20, జూన్ 2021, ఆదివారం

కనిపించే దైవం నాన్న"*

 పితృ దినోత్సవం - 2021 సందర్భంగా...


కవితా శీర్షిక: *"కనిపించే దైవం నాన్న"*


అవసరాలకు ఆడంబరాలకు దూరం నాన్న

బిడ్డ ఆకలి తీర్చడమే తెలిసిన నాన్న

ఆనందం పంచడమే తెలిసిన నాన్న

గొడవ చేస్తే దండించెేది నాన్న

ఏడిస్తే ఓదార్చే నాన్న

తప్పుచేస్తే మందలించేది నాన్న

ఆశయమే ఆయువై

గెలుపే లక్ష్యమై

నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న

ఊహలకందని ఆలోచనా కాలానికి ప్రతిరూపం నాన్న

భయాన్ని పోగొట్టి  ధైర్యాన్ని పెంచే నాన్న     

సంస్కార విలువలు నేర్పి

ఆత్మస్థైర్య మిచ్చేది నాన్న

నిరాశలో ఉన్నపుడు

స్పూర్తి నిచ్చేది  నాన్న

బతుకు బాటలో సంతోష మిచ్చేది నాన్న       అమృతాన్ని పంచె త్యాగజీవి నాన్న  

భాధ్యతను తెలిపే నాన్న

ప్రతి పిలుపులో నాన్న

అనుబంధాల బంధమే  నాన్నే

కోరికలు తీర్చే గొప్పోడు నాన్న

సలహాల నిచ్చే మంచి స్నేహితుడు నాన్న

తప్పుదారిని సరిచేయు గురువు నాన్న

గెలుపంటే నాన్న

నమ్మకమంటే నాన్న

మనసున్నోడు నాన్న

మంచికి మారుపేరు నాన్న

దుఃఖంలో ఓదార్పు నాన్న

భవిష్యత్తుకు పూలబాట నాన్న

ప్రతి అవసరానికి నాన్న

కంటికి రెప్పలా కాపాడు నాన్న

గుండెకు ప్రతిస్పందన నాన్న

త్యాగానికి ప్రతిరూపం నాన్న

గుర్తుల నిలువుటద్దం నాన్న

ఏడిస్తే ఓదార్చేది నాన్న

భవిష్యత్తుకు పూలబాట నాన్న

ప్రతి అవసరానికి నాన్న

కనిపించే దైవం నాన్న...


రచన: డా.ఆలూరి విల్సన్

చరవాణి:9396610766

Email: aluriwilson55@gmail.com

కామెంట్‌లు లేవు: