*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*
*4.అర్వావసువు ,పరావసువు మహరులు*
ఇప్పుడు మనం జంట ఋషుల గురించి తెలుసుకుందాం . మొదలు పెట్టండి మరి .... బ్రహ్మజ్ఞానియైన రైభ్య మహర్షి పితరుల ఋణం తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం తీసుకుని వివాహం చేసుకున్నాడు . రైభ్య మహర్షికి ఇద్దరు పిల్లలు కలిగారు . వాళ్ళ పేర్లు “ అర్వావసువు ' , ' పరావసువు ' . వాళ్ళిద్దరికి యుక్తవయస్సు రాగానే ఉపనయనం చేసి రైభ్యుడు తానే గురవయి వాళ్ళకి వేదాలు నేర్పించి వేదాధ్యాయన సంపన్నులని చేశాడు . అర్వావసువు , పరావసువులు కూడా తండ్రి చెప్పినట్లు విని గొప్ప పండితులయ్యారు . రైభ్యుడు తన ఇద్దరు కొడుకులతో వేదం చదువుతుంటే బ్రహ్మాది దేవతలు , బృహస్పతి మొదలైన ఋషులు వచ్చి మెచ్చుకుని వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు . అర్వావసువు , పరావసువులకి పెళ్ళిచేశాడు రైభ్యుడు . రైభ్యుడి ఆశ్రమం చాలా మనోహరంగా ఉండేది . పరావసువు భార్య ఆశ్రమంలో తిరుగుతుంటే అవక్రీతుడు అవమానించాడు . ఆమె మామగారైన రైభ్యుడికి చెప్పింది . రైభ్యుడు అవక్రీతుడ్ని(ఈయన భరద్వాజుని కొడుకు) చంపించాడు . భరద్వాజుడు బాధపడి దేహత్యాగం చేశాడు .
అర్వావసువు , పరావసువులు తండ్రి అనుమతి ప్రకారం బృహద్యుమ్నుడు చేస్తున్న సత్రయాగానికి ఋత్విజులుగా వున్నారు . ఒక రాత్రివేళ పరావసువు ఇంటికి వస్తూ చీకటిలో ఒక జంతువు తన మీదపడితే కర్రవిసిరాడు . అది తగిలి అక్కడే వున్న రైభ్యుడు మరణించాడు . అర్వావసువు తపశ్శక్తికి , ప్రతదీక్షకి మెచ్చి అగ్ని , మొదలయిన దేవతలు వరం కోరుకోమనడిగారు . అర్వావసువు తన తండ్రిని , అవహేతుడ్ని , భరద్వాజుడ్ని బ్రతికించమనడిగాడు . దేవతలు అర్వావసువు , పరావసువుల్ని ఆశీర్వదించి వాళ్ళు కోరినట్లే చనిపోయినవాళ్ళని బ్రతికించారు . ఆవక్రీతుడు బ్రతకడమే కాకుండా ఈర్ష్యాసూయలు లేకుండా అర్వావసువు , పరావసువులతో కలిసిపోయాడు .
*4.అర్వావసువు ,పరావసువు మహరులు*
*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి