7, జనవరి 2026, బుధవారం

అ ను ష్ఠా న బ లం !

  అ ను ష్ఠా న బ లం !


ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తో ధన మివ్వాలా"!!? అంటాడు.

దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు _"అంత అవసరం లేదు.!! మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది .దానెత్తు ఇచ్చిన చాలునంటాడు._

వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికో రెండు కాసులిచ్చి పంపమంటాడు.

దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టుబడతాడు.

దానికా రాజు 'సరదాగా ఆ వేడుకా చూద్దామనుకుని, త్రాసుతెప్పించి తూచిఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.

కానీ, _వింత_, ఎంత ధనమేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరితూగలేదు.

*దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం.*

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బక్క బ్రాహ్మణుని శక్తి తెలియకవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.


*జై గాయత్రీమాత*

కామెంట్‌లు లేవు: