*కాకి లేనిదే కైవల్యం లేదు.*
➖➖➖✍️
*’కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం!’ అని అంటారు ఎందుకు..?*
*కాకికి-మనుషులకు మధ్య గల సంబందం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది..?*
*************
*"చక్కటి వివరణ....రామాయణ ఘట్టం"*
*శ్లోకం :-*
*పక్షి చ శాఖా నిలయః ప్రవత్తః సుస్వాగతాం వాచ మదీర యానః!!*
```
పక్షి కూత శుభ వాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే ‘కాకి అరుస్తోంది... ఏ చుట్టాలొస్తారో చూద్దాం!’ అనే మాట లోకానికి వచ్చింది.
దీనికి ఒక మహత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చినది అని తెలుస్తోంది.
రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి, సప్త సముద్రాల ఆవల లంకా నగరానికి సమీపంలో ఆశోకవనంలో ఒక మద్ది చెట్టు క్రింద ఆమెని వదిలి పెట్టి, రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు.
రాజ్యం కాని రాజ్యంలో మనుషులు కాని మనుషుల మధ్యలో తనవారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ… సూటిపోటి మాటలతో అపుడపుడూ రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనసును కలచి వేస్తున్న సమయంలో ...
ఎక్కడినుంచో... ఎపుడూ కూడా ఆ పరిసర ప్రాంతంలో కనిపించని పక్షి... ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవసాగింది.
సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ... ఏ రాక్షస మాయతో ఇది ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలో... కోతిపిల్ల రూపంలో వున్న హనుమ... సీతమ్మ ముంగటికి వచ్చి...రెండు చేతులతో నమస్కరించి...
“నేను రామదూతని... మీ జాడ తెలుసుకు రమ్మని...సుగ్రీవ...రామ లక్ష్మణులు... పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి... లంకా నగరమంతా గాలించుచూ...
నార చీరలో వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మతల్లివే అని...తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరాన్నీ చూపగా మహానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో...
ఆ కాకి...అంతవరకు ఆ క్రొమ్మమీదనే వుండి...కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ సీతమ్మ ముంగిట వాలగా... “నీ అరుపుతో నాకు శుభ సూచకం జరిగింది...
ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో...
అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ సూచకంఅవుతుందని, నీ వంశం వున్నంత వరకు అది లోకానికి శుభధాయకం” అని వరం ఇచ్చింది.
ఈ సామెత అలా... రామాయణం కాలం నుండి... మన వరకూ కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి