🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
భగవంతునికి…
*‘నైవేద్య సమర్పణ’*
➖➖➖✍️
*నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?```
హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో ‘నైవేద్య సమర్పణ’ అని పేరు.
నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి..
ముఖ్యంగా ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు మనం తినేదే పెట్టాలి.
‘ద్రవ్యశుద్ధి’చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు?
అది అక్రమార్జితమా?
సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా?
ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు.
అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు.
దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.
“శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్” అన్నారు వేదఋషులు.
అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.
భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం.
అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి.
బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన ‘అశౌచాలకి’ గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు.
నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్త పెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం.
నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి.
ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం:```
*శ్లో॥బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్।*
*బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా॥*```
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...```
*శ్లో॥పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి।*
*తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః॥*
*శ్లో॥యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్।*
*యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్॥*
*శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా*
*బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్।*
*కరోమి యద్యత్ సకలమ్ పరస్మై నారాయణేతి సమర్పయామి॥*```
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు...```
*ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి।అమృతమస్తు। అమృతోపస్తరణమసి స్వాహా।*```
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.
తరువాత--```
*ఓమ్ ప్రాణాయ స్వాహా! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |*```
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.```
*’నమస్కరోమి’*``` అని సాష్టాంగం చేసి లేవాలి.
👉దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి.
లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది.
*ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకువచ్చి.... ప్రసాదంగా అందరితో కలిసి పంచుకొంటూ తినాలి🙏```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి