అమ్మా, నాన్న
--------------
తల్లి లేనిదే తండ్రి లేడు అనేది వాస్తవము
తల్లి అనేది యథార్థము,
తండ్రి అనేది నమ్మకము
తల్లి అనేది మూలము
తండ్రి అనేది ఒక ప్రేరణ
తల్లి ప్రాణమిచ్చి,మాటలు నేర్పింది
తండ్రి జీవనము నేర్పిన వాడు
తల్లి సృష్టి ఐ లోకమునకు
చూపింది
తండ్రి బ్రతుకఐ ప్రపంచము చూపినవాడు
తల్లి నీవే తన ప్రాణం పరి
తపించేది
తండ్రి నీకు భాద్యతలు
భోదించు గురువు
తల్లి నీ గునగణములకు కొత్త
భాష్యం చెప్పేది
తండ్రి నీ గుణగణాలకు
మెరుగు దిద్దే రూప శిల్పి
తల్లి నీకు జీవనానికి ఊపిరి అయితే
తండ్రి నీకు ఎద గటానికి ఓ ఊతము
తల్లి ఈ సృష్టిలో అద్భుత
మైన మధురాను భూతి నిచ్చే అమృత బాండము
తండ్రి నీకుకర్తవ్య విలువలు
బోధించే సనాతన గురువు
తల్లి క్రమం తప్పకుండా నీ
కడుపు ఆకలి చూసేది
తండ్రి క్రమము తప్పని క్రమ
శిక్షను నేర్పేవాడు
తల్లి నీ ఎదుగుదలను చూసి
ముచ్చట పడేది
తండ్రితనకంటే నీవు ఎత్తుకు ఎదగాలని కోరేవాడు
తల్లి నీకు ఈ లోకాన్ని పరిచ యము చేస్తే
తండ్రి నీ ముందున్న సమా
జాన్ని పరిచయము చేసే వ్యక్తి
తల్లి నీకు జ్ఞాపకాన్ని ధార పోస్తే
తండ్రి నీకు జ్ఞాపికలా మిగి లేవాడు
తల్లి నీకు ప్రత్యక్ష దైవం
తండ్రి నిత్య ఆరాధ్యము
ఎవరో అన్నారు ఇది 'పితృ
దినోత్సవము' అని
అందులో కూడా పురుషా ధిక్యత మిళితమే.........
కాదు ఇది ఎప్పటికి "తల్లి తండ్రులదినోత్సవము " అంటాను నేను..........
పిల్లలను బ్రతి కించుటకు బిక్షువులుగా మారిన తల్లి దండ్రులు ఎందరో......
ఏపుగాఎదిగిన ఈ పిల్లలే
తల్లిదండ్రులును వీధిపాలు జేసీ,కనీసము'వారు' బ్రతికి ఉన్నారా లేదా నిర్ధారించలేని
నిర్దయ సుపుత్రులు కొందరు
సభ్య సమాజము తలదించు కునేలా జీవించే రాబంధులు
కొందరున్నారు.......
సప్తసంద్రాల ఆవతల విలాసమైన జీవితాలకు అల
వడి,ఇల్లాలి(భార్య) మాటల కు తలొగ్గి చివరకు అనాధ
లుగా మార్చిన నిర్జీవ గమన పుత్రులుకొందరైతే......
ఆనాధాశ్రమా లకు సైతము దూరమైన దుర్దశలో జీవ శ్చవాలై బ్రతికె ఎందరో తల్లి తండ్రులకు ఈనా కవిత వారికే అంకితము.........
Er. నాగకుమార్. పేలాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి