఓం శ్రీధరాయ నమః*
(చక్రం_గద_శంఖం_పద్మం)

శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.

*10. ఓం హృషీకేశాయ నమః*
(చక్రం_పద్మం_శంఖం_గద)

ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

*11. ఓం పద్మనాభాయ నమః*
(పద్మం_చక్రం_గద_శంఖం)

నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ,
    ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

*12. ఓం దామోదరాయ నమః*
(శంఖం_గద_చక్రం_పద్మం) 

యశోదచేత పొట్టకు బిగించబడిన 
తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

*13. ఓం సంకర్షణాయ నమః*
(శంఖం_పద్మం_చక్రం_గద)

భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,
    మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.

*14. ఓం వాసుదేవాయ నమః*
(శంఖం_చక్రం_పద్మం_గద)

త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.

*15. ఓం ప్రద్యుమ్నాయ నమః*
(శంఖం_గద_పద్మం_చక్రం)

అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.

*16. ఓం అనిరుద్ధాయ నమః*
(గద_శంఖం_పద్మం_చక్రం)

ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ,  అబ్దానికీ,           నల్లని  ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మఋతువుకూ   నియామకుడు.

*17. ఓంపురుషోత్తమాయనమః*
(పద్మం_శంఖం_గద_చక్రం)

దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు

    ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.

*18. ఓం అధోక్షజాయ నమః*
(గద_శంఖం_చక్రం_పద్మం)

ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ  అయినందువల్ల  శ్రీహరి    ‘అధోక్షజుడు’     అనబడుతాడు.

    ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

*19. ఓం నారసింహాయ నమః*
(పద్మం_గద_శంఖం_చక్రం)

నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.

    ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

*20. ఓం అచ్యుతాయ నమః*
(పద్మం_చక్రం_శంఖం_గద)

శుద్ధజ్ఞానానందాలే దేహంగా క

లవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. 

*21.ఓంజనార్థనాయనమః*
(చక్రం_శంఖం_గద_పద్మం)

సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,  మోక్షప్రదుడూ,     జన్మలేనివాడూ,    సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.

    ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.

*22.ఓంఉపేంద్రాయనమః*
(గద_చక్రం_పద్మం_శంఖం)

ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి   ‘ఉపేంద్రుడు’   అనబడుతున్నాడు.

    ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.

*23. ఓంహరయేనమః*
  (చక్రం_పద్మం_గద_శంఖం)

భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.

    ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.

*24. ఓంకృష్ణాయనమః*
(గద_పద్మం_చక్రం_శంఖం)

  సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ,  నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు.

    ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ,  దైహిక  కర్మకూ    నియామకుడు.
(సేకరణ)

నాన్న ఎవరు


బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.

“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.

“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.

“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా

“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.

బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.

“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.

“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.

ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

 మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.

“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.

“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.

ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.

“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”

'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'

వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - 
మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది
ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది
అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది

మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు

విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.

హాస్యానందం

, ఒకసారి విశ్వనాధ సత్యనారాయణగారికి రాష్ట్ర సచివాలయంలో ఏదో పని కావలసి వచ్చింది. చాలా రోజులుగా ఆ వ్యవహారం తెమలకపోవడంతో ఏదో సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు. సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు. అందుకు ప్రకాశంగారు కొంత విముఖత చూపుతూ..”ఆ సచివాలయం పెద్ద అడివి. దానిలో పనులు అలాగే వుంటాయి” అన్నారు.అందుకు విశ్వనాధ ఓ చిరునవ్వు నవ్వి “అందుకే కదండీ తమకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్రకేసరి కదా! ఆ అడవి మీకొక లెక్క కాదు.” అన్నారు.ఆ మాట విన్నాక ఆంధ్రకేసరికి ఆ పని నెత్తిన వేసుకోక తప్పింది కాదు

కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*



🚩ఒకాయన ఉత్కళ దేశంలో ఉన్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట.
సామాన్యంగా అన్ని దేవాలయాలలో విగ్రహాలు రాతితో గాని, లోహాలతో గాని చేయబడతాయి.
ఆ దారుమూర్తిని చూసిన ఆ కవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది.
💥శ్లో||
ఏకా భార్యా ప్రకృతిరచలా, చంచలా చ ద్వితీయా
పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః
శేషశ్శయ్యాప్యు దధి శయనం, వాహనం పన్నగారిః
స్మారం స్మారం స్వగృహచరితం దారు భూతొ మురారి!💥

🚩అదేమంటే, శ్రీ మహా విష్ణువు తన కుటుంబంలోని వారి ప్రవర్తనలను చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట.

విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు. ఒకావిడ కదలకుండా ఉండే ప్రకృతి (భూదేవి),
ఇంకొకావిడేమో (లక్ష్మి) ఒకచోట నిలకడగా ఉండకుండా, మనుష్యులను మారుస్తూ తిరుగుతూ ఉంటుందిట.

🚩కొడుకు(మన్మధుడు)ని చూద్దామా అంటే, ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ ఉంటాడు. అందరినీ బాధిస్తూ ఉంటాడు. వాడు బలంగా ఉన్నాడా అంటే, అసలు శరీరమే లేదు.

🚩ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామనుకుంటే, తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద, ఆదేమో మెత్తగా ఉంటుంది. ఎంత సేపూ బుసలు కొడుతూనే ఉంటుంది. ఒక తలా ఏమన్నానా, వెయ్యి తలలాయె. ఒక దాని తర్వాత ఇంకొక తల బుసలు కొడుతూనే ఉంటాయి.

🚩ఆ పాముు ఉండేది పాలసముద్రం మధ్యలో. అన్నీ అలలే, హోరున శబ్దం. ఒక అల అటు వైపు నుండి కొడితే, ఇంకొకటి యిటు వైపు నుండి కొడుతుంది.

🚩పోనీ వాహనమెక్కి బయటికి పోదామా అంటే, అది ఒక పెద్ద గ్రద్ద, పైన ఎగురుతూ పోతూ ఉంటే, క్రింద పాము కనబడితే చాలు, తన యజమాని పని మర్చిపోయి, గబుక్కున క్రిందికి దిగి, ఆ పామును కాళ్లతో పట్టుకొని తినే వరకు కదలదు.

🚩ఇవన్నీ తలుచుకొని తలుచుకొని శ్రీ మహా విష్ణువు కొయ్యబారి పోయాడట!💥

✍🏿కవుల మనసులో ఏది మెరిస్తే దానిని చెప్పేస్తారు, చమత్కారంగా.😀

మిధ్య

ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి
నాయనా అని అడిగాడు.ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి.
అన్నాడు.దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు.చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.
సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు ,చంద్రబింబం లాంటి ముఖం.అతను అంత అందమైన అమ్మాయిని యింతవరకూ చూడలేదు.అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది.అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది.అంతే తాను  వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా?అని అడిగాడు.ఆ కన్య అంగీకారంగా తల వూచింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.
ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధారగా కురుస్తోంది  .ఊరూ వాడ ఏకమై పోయాయి.(హుదూద్ తుఫాన్ లాగ)చెట్లు పడిపోయాయి,ఇళ్ళు కూలిపోయాయి.భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.ప్రవాహం వేగంగా వుంది.ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు.'భగవంతుడా రక్షించు'అని మొరపెట్టుకున్నాడు.భగవంతుడు అతడి మొర విని  నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ?అని అడిగాడు. అప్పుడతడికి జ్ఞానోదయమైంది.
ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో  చేద్దామని  కాలం లో చిక్కుకుంటాడు.కాలం లో చిక్కుకొని
నివసించడం అలవాటయి పోయింది.కాలం రెండు విధాలు,1.గడియారం సూచించే కాలమానం 2.మనస్సు కల్పించే మానసిక కాలం.నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించినవి.నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు."నిన్న''గతించినట్లే అవి గతించాయి.కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు.రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.నిజానికి నిన్నా లేదు,రేపూ లేదు,వర్తమానమే ఎప్పుడూ వుండేది.మానసిక కాలమే మిధ్య.


ధర్మం అంటే

వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ఈ ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.


సుగుణ రూపనగుడి గారి సందేశం.


తమిళనాడులోని చిన్నమనై కెన్‌పట్టి అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… ఒకాయన నీలి గళ్ల చొక్క టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు, బూట్లు… కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు… మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజుకళ్లతో ఓ ముసలామె కనిపించింది… ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు… ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా… ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82… ఏందయ్యా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును… ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని, కింద పరుచుకుని కూర్చున్నాడు… పరిచయం చేసుకున్నాడు… ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్‌ను…’ అన్నాడు… ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం… ఊళ్లో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు… ఏం తప్పు జరిగింది..? అవును ఏం తప్పు జరిగింది..? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగుపెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్ల దృష్టిలో పెద్ద తప్పు… ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…
అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రెఫ్యూస్ చేసి, ఇదుగో, ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను… చాప మీద బైఠాయించాడు… డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్. ఆ ఊరి పట్వారీ, తాలుకూ తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు… ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు… పనిచేసే బలం లేదు… కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు… వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది.
‘ఏం వండుకున్నావమ్మా… నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్…‘ఇంకా వండుకోలేదయ్యా..?’ అన్నది… ఏం..? అనడిగాడు కలెక్టర్… ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది… కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్‌లో… డ్రైవర్‌ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు.ఆమెతోపాటు భోజనం చేస్తూ అడిగాడు… మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?
‘లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు, మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది ఉన్నదున్నట్టుగా… బయట నిలబడిన తహసిల్దార్‌ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు.వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్… మరి ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు… అంతేకాదు… ఆ తాలూకాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించాడు… ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడుమా అమ్మతో కూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు.
ఇది వాస్తవంగా జరిగింది.  ఇటువంటి అధికారులు ఈనాడు చాలా అవసరం.
అందరూ అధికారులు తమ అహాన్ని వీడి ప్రజా సేవకులైతే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది.
ఇది ఒక వాట్సాప్ గ్రూపులో చూసి కాపీ చేసి పెట్టింది. 

పూజ మధ్యలో లేవకూడదా ??



కొంతమంది పూజలు చేస్తూ మధ్య మధ్యలో లేచి వెళ్ళి వేరే పనులు చేయటమో, ఇంకెవరితోనో కబుర్లాడటమో, ఇంకేదైనా పనిలోకి వెళ్ళటమో చేస్తుంటారు. అలాంటి వారిలో చాలామంది ఆపిన పూజను మళ్లీ చేయకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.

ఏకాగ్రత, భక్తి, ప్రశాంత చిత్తంతో చేయాల్సిన దైవ పూజలను అలా మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది ?

దీనికి సంబంధించిన కథ స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండం
ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది.

పూర్వం విదర్భ దేశాన్ని సత్యరథుడు అనే ఓ రాజు పరిపాలిస్తూ ఉండే వాడు. పేరుకు తగ్గట్టుగానే సత్యరథుడు ధార్మిక జీవనాన్ని గడుపుతూ సత్యాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. అ రాజు నిత్యం శివుడికి పూజలు చేసేవాడు. సత్యరథుడు చక్కగా పరిపాలన చేస్తుండటం, రాజ్యం అంతా పచ్చగా విలసిల్లుతూ ఉండటం చూసి అతడి శత్రువులు ఓర్వలేక పోయారు. ఎన్ని విధాలుగా వారు ప్రవర్తించినా సత్యరథుడికి ఇసుమంత కూడా ప్రమాదం కలుగ చేయలేక పోయారు. దానికి కారణం అతడి ధర్మ బద్ధమైన, సత్యశుద్ధమైన పరిపాలనే.
ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజున సత్యరథుడు పూజలో ఉన్న సమయంలో రాజ మందిరం వెలుపల ఏదో పెద్ద అలికిడి వినిపించింది. సత్యరథుడికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అతడి మంత్రులు అతడిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు కావలసిన చర్యలన్నీ తీసుకొంటూనే ఉన్నారు. ఇంత గట్టి భద్రత తనకుందని సత్యరథుడికి తెలిసినా దైవపూజ విషయంలో నిర్లిప్తత, నిరాసక్తత కలిగాయి. అందుకు కారణం చేస్తున్న పూజ మీద అలసత్వం వల్ల ఏకాగ్రత లోపించటమే. దాంతో పూజ మధ్యలో లేచి బయటకొచ్చి చూశాడు.
అప్పటికే ఆ అలజడి చేసిన దుర్మర్షణుడు అనే శత్రురాజును సత్యరథుడి రక్షక భటులు బంధించి తేవటం, శత్రు సేనలను అణచటం కూడా జరిగింది. బంధితుడైన ఆ శత్రువుకు తగిన శిక్ష విధించాడు సత్యరథుడు. పూజ మధ్యలో లేచి వచ్చి ఇదంతా చేశాడు. చేయాల్సిన పనులన్నీ అయిపోయాక కూడా పూజ సంగతి రాజుకు గుర్తుకు రాలేదు. వెళ్ళి భోజనం చేసి నిద్రించాడు.

ఇలా జరిగిన కొంతకాలానికి మరొక శత్రువు సత్యరధుడి రాజ్యం మీదకు దండెత్తాడు. రెండు సేనల నడుమ భీకర పోరాటం జరిగింది. ఈసారి శత్రువు చేతిలో సత్యరథుడు మరణించాడు. దాంతో రాజ్యం శత్రువుల హస్తగతమైంది. అతడి పట్టపు రాణి అప్పటికే నిండు చూలాలు. ఆమె రాజ మందిరం నుంచి ఎలాగో ఒకలాగా బయటపడి అడవి మార్గం పట్టింది. అలా ఎక్కువ దూరం నడవటానికి ఓపిక లేక ఓ సరస్సు తీరంలో చెట్ల నీడలో కూలబడింది. అక్కడే ఆమె ఒక మగ శిశువును ప్రసవించి మరణించింది.

ఆ దోవన ఒక నిరుపేద వేద పండితుడి భార్య తన సంవత్సరం వయస్సున్న బాలుడిని ఎత్తుకొని వెళుతూ ఆ మగ శిశువును చూసింది. ఆ శిశువును ఆమె చేరే సరికి సరస్సులోని మొసలి వచ్చి రాజు భార్యను సరస్సులోకి లాక్కు వెళ్ళింది. దాంతో వేద పండితుడి భార్య ఆ పసికందు ఎవరో, ఏమిటో అర్థం కాక అతడిని తీసుకు వెళ్ళాలో, అక్కడే వదిలి వెళ్ళాలో తెలియక అయోమయంలో పడింది. ఇంతలో ఓ భిక్షువు అటుగా వచ్చి ఆ బాలుడిని తీసుకు వెళ్ళి పెంచుకోమని, అలా చేస్తే భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఆ పసికందును తన వెంట తీసుకు వెళ్ళి తన కుమారుడితో సమానంగా పెంచసాగింది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజున వేద పండితుడి భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక దేవాలయంలోకి వెళ్ళింది. అక్కడికే అదే సమాయానికి గొప్ప గొప్ప మునులు వచ్చారు. ఆ మునులలో శాండిల్యుడు అనే ముని, వేద పండితుడి భార్య దగ్గర పెరుగుతున్న బాలుడిని చూసి విధి ఎంత విచిత్రం, రాజకుమారుడు ఇలా బతకాల్సి వచ్చింది అన్నాడు.
ఆ స్త్రీ శాండిల్యుడికి నమస్కరించి తనకా పిల్లవాడు దొరికిన సంగతిని వివరించి ఆ బాలుడు ఎవరు అని అడిగింది. ముని దివ్య దృష్టి వల్ల తాను తెలుసుకొన్న విషయాన్నంతా చెప్పాడు. అప్పుడామె అంతటి మహారాజు ఎందుకలా శత్రువుల చేతిలో మరణించాల్సి వచ్చింది ? రాజు కుమారుడైన ఈ బాలుడు అనాథగా ఎందుకు బతకాల్సి వచ్చింది ? రాజు భార్య దుర్మరణం పాలు కావటానికి కారణమేమిటి ? అని అడిగింది.

అప్పుడు శాండిల్యుడు రాజు శివ పూజ చేస్తూ భక్తితో ప్రవర్తించక పూజ మధ్యలో ఆపి వేయటం వల్ల అన్ని కష్టాలు పొందాడన్నాడు. రాజ కుమారుడు కూడా గత జన్మలో రాజ కుమారుడేనని, అయితే ఆ జన్మలో అతడు కూడా శివ పూజను మధ్యలో ఆపటం, వెళ్ళి వేరే పనులు చేసుకుని తిని నిద్ర పోవటం లాంటివి చేశాడని, ఆ పాప ఫలితమే అతడు అనాథ కావటానికి కారణమన్నాడు. ఇక రాజు భార్య కూడా గత జన్మలో తన సవతి మీద అసూయతో ఆమెను మోసం చేసి చంపిందని, ఆ కారణం చేతనే ఆమె ఆ జన్మలో అలా దుర్మరణం పాలైందని అన్నాడు. రాజ కుమారుడు భవిష్యత్తులో మళ్ళీ రాజ్యం పొంది రాజుగా అవుతాడని, అయితే అతడి చేత భక్తితో పూజలు చేయించమని శాండిల్యుడు వేద పండితుడి భార్యకు చెప్పి వెళ్ళి పోయాడు.

చేస్తున్న పూజను త్రికరణశుద్దిగా చేయండి...శుభాలు వాటంతట అవే వస్తాయి.

రుద్రం యొక్క మహత్యం


రుద్రంలో మీరు చూస్తే ప్రపంచమంతా తిప్పుతాడాయన. "నమః కలాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః  పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః" పెద్ద flight లో కూర్చోబెట్టి world అంతా తిప్పుతుంది రుద్రం మనల్ని. తిప్పి తిప్పి ఏం చేసిందంటే ఇందరిలో రుద్రుణ్ణి చూడు. ఇందరిలో ఉన్న రుద్రుణ్ణి చూడు. అదీ చెప్పడం. ఇందరిలో ఇన్నిగా ఉన్నాడంటే ఒక్కడేట. ఎలా అంటే "ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు పోలిక" అని చెప్పడానికి పది కడవలు పెట్టి ఒకదానికి పసుపు రంగు, ఒకదానికి నీలం రంగు కడవ పెట్టి పసుపు కడవలోనూ సూర్యుడే, నీలం కడవలోనూ సూర్యుడే, అని ఇన్ని కడవలు చూపిస్తున్నా చిట్టచివరికి రుద్రం ప్రతిపాదించింది 'ఏకం' - అందరిలో ఉన్నవాడు ఒక్కడే అని ప్రతిపాదించుతూ వాడెక్కడున్నాడు? తిరిగావా? లోపలికి వెళ్ళు, అక్కడున్నాడు. మనం అది చెయ్యం. కనుక అక్కడున్నాడు. గర్తసదం - లోతుగా ఉన్నాడుట. అంతా గభీరం -ప్రత్యక్ దృష్టి ఉంటేగానీ కనిపించాడాయన. లోతైన హృదయంలో ఉన్నాడు. అందుకు ఆయనని స్తుహి - స్తోత్రం చెయ్యి. అందుకే స్తోత్రేణ స్తూయతే అనేన స ఏవ పరమేశ్వరః - ఆయనని స్తోత్రం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మధ్యలో రుద్రం ఎందుకు చెప్పారండీ? అని వెంటనే అనిపించవచ్చు కదా! దానికి సురేశ్వరాచార్యుల వారు చెప్పిన ఈ శ్లోక వ్యాఖ్యానంలోనే ఉన్నది.

రుద్రోపనిషదిత్యేతం స్తౌతి సర్వాత్మకం శివం
ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే
వ్యోమవత్ వ్యాప్య దేహాయ  దక్షిణామూర్తయే నమః!!

అణోరణీయాన్మహతో మహీయానితి వేదవాక్
రుద్రోపనిషదిత్యేతం స్తౌతి సర్వాత్మకం శివం!

ఏమండీ వేదాంతం అనేది ఎలాంటిది అంటే గట్టిగా అర్థం చేసుకుంటే రేపు ఉపన్యాసం అక్కరలేదు. రేపు మళ్ళీ పెట్టాం అంటే అర్థం చేసుకోలేదని మిమ్మల్ని అనుకున్నానని అనుకోవద్దు. ఇంకా ఇంకా తెలుసుకుందాం అని. కానీ ఎక్కడికక్కడే పరిపూర్ణమండీ. అదీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. 'అణోరణీయాన్మహతో మహీయాన్' అనే మాటకి అర్థం చెప్తున్నాడిక్కడ.  దీనికి మనం ఏంటంటామంటే అణువుకంటే అణువు, మహత్తు కంటే మహత్తు అని. అణువులో అణువై వున్నవాడు, మహత్తులో మహత్తై ఉన్నవాడు.

ఇది తక్కువ, ఇది ఎక్కువ అని లేకుండా అన్నిటియందు "సమః సృష్టిణా సమో మశకేన సమో నాగేన" అని ఉపనిషత్తు చెప్పినట్లుగా సర్వముయందు సమానమై వ్యాపించాడట. ఎలాగు? అయ్యా! సర్వమునందూ సమానమంటే మరి బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, ఇలా అనేకమంది దేవతలు మనకి కనిపిస్తున్నారు కదా! ఈ దేవతలందరూ నాకంటే గొప్పవాళ్ళు. అవునా? కాదా? అంతేకాదు. మా ఊరి రాజుగారు, మా దేశపు రాజుగారు, ఇంకా అల్లక్కడ ఫలానా దేశము యొక్క అధిపతి వీళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళు. మరి అందరూ సమానం అని ఎలా అంటారండీ? అయ్యా! గొప్ప అనేది ఉపాధుల వల్ల ఏర్పడినది. అది ఇక్కడ అర్థం. నీ దేహము, ప్రాణము, బుద్ధి ఇవన్నీ ఉపాధులే. ఇందులో ఆత్మ అంటే కొందరు దేహము నువ్వు కావు అంటే మనస్సేమో అనుకుంటారు. కొందరు ప్రాణమేమో అనుకుంటారుట. ఇన్ని confusion లు. ఇక్కడ ఆత్మను filter చేసి పట్టుకోవడం మామూలు విషయం కాదు. దానిని తెలుసుకోవడం మహా కష్టం., మహా తేలిక. అందుకే 'సులభః సువ్రతః సుముఖః' 'దుర్లభో దుర్గమో దుర్గో' - రెండూ ఆయనే. సరిగ్గా వెళ్ళగలిగితే accident కాకుండా చక్కగా అందుకోగలరు ఆయనని. జాగ్రత్తగా, ఆ ఏమరుపాటు లేకుండా alert గా వెళ్ళాలి. అదీ ప్రత్యగ్ర భావం. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళలోనూ నీలోనూ ఉన్నవాడు ఒక్కడే అని ఎలా అనగలవయ్యా? అంటే

శివో బ్రహ్మాది దేహేషు సర్వజ్ఞ ఇతి భాసతే!
దేవ తిర్యగ్ మనుష్యేషు కించిత్ జ్ఞః తారతమ్యతః!!

అది ఇక్కడ చెప్తున్నారు. 'కించిత్ జ్ఞః తారతమ్యతః'. శివ, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు  - ఇక్కడ చెప్తున్నది సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు, వాళ్ళందరిలో ఆయన ఎలా ఉన్నాడు అంటే సర్వజ్ఞా - చైతన్యంగా ఉన్నాడుట. సర్వమూ తెలిసిన చైతన్యంగా ఉన్నవాడు ఆయనే. ఆ చైతన్యమే 'దేవ తిర్యగ్ మనుష్యేషు' - ఆ ముగ్గురికీ బంట్లు అయినటువంటి దేవతలు, తర్వాత జీవులు, జీవులు ఎలా అంటే తిర్యగ్ మనుష్యేషు - అడ్డగా పెరిగేవాళ్ళు, నిలువుగా పెరిగేవాళ్ళు, అంతేకదండీ తేడా. అడ్డగా వెళ్ళేవి అంటే పశువులు, పక్షులు; నిలువుగా అంటే మనము, చెట్లు మొదలైనవన్నీ కూడా. ఈ 'దేవ తిర్యగ్ మనుష్యేషు' - వీళ్ళందరియందూ కూడా కించిత్ జ్ఞః అని వ్యాపించిన వాడూ ఆయనే అన్నారిక్కడ. అక్కడ సర్వజ్ఞుడుగా ఎవడున్నాడో, ఇక్కడ కించిజ్ఞుడుగా ఆయనే ఉన్నాడుట. అంటే వారికి అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలియవు. అంతే తేడా. కానీ నీకు అన్నీ తెలియవు అని అంటే ఏవో కొన్నైనా తెలియట్లేదా?  కనీసం అన్నీ తెలియడం లేదు అనే విషయం అయినా తెలుస్తోంది కదా! కనుక తెలుసుకోవడం అనేది నీలో ఉందా? లేదా? అది అక్కడ అంటున్నాడు. తెలుసుకోవడం అనేటటువంటిది నీకెలా వచ్చింది? చైతన్యం వల్లనే వచ్చింది కదా! అది ఇక్కడ చెప్తున్నారు.

అక్కడ 100 candles బల్బు వెలుగుతోంది. ఇక్కడ 0 candle బల్బు వెలుగుతోంది. అయితే ఇక్కడ ఆత్మతత్త్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోతే హిరణ్యకశిపుడులాగా మనం wrong conclussions కి వెళ్తున్నాం. అంతటా ఒకటే ఈశ్వరుడు. కనుక నేనే ఈశ్వరుడిని అన్న మాటకీ, అహం బ్రహ్మాస్మి అన్న మాటకి చాలా తేడా ఉంది ఇక్కడ. నేనే ఈశ్వరుడు అంటే దేహ, ప్రాణ, బుద్ధి ఈ ఉపాధులతో తన్మయం చెందిన 'నేను'ను ఊదిపారేస్తేనే కానీ ఈ 'నేను' తేలదు. ఆ'నేను'తో మమైకం చెందిపోయి నేనే ఈశ్వరుణ్ణి అంటే అది అహంకారమై, రాక్షసత్వమై పదిమంది చేత చావాల్సిన స్థితికి వెళ్తుంది. రెంటికీ అంత తేడా ఉంది. ఇది తెలియక చాలామంది అద్వైతాన్ని అర్థం చేసుకోలేక అచ్చం హిరణ్యకశిపుడి వలె అని విమర్శించిన దుర్మార్గం కూడా చేశారిక్కడ. దానిని సరిగ్గా తెలుసుకోలేక జరుగుతున్నది. ఇది మనం బాగా పరిశీలిస్తే zero watt బల్బుకి, 100 watt  బల్బుకి తేడా ఉంది. వెలగడంలో తేడా ఉంది.

కానీ దానిని వెలిగించే దీనిని వెలిగించే విద్యుత్ మాత్రం ఒక్కటే. అది నువ్వు తెలుసుకుంటే ఈ ఉపాధిగతమైన మమైకాన్ని విడిచిపెట్టి ఉపాధిగతమైన మమైకం అంటే కించిజ్ఞుడిని, నాకు అన్నీ limitations యే. నిజమే. ఈ limitations నాకు ఉన్నాయి అని ఎవడు అనుకుంటున్నాడో ఆ నేను అనేదానికి ఆధారమైన చైతన్యానికి limitation లేవు. కనుక దానితో నువ్వు తన్మయం చెందవయ్యా. అది తెలుసుకోవడానికై

బ్రహ్మాది స్తంభ పర్యంతా స్వ ప్రకల్ప ఇవ కల్పనా!

బ్రహ్మాది స్తంభ పర్యంతమూ ఈ స్వ ప్రకల్పమే నేను అనే దానితోనే కల్పించబడి ఉన్నదయ్యా.

సాక్షాత్ కృతేన అనవత్ ఛిన్న ప్రకాశే పరమాత్మనీ!

ఇదంతా కూడా అనవత్ ఛిన్నం – పరిమితి లేనటువంటి పరిచ్ఛిన్నత లేనటువంటి పరమాత్మయందు ప్రకాశం లభించినప్పుడు ఇది తెలుస్తున్నది. అందుకు శృతి వాక్యములు “అణోరణీయాన్ మహతో మహీయాన్ ఇతి వేదవాక్” ప్రతిదానికీ వేదం ప్రమాణం కదండీ మనకి. అందుకే గురువుగారు ఏంటంటే మన అహంకారం, మన బుద్ధికి తోచడం ఇవి ఎప్పుడూ ప్రమాణాలు కావండీ. మన బుద్ధికి ఇవాళ నిద్ర మత్తు వస్తే ఒకటి తోస్తుంది. నిద్రమత్తు వదిలితే మరొకటి తోస్తుంది. ఇవాళ ఒక పుస్తకం చదివితే ఒకటి తోస్తుంది. రేపు మరొక పుస్తకం చదివితే మరొకటి తోస్తుంది. కనుక స్వబుద్ధి ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రత్యక్షం అంతకంటే ప్రమాణం కాదు. ఎందుకంటే దానిని చూసేదీ నీ బుద్ధితోనే. కనుక ప్రమాణం ఏమిటంటే పరమేశ్వర స్వరూపమైన వేదమే ప్రమాణం. ప్రమాణం లేకపోతే ఎలా మాట్లాడతారండీ? ప్రతివాడు సృష్టిలో నాస్తికుడు కూడా రహస్యాలు తెలుసుకోనిది మాట్లాడుట. వాడూ ఏదో ఒక ప్రమాణాన్నే తీసుకున్నాడు. ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకొని దానికి కట్టుబడి మాట్లాడతాడు. మరి ఇది దేనిని ప్రమాణం చేసుకుంది అంటే ఈశ్వర స్వరూపమైన వేదాన్ని ప్రమాణం తీసుకుంది. ఎందుకంటే అది ఇంద్రియాతీతమైన జ్ఞానం గురించి చెప్పింది కనుక ఇంద్రియబద్ధమైన బుద్ధి నిర్దేశించే సత్యముల కంటే ఇంద్రియాతీత సత్యాన్ని ఆవిష్కరించుకున్న ఋషి వాక్యములే మనకు ప్రమాణం. కనుక ఇది ‘వేదవాక్’