20, జూన్ 2021, ఆదివారం

చక్రమునకు

 మానవ దేహంలో నాడులు 72000 యని దీనికి శ్రీ చక్రమునకు పోలిక. 8 కోణములు, 8 దళములు, 8 మూర్తుల కలయిక గాయత్రీ/ లలితా రెండును వకే రూపం. యిది నవావరణ  యని కూడా కలదు. 8 కోణములుగల చక్రమునకు బిందువుతో గూడి నవావరణ. 1.బిందువు, 2.అధోకోణము,3.ఊర్ధ్వ కోణము, 4.వృత్తము, 5.చతురస్రము, 6.ఊర్ధ్వకోణ గత మైన చతురస్రము,7.వృత్తము, 8.చతురస్రము ,9 వ ఆవరణ పైన తెలిపిన 8 తో కూడినది.యివి కోణగతమైన 8 ఆవరణలు. దీనికి 8 దళములుగల పద్మం. దీనితో 16 కళలు. వీనికి 8 మూర్తులు, త్రిమూర్తులు,ముగ్గురు ఐదు గురు దేవతలు. సావిత్రి, గాయత్రీ, మహాదుర్గ మహాలక్ష్మి, మహాసరస్వతులతోగూడిన 24 పూర్ణమైన శ్రీచక్రం పూర్వక గాయత్రీ రూపంలో గల లలితా స్వరూపము. దీనిని 24 ×3 72 తో 72౦౦౦ నాడులకు అన్వయమై యున్నది దేహం. రూపమును యిట్లు భావన చేసి లలితా పారాయణ/గాయత్రీ మంత్ర పారాయణ చేయుట

 వక్కొక్క నామము పారాయణ వలన ప్రతీ నాడీ వేయి 1000 నాడుల శక్తితో గూడిన స్వభావము, అనగా అనేకత్వము సూచించుచూ అనంతమైన శక్తి దేహములో వుత్పన్నమగును. మూల స్వభావము యిదియే.యిదే మేరువుకూడా. 7 వ ఆవరణ వృత్తాకారంలో జలమయము మీన తత్వము. సృష్టికి మూలతత్వం. 8 వ ఆవరణ చతురస్రము కూర్మమని సాధనకు, అగ్నిచైతన్యమునకు కూర్మమే సాధనము.భూమిని కూర్మమే భరించుతత్వము. 24 అక్షరముల గాయత్రీ స్వరూపమే లలిత కూడా. లలితా పారాయణ గాయత్రీ మంత్రము వకే శక్తి. గాయత్రీ శక్తి తెలియదు. దాని ప్రకృతి లక్షణమే లలితా రూపము. ఎవరికి ఏది అవలంబించవచ్చునో దానిని సాధన చేసి తరించవచ్చును. గాయత్రి నిర్గుణస్వరూప శక్తి . లలిత గుణ స్వరూపము శక్తి. పరమేశ్వర పరమేశ్వరీ తత్వము రెండింటిదీ  దీని మూలము ప్రకృతి యని జీవమని తెలియును. వీటికి మంత్రములవలన ఆపాదించిన ఆయా  మూర్తులను భావన చేసి పారాయణ/ జపంగాని  చేయవలెను. అప్పుడు గాని మంత్ర/ పారాయణ శక్తిని తెలుసుకొనుట జరుగదు. మనలోయున్న అనంతమైన శక్తిని చైతన్య పరచుచయే ధ్యానమని సాధనయని తెలియుచున్నది. దీనికి ముందు లలితా పారాయణ మౌనంగా మూర్తిని ధ్యానించుచూ  చేయవలెను. సాధనవలననే సమస్తము తెలియును. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: