విటమిన్లు మరియు అవి లభించే పదార్ధాలు - 2 .
* విటమిన్ B6 - పైరిడాక్సిన్ .
తవుడు , అరటి , బంగాళాదుంప , చేపలు , బటాణీ , చిక్కుడు గింజలు , గుడ్డులోని పచ్చసొన , కాలేయం , మాంసం మొదలైన వాటిలో సమృద్దిగా లభించును.
* బయోటిన్ -
కాలేయం , కిడ్నీ , సోయాచిక్కుడు , పాలు , గుడ్డు , చేపలు , పుట్టగొడుగులు మొదలైన ఆహారాల నుంచి బయోటిన్ లభ్యం అగును.
* విటమిన్ B12 -
వృక్ష సంబంధ ఆహారం ఏది మన శరీరంలో B12 విటమిన్ ఉత్పత్తి చేయలేదు . పాలు , మాంసం , గుడ్లు వంటి జంతు సంబంధ ఆహారం నుంచి మాత్రమే B12 ఉత్పత్తి అగును.
మేక మాంసం , గొర్రె మాంసం , మేక కాలేయం , గొర్రె కాలేయం , చేపలు , కోడిగుడ్డు , ఆవుపాలు , గేదె పాలు , మేకపాలు , తల్లిపాలు , పాలపొడి నుంచి మనకి B12 విటమిన్ లభ్యం అగును.
* ఫోలిక్ ఆమ్లం -
బియ్యం , బార్లీ , గోధుమలు , జొన్న , మొక్కజొన్న వంటి తృణధాన్యాలు , సోయాచిక్కుడు , బటాణీ , పప్పులలోను , బాదం , వేరుశెనగ , చిక్కుడు లాంటి గింజలలోను ఆకుకూరలలోను నిమ్మ , నారింజ , అరటిలాంటి పళ్ళలోనూ , పాలు , కాలేయం , గుడ్డు లాంటి ఆహారాలలో ఫోలిక్ అమ్లం లభ్యం అగును.
* విటమిన్ C -
నారింజ , నిమ్మ , టమాటో , ఉసిరి , జామ , బొప్పాయి , మామిడి వంటి పళ్లలో , క్యాబేజి , కొత్తిమీర , ముల్లంగి ఆకు , బచ్చలి , చుక్కకూర వంటి ఆకుకూరలలో , మునగ , కాకర , బీట్రూట్ , గోరుచిక్కుడు , తోలు వలవని బంగాళా దుంపలలో ఈ C విటమిన్ పుష్కలంగా లభ్యం అగును.
* విటమిన్ E -
మొలకెత్తే గోధుమలు , వరిధాన్యం , శెనగలు , ఆకుకూరలు , మాంసం , గుడ్లలో విటమిన్ E లభ్యం అగును.
* విటమిన్ - K .
ఆకుకూరలు , కాలేయం , పప్పులు , తృణధాన్యాలు , కాయగూరలు , ఆవుపాలు , తల్లిపాలలో విటమిన్ K లభ్యం అగును. క్యాబేజి , క్యాలీఫ్లవర్ , పంది కాలేయంలో లభ్యం అగును.
* విటమిన్ - D .
సూర్యరశ్మి చర్మానికి సోకడం , కాడ్ లివర్ ఆయిల్ , చేప కొవ్వు , చికెన్ , గుడ్డులోని పచ్చసొన , వెన్న , నెయ్యి , కొవ్వు తియ్యని పాలు , పాలపొడి నుంచి విటమిన్ లభ్యం అగును .
సమాప్తం
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034