ఉత్తర ప్రదేశ్ ని ఎవరూ మార్చలేరు దేవుడు కూడా !
అన్నారు చాలా మంది.
దేవుడికి కోపం వచ్చింది. రాక్షసులని సంహరించడానికి తన తరుపున ఒక సన్యాసిని పంపించాడు. ఆ సన్యాసి పేరు యోగి ఆదిత్యనాథ్.
🌷🌷🌷.
ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు నీచ,నికృష్ట రాజకీయాలు,హత్యలు,దోపిడీలు,మానభంగాలు,భూ కబ్జాలు,రెడ్ టేపిజం, అవినీతి అధికారులు, మాఫియా గ్యాంగులు చాలా పెద్ద జాబితాయే ఉంది.
రాజకీయ నాయకుల అండదండలతో అధికారులు,రౌడీ మూకలు కలిసి చేసే వికృత నాట్యానికి టికెట్ కొనుక్కొని చూసే సామాన్య ప్రజలు. నీతి,నిజాయీతీకి అస్సలు చోటు లేదు అక్కడ.
వాటిని ఎదుర్కొలేని వాళ్ళు తమ ఆస్తులని,భూములని వదిలిపెట్టి దక్షిణ భారతానికి వలస వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీ,
బహుజన సమాజ్ వాదీ పార్టీ... పేర్లు వేరు కానీ వీళ్ళు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
కొద్దో గొప్పో మిగిలిన కొందరు నిజాయితీగల జర్నలిస్టులు అనేమాట ఉత్తరప్రదేశ్ ని ఎవరూ బాగుచేయలేరు.....
వ్యవస్థీ కృతం అయిపోయిన నేరమయ వ్యవస్థని బాగు చేయాలంటే ఓ వందేళ్లు పడుతుంది ..ఇది తరుచూ తమ సంభాషణలలో వాడే పదం...అలవాటు పడ్డారు ..లేదు అలవాటు చేయబడ్డారు.
అసలు పేరు అజయ్ సింగ్ బిస్థ్.
సన్యాసం స్వీకరించిన తరువాత ... మహంత్ యోగి ఆదిత్యనాథ్.
విద్య : బాచిలర్ డిగ్రీ, మాథమాటికల్ సైన్స్ B.Sc., తనకి స్ఫూర్తిని ఇచ్చిన
గురువు : గులాబ్ మహమ్మద్.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక నెల రోజులు పాటు అవినీతి,నేర చరిత్ర ఉన్న అధికారుల రికార్డులు పరిశీలన కోసం కేటాయించారు యోగీజీ. అందరూ కింద నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే యోగీజీ మాత్రం పై నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాని ప్రతిపాదించారు. పై వాడు తినే రకం అయితే కింద వాడు ఉపవాసాలు ఉంటాడా ?
ఉత్తరప్రదేశ్ లోని అధికారులకి చెప్పకుండానే ఆదేశాలు వెళ్ళాయి. నేరస్తుల కొమ్ము కాసే అధికారులకి ఉత్తరప్రదేశ్ లో చోటు లేదు అంటూ..... మొదట్లో అందరు ముఖ్యమంత్రులు ఇలానే అంటారు,
తరువాత షరా మామూలే అనుకొన్నారు.
కానీ నెల తిరిగేసరికి అధికారులకి అసలు సినిమా కనపడింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నేరస్తుల నాన్ బెయిలబుల్ వారంట్ల కి రెక్కలు వచ్చాయి కాదు జెట్ ఇంజిన్లు వచ్చాయి.
అరెస్టుల పర్వం మొదలవగానే ఇన్నాళ్లూ మా దగ్గర లక్షల రూపాయల లంచం తీసుకొని ఇప్పుడు మమ్మల్నే అరెస్టు చేస్తారా అంటూ మాఫియా గాంగుల హెచ్చరికలతో వీళ్ళు నోరు విప్పితే తమకి జైలు కూడు తప్పదు అనుకోని వరుస ఎంకౌంటర్లతో దొరికిన వాడిని దొరికినట్లు లేపేశారు పోలీసు అధికారులు.
నిజానికి యోగీజీ ప్రత్యేకంగా ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. ఆ పరిస్థితులు కల్పించారు అంతే! నువ్వు ఉద్యోగం చేయాలంటే నీ డ్యూటీని నువ్వు చేయాలి లేదా మాఫియా చేతిలో చావాలి. ఇష్టం లేని వారు రాజీనామ చేసి వెళ్లిపోవచ్చు. వెల్ ! రాజీనామ చేసిఇంట్లో కూర్చుంటే మాఫియా చేతిలో చావాలి లేదా అప్పటివరకూ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలి. మన డ్యూటీ మనం చేయడమే బెస్ట్.
ఉత్తరపదేశ్ లో దశాబ్దాలుగా ఊడలు దిగి వట వృక్షంలా పాతుకుపోయిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెరికి వేశారు యోగీజీ. ఎన్ కౌంటర్లలో పోయిన వాళ్ళు పోగా,కొంతమంది నేరుగా లొంగిపోయి జైళ్ళలో ఉన్నారు. మిగిలిన వారు పక్కనే ఉన్న ఢిల్లీలో తల దాచుకున్నారు. మరికొంతమని నేపాల్ వెళ్ళి అక్కడనుండి దొంగ పాస్పోర్ట్లతో పాకిస్తాన్ పారిపోయారు.
రెడ్ టెపిజమ్ : సచివాలయం తో సహా రాష్ట్రం మొత్తం ఉన్న ప్రభుత్వ కార్యాలయా లు అన్నీ గుట్కా, ఉమ్ములతో అసహ్యంగా ఉండేవి. యోగీజీ వాటిని నిషేధించారు. ఇప్పుడు అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంటున్నాయి. ఇక రాజకీయ పలుకుబడి ఉన్నవారి లేదా లంచాలు ఇచ్చినవారి ఫైల్స్ మాత్రమే వెంటనే ఆమోదం పొందేవి గతంలో. ఇప్పుడు ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ పెండింగ్ లో ఉంటే అది ఎందుకు పెండింగ్ లో ఉందో వివరంగా ఒక నోట్ వ్రాయాలి సంబంధిత అధికారి తేదీ,సమయంతో సహా ...లేదా ఉద్యోగం వదులుకోవాలి.
అవినీతికి అలవాటు పడ్డ IAS,IPS,IRS అధికారులు తమ సొంత గూటికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మాయావతి,అఖిలేశ్ ల హయాంలో ఢిల్లీలో వివిధ శాఖలలో పనిచేసేవారు. అక్కడనుండి UP కి డిప్యోటేషన్ మీద వచ్చి పాతుకుపోయారు.
ఉత్తర ప్రదేశ్ అంటేనే విద్యుత్ కోత కి పెట్టింది పేరు. యోగీజీ వచ్చిన తరువాత ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారు.
చైనా నుండి తరలి రావడానికి సిద్ధంగా ఉన్న 100 అమెరికన్ కంపనీలు యూపి లో తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి గుజరాత్,మహారాష్ట్ర , తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకి వెళతాయి అని భావించిన వారికి ఆశాభంగం కలిగించాయి. UP ప్రభుత్వ పని తీరుకి ఇది చిన్న మచ్చు తునక.
కాషాయ వస్త్రాలు కట్టుకొన్న సన్యాసి UP ని ఏమి చయగలడు అన్నవాళ్లకి యోగీజీ ఒక సస్పెన్స్ , క్రైమ్ , త్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు.
భారతదేశంలో కటికనేలపై నిద్రించే ముఖ్యమంత్రి బహుశా యోగి ఒక్కరేనేమో...
అత్యంత రోగగ్రస్త వ్యవస్థ పాతుకు పోయినా ఉత్తరప్రదేశ్ ను
ఉత్తమ ప్రదేశ్ గా తీర్చి దిద్దుతున్న యోగీజీ
దేశంలో నేడు 5 గురు అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకడుగా ప్రజలచే
కీర్తించబడటంలో ఆశ్చర్యమేముంది.
............
🙏🌹🙏🙏🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి