రోజు రోజుకి పెట్రోల్ ధరలతో ప్రతివారు ఆలోచనలో పడ్డారు మోటార్ సైకిల్ వున్నా సైకిలు ఉంటే బాగుండేది అని కొందరు, బస్సులో పోతే యెట్లా ఉంటుందో అని కొందరు ఆలోచిస్తున్నారు. ఇక కారు వున్న వారు అటు కారు తీయలేక బస్సు ఎక్కలేక అనేక అవస్థలు పడుతున్నారు. వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాను.
1) మీరు మీ కారుని సిగ్నల్ దగ్గర ఇంజన్ ఆపండి అట్లా కొంత పెట్రోల్ సేవ్ చేయవచ్చు.
2) ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కేటప్పుడు ఇంజన్ ఆన్ చేసి దెగేరప్పుడు మాత్రం నూట్రాల్లో దిగండి ఈ విధానం కొంత పెట్రోల్ ఖర్చు తగ్గిస్తోంది .
3) పెట్రోల్ బంకుల్లో కొంతమంది మీ కారు అద్దాలను తుడిచి డబ్బులు అడుగుతారు వాళ్లతో కిలోమీటర్ తోస్తే 10 రూపాయలు ఇస్తామని కొంతదూరం తోయించుకోండి మీ ఖర్చు కొంత తగ్గిచుకోవచ్చు.
4) మొహమాటంతో పెట్రలో మిగులు.
ఈ చిట్కా చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. మీరు కారులో వెళ్ళేరప్పుడు కొంతంనుంది మీకుతెలిసిన ఓ సి గళ్ళు అదేనండి ఊరికే వస్తే ఫేనాయిల్ తాగే వాళ్ళ మీ కారు ఎక్కుతామంటే వాళ్ళని ఎక్కించుకోండి కొంత దూరం వెళ్లిన తరువాత మీరే ఇంజిన్ ఆపి వాళ్ళని తోయమని ఫురమాయించండి. వాళ్ళు తోస్తారు. ఆలా కొంత పెట్రల్ ఆదా చేసుకోవచ్చు.
ఈ చిట్కా చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. మీరు కారులో వెళ్ళేరప్పుడు కొంతంనుంది మీకుతెలిసిన ఓ సి గళ్ళు అదేనండి ఊరికే వస్తే ఫేనాయిల్ తాగే వాళ్ళ మీ కారు ఎక్కుతామంటే వాళ్ళని ఎక్కించుకోండి కొంత దూరం వెళ్లిన తరువాత మీరే ఇంజిన్ ఆపి వాళ్ళని తోయమని ఫురమాయించండి. వాళ్ళు తోస్తారు. ఆలా కొంత పెట్రల్ ఆదా చేసుకోవచ్చు.
5) ఇక పైదానిలోనే ఇంకొక చిట్కా మీరు ఆ ఓ సిగాళ్ళని నేరుగా పెట్రోల్ బంకుకి తీసుకొని వెళ్ళండి. పెట్రల్ పోస్తుండుగా మీరు సెల్ పోను తీసుకొని ప్రక్కకి వెళ్లి మాట్లాడుతన్నట్లు నటించండి. అప్పుడు వాళ్ళు పెట్రోల్ బిల్ కడతారు. కానీ కొంతమంది ఓ సి గళ్ళు మీకన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించి మీరు కారుని బంకు వైపు తిప్పగానే దిగి అరె నాకు ఇక్కడ పని ఉందని జారుకుంటారు జాగ్రత్త.
6) ఇంకొక అనుబంధ చిట్కా మీరు మీ జేబు తడుముకున్నట్లు నటించి అరె నేను పర్సు తేవటం మరిచానే అన్నా నీదగ్గర డబ్బులుంటే ఇస్తావా అని బిల్లు కట్టించండి. గుర్తు పెట్టుకోండి పొరపాటున కూడా ఇంకొక్క మాట, అదేనండి రేపు ఇస్తాను అని అనకండి. ఎందుకంటె మరుసటి రోజు మీరు కనబడంగానే నిర్మొహమాటంగా మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటె ముందే చెప్పుకున్నాము కదా వాళ్ళు ఓ సి గాళ్ళని.
7) దర్జాగా మీరు పెట్రోల్ లేకుండ కారు నడిపే మార్గాలు.
ఇవి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.
ఇవి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.
అ ) మీ కారుకి ముందు రెండు కొక్కాలు బిగించి రెండు దున్నపోతుల్ని కట్టండి. చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు.
ఆ) మీ కారు కొక్కాలకు రెండు గాడిదలని కట్టండి. చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు.
ఇ ) మీరు ఎప్పుడు ఎద్దులని, లేక ఒంటెలని మరియు గుఱ్ఱాలని కట్టాలని ఆలోచించకండి. అవి వేగంగా వెలుతాయి మీరు నడపలేరు. అదేనండి మీరు తోలలేరు.
ఇక్కడ చెప్పిన వాటిని మీకు నచినది మీరు ఎంచుకోవచ్చు.
గమనిక: మీకు ఏదైనా పైన తెలిపిన ఉపాయం వల్ల ప్రమాదం వాటిల్లితే నా పూచి లేదు.
షర : ఈ చిట్కాలు కేవలం హాస్యానికి వ్రాసినవె ఆచరణ కోసం కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి