*2048*
*కం*
ఒక్కరు చేయుట కన్నను
చక్కగ పలువురు నొకటగు సంఘాతమునన్
తక్కువ శ్రమనొంది పనిన
ఎక్కువ ఫలమొందగలరు నిజముగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఒక్కరు చేయడం కన్నా ఎక్కువ మంది ఏకమై కలిసి మెలిసి పనిచేసినచో తక్కువ శ్రమతోనే ఖచ్చితంగా ఎక్కువ ఫలితం పొందగలరు.
*సూక్తి*:-- ఐకమత్యమే మహా బలం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి