7, జనవరి 2026, బుధవారం

గొంతు సంబంధ సమస్యలకు

 గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు -

 * శొంటి కొమ్మును చూర్ణం చేసి తేనెతో కలిపి సేవించిన గొంతు నొప్పి తగ్గును.

 * తేనెలో కొంచం మిరియాల చూర్ణం వేసి తీసుకుంటే బొంగురుపోయిన గొంతు మాములుగా అగును.

 * మామిడి ఆకుల కషాయం అరకప్పు తీసుకుని అందులో చెంచా తేనె కలుపుకుని తాగాలి . అలా ఉదయం , సాయంత్రం రెండుపూటలా మూడు రోజుల పాటు తీసుకున్న గొంతు బొంగురు పోవును . 

 * ముల్లంగి రసాన్ని పూటకు పావుకప్పు తీసుకుంటున్న గొంతు బొంగురు పోవును . 

 * చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్నను గొంతు బొంగురు పోవును . 

 * రాత్రి సమయం నందు నిద్రించుటకు పూర్వం ఒక గ్లాసు వేడివేడి పాలలో ఒక చిన్న స్పూన్ మిరియాల చూర్ణం కలుపుకుని తాగుచున్న గొంతులో రొంప, గొంతు బొంగురు పోవును .

 * గొంతులో మంట, నుస ఉంటే లవంగ మొగ్గ నోటిలో వేసుకొని రసం మింగుచున్న తగ్గును.

 * చిన్నపిల్లలకు గొంతులో మంట, నుస ఉంటే వారితో అప్పుడప్పుడు లేత కొబ్బరి తినిపిస్తున్న తగ్గును.

 * గొంతులో టాన్సిల్స్ వాపు వచ్చినపుడు ఉల్లిగడ్డ దంచి ఆ రసం పైన పూయుచున్న వాపు తగ్గును.

 * లేత కొబ్బరి వేర్ల కషాయం కాని మెంతుల కషాయం తో పుక్కిలిస్తున్న గొంతు మంట తగ్గును.

 * టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలం లో వాడే కాచు చూర్ణం చేసి పూటకు పావు స్పూన్ చూర్ణం కొంచం తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా రోజు చేయుచున్న టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గును.

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

గమనిక -

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          కాళహస్తి వేంకటేశ్వరరావు  

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

పంచాంగం

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

  శ్లో𝕝𝕝 *వాణీ రసవతీ యస్య* 

         *యస్య శ్రమవతీ క్రియా* l

         *లక్ష్మీః దానవతీ యస్య*

         *సఫలం తస్య జీవనమ్* ll

తా𝕝𝕝 *ఎవడి మాటలు ప్రియకరమై, పరహితమై ఉండునో, శ్రమతో కూడిననూ కర్తవ్యనిష్ఠతో క్రియలను ఆచరించునో, సంపదలు దానధర్మములకై వినియోగించబడునో అతడి జన్మ సార్థకమగుచున్నది... ఫలప్రదమగుచున్నది...*.

✍️VKS ©️ MSV🙏

దాన_మహిమ

  #దాన_మహిమ..❄️🌿🚩

ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ‘

ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.

‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే 

అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.

గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ

రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః

దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..

గోదానం....గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం .....కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం...తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (సువర్ణ)దానం.....హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

.

ఆజ్య(నెయ్యి)దానం...ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం....శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం...;జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం....రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం....అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం....రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు

ఇతర దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.......!!!!

1. బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి.

2. వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి.

4.పండ్లను దానంచేస్తే............బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

5. పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే.........రోగాలు పోతాయి.....ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే..........నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే..... సంతానం కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే...... మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే......... అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే........కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే.......ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు

లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే.......బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక

దర్శనం కలుగుతుంది.

14. వస్త్ర దానం చేస్తే...........ఆయుషు పెరుగుతుంది.

15. అన్నదానం చేస్తే..............పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.ఓం శనైశ్చ రాయనమః

🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత🌹

🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼

  🌿 *_శుభమస్తు_* 🌿

ఆత్మస్తుతి

  ఆత్మస్తుతి" (తనను తాను పొగుడుకోవడం) నిరసన మరియు "వినయం" యొక్క ప్రాముఖ్యత గురించి మన పురాణాలు, ఇతిహాసాలు మరియు ధర్మశాస్త్రాలు ఏమి చెబుతున్నాయో వివరంగా విశ్లేషిద్దాం.

1. పురాణ సూక్తి - ఆత్మస్తుతి పరనింద

ధర్మశాస్త్రాల ప్రకారం "ఆత్మస్తుతిః పరనిందా చ" అనేవి రెండూ సమానమైన దోషాలుగా పరిగణించబడ్డాయి. తనను తాను పొగుడుకోవడం అనేది అహంకారానికి (Ego) సంకేతం. ఇది మనిషి యొక్క వివేకాన్ని నశింపజేస్తుంది.

2. మహాభారతంలో ఉదాహరణ (అర్జునుడి ఘట్టం)

మహాభారతంలో ఒక ఆసక్తికరమైన సందర్భం ఉంది. అర్జునుడు తన గాండీవం గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వారిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఒకానొక యుద్ధ సమయంలో ధర్మరాజు ఆవేశంలో గాండీవాన్ని నిందిస్తాడు. ప్రతిజ్ఞా పాలన కోసం అర్జునుడు ధర్మరాజును చంపబోతే, శ్రీకృష్ణుడు అడ్డుకుని ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాడు:

"పెద్దలను నిందించడం మరణంతో సమానం, అలాగే తనను తాను పొగుడుకోవడం ఆత్మహత్యతో సమానం."

శ్రీకృష్ణుడి సూచన మేరకు, అర్జునుడు తనను తాను పొగుడుకుంటాడు. అలా చేయడం ద్వారా అతనిలోని 'పాత అర్జునుడు' మరణించినట్లుగా భావించి, ప్రతిజ్ఞ నెరవేరినట్లుగా పరిగణిస్తారు. అంటే, తనను తాను పొగుడుకోవడం అనేది వ్యక్తిత్వ వినాశనానికి దారి తీస్తుందని దీని అర్థం.

3. రామాయణంలో హనుమంతుని వినయం

హనుమంతుడు అపారమైన బలవంతుడు ("బుద్ధిమతాం వరిష్టం"). కానీ ఎక్కడా ఆయన తనను తాను పొగుడుకోలేదు. రావణుని సభలో కూడా తనను తాను కేవలం "రామదూత" అని మాత్రమే పరిచయం చేసుకున్నారు. ఎంత గొప్ప వారైనా సరే, తమ గొప్పతనాన్ని తాము చెప్పుకోకుండా ఉండటమే 'ఉత్తమ లక్షణం' అని హనుమ చరిత్ర మనకు నేర్పుతుంది.

4. నీతి శాస్త్రాల విశ్లేషణ

భర్తృహరి సుభాషితాలలో వినయం గురించి ఇలా చెప్పబడింది:

"విద్య దదాతి వినయం" - నిజమైన జ్ఞానం మనిషికి వినయాన్ని ఇస్తుంది, గర్వాన్ని కాదు.

గొప్పవారు తమ గురించి తాము చెప్పుకోరు, వారి పనులే వారి గురించి చెబుతాయి. ఉదాహరణకు, బంగారం తనను తాను గొప్పదని చాటుకోదు, కానీ దాని విలువ అందరికీ తెలుస్తుంది.

5. జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర విశ్లేషణ (మీ కోరిక మేరకు)

గ్రహ బలం: జాతకంలో గురు గ్రహం (Jupiter) బలంగా ఉన్నవారు జ్ఞానులై ఉండి కూడా వినయంగా ఉంటారు. అదే రాహువు లేదా అశుభ శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ఆత్మస్తుతి చేసుకుంటాడు.

అక్షర సంఖ్య గణితం: 'అహంకారం' అనే పదం యొక్క సంఖ్యా తరంగాలు మనిషిని పతనానికి గురిచేస్తాయి. వినయం మరియు మౌనం అనేవి లగ్న శుద్ధికి, ఆత్మ బలానికి కారణమవుతాయిపురాణాల సారం ప్రకారం—ఎవడైతే తన నోటితో తనను తాను పొగుడుకోడో, అతడిని లోకం పొగుడుతుంది. దైవ అనుగ్రహం కూడా వినయం ఉన్నచోటే ఉంటుంది.

ఆతిథ్య సత్కార - ధర్మములు*

  *ఆతిథ్య సత్కార - ధర్మములు*

*అతిథి అంటే* ???

'న విద్యతే తిథిః యస్య సః' - అంటే, తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఇంటికి వచ్చేవాడు అని అర్థం.

*అభ్యాగతః:

అంటే స్వయంగా వెతుక్కుంటూ వచ్చినవాడు అని అర్థం.

******

మన ఇంటికి వచ్చిన అతిథికి మన దగ్గర ఏమీ లేకపోయినా కనీసం ఈ నాలుగు అందించాలని శాస్త్రం

తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూనృతా |

ఏతాన్యపి సతాం గేహే నోచ్ఛిద్యంతే కదాచన ||

సజ్జనుల ఇళ్లలో ఈ నాలుగు వస్తువులు ఎప్పుడూ తక్కువ కావు

*తృణాని: కూర్చోవడానికి చాప లేదా ఆసనం.

*భూమిః: విశ్రాంతి తీసుకోవడానికి స్థలం.

*ఉదకం: దాహాన్ని తీర్చడానికి నీరు.

*సూనృతా వాక్: ప్రియమైన (మంచి) మాట.

******

*శత్రువు వచ్చినా ఆదరించాలి*

మహాభారతంలోని శాంతి పర్వం ప్రకారం, శత్రువు ఇంటికి వచ్చినా అతనికి తగిన గౌరవం ఇవ్వాలని ఉన్నది.

అసంపన్నః కులేఽపి స్యాదాగతః పరమోఽతిథిః |

యథాశక్తి ప్రపూజ్యోఽయం న త్వపూజ్యో విసర్జయేత్ ||

ఇంటికి వచ్చిన వాడు ఏ కులస్థుడైనా, ఏ హోదాలో ఉన్నవాడైనా అతను గొప్ప అతిథే , శక్తి ఉన్నంతలో అతడిని పూజించి పంపాలి కానీ, అవమానించి పంపకూడదు.

******"

*అతిథిని పంపేటప్పుడు (ప్రదక్షిణ పూర్వకం)*

అతిథి వెళ్లేటప్పుడు కూడా వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని శాస్త్రం .

అభిగమ్యోత్తమం విద్వాన్ ప్రణమ్య చ యథావిధి |

అనుగమ్య చ సీమాంతం విసృజేత్ ప్రియవాక్యతః ||

అతిథి వెళ్లేటప్పుడు వారిని సాగనంపడానికి ఇంటి గడప దాటి కొంత దూరం వరకు (గ్రామ పొలిమేర వరకు అని పూర్వకాలంలో అనేవారు) వెళ్లి, ప్రియమైన మాటలు చెప్పి పంపాలి.

*చెట్టు తనను నరకడానికి గొడ్డలి పట్టుకుని వచ్చిన వాడికి కూడా నీడను ఇస్తుంది. ఆ దృష్టాంతంతో ఆతిథ్యం గురించి ఇలా 

ఛేత్తురప్యాశ్రయం ఛాయాం నోపసంహరతే ద్రుమః |

అతిథిం పూజయేత్తస్మాత్ యథాశక్తి విధానతః ||

తనను నరికే వానికి కూడా చెట్టు నీడను ఇవ్వడం మానదు. అలాగే మనిషి కూడా తన శక్తి మేరకు ఇంటికి వచ్చిన అతిథిని పూజించాలి.

*******

*అతిథిని నిరాశపరచకూడదు*

అతిథి నిరాశతో వెనుదిరిగి వెళితే, అది ఇంటి యజమానికి శ్రేయస్కరం కాదు.

అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే |

స తస్మై దుష్కృతం దత్త్వా పుణ్యమాదాయ గచ్ఛతి ||

ఎవరి ఇ ఇంటి నుండైతే అతిథి ఆశ కోల్పోయి (ఆదరణ లభించక) తిరిగి వెళ్ళిపోతాడో, ఆ అతిథి తన పాపాన్ని ఇంటి యజమానికి ఇచ్చి, ఆ యజమాని చేసుకున్న పుణ్యాన్ని తాను తీసుకువెళతాడు.

ఇలా అతిథి అంటే తిథి, వారం చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చేవారు ఆ అతిథిని సంతోషపెడితే సకల దేవతలు సంతోషించినట్లేనని మన పురాణాలు వచనం.

****************************************

ఆ ఆతిథ్యం పొందే వ్యక్తి పాటించాల్సిన నియమాలు*?????

అతిథి నిర్వచనం

"ఏక రాత్రం తు నివసన్ అతిథిర్ బ్రాహ్మణః స్మృతః 

నానిత్యం హి స్థితో యస్మాత్ తస్మాద్ అతిథిరుచ్యతే ||"

ఒకే రాత్రి నివసించేవాడిని 'అతిథి' అంటారు. అంటే, వచ్చిన వ్యక్తి ఎక్కువ కాలం ఉండి యజమానికి భారం కాకూడదని దీని అర్థం. తిథి, వార నియమాలు లేకుండా వచ్చి, కొద్దిసేపు లేదా ఒక రాత్రి మాత్రమే ఉండి వెళ్ళేవాడే నిజమైన అతిథి.

*ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రవర్తన*

ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పరిస్థితులను గౌరవించాలి

"అమంత్రితాః ప్రవిశంతి హ్యకృతాశ్చైవ భాషిణః |

అవిశ్వస్తే విశ్వసంతి మూఢచేతా నరాధమః ||"

పిలవకుండా లోపలికి వెళ్ళేవాడు, అడగకుండానే అతిగా మాట్లాడేవాడు, నమ్మకూడని వారిని నమ్మేవాడు "మూఢుడు" (తెలివి తక్కువ వాడు) అని పిలవబడతాడు. కాబట్టి అతిథిగా వెళ్ళినప్పుడు అనుమతి కోరడం, మితంగా మాట్లాడటం చాలా ముఖ్యం.

*భోజనం విషయంలో అతిథి ధర్మం*

ఆ అతిథి భోజనం పెట్టినప్పుడు ఎలా ఉండాలి 

"న నింద్యాత్ అన్నం తద్ వ్రతమ్"

 పెట్టే ఆహారం రుచిగా ఉన్నా, లేకపోయినా దాన్ని నిందించకూడదు. యజమాని ఎంత ప్రేమతో పెట్టాడో గమనించి, తృప్తిగా భుజించాలి. వడ్డించేవారిని ఇబ్బంది పెట్టేలా కోరికలు కోరకూడదు.

*వినయం మరియు గౌరవం*

అతిథికి ఉండాల్సిన లక్షణాల గురించి భర్తృహరి సుభాషితాలలో ఇలా ఉంది

"ప్రియతమమ్ వినయేన సమాచరేత్"

ఎక్కడికి వెళ్ళినా వినయంతో ప్రవర్తించాలి. అతిథిగా వెళ్ళినప్పుడు మన గొప్పలు చెప్పుకోవడం కంటే, ఆ ఇంటి యజమానిని గౌరవించడం ఉత్తమ లక్షణం.

*సదాచారం సత్ప్రవర్తన*

"దురాచారో హి పురుషో లోకే భవతి నిందితః |

దుఃఖభాక్ చ సతతం వ్యాధితోఽల్పాయురేవ చ ||"

పరుల ఇంటికి వెళ్ళినప్పుడు దుష్ప్రవర్తన (చెడు పనులు, దొంగతనంగా చూడటం, రహస్యాలు వినడం) చేసే వ్యక్తి సమాజంలో నిందల పాలవుతాడు. కాబట్టి అతిథి ఎప్పుడూ పరిశుభ్రతను, పద్ధతిని పాటించాలి.

సంక్షిప్తంగా అతిథి పాటించాల్సిన నియమాలు చూద్దాం (Checklist)నియమం వివరణ

*అనుమతి (Permission) ఏ వస్తువునైనా తాకేముందు, ఏ గదిలోకి వెళ్ళేముందు యజమానిని అడగాలి.

*మితభాషణం (Limited Speech) అనవసరమైన మాటలు, వ్యక్తిగత ప్రశ్నలు మానుకోవాలి.

*సమయపాలన (Timing) భోజన సమయాల్లో లేదా పడుకునే వేళల్లో ఇబ్బంది కలిగించకూడదు.

*సహకారం (Cooperation) వీలైతే ఆ ఇంట్లోని చిన్న చిన్న పనుల్లో సహాయం చేయాలి, భారం కాకూడదు.

*కృతజ్ఞత (Gratitude) తిరిగి వచ్చేటప్పుడు ఆదరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి.

***************************************

*పరస్పరం ఇద్దరి బాధ్యత ధర్మాలు*????

బంధువులు లేక మిత్రులు మధ్య ఉండాల్సిన అనుబంధం (స్నేహ భావం)

సతాం సద్భిః సమాగమః కథమపి పుణ్యేన భవతి |

సదా మిత్రం చక్షుర్విశదమపి భావార్ద్రమతులమ్ ||

 సజ్జనులకు (మంచి వారికి), సజ్జనులతో కలిగే కలయిక , ఏదో ఒక గొప్ప పుణ్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది , అటువంటి మిత్రుడు ఎల్లప్పుడూ ,కళ్లకు స్పష్టతను (జ్ఞానాన్ని) ఇచ్చేవాడు ,సాటిలేని హృదయపూర్వకమైన అనురాగాన్ని ఇచ్చేవాడు.

మహాభారతంలో విదుర నీతి ప్రకారం, నిజమైన స్నేహితుల మధ్య ఉండవలసిన లక్షణాలు 

దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి |

భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతిలక్షణమ్ ||

 ఇచ్చిపుచ్చుకోవడం (కానుకలు), రహస్యాలను పంచుకోవడం, కుశల ప్రశ్నలు అడగడం, వారి ఇంట్లో భుజించడం, మన ఇంట్లో వారికి భోజనం పెట్టడం—ఈ ఆరు పనులు స్నేహానికి, ప్రేమకు నిదర్శనాలు.

అకౌతుకాని గేహాని న గంతవ్యాని కర్హిచిత్ |

అప్యుత్సవగతైర్నృభిః కిం పునః సామాన్యకర్మణి ||

 మనపై ఆదరాభిమానాలు లేని వారి ఇంటికి వెళ్ళకూడదు. కానీ, మన క్షేమాన్ని కోరేవారు, మన రాకను ఆశించే వారి ఇంటికి ఆహ్వానం ఉన్నా లేకపోయినా వెళ్ళడం వల్ల ఆ బంధం పటిష్టమవుతుంది ఇది మన భారతీయ సాంప్రదాయo .

****************************************

శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 

*రాళ్ళబండి శర్మ*

🙏🏼🙏🏼🙏🏼

విధి వ్రాత*

  🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

                   *విధి వ్రాత*

                   ➖➖➖✍️

“విధి వ్రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు

విధిని ఎవ్వరూ మార్చలేరు.”```

అది ఇంద్రలోకం...అందులో ఇంద్రుడి విలాస వంతమైన రాజమందిరం. ఆ భవనంలో సుందరమైన రాణివాసం. అక్కడ ఒక పంచవన్నెల రామచిలుక. అందమంతా తనదే అన్నట్లు వయ్యారాలు పోతూ తానే రాణిలా కలతిరుగుతోంది. అది ఇంద్రుడి భార్య ఇంద్రాణి పెంచుకుంటున్న అందమైన చిలుక.

ఆమెకు ఆ చిలుకంటే ఎంతో ఇష్టం. దానిని తన ప్రాణ సమానంగా చూసుకునేది. ఉన్నట్లుండి ఒక రోజున ఆ చిలుకకు జబ్బు చేసింది. ఇంద్రాణి బాగా దిగులుపడి పోయింది. చిలుకను ఆస్థాన వైద్యుడికి చూపించింది.

ఆ వైద్యుడు చిలుకను అన్ని విధాల పరీక్షించాడు. ఇక చిలుక బ్రతకడం కష్టమని తోచిందతడికి. అదే విషయం ఇంద్రాణితో చెప్పాడు.

ఆ మాట విన్న ఇంద్రాణి హతాశురాలైంది. పరుగు పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్లింది. చిలుక సంగతి భర్తతో చెప్పి....

“మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను” అంటూ కన్నీరు పెట్టుకుంది.

ఒక చిలుకతో ఆమెకు వున్న అనుబంధానికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ...

“దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మే కదా! నేను వెళ్ళి ఆయన్ని ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు” అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.

ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు

“నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మాత్రం శ్రీమహావిష్ణువు... కాబట్టి మనం శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళదాం పద” అంటూ ఇరువురూ వైకుంఠానికి బయలుదేరారు.

వీరి రాకను గమనించిన శ్రీహరి వారిని ఆహ్వానించి వచ్చిన కారణం తెలుసుకున్నాడు.

“మీరు అనుకున్నది నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే.. కానీ.. చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే ఆ పరమశివుడికే సాధ్యం. మనం ముగ్గురం శివుడిని ప్రార్థిద్దాం పదండి” అన్నాడు.

ముగ్గురూ కైలాసానికి వెళ్లి శివుడితో విషయం చెప్పారు. అంతా విని శివుడు ఇలా అన్నాడు...

“ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను. అతని పనికి నేను అంతరాయం కలిగించకూడదు. కాబట్టి మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి” అన్నాడు.

అందరూ కలిసి యముడి కోసం యమపురికి బయలుదేరారు.

ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కలిసి యమలోకానికి రావడం చూసిన యముడు మనసులో ‘వీరంతా తన వద్దకు వచ్చారంటే ఏదో విశేషమే వుండి వుంటుంది’ అనుకుంటూ వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకుని....

“అయ్యో..! అదేమంత పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరైన వారి పేర్లను, వారు ఏ విధంగా చనిపోవాలి అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. వారికి సమయం ఆసన్నమయినపుడు ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆ విధంగా చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుదాం” అని అన్నాడు.

యముడితో కలిసి అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. 

ఆ ఆకు ఎవరిదో అందులో ఏం రాసి వుందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా వ్రాసి ఉంది...

“ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు కలిసి వస్తారో అప్పుడు చిలుకకు మరణం!” అని వ్రాసి ఉంది.```

విధి అంటే ఇదే కదా..! విధిని ఎవ్వరూ మార్చలేరు.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

అ ను ష్ఠా న బ లం !

  అ ను ష్ఠా న బ లం !

ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తో ధన మివ్వాలా"!!? అంటాడు.

దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు _"అంత అవసరం లేదు.!! మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది .దానెత్తు ఇచ్చిన చాలునంటాడు._

వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికో రెండు కాసులిచ్చి పంపమంటాడు.

దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టుబడతాడు.

దానికా రాజు 'సరదాగా ఆ వేడుకా చూద్దామనుకుని, త్రాసుతెప్పించి తూచిఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.

కానీ, _వింత_, ఎంత ధనమేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరితూగలేదు.

*దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం.*

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బక్క బ్రాహ్మణుని శక్తి తెలియకవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.

*జై గాయత్రీమాత*

నైవేద్య సమర్పణ’*

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

భగవంతునికి…

           *‘నైవేద్య సమర్పణ’*

                  ➖➖➖✍️

*నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?```

హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో ‘నైవేద్య సమర్పణ’ అని పేరు.

నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి..

ముఖ్యంగా ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు మనం తినేదే పెట్టాలి.

‘ద్రవ్యశుద్ధి’చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు?

అది అక్రమార్జితమా? 

సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? 

ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. 

అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. 

దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

“శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్” అన్నారు వేదఋషులు. 

అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం.

అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి.

బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన ‘అశౌచాలకి’ గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. 

నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్త పెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. 

ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం:```

*శ్లో॥బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్।*

*బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా॥*```

విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...```

*శ్లో॥పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి।*

*తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః॥*

*శ్లో॥యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్।*

*యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్॥*

*శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా*

*బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్।*

*కరోమి యద్యత్ సకలమ్ పరస్మై నారాయణేతి సమర్పయామి॥*```

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు...```

*ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి।అమృతమస్తు। అమృతోపస్తరణమసి స్వాహా।*```

అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. 

తరువాత--```

*ఓమ్ ప్రాణాయ స్వాహా! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |*```

అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.

మధ్యేమధ్యే పానీయం సమర్పయామి

అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.```

*’నమస్కరోమి’*``` అని సాష్టాంగం చేసి లేవాలి. 

👉దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. 

లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది.

*ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకువచ్చి.... ప్రసాదంగా అందరితో కలిసి పంచుకొంటూ తినాలి🙏```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️

కాకి లేనిదే కైవల్యం లేదు.*

     *కాకి లేనిదే కైవల్యం లేదు.*

              ➖➖➖✍️

*’కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం!’ అని అంటారు ఎందుకు..?*

*కాకికి-మనుషులకు మధ్య గల సంబందం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది..?*

*************

*"చక్కటి వివరణ....రామాయణ ఘట్టం"*

*శ్లోకం :-*

*పక్షి చ శాఖా నిలయః ప్రవత్తః సుస్వాగతాం వాచ మదీర యానః!!*

```

పక్షి కూత శుభ వాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే ‘కాకి అరుస్తోంది... ఏ చుట్టాలొస్తారో చూద్దాం!’ అనే మాట లోకానికి వచ్చింది.

దీనికి ఒక మహత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చినది అని తెలుస్తోంది.

రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి, సప్త సముద్రాల ఆవల లంకా నగరానికి సమీపంలో ఆశోకవనంలో ఒక మద్ది చెట్టు క్రింద ఆమెని వదిలి పెట్టి, రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు.

రాజ్యం కాని రాజ్యంలో మనుషులు కాని మనుషుల మధ్యలో తనవారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ… సూటిపోటి మాటలతో అపుడపుడూ రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనసును కలచి వేస్తున్న సమయంలో ...

ఎక్కడినుంచో... ఎపుడూ కూడా ఆ పరిసర ప్రాంతంలో కనిపించని పక్షి... ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవసాగింది.

సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ... ఏ రాక్షస మాయతో ఇది ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలో... కోతిపిల్ల రూపంలో వున్న హనుమ... సీతమ్మ ముంగటికి వచ్చి...రెండు చేతులతో నమస్కరించి...

“నేను రామదూతని... మీ జాడ తెలుసుకు రమ్మని...సుగ్రీవ...రామ లక్ష్మణులు... పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి... లంకా నగరమంతా గాలించుచూ...

నార చీరలో వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మతల్లివే అని...తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరాన్నీ చూపగా మహానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో...

ఆ కాకి...అంతవరకు ఆ క్రొమ్మమీదనే వుండి...కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ సీతమ్మ ముంగిట వాలగా... “నీ అరుపుతో నాకు శుభ సూచకం జరిగింది...            

ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో...

అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ సూచకంఅవుతుందని, నీ వంశం వున్నంత వరకు అది లోకానికి శుభధాయకం” అని వరం ఇచ్చింది.

ఈ సామెత అలా... రామాయణం కాలం నుండి... మన వరకూ కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖

దాన_మహిమ

 #దాన_మహిమ..❄️🌿🚩

ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ‘

ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.

‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే 

అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.

గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ

రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః

దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..

గోదానం....గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం .....కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం...తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (సువర్ణ)దానం.....హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

.

ఆజ్య(నెయ్యి)దానం...ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం....శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం...;జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం....రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం....అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం....రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు

ఇతర దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.......!!!!

1. బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి.

2. వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి.

4.పండ్లను దానంచేస్తే............బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

5. పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే.........రోగాలు పోతాయి.....ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే..........నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే..... సంతానం కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే...... మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే......... అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే........కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే.......ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు

లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే.......బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక

దర్శనం కలుగుతుంది.

14. వస్త్ర దానం చేస్తే...........ఆయుషు పెరుగుతుంది.

15. అన్నదానం చేస్తే..............పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.ఓం శనైశ్చ రాయనమః

🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత🌹

🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼

  🌿 *_శుభమస్తు_* 🌿

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - చతుర్థి & పంచమి - మఘ -‌‌ సౌమ్య వాసరే* (07.01.2026)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*