23, ఆగస్టు 2024, శుక్రవారం

*శ్రీ మహంకాళి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 418*


⚜ *కర్నాటక  :- అంబలపడి - ఉడిపి* 


⚜ *శ్రీ మహంకాళి ఆలయం*







💠 చెడును నాశనం చేయడానికి మరియు మానవాళిని రక్షించడానికి భూమిపైకి వచ్చిన దేవతలు గురించి హిందూ పురాణాలలో అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. అటువంటి సంఘటనలు జరిగినట్లు చెప్పబడే అనేక ప్రదేశాలు అప్పటి నుండి ఎంతో గౌరవించబడ్డాయి మరియు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. 


💠 ఉడిపికి సమీపంలోని అంబల్‌పాడి

మహంకాళి జనార్దన దేవాలయం అలాంటి వాటిలో ఒకటి.


💠 శక్తి (మాతృ దేవత) పూజించబడే చాలా దేవాలయాలలో శివుడు కూడా పూజించబడతాడు, అయితే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో మరొక లక్ష్మీ జనార్దన్ ఆలయం కూడా ఉంది.  

అంబల్‌పాడి అనే పేరు అంబా అంటే తల్లి మరియు పాడి అంటే స్థానిక భాష తుళులో "కొండ శిఖరం" నుండి వచ్చింది. 



💠 తుళులో 'పాడి' అంటే కొండ లేదా అడవి (ఉడిపి స్థానిక భాష). అంబల్‌పాడి అనే పేరు అమ్మనా పడి (అమ్మ అడవులు) అని అర్థం.


💠 శ్రీ కృష్ణ భగవానుడి భూమి అయిన ఉడిపి నగర పరిసరాలలో అంబల్పాడి ఒక పవిత్ర ప్రదేశం . 

పక్కనే మహాకాళీ మందిరం, ముందు భాగంలో జనార్దన పుష్కరిణి, ముఖ్యప్రాణ అవతారాలతో కూడిన ఆంజనేయ దేవాలయం, పరిసరాల్లో రాఘవేంద్ర స్వామీజీ యొక్క బృందావనం ఉన్న పురాతన శ్రీ జనార్దన దేవాలయం ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

కర్ణాటక రాష్ట్ర తీర ప్రాంతంలో తూర్పున శ్రీకృష్ణ దేవాలయం మరియు పశ్చిమాన శ్రీ మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహాన్ని పొందిన పవిత్ర బీచ్‌తో, అంబల్పాడి ఉడిపి బస్టాండ్ నుండి 2 మైళ్ల దూరంలో ఉంది.


💠 శ్రీకృష్ణుడు పడమర ముఖంగా ఉంటే, అంబల్‌పాడులో జనార్దనుడు తూర్పు ముఖంగా ఉన్నాడు.  అంబల్‌పాడుకు జనార్దనుడు పీఠాధిపతి

అతని ఆగ్నేయంలో మహంకాళి దేవత ఉంది , ఆమెను ఎక్కువ ఉత్సాహంతో పూజిస్తారు. పిల్లలు తమ తండ్రి కంటే ఎక్కువగా తల్లి వద్దకు వెళ్లి సహాయం కోసం తల్లిని ఒప్పుకోవడం వలన ఇది సర్వసాధారణం. అదే నమ్మకంతో, భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మరియు వారి సమస్యలకు పరిష్కారం పొందడానికి మహాకాళి దేవి వద్దకు వస్తారు. 


💠 ఇక్కడ ఆమె ఆధిపత్యానికి మరో కారణం కూడా ఉంది. భూమిని రక్షించడానికి ఆమె ఇంతకు ముందు ఈ ప్రాంతానికి వచ్చింది మరియు ఆమె కారణంగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

అంబల్పాడి 'అమ్మన పడి', లేదా 'అమ్మల అడవులు'.

 ప్రారంభంలో మహాకాళి దేవత ఒక రాతిలో పూజించబడిందని నమ్ముతారు. 

 మహాకాళి చెక్క విగ్రహంతో పాటుగా ఇప్పుడు కూడా అదే రాయిని పూజిస్తున్నారు. 

ఆ విధంగా, ఈ ప్రాంతంలో పూర్వం మహంకాళిని పూజించారు మరియు జనార్దన స్వామి దేవతను వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చి ఇక్కడే ఉండి భక్తులను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. 


🔆 చరిత్ర 🔆


💠 ప్రచారం లో కథ ప్రకారం, ఈ ప్రదేశాన్ని రక్షించడానికి మహంకాళి దేవి ఇక్కడ నివసించడానికి భూమిపైకి దిగింది.

 దేవతని వెతుక్కుంటూ వచ్చిన విష్ణువు లేదా జనార్దనుడు ఇక్కడ నివసించాలని నిర్ణయించుకున్నాడని మరియు అతను గ్రామంలో ఉన్న సమయంలో భక్తులను దెయ్యాల నుండి రక్షించాడు. 

అందువలన, అంబల్పాడు ప్రజలు అమితంగా ప్రేమించే మరియు గౌరవించే అంబల్పాడు యొక్క ప్రధాన దేవతగా జనార్దనుడు అయ్యాడు. 

అప్పటి నుండి, అంబల్‌పాడి దేవాలయాలలో జనార్దన్‌తో పాటు మాతా మహాకాళిని కూడా పూజిస్తారు. 


💠 ఈ ఆలయాన్ని అంబల్పాడి మహంకాళి జనార్దన దేవాలయంగా పిలుస్తారు.ఆలయ నిర్మాణం తీరప్రాంత ఆలయ శైలిని అనుసరిస్తుంది. 

జనార్దన పుష్కరిణి (ఆలయ చెరువు) కుడివైపున ఉన్నందున, ఆలయ ప్రవేశ ద్వారం విశాలంగా ఉండి ప్రముఖంగా కనిపిస్తుంది. 


💠 నేరుగా ఎదురుగా ఉన్న జనార్ధన ఆలయం చాలా పెద్దది మరియు గంభీరమైనది. మహాకాళి ఆలయం దాని ఎడమ వైపున ఉంది. 


💠 గర్భగుడిలో మహాకాళి చెక్క విగ్రహం 6 అడుగుల ఎత్తు ఉంటుంది.

దర్శనానంతరం, చుట్టూ అన్వేషిస్తే, అయ్యప్ప స్వామికి అంకితం చేయబడిన చిన్న ఆలయాలు మరియు కుడివైపున ఉన్న నవగ్రహాలు కనిపిస్తాయి. 

మహంకాళి దేవాలయం ముందు రాఘవేంద్ర స్వామి సృష్టించిన బృందావనం అని చెప్పబడే అందమైన ఉద్యానవనం. వివిధ జంతువులు, గురువులు మొదలైన  విగ్రహాలతో అలంకరించబడిన ఈ ఆకర్షణీయమైన ఉద్యానవనం దృశ్యమానంగా ఉంటుంది. 


💠 అంబల్పాడి ఆలయంలో చేసే కొన్ని పూజలు తీర్థ స్నానం, కుంకుమార్చన, పంచామృత అభిషేకం, సప్తశతి పారాయణ, చండికా హోమం, రక్షా యంత్రం, మహాపూజ మొదలైనవి.


💠 ఈ ఆలయం యొక్క ప్రత్యేకత "ఒరాకిల్" ఇక్కడ మాతృ దేవత పత్రి అనే వ్యక్తి ద్వారా భక్తులతో మాట్లాడుతుంది. 

ఇది ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది.

 ఈ సందర్భంగా ప్రజల వ్యక్తిగత సమస్యలను విని వాటికి పరిష్కారం చూపుతారు.


💠 అంబల్పాడి ఉడిపి బస్టాండ్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది

పెద్దన్నయ్య

 జీవితం మంచికధ*

*పెద్దన్నయ్య*

"దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు" పక్కసీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్.

బ్యాంకు గేటునుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.

బ్యాంకు స్టాఫ్ కొంతమంది శివరాంను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు. కొంతమంది పలకరిస్తున్నారు.

శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.

శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది.

"ఏమిటి.. ఇలా వచ్చావు..? బ్యాంకులో ఏమైనా పనిబడిందా..?" దివాకర్ అడిగాడు.

"మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను. ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.

"ఎంతవుతుందట..?"

"యాభైవేలు అవుతుందని చెప్పారు"

కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్. తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి "చూద్దాం అన్నయ్యా., నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంచి సర్జన్లు కూడా. వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.

"ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"

దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా. పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.

"అలాగే.. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు., మనం తర్వాత మాట్లాడుకుందాం.." అంటూ లేచాడు శివరాం.

అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి "నమస్తే సార్., నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.

"నీ పేరు గుర్తులేదుగానీ నువ్వు గుర్తున్నావు..  బాగున్నావా..?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.

"బాగున్నాను సార్..! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను. రాగానే దివాకర్

సార్ ని మీ గురించి అడిగాను., కూర్చోండి సార్.. టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.

"ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం. కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.

"టీ ఆఫర్ చేయాలని ఆ పాతశిష్యుడికి తోచిందిగానీ, తనకెందుకు తోచలేదు..?, ఎండనపడి వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు..?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు.

     *          *          *           *

ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రిప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.

"రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే.. ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడు దివాకర్ తో.

"అదేం పెద్ద పని కాదు., బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఓచర్లు నింపడమే నా పని. నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్.

రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు..?" అని అడిగాడు, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

"రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"

కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక

"మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు. చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.

"అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట. అందుకు యాభైవేలు..."

దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు..!" అన్నాడు వేణు గేటువైపు చూస్తూ...!

దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది.

"నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు

వేణుతో.

"నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తనసీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా..?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

"పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా.. మళ్ళీ నువ్వు రావడం ఎందుకు..? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది. కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు..?"

దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా.. అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం..

"సారీరా..! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం...!"

శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు. వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు. అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.

    *         *         *           *

దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.

"ఎన్ని గంటలకు చేశాడు"        విసుగ్గా అడిగాడు శివరాం.

"ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు. మీరు బ్యాంకునుంచి వచ్చారా... అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను.."

"బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు.."

"మీరేమని చెప్పారు?"

"ఆలోచించి చెబుతానన్నాను"

"బాగా ఆలోచించండి. ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు. యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"

"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

"అయిదో, పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి.."

"కానీ మనం కారు కొంటున్నాం"

"కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి. ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"

"అలాగే చెప్తా. నాకు కాస్త త్రాగడానికి మంచినీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్..

       *           *         *         *

మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.

ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్తకారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు. శివరాం ఇల్లు తాళంవేసి ఉండటంచూసి ఆశ్చర్యపోయాడు. శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు.

దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ. అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.

"చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.

"నాకూ అలాగే ఉంది. కొత్తకారు కొన్నాను. నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"

"అలాగా...కంగ్రాట్స్"

"అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా..?"

"నీకు తెలుసో, తెలియదో నాకు తెలియదుగానీ... మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు.."

"ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు. చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"

"ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. మీ అన్నయ్య స్టూడెంటు ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని, తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు. మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు "బీ గుడ్.., డూ గుడ్.., హి విల్ డూ గుడ్..," అని..! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది.  ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు" అన్నాడు. రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా..?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్. "లేదు. మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది.."

"తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో..?" అనుకున్నాడు దివాకర్. ఆ తర్వాత "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు. ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను.. వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.

"రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా., స్నానం చేస్తున్నావా., భోజనం చేస్తున్నావా., కరెంట్ బిల్లు., టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా..? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా., నీ భార్యకు, పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా..? మరి., వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు..? అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడంలేదు. నీకు గుర్తుందా.. మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు. అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా..?

"మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి., డాక్టర్ కావాలి., ఇంకోటి కావాలి. అని కోరుకుంటారు కానీ.. నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి.. అని ఎందుకు కోరుకోరు..?' అనిపించేది. మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినలద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి., వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి., కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్విప్పుడు మరచిపోయినట్లున్నావు దివాకర్., ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి..? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో..? దీనికి కారణం ఏమై ఉంటుంది..? నీ ప్రొమోషనా..? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా..? మీ అన్నయ్య కూడా నీలాగే "నేనూ, నా భార్యాపిల్లలూ" అని గిరిగీసుకుని ఉండుంటే మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."

దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.

ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఐదునిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు.

"నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోను చేసి చెప్పగానే, నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది. ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు. ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."

దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు.

రామకృష్ణ కారువరకూ వచ్చి "దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా... అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ, తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటంవల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు. నిన్ను నొప్పించి ఉంటే సారీ.. గుడ్ నైట్" అన్నాడు..

"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్..

    *          *          *          *

"రామకృష్ణా..

నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది.

శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు., ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు. ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు. క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడికుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పెద్దల మధ్య విభేదాలు, పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.,

అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీనుండి ఇంటికి వచ్చాడు. ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు. నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది. ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ.. ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు. పెద్దలమధ్య కూర్చుని, వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ, చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు. అందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు. మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఆయన చెప్పినట్లే చేశాం., తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు. వాళ్ళు ఏ పనిచెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు వివరంగా తెలియజేసి వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు. త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు. అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి. కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు. అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.

"తనొక్కడు చదివి బాగుపడితే చాలు" అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా చదువుకుని బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం., మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని, దగ్గరుండి మరీ జరిపించాడు అన్నయ్య.

మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదుగానీ, తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు. పెదనాన్నకు ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ, సోదరుల్నీ చూసి తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా..! అనుకునేవాడు. ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతోపాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు. ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు. నేను హర్ట్ అయి, ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను. అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే.. ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.

"ఎక్కడికి పోతున్నావ"ని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.,

"పరీక్ష ఏమైందని" అడిగాడు. చెప్పాను.

"ఫరవాలేదులే., ఫస్టియరే కదా., సంవత్సరం వృధాకాదు. ఈసారి ఇంకా బాగా చదివి రాయి" అన్నాడు. నాకు ఎంతో ఆశ్చర్యంవేసింది. చదువు ప్రాముఖ్యంగురించి అంతగా చెప్పే అన్నయ్య, నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు..

అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు "మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు. ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."

ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు. నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది.

తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లోనూ, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే.. నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో..? ఏమయ్యేవాడినో..? ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నానంటే, ఇది ఆయన పెట్టిన బిక్షే...!

అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా., మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే   స్థిరపడిపోయాడు. పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు. మా గురించి ఎలా పట్టించుకునేవాడో, తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు. మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది. ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లా ఉంటారు.

మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి, ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు., అరిచిపోయిన వాళ్ళున్నారు., కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే., అభిమానపు పలకరింపులే., సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు. కావలసిన పని చేసిపెడతారు.

అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - "ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు. కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ సోదరి నివేదిత /మదర్ థెరెసా కాగలరు. ఇందుకు మేధస్సు,ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టంపట్ల స్పందించే హృదయం ఉంటే చాలు..!".అని.  ఈ మాట అనడమే కాదు, ఆచరించి చూపించాడు కూడా., ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాడు.

మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు.. ఇవే జీవితం అనుకుంటాం., అన్నయ్యలాంటివాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా చాలా ఉందనిపిస్తుంది. ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను. అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే. ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు.

ఉంటాను.

నీ...దివాకర్.

ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటిచుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.

     *        *         *         *

ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.

"దివాకర్. మీ అన్నయ్య, వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు.." అని చెప్పాడు రామకృష్ణ.

"అలాగా.. నేను వచ్చి చూస్తాను. రామకృష్ణా..! నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకుప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ. ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో., ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో., మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"

"మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు. నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"

"తప్పకుండా. నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను.."

తర్వాత భార్యకు విషయంచెప్పి, వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.

హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి, గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

"మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ..!

నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి, చివరికి విజయం సాధించారు..!" జానకి శివరాంతో అంటూంది.

"ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు. అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తనవంతు సాయంచేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"

"కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది..?" "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది. నా భయం నీతో చెప్పుకోలేను., నువ్వే పేషంట్ వి కాబట్టి., ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు. వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటిదగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను. వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను. పాపం.. వాడు అప్పుడూ బిజీనే..!"

"అన్నయ్య బ్యాంకుకు వచ్చింది.. నన్ను డబ్బులు అడగటానికి కాదా..?" అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.

"కానీ, అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు..? మీరు దివాకర్ కు ఎంత చేశారు..? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు..? అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.

"తప్పు జానకీ., అలా అనకు..! నేను ఏదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు., ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే., పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా.. తరువాత ఆలోచిస్తే, పనిఒత్తిడివల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.

దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగునవెళ్ళి శివరాం చేతులు పట్టుకుని, ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ...!

రచయిత శ్రీచంద్రశేఖర్.

*(

Panchaag

 


అగ్ని సాక్షిగా

 


*అగ్ని సాక్షిగా వివాహం అనేది ఎందుకు ?*


అగ్నిసాక్షి గా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.


“సోమః ప్రధమో వివిధే, 

గంధర్వో వివిధ ఉత్తరః

తృతీయాగ్నిష్టే పతిః 

తురీయప్తే మనుష్యచౌః”


అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే, నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు.. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం.


అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు).. ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు.


గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు.


 “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు.!!


సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి - పాటించండి.

*శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం*_

 _*శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం*_ 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


 మనం_తెలిసి_తెలియక_ చేసే_పాపాలు_ఏవి ....! 


హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచి వారిని నిందించే వారు, ఋణ గ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు,ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి

చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ద్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ టంగుటూరి ప్రకాశం

 🌹🦜🙏🏽🦜🌹

    23.08.2024

      శుక్రవారం 


అంశం....శ్రీ  టంగుటూరి ప్రకాశం

 పంతులు గారి జయంతి సందర్భంగా...వారికి నివాళి..


 *తేటగీతి మాలిక....* 


టంగుటూరి ప్రకాశము డస్సిబోక

గాంధి, నెహ్రూల సరసన గదలుచుండి

దేశ స్వాతంత్య సమరాన యాశవిడక

పట్టు సడలని ధైర్యమున్ బగర జూపి

నిలచి, నిలబడి, యెదురొడ్డి, నిగ్గుదేల్చి 

పరుల పాలన దూర్పార బట్టు చుండి

భరత మాతకు బిఢ్ఢడై భాగ్యమొందె...


లోభి, తెల్లోడి తూటాకు రొమ్ము విరచి

యాంధ్ర రాష్ట్రము సాధించి యద్భుతముగ

ముఖ్యమంత్రిగ  పేర్గాంచి ముచ్చటగను 

గాడి దప్పక నేలిన ఘనులు వీరు....


నీతి, జాతికి నిలువెత్తు నిచ్చెనయిన 

జాతి రత్నము 'కేసరి' జనుల మదిని

దోచు కున్నట్టి గడుసరి, తురుపు ముక్క

యుద్ద రంగాన పోరాడు యోధుడయిన

అమరవీరుని స్మరియిస్తు నంజలిడుదు....

.......................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఒక్కరు చేయడం కన్నా

 *2048*

*కం*

ఒక్కరు చేయుట కన్నను

చక్కగ పలువురు నొకటగు సంఘాతమునన్

తక్కువ శ్రమనొంది పనిన

ఎక్కువ ఫలమొందగలరు నిజముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఒక్కరు చేయడం కన్నా ఎక్కువ మంది ఏకమై కలిసి మెలిసి పనిచేసినచో తక్కువ శ్రమతోనే  ఖచ్చితంగా ఎక్కువ ఫలితం పొందగలరు.

*సూక్తి*:-- ఐకమత్యమే మహా బలం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆంధ్రకేసరి

 >


ఆంధ్రకేసరి


టంగుటూరి


సీ. ”బారిష్టరు”జదివి,ప్రముఖులన్వోడించి, న్యాయవాదులలో,నజేయుడయ్యె. సాయమ్ముగానిల్చి,న్యాయమ్ములోగెల్చి, పేదలహృదయాల,వెలుగునింపె, సామ్రాజ్య సిద్ధికై స్వార్థమ్మువిడనాడి, ఆస్తులన్నింటి,దానమ్మివేసె స్వాతంత్ర్య సమరాన,సాహసమ్ములుజూపి, ”గుండు”కెదురుగ దా గుండెనిల్పె తే.గీ. పట్టుబట్టిన విడువని– గట్టివాడు, ఆంధ్రకేసరి”బిరుదుతో–నలరువాడు, పదవినైనను—తృణముగా వదలువాడు హంగులార్భాటములులేని”టంగుటూరి” 


సురభి శంకరశర్మ,

బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!

 బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!


అమ్మా! మన్నుదినంగ నేశిశువునో?

ఆకొంటినో?వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరిమాటలు మదినన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేన్

మదీయాస్య గం

ధ మ్మాఘ్రాణము సేసి నావచన ముల్ దప్పైన దండింపవే!!


ఆం:భాగవతము- పోతనమహాకవి: 10 స్కం: 337 ప:


       బాలకృష్ణుని చిలిపి చేష్ఠలకు చిత్రాయమానం బమ్మెఱ వారిభాగవతం!

              ప్రతిపద్యం ఒక రసగుళిక! మనంభౌతికదృష్టితోగాక ఆదిభౌతిక దృష్టితో పరిశీలిస్తే వాటి వెనుక నున్న అర్ధంపరమార్ధం మనకు బోధపడుతుంది.

       కావాలని కృష్ణయ్య బలరామాదులు వీక్షింపగా ఆటలాడుసందర్భంలో మృద్భక్షణ చేశాడు. తమ్ముడుఇలాచేశాడని తల్లితోఅన్న ఫిర్యాదు.(అదేకావాలి ఆనల్లనయ్యకు.) తల్లి మందలింపు .మనయింట్లో పాలు పెరుగు వెన్నలు లేవా?మన్నెందుకు తిన్నావురా?అనియశోద మందలిస్తే 


"నంగనాచి, బుంగమూతిపెట్టి,ఏవిటమ్మా! నువ్వూనమ్ముతున్నావా వీరిమాటలు? ఉత్త అబధ్ధాలమ్మా! ఆవంకతో నీవునన్నుకొడితే చూచి నవ్వటానికి యీయెత్తులన్నీ.మన్నుతినటానికి నేనేమైనా వెర్రివాడనా?ఆకలిగొనియున్నానా? ఇన్నిమాటలెందుకమ్మా !ఇదిగోనా దగ్గరకురా! నానోరు వాసనజూచిచెప్పవమ్మా! మన్నుతిన్నానో లేదో?అంటున్నాడు."

ఆవెర్రిబాగులతల్లి ,అందుకుపక్రమించింది.ఇంకేముంది? సకలప్రపంచం ఆయన ఉదరంలోనే దర్శనమిచ్చింది.(ఇది తొలి విశ్వరూప ప్రదర్శనం)

యశోదకు కళ్ళుతిరిగిపోయాయి.ఒకపక్కనుండి కృష్ణుడంటే భయం పట్టుకుంది. 

              "ఏమిటిది?కలగన్నానా?లేక యదార్ధమా?వీడు నాకొడుకేనా?లేక వైష్ణవ మాయయా?"-అనితబ్బిబ్బయింది.

అంతలోకృష్ణుడు అమాయకంగా మొగంబెట్టి పొట్టచూపిస్తూ అమ్మా!ఆకలిగా ఉందే!ఏదైనాపెట్టవే! అన్నాడు.అంతే ఆవెర్రిబాగులతల్లి అన్నీమరచిపోయింది.పుత్రవ్యామోహం మనస్సు నాక్రమింపగా,కృష్ణుని చంకకెత్తుకొని వంటయింటి వైపుపరుగెత్తింది.

          ఇదీ బాలగోపాలబాలుని అమాయకత్వంలోని మాయకత్వం!

                                 స్వస్తి!

మానవజీవనసాఫల్యతకు

 శు భో ద యం🙏🙏


ఈత్రయం బహు పుణ్య లబ్ధమే!


"జనకుని పూజలంగడుబ్రసన్నుని జేయునతండుపుత్రుఁ,డే

వనితమెలంగు భర్తృవశ వర్తినియైయది సత్కళత్ర, మే

జనుడు విపత్తిసౌఖ్య సదృశ క్రియుడాతడుమిత్రు,డీ

త్రయం

బును జగతిం లభించు నతిపుణ్యముజేసిన యట్టివారికిన్,

     భర్తృహరి సుభాషితములు.

    భావం:తండ్రిని పూజించే కుమారుడు,చెప్పినమాటవినేభార్య, కష్టసుఖాలలో అండగా ఉండే మిత్రుడు,అనే ముగ్గురూ ఎంతోపుణ్యంచేసికున్నవారికే లభిస్తారు. అని భావం.

విశేషాంశములు:

తలిదండ్రులయెడ విధేయుడై యుండుటయే కొమారునికర్తవ్యము.అదేవారికి కొమరుడుజేసే పూజ!

  భర్తకు విధేయురాలై చెప్పినట్లు నడచుకొనుట భార్యకర్తవ్యము.అట్టివనితయే భార్యారత్నమగును.

     కష్టసుఖములలో మిత్రుని వెన్నంటి యుండుట మిత్రధర్మము.దానిని పాటించువారు అరుదు.

    ఈమువ్వురు మానవజీవనసాఫల్యతకు మూలము.వీరులభించుటయనునది .మన పూర్వజన్మ పుణ్యమే!!!👏🙏

కొంచె బరువుగా

 పెళ్లిపైన తండ్రి తనయ సంభాషణ:-


తనయ: నాన్న పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందని ,ఆంక్షలు ఎక్కువవుతాయని  అంటారు నిజామా?


తండ్రి: చిన్నప్పుడు గజ్జెలు గజ్జెలు కావాలని తెగ మారం చేశావు, చాలా షాపులు తిరిగి నీవు ఇష్ట పడ్డ గజ్జెలే కొన్నాను.  

అవి బాగా బరువుగా  గట్టిగా ఉన్నాయి కానీ అవే కావాలన్నావు.  సరే ఇంటికొచ్చి 

అవి కట్టుకుని అటు ఇటు పరుగెత్తుతున్నావు.  అది చూసి ఏమ్మా నొప్పిగా ఉన్నాయా అని ఊరికినే అడిగాను.  అప్పుడు ముద్దుగా ఒక మాటన్నావురా 

అవి బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ నడుస్తున్నప్పుడు ఘల్లు ఘల్లు మనే శబ్దం బేక్ బాగుంది తెయ్యొద్దు నాన్న అన్నావు.  పెళ్లి  కూడా అంతేరా.  కొంచె బరువుగా , కొంచెం భయంగా ఉంటుంది, 

కొంచెం మొహమాటంగా, కొంచెం బాధగా కూడా ఉంటుంది.  దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు .  కానీ కూతురంటే తప్పదుగా..

దేవాలయాలు - పూజలు 19*

 *దేవాలయాలు - పూజలు 19*


సభ్యులకు నమస్కారములు.


*సంప్రదాయములు*

4) *మధ్వ సంప్రదాయము* దక్షిణ భారత దేశంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఇచ్చిన, ప్రవేశ పెట్టిన భక్తి మార్గం మరియు గురువులు (పీఠాధిపతులు) వారి ప్రబోధనల ద్వారా మధ్వ సంప్రదాయం లేదా సద్వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగినది అని తెలుస్తున్నది. వీరు *ద్వైత*  సిద్ధాంతాన్ని విశ్వసించి పాటిస్తారు.

5) *శైవ సిద్ధాంతం* శైవత్వం లేదా శివ తత్వం అనేది లింగ పూజల పట్ల పరమేశ్వరుని పట్ల నమ్మకం ఉన్న వ్యవస్థ. ఇక్కడ సర్వ సర్వ శ్రేష్టమైన, ముఖ్యమైన పరమైన భగవంతుడు శివుడు. 

వీరు విశ్వసించేది 

శ్రీమద్భగవత్ శంకరాచార్యులు గారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని *అద్వైతం* .

శైవము  పలు ఉపశాఖలతో కూడి ఉన్నది. అందులో కొన్ని రుద్ర శైవము, వీర శైవము, పరమ శైవము ఇత్యాది. 


పూజా సంప్రదాయాల గురించి గతంలో సంగ్రహంగా తెలుసుకున్నాముకదా,  ఇప్పుడు ఆగమాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాము.  *భగవంతుని  చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు*. భగవంతుని ఏలా  ప్రతిష్టించాలి, ఏలా అర్చించాలి, మరియు సంవత్సరము/ప్రతి సంవత్సరము జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ మార్గమును ప్రబోధిస్తాయి ఆగమాలు. ఉత్సవం నిర్వహించే ఉదాత్తులకు ఏలాంటి లక్షణాలు, అర్హతలు ఉండాలి అనే వివరాలను ఆగమ శాస్త్రం తెలియజేస్తున్నది. వైష్ణవ ఆగమాలు రెండు విధములు. 

1) వైఖానస ఆగమము

 2) పాంచ రాత్ర ఆగమము.


1) *వైఖానస  ఆగమము* వైఖానస ఋషికి శ్రీ మహా విష్ణువు ద్వారా తెలియజేయబడినది. 

శ్రీవైష్ణవం, శైవం, మధ్వం లాగానే వైఖానసం కూడా ప్రాచీన హిందు సంప్రదాయం.


 ఈ సంప్రదాయాన్ని పాటించే వారు ముఖ్యంగా *కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖను, వైఖానస కల్ప సూత్రాన్ని* పాటించే బ్రాహ్మణులు.  వీరు వాస్తవానికి *ఏకేశ్వర* భావాన్ని నమ్ముతారు. 

కాని, కొన్ని అలవాట్లు *బహు దేవతారాధనను* తలపిస్తాయి.  ఇతర వైష్ణవ వర్గాలలో ఉన్నట్లు *ఉత్తర మీమాంస* ను నమ్మకుండా, కేవలం పూజా పునస్కారాల పైననే వైఖానసం అమలు జరుగుతుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన *వైఖానస భగవత్ శాస్త్రమే*  ప్రామాణము. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య పూజలకు వైఖానస ఆగమమే ప్రధానము. 

2) *పాంచరాత్ర ఆగమము* పాంచ అంటే అయిదు, రాత్ర  అర్థము రోజులు. భగవంతుడు అయిదు రోజుల పాటు నాగరాజు అయిన  అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేన మూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి.


*బ్రహ్మాదీనాం గురుం పూర్వం* 

*ఇందిరా గృహమేదినం*,

*పాంచరాత్ర ప్రవక్తారం* 

*వందేనారాయణంప్రభుం* ||


*విష్వక్సేనం తదాతార్క్ష్యం*

*భరద్వాజం కపింజలం*

*వశిష్ఠాది మునింవందే*

 *పాంచరాత్ర ప్రవర్తకాన్*||

 కావుననే దీనికి 

*పాంచరాత్ర ఆగమమని* పేరు. 

ఈ  భక్తి పూర్వకంగా చేసే పూజా విధానము వలన మనుష్యుల అజ్ఞానము తొలగి జ్ఞానము, వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ విశ్వంలో ప్రతి జ్ఞాని పునరావృత్తి  రహిత వైకుంఠము చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు 

పాంచరాత్రము దోహద పడుతుంది.  ఆగమంలో భగవంతుని సేవించేందుకు *దివ్యము, అర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి*. 


శ్రీ పద్మ సంహిత, శ్రీప్రశ్న సంహిత  శ్రీ మన్నారాయణ సంహిత మొదలైన శాస్త్రాలలో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక మరియు కామ్యోత్సవాలను జరుపుతున్నారు.


నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజాదికాలు నిర్వహింపబడుతున్నాయి. కాని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం అనూచానంగా *వైఖానస* ఆగమానుసారమే పూజలు జరుగుతున్నాయి.  


ధన్యవాదములు.

*(సశేషం)*

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి

 *జై శ్రీమన్నారాయణ* 

23.08.2024,శుక్రవారం



*ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, "ఆంధ్ర కేసరి" శ్రీ.టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి నేడు..*


టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.


టంగుటూరి ప్రకాశం’ పంతులు సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు. మనిషి కృషి పట్టుదల ఉంటె ఎన్నికష్టనష్టాలు వచ్చినా జీవితంలో పైకి ఎదగవచ్చనునని నేటి తరానికి తెలిపిన స్ఫూర్తి ప్రధాత. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని.. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు.. టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు. ఆయన జీవితం పూలపాన్పు కాదు.. బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రకాశం పంతులు జీవితంలోని ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలున్నాయి.


తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాఋ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు వారి కోసం హైకోర్టు స్థాపించారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించారు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపారు. బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజ్ రిపేర్ చేయడానికి ఇవ్వమని స్పష్టం చేస్తే.. రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ ను బాగుచేయించి నిలబెట్టారు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దారు. అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.


అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్యాన్ని అనుభవించారు. ప్రకాశం పంతులు తన పుట్టిన రోజున తనను శాలువతో సత్కరిస్తే ‘ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!’ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు.

ఆగష్టు, 23, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      🌹 *శుక్రవారం*🌹

🪷 *ఆగష్టు, 23, 2024*🪷

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి  : చవితి* ఉ 10.38 వరకు ఉపరి *పంచమి*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 07.54 వరకు ఉపరి *అశ్విని*


*యోగం  : శూల* ఉ 09.31 వరకు ఉపరి *గండ*

*కరణం  : బాలువ* ఉ 10.38 *కౌలువ* రా 09.12 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 08.00  సా 04.00 - 06.00*

అమృత కాలం  :*సా 05.43 - 07.10*

అభిజిత్ కాలం  : *ఉ 11.45 - 12.35*


*వర్జ్యం        : ఉ 09.00 - 10.27*

*దుర్ముహుర్తం   : ఉ 08.24 - 09.14 మ 12.35 - 01.25*

*రాహు కాలం : ఉ 10.36 - 12.10*

గుళిక కాలం     :*ఉ 07.27 - 09.01*

యమ గండం   : *మ 03.18 - 04.53*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *మీనం/మేషం

సూర్యోదయం ;*ఉ 05.53*

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల  :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం  :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం   :*08.24 - 10.54*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.25*

అపరాహ్న కాలం :*మ 01.25 - 03.56*

*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ పంచమి*

సాయంకాలం :  *సా 03.56 - 06.27*

ప్రదోష కాలం  :  *సా 06.27 - 08.44*

నిశీధి కాలం     :*రా 11.47 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.07*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹 *మహా లక్ష్మ్యష్టకం* 🌹

           *ఇంద్ర ఉవాచ*

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

ఆరాటపడితే

 🙏🕉️ శ్రీ మాత్రే నమః శుభోదయం🕉️🙏.     🔥 *జీవితంలో ఆరాటపడితే సరిపోదు..పోరాడితేనే కోరుకున్నది దక్కుతుంది..ఆరాటంలో ఆశ మాత్రమే ఉంటుంది..కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది..ప్రయత్నం ఎప్పటికీ ఓడిపోదు* 🔥మనము ఎల్లప్పుడూ సమస్యలలో భాగస్వాములు కాకుండా పరిష్కారంలో భాగస్వాములు అయ్యే విధంగా మనల్ని మనము తయారు చేసుకోవాలి🔥ఒక చెట్టు నుండి వచ్చే పళ్లు కూడా ఒక విధంగా ఉండవు..కాబట్టి మనలని ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదు..అది మన అంతర్గత శాంతిని నాశనం చేస్తుంది🔥బతకడం తెలిసిన వాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు..బతకడం చేతకాని వాడే పక్కనోడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు..ఎప్పుడైతే మనం ఎమోషనల్ ఫీల్ అవుతామో ఎప్పుడు మనల్ని ఎదుటి వారు వాడుకోవడం, ఆడుకోవడం, శాషించడం చేస్తారు🔥బతుకు మీద బాధ్యత లేనివారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు ! నిన్ను సానబెట్టేందుకే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం..తట్టుకుంటే రత్నమై వెలుగుతావు..తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు🔥🔥🔥మీ  అల్లం రాజు భాస్కర రావు  శ్రీ విజయ ఆయుర్వేదిక్ శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజెన్సీస్ గోకవరం బస్టాండు దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి 9440893593 9182075510 వైద్య సలహాలు ఉచితం🙏🙏🙏🙏

అశోక చక్రవర్తి

 మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??


ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 


# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 


# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 


లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 


ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 

తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??


# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 


*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 

చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 

అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 


ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏

 

# *కొందరు పంపరు*... 

అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻


*వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊

*ధర్మ నిష్ఠ

 


                    *ధర్మ నిష్ఠ* 

                  ➖➖➖✍️

```

రాముడు, "తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది?


రావణాసురుడు ఘోర తపస్సు చేసి, అనేక శక్తులను,వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే.


కానీ! రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?


కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన, జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు.


మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.


నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం."


ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి.


’ధర్మాన్ని రక్షిస్తే .. అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.


ఇందులోని విచిత్రమేమిటంటే, ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు.


శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.


తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించలేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు.


పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జనరక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.


అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.```


*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః॥*```

 

అని ఉపనిషద్వాక్యం.


ఋజు వర్తనము, సత్య వాక్పరిపాలనము, వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.


దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు. మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.


కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.


అది అందరికీ ఆచరణ యోగ్యమైనది కాదు. కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు!”


ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పొందాలంటే

 


*ఏదైనా పొందాలంటే....*

                *....ఇవ్వడం నేర్చుకోవాలి!*

                   ➖➖➖✍️


```

     ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ దారి తప్పిపోయాడు. 


అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.


నడుస్తున్నాడు. కానీ నీరు ఎక్కడా కనబడటం లేదు.


తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. 


'ఈ రాత్రి గడవదు, రేపు ఉదయం చూడను.' అని అనుకుంటున్న దశలో

ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడిపోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. 


దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేనేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో!


చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. శక్తిని కూడదీసు కున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు.


గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.


దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చి నట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. 

నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. 


అయినా ప్రయోజనం లేదు!


నిరాశ నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి. 


అపుడు ఓమూలన సీసా కన్పించింది. 

దానిలో నీరు ఉంది. కానీ మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు.

   

దానికి ఒకకాగితంక ట్టి ఉంది! కాగితం

మీద ఇలా వ్రాసి ఉంది.``` 

*'ఈ బాటిల్లోని నీరు బోరింగ్ పంపులో పోయండి... పంపు కొట్టండి... నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి!'*```


అతడికి సందేహం కలిగింది.. 'ఈనీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా?'


'ఎంత కొట్టినా రాని నీరు, ఈబాటిల్లోని నీరు పోస్తే వస్తుందా?'


 'ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను?'


'చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం... ఇంకో రెండ్రోజులు బతకొచ్చు. అందులో పోసేస్తే మరణం ఖాయం!


ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. 


ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు.


బోరింగ్ పంపు కొట్టడం మొదలు పెట్టాడు.```


 *ఆశ్చర్యం!!!!!*```


పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది!

నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. 


తనుతెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. 


గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. 

తను ఎటువెళ్లాలోచూసి బయల్దేరాడు. 

       ***************


ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి!


ఇవ్వడంవల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి!


ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి.


కృషి చెయ్యకుండా ఫలితం ఆశించ కూడదు !


చావు బతుకుల మధ్య 

ఇక్కడ తర్కం చూడండి:


ఎంత కొట్టినా పంపు నుండి రానినీరు కొద్ది నీరు పోస్తే ఎలా వస్తాయి?


రిస్క్ తీసుకోకుండా బాటిల్లోని నీళ్ళు తాగేస్తే-మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. 


తరువాతా...??


అసలు బాటిల్లో నీళ్ళు ఎలావచ్చాయి. 


తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు. 


వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు.


కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్!


గత్యంతరంలేని క్లిష్ట పరిస్థితుల్లో....

నమ్మకం ముఖ్యం! నమ్మడమే శ్రేయస్కరం!!```

                     

*”నీవు ఇవ్వకుండా…*

               *....దేనినీ పొందలేవు!*✍️️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సుభాషితమ్

 

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*𝕝𝕝 శార్దూలము𝕝𝕝* 


  *నీ రూపంబు దలంపగాఁ దుద మొద ల్నేఁగాననీవైనచో*

  *రారారమ్మనియంచుఁ జెప్పవు, వృథారంభంబు లింకేటిక్కిన్*

  *నీర్మమ్మంపుము పాలముఁపు మిఁక నిన్నేనమ్మినాడఁ జుమీ*

  *శ్రీ రామార్చిత పాదపద్మయుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 19*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ రూపము ఊహించవలెనన్న దాని అద్యంతములు నాకు తెలియవు.... నీవు నన్ను రమ్మని పిలవవు.... ఇంక ఏటికి ఈ పాట్లు? నీట ముంచినా, పాల ముంచినా నీదే భారమని నేను నమ్మితిని....* *శ్రీరామచంద్రుడు నమ్మిన నీ పాదయుగళమునే నేను కూడా నమ్మితి ప్రభో*.....


✍️💐🌹🌷🙏

పంచాంగం 23.08.2024

 ఈ రోజు పంచాంగం 23.08.2024 Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస కృష్ణ పక్ష చతుర్ధి తిధి భృగు వాసర: రేవతి నక్షత్రం శూల యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి పగలు 10:41 వరకు.

రేవతి రాత్రి 07:56 వరకు.


సూర్యోదయం : 06:04

సూర్యాస్తమయం : 06:33


వర్జ్యం : పగలు 09:02 నుండి 10:29 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:34 నుండి 09:24 వరకు తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి 01:33 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 05:45 నుండి రాత్రి 07:13 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

భార్యపోయినతరువాతభర్త

 భార్యపోయినతరువాతభర్త బ్రతికి ఉంటే భర్తజీవితంఎంతదుర్భారమోమీకుతెలియచేయాలని నాతపన


🌹 భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, 

ప్రస్తుతంమానవసంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో  మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు.

--

సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. 


తన కన్నా చిన్నదైన భార్య

చనిపోతుందనే సన్నద్ధత

పురుషుల్లో ఉండదట. 

భార్య చనిపోతే భర్త 

కుంగుబాటుకు గురవడానికి 

ఇది కూడా ఒక ప్రధాన 

కారణమ.

                                                                                                           --భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు., 

*ఆమె శాశ్వతంగాదూరమైతే*

*మాత్రం  తట్టుకొని బతికేంత*

*మానసిక బలంపురుషులకు ఉండదు.*

‘🌷ఆమె’ లేని మగాడిజీవితం, మోడువారిన చెట్టుతో సమానం !!'

అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు 

ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడులేక..,అందరితోకలవలేక..,మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు 

                                                                                                                                                                                  "నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., కట్టుకున్న భర్త జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు అని భార్య అనుకుతుంది 


‘🌷దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.

‘మొగుడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు. 

నాకు  అయన మీద 

చచ్చేంత ఇష్టంరా. 

ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది. 

చీకటంటే భయం. 

ఉరిమితే భయం. 

మెరుపంటే భయం. 

నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’


శ్రీరాముడుఓనవస ము లో వున్నప్పుడు రామనుడు సీతా దేవి ని అపహారణ జరిగిన తరువాత సీతా దేవి గురించి అప్పుడును 

మరల సీతా దేవిని అడివిలో లక్ష్మణ్ ని చేత దింపిన తరువాత రామునికి భార్య వియోగం ఏంత దుర్భరమొ అంతలా దుక్కించి హ సీతా హ సీతా అనుచు దుఃఖ సముద్రం లో మునిగి పోయి అన్న పానదులు లేకుండాపోయినాడు 


అంటే భార్యలేని జీవితం భర్తకు ఏంత కష్టతరమో రామాయణం నుండే తెలిసినద

                                                                                                                                       

                                                                                                                                                                                                                                                                                                                                సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.

భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్పఆమెకు 

దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 

కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 

చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

 భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికిబాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 


🌷భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.

స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది 

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే 

ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. 

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.

                                                                                                                                                                                                                        -🌷భావోద్వేగ బలం ఆమెదే !

_*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.*

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. 

అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

* స్త్రీ మగాడికి సర్వస్వం..!


యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత"


ప్రతి భర్తకు భార్యదేవతస్వరూపం.


అధి తెలుసుకుని భర్తలు తమ భార్య లను గౌరవం గా చూసుకుంటారాని


చూసుకోవాలని కోరుతూ 

మీ సిద్ధాంతి

అదృష్టవంతుడు

 అదృష్టవంతుడు 


ఎప్పుడు ఉషారుగా వుండే రామారావు ఎందుకో ఈ రోజు మూడీగా వున్నాడు.  ఎందుకా అని నేను వెళ్లి ఏమిటి రామారావు ఈ రోజు నీవు ఏదో కోల్పోయినట్లుగా ఏమిటి అట్లా వున్నావు అన్నాను.  ఏమి చెప్పమంటావురా సుబ్బారావు నా భార్య ఆగడాలు రోజురోజుకి ఎక్కువైతున్నాయి.  ఈ రోజు కొట్టినంత పనిచేసింది (నిజానికి కొట్టింది ఆలా చెపితే బాగుండదని) అందుకే దిగులుగా కూర్చున్నాను.  రోజు క్షణక్షణం ఆ ఈశ్వరుని వేడుకొంటున్నాను నా భార్యకు మంచి బుద్దిని ప్రసాదించమని.  కానీ నా కర్మ ఇలా  కాళింది. అదే మా యింటిప్రక్క వెంకటేశ్వర రావు భార్య ఆయనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళు తరచుగా సినిమాలకు షికార్లకు రయ్యి మని వెళుతుంటే నాకు కడుపులో దేవినట్లవుతుంది అదుష్టవంతుడు అంటే వాడురా అని అని కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.  నాకు ఒక నిమిషం మాటలు రాలేదు.  యెంత మంచివాడు రామారావు ఆఫీసులో ఎవరికి ఏ సమస్య వచ్చిన యిట్టె పరిష్కరించే రామారావేనా నేను చూస్తున్నది అని అనుకున్నాను. 


రామారావు కొంత తమాయించుకున్న తరువాత చూడు రామారావు నిజానికి అదృష్టవంతుడు మీ ఇంటిప్రక్క వెంకటేశ్వర రావు కాదు  నీవే. ఆ వెంకటేశ్వర రావే దురదృష్టవంతుడు. అని నేను అనేసరికి ఏరా నన్ను యెగతాళి చేస్తున్నావా అని నవ్వుతు నన్ను చిన్నగా కొట్టాడు. చూడు రామారావు నేను నీ నోటితోటె నీవు అదృష్టవంతుడివి అని చెప్పేస్తాను.  ఇప్పుడు చెప్పు ఇందాక నీవు నాతొ ఏమన్నావు అన్నాను.  ఏమన్నాను నా భార్య ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అన్నాను అని అన్నాడు.  ఆ తరువాత ఏమన్నావు చెప్పు అన్నాను.  ఏమన్నాను నేను ప్రతి క్షణం ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నాను.  అదే నేనంటున్నాను. నీకు ఈశ్వరుని అనుగ్రహం వున్నది కాబట్టే నీవు అనుక్షణం ఈశ్వరుణ్ణి తలుస్తున్నావు. అన్నాను. ఎన్నో జన్మలను ఎత్తినతరువాత మనకు భగవంతుడు ఇచ్చిన  అపూర్వ వరం లాంటిది  ఈ  మానవ జన్మ ఈ జన్మలోనే మనం భగవంతుడి సన్నిధానం అంటే మోక్షాన్ని పొందగలం.  భగవంతుడు సాధకునికి అనేక అవాంతరాలను కలుగ చేస్తాడు.  అటువంటి అవాంతరమే నీకు వున్న ఈ పరిస్థితి అని ఎందుకు అనుకోవు.  ఒక్కసారి బాహ్య ప్రపంచంచుడు ఎంతమంది ఎన్నిరకాలుగా కస్టాలు, బాధలు అనుభవిస్తున్నారో.  కొందరికి కళ్ళు లేక అంథులుగా వుంటున్నారు, కాళ్ళు లేక, చేతులు లేక అనేకవిధాల నివారణ కానీ, లేని వ్యాధులతో భాదపడుతున్నారు.  కొంతమందికి తినటానికి తిండి, కట్టుకోటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు లేక ప్లేటుపారాలమీద, పెద్ద పెద్ద నీళ్ల పైపులలోన, చెట్లకింద జీవనం గడుపుతున్నారు వారిని చూసావా.  ఒక్కసారి ఆలోచించు నీకు వున్న కష్టం వారిముందు ఏపాటిది.  నిజానికి నీ భార్య గయ్యాలే అవవచ్చు నీకు చక్కగా భోజనం వండి పెడుతున్నది, పిల్లలను చక్కగా చేసుకుంటున్నది. ఇంకా ఏమికావాలి.  మనం ఒక్క సత్యాన్ని ఎప్పుడు మారుస్తాం అదేమిటంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి మనస్తత్వాన్ని పోలిన మనిషి ఇంకొకడు ఉండదు.  కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులను బట్టి సర్దుకొని పోవటమే. ఏ మనిషి పరిస్థితులను అర్ధంచేసుకుని నడుచుకుంటాడో వాడికి ఎప్పుడు సంతోషమే ఉంటుంది.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్‌


మౌనేన కలహం నాస్తి, నాస్తి జగరతో భయమ్‌


కష్టపడే వారికి దారిద్ర్యం ఉండదు, జపం చేసే వారికి పాతకం ఉండదు అలాగే నిశబ్ధంగా ఉండేవారికి పోట్లాటలు వుండవు, జాగర్తగా వుండే వారికి భయం ఉండదు.  కాబట్టి మిత్రమా నీవు అనవసరమైన జగడాలకు వేళ్ళకు, సాధ్యమైనంత వరకు నిశబ్ధంగా వుండు.  కొన్ని మాటలు విన్న వినునట్లు వుండు మితంగా మాట్లాడు. తప్పకుండా నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు  సుబ్బారావు. దానితో రామారావుకు కొత్త శక్తి వచ్చినట్లైయిన్ది.  తన డ్రాలో వున్నా భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి నీకు ఏ సందేహం, అశాంతి, భయం కలిగిన గీత చదువు నీకు పూర్తి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంగా రామారావు ఇంటికి వెళ్ళాడు. ఆలా మూడు నాలుగు రోజులు గడిచాయి.  ఎవరి పనులల్లో వాళ్ళు వున్నారు.  సుబ్బారావు రామారావుతో క్యాజువల్గా గడిపాడు.  నాలుగవ రోజు సుబ్బారావు ప్రొద్దున్నే ఆఫీసుకు వచ్చి ఫైళ్లు   వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నారు. " కృష్ణ భగవానునికి వందనం"  ఈ మాటలు ఎవరు అంటున్నారు అని వెనుకకు తిరిగి చూసాడు వెనుక రామారావు చెందుతులుజోడించి నిలుచున్నాడు.  సుబ్బారావు నిజంగా నాకు పునర్జన్మని ఇచ్చావు నేను ఆత్మహత్య చేసుకోవాలని  అనుకున్నాను. నీ మాటల ప్రభావం వలన గీతాపారాయణ వలన నేను ఏమిటి నాకర్తవ్యం ఏమిటన్నది నాకు తెలిసింది.  ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా వున్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు నీవు అదృష్టవంతుడవా కాదా అని సుబ్బారావు అడిగాడు.  అవును నిజంగా అదృష్టవంతుడినే అని రామారావు  అన్నాడు . ఆత్మహత్య ప్రయత్నం చేసే ప్రతి మానసిక బలహీనునికి నీలాంటి మిత్రుడు వుంది గీత  చదవమని ప్రబోధిస్తే ప్రతివాని జీవితం  వెలుగుని చూస్తుంది. అని సంతోషంగా అన్నాడు. 

ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా వుండవు   అట్లా అని ఎప్పుడు ప్రతికూలంగాను వుండవు. స్థితప్రజ్ఞుడు కష్టాలలోను సుఖాలలోను తొణకక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కానీ ఇది చెప్పినంత సులభం  కాదు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిత్యం సాధన చేస్తే  ఏదైనా సాధించవచ్చు.


 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు


 తినగ తినగ వేము తియ్యగుండు


 సాధనమున పనులు సమకూరు ధరలోన


 విశ్వధాభిరామ వినుర వేమ


కాబట్టి మిత్రమా పరిస్థితులను బట్టి మన ప్రవర్తన మార్చుకుంటే మంచిది. సత్వగుణ సంపత్తి సదా ఉత్తమం.


ఇటీవల ఒక వేదపండితుడు తన భార్య, అత్తగార్లు పెట్టిన  వేదనలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నంచేయగా తీవ్ర అనారోగ్యగ్రస్తుడు అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని పెట్టిన పోస్టుకు భాదతో స్పందించి వ్రాసిన కధనం ఇది. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

సంబంధం

 సంబంధం 


ప్రతి మనిషికి ఇంకొక మనిషితో ఏదో ఒక సంబంధం ఉంటుంది. కానీ కొన్ని సంబంధాలను మనం గుర్తిస్తాము కొన్ని గుర్తించం. తల్లిదండ్రుల సంబంధం ప్రతి మనిషికి ఉండే మొదటి సంబంధం ఇది మా అమ్మ మా నాయనగారు అని ఏర్పడ్డ సంబంధం ఈ సంబంధాలు రక్త సంబంధాలుగా పేర్కొంటారు ఎందుకంటె తల్లిదండ్రుల్లో ప్రవహించే రక్తమే పిల్లల్లాలో కూడా ఉంటుందని భావన తరువాత రక్తసంబందాలు తోబుట్టువులు. మిగిలిన వారిని చుట్టరిక సంబంధాలుగా తెలుసుకోవచ్చు. ఒక్క విషయాన్ని మనం చుస్తే ఇక్కడ మనకు వున్న బంధుత్వాలు అన్నీకూడా వివాహ సంబంధాలే యెట్లా అంటే తల్లి దండ్రులు వివాహం చేసుకోవటం వలన పిల్లలు కలిగారు అలాగే వేరే ఎవరితో ఏర్పరచుకున్న బంధుత్వం కూడా ఎవరో ఒకరితో ఏర్పడిన వివాహసంబంధం మాత్రమే కానీ మరొకటికాదు. 


మనిషి తాను వివాహంతో ఏర్పరచుకున్న లేక ఏర్పడ్డ సంబంధాలే శాశ్వితం అని వాటివెంటే ప్రాకులాడుతూ ఉంటాడు. నీకు నీ భార్యకు మీ వివాహం వలన సంబంధం ఏర్పడింది కాబాట్టి ఆమె నీ ఇంట్లో పూర్తి హక్కులతో ఉంటుంది. నీ ఇంటికి నీ పొరుగింటి ఆమె వస్తేకొద్దిసేపు ఉండి తాను వచ్చిన పని చూసుకొని వెళుతుంది. కానీ ఆమెకు నీ ఇంటిమీద కానీ నీ మీద కానీ ఎలాంటి హక్కు ఉండదు. కాకుండా ఆమె నీ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగి నీతోకూడ స్వేచ్ఛగా మాట్లాడి ఉంటే వెంటనే నీకు ఆమెకు సంబంధం కలుపుతుంది ఈ సమాజం. దానిని వక్రంగా చూస్తుంది. ఏతావాతా తేలేది ఏమిటంటే మన సమాజం పూర్తిగా వివాహవ్యవస్త మీదనే ఆధార పడివుంది. 


సమాజంలో వివాహంతో ఏర్పడిన సంబంధాలు కాకుండా ఇతరత్రా వున్న సంబంధాలు మనం అంతబలమైనవిగా చూడము. ఉదాహరణకు స్నేహ సంబంధం, యజమాని సేవకుని సంబంధం, ఇరుగుపొరుగు వాళ్ళతో వుండే సంబంధం. నీవు రైలులోనో బస్సులోనో ప్రయాణిస్తున్నావనుకో నీ తోటి ప్రయాణికునికి నీకు వున్న సంబంధం. ఇలాంటి అనేక సంబంధాలు మనకు రోజు తారసపడుతుంట్టాయి. కానీ దేనిని మనం అంతగా ప్రముఖంగా తీసుకోము. 


మానవుడు సంఘజీవి అయినప్పటికీ కేవలం తానుతన భార్యా పిల్లలు అనేవరకు మాత్రమే స్వార్ధంగా జీవనాన్ని గడుపుతూ ఆ సంబందాలనే శాశ్వితం అనుకోని జీవిస్తుంటాడు. 


నిజానికి ఒక ముముక్షువు అయిన సాధకుడు ఈ శరీరంతో వున్న సంబంధాలు అన్ని ఈ శరీరం వున్నంతవరకు మాత్రమే ఉంటాయి కానీ యదార్ధమైనది కేవలం భగవంతునితో వున్న సంబంధం మాత్రమే. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకొని సాధకుడు నిత్యం భగవంతునితో మాత్రమే సంబంధం పెట్టుకుంటాడు. ఇది భార్గవ శర్మ చెప్పేది కాదు అనాదిగా మన మహర్షులు అనేక వేలయేళ్లు తపస్సు చేసి తెలుసుకున్న సత్యం.  


కాబట్టి సాధక ఇంక నిద్రనుండి లేచి సాధనకు ఉపక్రమించి మోక్షాన్ని సిద్దించుకో 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ భార్గవ శర్మ

సాధకుడు - సద్గురువు

 సాధకుడు - సద్గురువు 


ప్రతి సాధకుని మదిలో తొలిచేది ఏమిటంటే నాకు సద్గురువు దొరుకుతారా? ఆయనను నేను ఎలా తెలుసుకోవాలి? అన్నది ఒక ప్రశ్న ఎంతో మంది ముముక్షువులు తనను తరింపచేసే సద్గురువు కోసం వెతుకులాట చేస్తుంటారు. ముందుగా అసలు సాధకుడు ఎవరో తెలుసుకుందాము.  


సాధకుడంటే ఈ ద్వైత ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఇక్కడ ప్రతిదీ రెండుగా వున్నది మరి దీనికి కారకుడు ఎవరు? నేను ఆ కారకుడిని తెలుసుకోవటం ఎలా అని పరితపించే ముముక్షువే సాధకుడు.  సాధకుడు తాను చూస్తున్నది ప్రతిదీ నశించేదని గ్రహించి ఇక్కడ నశించనిది, శాశ్వతమైనది ఏది అని వెతకటం మొదలిడతాడు.  అతడు మరణాన్ని జయించటం ఎలా అని ఆలోచిస్తాడు. 


గురువు: గురువు అనగా అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞనాన్ని ప్రసాదించే వాడే గురువు.  అజ్ఞానం చీకటిగా భావిస్తే జ్ఞానప్రకాశాన్ని నిలిపే వాడే గురువు.  మనకు అనేక విషయాలను తెలియచేసే గురువులు వున్నారు.  కానీ బ్రహ్మ జ్ఞనాన్నికలిగించవారే గురువే సద్గురువు.. జ్ఞానం అంటే మనకు తెలియనిది తెలుసుకోవటం.  బ్రహ్మజ్ఞానం అంటే అన్నిటి కన్నా ఉత్తమమైన జ్ఞానం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవలసిన పనిలేదో అదే బ్రహ్మ జ్ఞానం.  అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే గురువే సద్గురువు. 


సద్గురువు లక్షణాలు: ఏ మహానుభావుడు అయితే ఈ భవసాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలనుకుంటాడో ఆయనే బ్రహ్మజ్ఞాని అటువంటి జ్ఞానియే సద్గురువు . ముందుగా మనం పరిశీలిస్తే ఆ మహానుభావుడు అరిషడ్వార్గాన్ని జయించిన వాడైవుంటాడు. అనగా  కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు ఆయన వాటినుండి విముక్తి పొందినవాడై ఉంటాడు. అంటే 


1) కామం: ఆయనకు ఈ ప్రపంచంలో వేటి మీద కోరిక కలిగి ఉండడు ఏది అతనికి కావాలని ఉండదు అది స్త్రీ కానీ, ధన, వస్తు, వాహన కనకాలైన కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహానుభావునికి తనదనేది ఏది ఉండదు, సమాజ అర్ధంలో చెప్పాలంటే పూర్తి దారిద్యపు జీవనం గడుపుతుంటాడు. నిరాడంబరగా ఉంటాడు.,


2) క్రోధం: క్రోధం అంటే కోపం ఆయన ఎల్లప్పుడూ కోపానికి లోనుకాకుండా సదా శాంత స్వభావంగా ఉంటాడు, మిత బాషి.


3) మోహం: మొహం అంటే విషయ వాంఛలు నాకు ఇదికావాలి అది కావాలనే కోరిక అది అతనికి ఉండదు. 


4) లోభం: లోభం అంటే మన వాడుక భాషలో పిసినారితనం. అనగా తనదైన దానిని వదులుకోవటానికి ఇష్టపడని తత్త్వం.  ఆయనకు ఏమి ఉండదు కాబట్టి ఇక వదులుకోవడం అనేదే  ఆయనకు ఉండదు.


5) మదం: మదం అనేది నా అంతవాడు లేడనే గర్వము, నేను గొప్పవాడిని అనే  భావం. ఆయనకు అవి వుండవు. 


6) మాత్సర్యం :మాత్సర్యం అనగా తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం.  అది అతని మనస్సులోకూడా రాదు.


బ్రహ్మ జ్ఞాని అయినవాడు పైన పేర్కొన్న ఆరు మానసిక స్థితులను అధిగమించి కేవలము సదా బ్రహ్మములోనే చరిస్తూ ఉండి తనను తాను ఉద్దరించుకుంటాడు. అటువంటి మహానుభావుడు మాత్రమే సద్గురువుగా పరిగణించబడతాడు.  ఇప్పుడు చెప్పండి మనకు ఇటువంటి గొప్పవారు తారసపడతారా ? 


నేటి గురువులు: ప్రస్తుతం సమాజంలో మనం అనేక మందిని వారికి వారే సద్గురువులం అని చెప్పుకునే వారిని చూస్తున్నాము. మిత్రమా ఒక్కసారి వారిలో పైన తెలిపిన లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించు.  ఒక్కటి అంటే ఒక్కటి కూడా వారిలో వుండవు. 


ఖరీదైన కాషాయ వస్త్రాలను ధరిస్తూ, ఖరీదయిన భవనాలలో నివసిస్తూ, విలువైన ఆసనాలఫై ఆసీనులు అవుతూ ప్రవచనాలు చేస్తున్నవారు మనకు కోకొల్లలుగా కనపడతారు.  మీకు కౌపీనం (గోచి) పెట్టుకున్న యోగి ఎక్కడైనా తారసపడ్డాడా? నేను చూడలేదు, మీరు చుస్తే తెలియచేయండి.


సాధకునికి గురువు ఆవశ్యకత: నేను కొన్ని ఉపమానాలతో సాధకునికి గురువు ఎంతవరకు అవసరమో తెలియచేయ ప్రయత్నిస్తాను. 


నీవు మీ ఊరుకు బస్సులో వెళ్లాలని అనుకొని దారి ఖర్చులకు తగు డబ్బులు సమకూర్చుకొని బస్స్టాండు చేరుకొని నీ బస్సు ఏదో తెలుసుకోలేక అక్కడ వున్న అక్కడి విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని నీ ఉరుకు వెళ్లే బస్సు యెక్కడ ఆగుతుంది అని అడిగితె అతను నీకు ఫలానా ప్లాటుఫారమ్ లో దొరుకుతుంది అని చెప్పాడనుకో, ఇప్పుడు ఆతను నీకు ఏవిధంగా సహకరించాడు? కేవలం నీకు ఒక మాట సహాయం చేసాడు, గురువు కూడా అంతే. 


నీవు కారులో ఒక వూరు వెళ్లదలిచావు కొంత దూరం వెళ్లిన తరువాత రెండు రోడ్లు చీలాయి అక్కడ ఒక మార్గనిర్దేశం అంటే సైను బోర్డు కనపడినది అందులో రెండు రోడ్లు ఏ ఏ ఊర్లకు వెళతాయో తెలియపరచి వుంది దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని  నిర్ధారించుకుంటావు. ఆ బోర్డు నీకు ఎలా ఉపయోగ పడింది? గురువు కూడా అలానే సహాయపడగలడు 


నీవు వెళ్లే మార్గంలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది దానిని దాటటం ఎలా అని నీవు అనుకుంటుంటే అక్కడ ఒక వ్యక్తి దూరంలో వున్న ఒక రాయిని చూపి అది ఆ కాలువలో వేసి దానిమీద కాలు పెట్టి బురద అంటకుండా దాటమని సలహా ఇచ్చాడు.  అలాగే నీవు ఆ కాలువను దాటావు .  ఇక్కడ మురికి కాలువ అనేది సంసారం అనేది. దానిని దాటాలి అని అనుకోవటం నీ ప్రయతనం. అక్కడ వేసిన రాయి నీవు చేయవలసిన సాధన ఆ రాయిని చూపినవాడు నీ గురువు. 


గురువు కేవలం నీవు ఎలా సాధన చేయాలో మార్గదర్శనం చేస్తాడు.  కానీ ప్రయత్నం, సాధన కృషి అన్నీ నీవే కలిగి ఉండాలి.  నీ ప్రయత్నం లేకుండా నీకు మోక్షం సిద్దించదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిమీద నివసించే ఎవ్వరు కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేరు.  కేవలం సద్గురువు నీకు పైన తెలిపినట్లు మార్గదర్శనం చేయగలరు. 


గురువును వదిలి వేయాలి: ఓ సాధక మిత్రమా నీకు గురుత్వం వహించిన గురువును కేవలం కొద్దికాలం మాత్రమే సంబంధం కలిగి తరువాత గురువుని వదిలి వేయాలి.  కేవలం సాధనతోటె మోక్షాన్ని పొందాలి.  అంటే నీకు గురువుతో ఇప్పుడు  పనిలేదు. ఎలాగైతే పై సందర్భంలో రాయిని చూపిన వాడిని, అలాగే రాయిని వదిలి నీ మార్గంలో వెళ్ళావో అదే విధంగా గురువు చూపిన సాధనను  వదలాలి. అంటే ఎప్పుడైతే నీవు సమాధి స్థితిని పొందుతావో అప్పుడు నీకు గురువు నేర్పిన ధ్యానంతో పనివుండదు. 


సమాజంలో ఈ రోజుల్లో అనేకమంది ధన సంపాదన అభిలాషులు నేనే గురువుని ఈ పద్ధతి నేనే కనుక్కున్నాను అని పేర్కొంటూ వారి శిష్యగణాలను వృద్ధి చేసుకుంటూ వారి వద్దనుండి ధనాన్ని  సేకరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు గురువులు తాము నేర్పిన విద్య (యోగ పద్దతి) వేరే ఎవ్వరికీ చెప్పరాదని ప్రమాణం చేయించుకొని వారి శిష్యుల వద్ద ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని వసులు చేస్తున్నారు. అమాయకులైన ఆ శిష్యులు వారి గురువు గారి గొప్పతనాన్ని వారు నేర్చుకున్న యోగాన్ని ప్రచారం చేస్తూ గురువుగారి వ్యాపారాభివృద్ధి చేస్తున్నారు.  భార్గవ శర్మ అలాంటి ఒక శిష్యుడిని తమరు నేర్చుకున్న యోగం ఏమిటని ప్రశ్నించాడు.  తాము సుదర్శన క్రియ అనే యోగసాధన గురువుగారి వద్దనుండి నేర్చుకున్నామని.  దానిని ఎవ్వరికీ చెప్పకూడదని ప్రమాణం చేశామని చెప్పి మీరు అందులో చేరండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.  మిత్రమా తెలిసిన విద్య పలువురికి చెప్పటానికి పనికిరానప్పుడు విద్య అభ్యసించటం ఎందుకు అంటే సమాధానం లేదు.   ఇక కొందరు వారి గురువు ఫోటోని పెన్నులకు పెట్టుకొని మెడలో వేసుకొని ప్రచారం చేస్తున్నారు.  అలాటి వారు తమ గురువుకి శిష్యులను చేర్చటమే తమ జీవిత పరమావధి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 


బ్రహ్మకుమారి యోగ సంఘంలో పరిచయం అయిన ఒక మిత్రుడు భార్గవ శర్మతో నా వద్ద అమ్మా భగవాన్ పాసు ఒకటి వున్నది నాకు వెళ్ళటం కుదరటం లేదు దాని ఖరీదు ఐదు వేలు నేను మీకు ఉచితంగా ఇస్తాను మీరు ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నారుకదా మీరు వెళ్ళండి అని అనటం జరిగింది.  దానికి ఆయన మిత్రమా భగవంతుడు నిరాకారుడు అతడు ఈ జగత్తుకి కారకుడు అటువంటి భగవంతుని మనం సాధన చేసి తెలుసుకోవాలి కానీ నేనే దేముడు అని ప్రగల్బాలు పలికే వారిచుట్టూ తిరిగితే ఏమి లాభం ఉండదు.  మీరు ఇచ్చే పాసుతో పాటు ఇంకొక ఐదు వేలు దారిఖర్చులకు ఇచ్చినా నేను వెళ్ళను.  మీరు కూడా అటువంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పాడు. అంతే కాకుండా సాధక మిత్రమా నీవే ఆలోచించు నీ గమ్యం మోక్షమా లేక గురువుల ప్రచారామా?  ఇలా తమ గురువులని ప్రచారం చేసే వారు సారా తాగుతున్నానని మెడలో కాళీ సీసాలు వేసుకొనే మూర్ఖులకన్నా అధములు. ఇటువంటి గురువులు మురికి కాలువ దాటించామని చెప్పుకొంటూ మురికి కాలువలో (సంసార బంధనాలలో) జలకాలాడుతూ నిన్నుకూడా ఆ మురికి కాలువలో నిర్బంధిస్తున్నట్లు తెలుసుకో. మిత్రమా నీ సాధన సిద్దించిన తరువాత నీ గురువుని విస్మరించి ముందుకు పో 


ఇటీవల ఒక మిత్రుడు తాను ఒక గురువును నమ్ముతున్నానని అయన చాలా మహిమాన్వితుడని అయన కొన్ని యోగ పద్ధతులు కనుకొన్నారని నాకు తెలిపితే అది విన్న తరువాత తట్టిన భావాలతో ఈ వ్యాసం. 


గమనిక: దయచేసి సాధక మిత్రులారా గమనించ గలరు, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ కృష్ణ భగవానులు పతంజలి మహర్షి, ఆది శంకరాచార్యులు ఇంకా ఉపనిషత్తులలో పేర్కొనిన మహర్షులు మనకు మార్గదర్శకులు.  వారు చెప్పిందే కొందరు తెలుసుకొని అది వారి ప్రతిభ అన్నట్లు చెపుతూ అమాయక సాధకులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు.  కాబట్టి మోసపోకండి.  మీకు నిజంగా మోక్ష ప్రాప్తి కావాలంటే నా దగ్గరకు (ఇక్కడ "నా" అంటే ఎవరి వద్దకు వారు అని అర్ధం) రండి మీకు తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది.


ఓం తత్సత్ 


ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


మీ భార్గవ శర్మ

భగవంతుడు కొడతాడు....*

 🦚💦🌻🌹💜🌈


 *🍁సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చెయ్యడానికి ప్రయత్నించండి.మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది.అదే నువ్వు వేరొకరికి చెడు చేయాలని చూస్తే పైన నిన్ను ఆ దేవుడు చూసుకుంటాడు ఏందుకంటె బలహీనుడ్ని బలవంతుడు కొడితే బలవంతుడ్ని ఆ భగవంతుడు కొడతాడు....* 


 *🌅 💥*


🦚🌻🌹💦💜🌈

ఒత్తిడి లేని జీవితాన్ని

 ♦️ ఇది రిటైర్మెంట్ తర్వాత సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం 36 సిఫార్సుల జాబితా. ఇది ప్రఖ్యాత కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ సర్క్యులేషన్.


1. ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి.

2. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయండి.

3. పీక్ అవర్స్ లో బయటకు వెళ్లడం మానుకోండి.

4. అధిక వ్యాయామం లేదా నడకను నివారించండి.

5. అధికంగా చదవడం, మొబైల్ ఉపయోగించడం లేదా టీవీ చూడటం మానుకోండి.

6. ఓవర్ మెడికేషన్ మానుకోండి.

7. సమయానికి వైద్యులను సందర్శించండి మరియు క్రమం తప్పకుండా మందులు తీసుకోండి.

8. పదవీ విరమణ తర్వాత ఆస్తి లావాదేవీలను నివారించండి.

9. ఎల్లప్పుడూ మీ ID మరియు ముఖ్యమైన ఫోన్ నంబర్‌లను తీసుకెళ్లండి.

10. గతాన్ని మర్చిపోండి మరియు భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించకండి.

11. మీకు సరిపోయేది తినండి మరియు నెమ్మదిగా నమలండి.

12. బాత్రూమ్ మరియు టాయిలెట్లో జాగ్రత్తగా ఉండండి.

13. ధూమపానం మరియు మద్యపానం మానుకోండి, అవి హానికరం.

14. మీ విజయాల గురించి గొప్పగా చెప్పుకోకండి.

15. పదవీ విరమణ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు విస్తృతంగా ప్రయాణించండి, ఆపై రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి.

16. మీ ఆస్తి మరియు ఆస్తుల గురించి ఇతరులతో చర్చించవద్దు.

17. మీ సామర్థ్యం మరియు ఆరోగ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయండి.

18. మీకు అధిక BP లేదా గుండె సమస్యలు ఉన్నట్లయితే హెడ్‌స్టాండ్‌లు మరియు కపాలభాటిని నివారించండి.

19. సానుకూలంగా ఉండండి మరియు అధిక భావోద్వేగాలకు దూరంగా ఉండండి.

20. తిన్న వెంటనే నిద్రపోకండి.

21. ఇతరులకు డబ్బు ఇవ్వవద్దు.

22. తదుపరి తరానికి అయాచిత సలహాలు ఇవ్వడం మానుకోండి.

23. ఇతరుల సమయాన్ని గౌరవించండి.

24. మీకు అవసరం లేకపోతే ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నించవద్దు.

25. రాత్రి బాగా నిద్రపోవడానికి పగటి నిద్రలకు దూరంగా ఉండండి.

26. మీ స్వంత స్థలాన్ని కలిగి ఉండండి మరియు ఇతరుల గోప్యతను గౌరవించండి.

27. వీలునామా చేసి, మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి.

28. మీ పదవీ విరమణ పొదుపులను తదుపరి తరానికి అందించడం మానుకోండి.

29. సీనియర్ సిటిజన్స్ గ్రూప్‌లో చేరండి, అయితే విభేదాలను నివారించండి.

30. మీరు నిద్రపోకపోతే ఇతరులను డిస్టర్బ్ చేయకండి.

31. చెట్ల నుండి పువ్వులు తీయవద్దు.

32. రాజకీయాలను చర్చించడం మానుకోండి లేదా భిన్నమైన అభిప్రాయాలను అంగీకరించండి.

33. మీ ఆరోగ్యం గురించి నిరంతరం ఫిర్యాదు చేయవద్దు.

34. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండండి, వారు మీ ప్రాథమిక మద్దతు.

35. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవ్వండి, కానీ గుడ్డి అనుచరులుగా మారకండి.

36. చిరునవ్వుతో ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి.


*****************************************