అక్షర సూరీడు అడుగో వస్తున్నాడు
పెత్తందారీ గుండెల్లో పిడుగై
పేద కార్మిక కర్షక వర్గ ప్రజల ఆశా జ్యోతి యై
శ్రమ శక్తికి బాసటగా
అగ్ని జలపాతమై ఎగుస్తూ
శ్రమ దోపిడీని నిరసిస్తూ
చే జారని గెలుపుకై
చేయి చేయి కలుపు కుంటు
మును ముందుకు పయనిస్తూ
దేశ పురోగతికి పురోగ మిస్తూ
మునుముందు పయనించ మని
శ్రమైక్య జీవన సౌందర్యాన్ని చాటిన వాడు
సుత్తి,కొడవలితో పాటు సహజీవనం
చేసి
బాధా సర్ప దస్టులకు ఆరాధ్య దైవమై
కడకు శ్రీ శ్రీ అంటే చైతన్యానికి సంకేతం
శ్రీ శ్రీ అంటే సదా అంబరాన ఎగిరే
అరుణ పతాకం
శ్రీశ్రీ అంటేనే ఓ అగ్నికణం
అంటూ ఈ జగతికి చాటిన వాడు
అందుకే అరుణ పతాకాన నింగిన
నక్షత్రమై ఎగసాడు
అంబరాన్ని చుంబిద్దామని
తన యశస్సు తో....
వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీకి అరునాక్షర నివాళులు.
దోస పాటి.సత్యనారాయణ మూర్తి.
9866631877
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి