26, సెప్టెంబర్ 2024, గురువారం

Panchaag


 

27. " మహాదర్శనము

 27. " మహాదర్శనము "--ఇరవై ఏడవ భాగము-- బ్రహ్మత్వపు కానుక


27. ఇరవై ఏడవ భాగము--  బ్రహ్మత్వపు కానుక 



         యథాకాలములో స్వస్తి వాచనము , అంకురార్పణము , గృహ యజ్ఞము , నాందీ శ్రాద్ధములు నెరవేరినవి . కుమారునికి చౌలమూ , మాతృ సహ భోజనమూ అయి , వాడిని అలంకరించి ఆచార్యుని వద్దకు పిలుచుకొని వచ్చినారు . బుడిలులు పురోహితులై లేచి నిలచి , సదస్సుకు అభివాదము చేసి , " ఇది వైదిక కర్మ. ఇది సఫలమగునట్లు సదస్సులోని వారందరూ అనుగ్రహించవలెను . తమ ఆశీస్సులు సఫలమగుటకు తామెల్లరూ దేవతామూర్తులై కూర్చోవలెను . " అని ప్రార్థించి  ఆచార్యుని వైపుకు తిరిగి తాము బ్రహ్మయై కూర్చున్నారు . 


         ఆచార్యుడు మంత్రాధిదేవతయే తానైనట్లు ప్రతియొక్క మంత్రము చెప్పునపుడూ ఆయా దేవతలను తనలో ఆవాహించుకొని కర్మమును నెరవేర్చినాడు. భిక్షాచర్య వరకూ సర్వమూ నడచింది . వటువు దేవాంశలతో కూడి , వేదములను పరిగ్రహించినాడు . సూర్యదర్శనము చేయించినపుడు సవితృడిని ప్రార్థించి సావితృ కిరణమును పొంది హృదయములో ధారణము చేసి తానే ఇంకొక సవితృడయినాడా అన్నట్టు ప్రకాశించినాడు . అతడు , ’ భో , సావిత్రీం అనుబ్రూహి ’ , అని అడిగి దానిని క్రమ క్రమముగా పదశః , అర్థశః  పూర్తిగా పొందినపుడు , వెనుక బ్రహ్మను మెప్పించి , వేదములను ముష్టి ముష్టిగా ( పిడికెళ్ళతో )  పొందిన భారధ్వాజుడే అందరికీ గుర్తుకొచ్చినాడు . 


         కులపతులకు అంతులేని సంతోషము . బహుశః వారికన్నా ఎక్కువ సంతోషమును పొందినవాడు ఆ సభలో ఒకడే ఒకడు . ఆతడు జనక మహారాజు . అతడికి వటు యాజ్ఞవల్క్యుని చూచినపుడు కనిపించినది కేవలము వటువు కాదు , లోకోద్ధార కర్త యైన మహా బ్రాహ్మణుడొకడు ఆ వామన మూర్తిలో అణగిపోయి కూర్చున్నట్టే తోచింది . " నేను రాజ్యమును ధర్మముగా పాలించుట సార్థకమైనది. కురు , పాంచాల , మద్ర , కాశీ దేశములలో ఉన్న విద్వాంసులందరి కన్నా శ్రేష్ఠుడై , కర్మ , బ్రహ్మలు రెండింటిలోనూ మిగిలినవారికన్నా జ్యేష్ఠుడైన మహానుభావుడొకడు తన రాజధానిలోనే అవతరించినాడు . " అని అతనికి కలిగిన సంతోషము అంతా ఇంతా కాదు . . వెనుకటి రోజు బుడిలులు ఆచార్యునికి బోధించినదంతా భార్గవుడి ద్వారా విన్న రాజు దానినంతటినీ కళ్ళారా చూచి ఆనంద పరవశుడైనాడు . 


          భిక్ష ప్రారంభమైనది , మాతృభిక్ష అయినది , మాతామహాది భిక్షలైనవి , కులపతుల పత్నులు భిక్షనిచ్చినారు . అనంతరము క్షత్రియుల భిక్ష అయినది . రాజు నూతన వటువుకు బంగారము , రత్నములను కానుకగా ఒసగి , " మమ్ములను ఉద్ధరించి , ’ ఈతనికి ఈ రాజ్యమును ఇచ్చినా సరిపోదు ’ , అనిపించుకొనునట్టి విద్వద్వరిష్ఠుడవు కమ్ము" అని ఆకాంక్షించినాడు . అక్కడికి వచ్చిన వైశ్యులు కూడా భిక్షను ఇచ్చినారు . 


        ఆచార్యుడు ఆ భిక్ష ద్రవ్యమునంతా తనకు అర్పించిన వటువుకు ఆశీర్వాదము చేసి , బుడిలులకు సమర్పించినాడు . బుడిలులు దానిలో కొంత తీసియుంచుకొని , మిగిలినదంతయునూ బ్రహ్మ భోజన దక్షిణాదులకని ఇచ్చివేసినారు . 


         మహారాజు తన అనుయాయులైన రాజపుత్రులతో పాటు వెడలినపుడు ఒక విచిత్రము జరిగింది . వెంట భార్గవుడు కూడా ఉన్నాడు . బయలుదేరి నిలచినరాజు , కులపతులనూ , బుడిలులనూ చూడవలెనని అనుకున్నాడు . ఆచార్యుని పక్షాన వచ్చిన మహిదాసుడు వారు ముగ్గురినీ పిలుచుకు వచ్చాడు . వారు వస్తుండగా , రాజు భార్గవులను రహస్యముగా వద్దకు  పిలచి , " అభివాదన చేయు క్రమమేది ? " అన్నాడు . అతడు కూడా రహస్యముగానే , ’ బ్రహ్మ విద్యా సంపన్నులైన కులపతులు కాబట్టి మొదట ఉద్ధాలకులకు , కర్మ విద్యా సంపన్నులైనందుకు ద్వితీయం గా వైశంపాయనులను , అనంతరము ఈదినపు బ్రహ్మత్వమును అంగీకరించియున్న బుడిలులకు ’ అన్నాడు . 


       అంతలో ముగ్గురూ వచ్చినారు . మహారాజు మొదట బుడిలులకు , తరువాత ఉద్ధాలకులకు , వైశంపాయనులకూ నమస్కారములు చేసి , " వ్యుత్క్రమమై ఉంటే , క్రమము తప్పి ఉంటే క్షమించవలెను ’ అని మరియొక సారి చేతులు జోడించినాడు . 


        కులపతులిద్దరూ , " మహారాజులు చేసినది సక్రమముగానే ఉన్నది . బుడిలులు వయస్సులోనే కాదు , జ్ఞానములోనూ మాకంటే తక్కువేమీ కాదు " అని ప్రసన్నముగా అన్నారు . బుడిలులు , " తప్పుకాదేమి , తమరు కులపతులు , మాకు చివరలో జరగవలసినది , ఏదో జరిగిపోయింది , వదిలేయండి " అని గొణుక్కున్నారు . 


      మహారాజు , " ఈ దినము వేదమూర్తులు బ్రహ్మత్వములో ఉన్నారు . మేము ఒక వరమును అడుగవలెనని యున్నాము " అని వినయముగా అన్నాడు .


వైశంపాయనులు , ’ వరమును అడుగుటకు ఇదే సకాలము . ఇక వారు లేదనుటకు లేదు ’ అన్నారు . 


        " బుడిలులకు ఒక గ్రామమును కానుకగా సమర్పించవలెనన్న మా కోరికను మన్నించి అంగీకరించవలెను . " 


         బుడిలులు నవ్వుచూ , " కులపతుల వలననూ , ఈ దినపు బ్రహ్మత్వము వలననూ మా నోరు కట్టివేయబడినది. ఇలాగ సందర్భమును గమనించి గెలిచిన మహారాజావారు ఒక నిబంధన పూర్వకముగా మేము దానిని అంగీకరించుటను ఒప్పుకోవలెను . " అన్నారు . 


" అటులనే , అనుజ్ఞ ఇవ్వవలెను " 


         " మా ఇంటికి సవారీ వచ్చి దానిని యజ్ఞేశ్వరునికి సమర్పించవలెను . రాజాస్థానము ఎంతైనా లక్ష్మీ స్థానము . అక్కడి వచ్చినపుడు ఆ వైభవాదులు మావంటి వారికి చపలమును పుట్టించగలవు. మా తల గట్టిగా ఉన్ననూ రాళ్ళు తగలరాదు కదా ? " 


         మహారాజు ఒప్పుకున్నాడు . బుడిలులు తాము నిస్సహాయంగా దొరికిపోయినందుకు అర్థం లేని నవ్వు నవ్వుచూ , ’ యాజ్ఞవల్క్యుడి యజ్ఞములో బ్రహ్మనైనందుకు ప్రత్యక్ష ఫలము దొరికింది , చూచితిరా ? ఇక మీరిద్దరూ కులపతులుగా వాడి గురువు లైనపుడు మీకెంతటి ఫలములు లభించునో ? " అన్నారు .


         కులపతులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు . " ఒక వటువు రెండు ఆశ్రమములలో గురుకులమును చేయుట ఎలాగ ? " అన్న సంశయము ఇద్దరి ముఖాలలోనూ కొండంతగా కనిపించింది . బుడిలులు దానిని చూచి , " నేను చెప్పకూడదనే అనుకున్నాను , దైవము పలికించింది . కానివ్వండి , స్పష్టమగ్రే భవిష్యతి " అని , ఆచార్యుడూ , వటువూ ఉన్నచోటికి వెళ్ళినారు . 


         అక్కడ ఆచార్యుడిని సాక్షిగా నుంచుకొని , వటువును  ’ వ్రతమెన్ని దినములు ? ’ అని అడిగినారు .  వటువు వామనుడిగా కనిపించిననూ త్రివిక్రముడిలా మాట్లాడుచూ , " మొదటగా ఆచార్యులూ , తమరూ ఎన్ని దినములంటే అన్ని దినములు వ్రతము చేయుట నా కర్తవ్యము . అలాకాక , నన్ను అడిగితే , మూడు దినములు చాలు " అన్నాడు . 


బుడిలులు తమకు కావలసినది అదేనన్నట్టు తలయూపుతూ , ’ ఆచార్యుల అనుజ్ఞ ఎలా ఉన్నది ? " అన్నారు . 


         ఆచార్యుడు అన్నాడు , " నిన్నటి దినము తమరి నోటివెంట వచ్చినదంతయూ ఈ దినము కనులారా చూచితిని . ’ ఆచార్యుని చిత్తానికి అనుచిత్తుడవు కమ్ము ,  , అతని మాట ప్రకారము  నడచుకో ’ అని తమ ఆదేశమని, శృతి విహితమనీ అన్ననూ , వ్రతములను విధాయకముగా చేసిననూ , వ్రతమెన్ని దినములు అనుదానిని నిర్ణయించవలసినది ఆతడు . ఆతడు చెప్పినట్లే కానివ్వండి " . వ్రతము మూడు దినములనీ , నాలుగవ రోజు మేధా జననమనీ నిర్ణయింపబడినది . 

Janardhana Sharma

సమస్యకు నాపూరణ.

 *నీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్*

ఈ సమస్యకు నాపూరణ. 


మోతల్ మ్రోగెను శుష్కవాదనలతో మూర్ఖంపు సమ్మేళనన్


తాతల్  నేతులు తాగినారనుటయే  తర్కంబుగా  జూపుచున్ 


రీతుల్ మృగ్యము న్యాయ ధర్మము లనన్ రిక్తంబులే సభ్యతన్ 


నీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్. 



అల్వాల లక్ష్మణ మూర్తి.

బ్రాహ్మణుడు

 CEO గూగుల్ - సుందర్ పిచాయ్ - బ్రాహ్మణుడు

మైక్రోసాఫ్ట్ CEO - సత్య నాదెళ్ల - బ్రాహ్మణుడు

CEO యూట్యూబ్ - నీల్ మోహన్ - బ్రాహ్మణుడు

CEO అడోబ్ - శంతను నారాయణ్ - బ్రాహ్మణుడు

CEO IBM - అరవింద్ కృష్ణన్ - బ్రాహ్మణ

CEO Motorola Mobi - సంజయ్ ఝా - బ్రాహ్మణుడు

CEO ఆల్బర్ట్సన్స్ - వివేక్ శంకరన్ - బ్రాహ్మణుడు

ఈ CEO లందరూ జనరల్ కేటగిరీకి చెందినవారునే...


ఇక్కడ మన దేశంలో వున్న రిజర్వేషన్ల కారణంగా అత్యంత గొప్ప ప్రతిభావంతుల్ని భారతదేశం కోల్పోయింది.

వారి ప్రతిభను అందిపుచ్చుకొని అమెరికా బాగుపడుతున్నది.

ఆచార్య సద్బోధన

 ✳️ *ఆచార్య సద్బోధన*✳️

                  ➖➖➖


*పిల్లలకి డబ్బులు సంపాదించే విద్యలు నేర్పి ...*


*వాళ్లు పెద్దయ్యాక*

*డబ్బు సంపాదనలో పడి..*

*మనుషులను పట్టించుకోవడం లేదు అంటే ..*


*తప్పు పిల్లలదా ...?*


*మనం కాసేపు ఆగాలి...!*

*సంపాదించడమే జీవితమా. .?*

*సుఖ పడడమే లక్ష్యమా .. ?*

*ఆలోచించాలి ...!.*


*ఆరోగ్యం ...*

*కుటుంబం పట్ల శ్రద్ధ*

*మన మనసుని సరైన మార్గంలో పెట్టే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం ..*

*ఇవన్నీ కూడా ....*

*సంపూర్ణ సుఖమయ జీవనానికి సరైన పోషక పదార్థాలు ...*


*అలా కాసేపు*

*ఆగడానికి చేయవలసిన పని ...*


*జపం / ధ్యానం ...*


*ధర్మో రక్షతి రక్షితః*


          ✳️*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏*

తులసిదళములు

 ✳️*తులసిదళములు గురించి తెలుసుకోండి*✳️


*తుల స్యమృత జన్మాసి సదా త్వం కేశవప్రియే*

*కేశవార్థం ఛినోమి త్వాం వరదాభయ శోభనే!*


*త్వదంగసంభవై ర్నిత్యం పూజయామి యథా హరిం*

*తథా కురు పవిత్రాంగి కలౌ మలవినాశిని!*


*మంత్రే ణానేన యః కుర్యాత్ విచిత్య తులసీదళం*

*పూజనం వాసుదేవస్య లక్షకోటిగుణం భవేత్!*


*భావము :*


ఈ పై మంత్రమును ఉచ్ఛరించుచు తులసి దళములను కోసి వాసుదేవుని పూజించినచో లక్షకోటిరెట్లు ఫలము లభించును.


*తులసీపత్ర గలితం య స్తోయం శిరసా వహేత్*

*గంగాస్నాన మవాప్నోతి దశధేను ఫలప్రదమ్!!*


*భావము :*


తులసీదళము నుండి పడిన ఉదకమును శిరమున ధరించినచో గంగాస్నానము చేసినట్లగును. దశధేనుదాన ఫలము నిచ్చును.

                                --పద్మపురాణం


*పూర్ణిమాయా మమాయాంచ ద్వాదశ్యాం రవిసంక్రమే!*

*తైలాభ్యంగే చాస్నాతే చ మధ్యాహ్నే నిశి సంధ్యయోః!!*


*అశౌచే౬శుచికాలే వా రాత్రివాసాన్వితా నరాః!*

*తులసీం యే చ చ్ఛిందంతి తే ఛిందంతి హరేః శిరః!!*


*భావము :* 


పూర్ణిమనాడు, అమావాస్యనాడు, ద్వాదశి రోజున, సూర్యసంక్రమణ దినమున, తలంటుకొనునపుడు, స్నానము చేయకుండగ మధ్యాహ్న కాలమందు, రాత్రియందు, ఉభయసంధ్యలందు, అశౌచమందు, పరిశుద్ధతగా లేనప్పుడు, రాత్రి కట్టిన బట్టతో ఉన్నప్పుడు తులసిని జనులు త్రుంచరాదు. అట్లు త్రుంచువారు విష్ణువు శిరమును త్రుంచిన వారగుదురు.

                     

**** శ్రీ కృష్ణార్పణం🙏*****

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


 శని..శని..శని అని పిలువకూడదు...

శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు?


🔅 శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. 

కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. 

శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే?


 ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు.


నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, 

రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం.

ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. 


శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. 

"శనీశ్వరుడు" అని మాత్రమే అనాలి.


ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. 

శివుడిని ఈశ్వరుడు అంటాం. 

మహేశ్వరుడు అని కూడా అంటాం. 

అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.


నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. 




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

త్యాగమూర్తులే

 🌹 *నేటి సత్సంగం* 🌹


🙏 *నాన్న , నాగలి ఇద్దరూ త్యాగమూర్తులే* 🙏 


తలక్రిందులైనా సరే...

కష్టించి అన్నం పెడతారు..!

మట్టిలో కూరుకుపోతున్నా సరే...

ముందుకు సాగుతూనే వుంటారు..!

ప్రయాణంలో రాళ్ళు వున్నా సరే...

గాయాలను లెక్క చేయక ,

ముందుకి నడుస్తూనే వుంటారు..!

ఎందుకంటే..?!

వారు అలసిపోతే అన్నం ఆగిపోతుంది..!

ఇంతా చేసి తెరవెనకే వుంటారు...

కానీ, తెగదెంపులు చేసుకోరు..!

🙏ఇదే నాన్నలో వున్న నాణ్యత..

నాగలి నేర్పే నాగరికత..!


🌹 *గోసాం శివప్రసాద శాస్త్రి* 🌹

భగవద్గీతను

 *1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత  మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.

*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగ

By Brahmana Samaakhya🙏

సింహంలా ధైర్యంగా

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏           🏵️ *సింహంలా ధైర్యంగా పరిగెత్తలని అందరికి ఉంటుంది.. కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యాన్ని నేర్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది.. కొన్ని సార్లు మొండి ధైర్యం కంటే చాకచక్యమే మేలు చేస్తుంది* 🏵️సంపాదించే తెలివి ఉన్నవాడు  పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు.. గెలిచే దమ్ము ఉన్నవాడు ఓటమి గురించి బాధపడడు.. బలమైన బలహినమైన అంతా ఆలోచించ్చే విధానంపై ఆధారపడుతుంది🏵️మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్యం నూతన మార్గాలు అన్వేషంచాలి.. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో.. తక్కువవాడిననుకోవడం కూడా అంతే తప్పు..మొదటిది గర్యానికి, రెండవది పిరికితనానికి దారితిస్తుంది🏵️ *స్వచ్చమైన బంగారం ఒక పరిపూర్ణమైన అకారం కావాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థాయికి రావాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు*🏵️🏵️ మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్. D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా .రాజమండ్రి. వైద్య సలహాలు ఉచితం🙏🙏🙏🙏

ధర్మ సూక్ష్మం

 ధర్మ సూక్ష్మం


కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాల పాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.

అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు.

ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజునుచంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనేఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను s క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. ధర్మరాజు, అర్జునులకు అదొక విషమ సందర్భం. సమయంలో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపమంటుంది. ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొంతమంది వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంత సేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష

కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణపరమాత్మ మాటలు విని అర్జునుడు ధర్మ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఒక ధర్మమర్మాన్ని తెలియజేశాడు. గౌరవించదగిన పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీకృష్ణుడు అతణ్ని ఆపి పరుల ఎదుట ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశం అవుతుందని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.


గోలి రామచంద్రరావు

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - నవమి - పునర్వసు -‌‌ గురు వాసరే* (26.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ధర్మ సందేహాలు

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

         *ధర్మ సందేహాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రతి మనిషి నిత్యం పూజ చేస్తున్నప్పుడు ఏ యే గుణములను ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించాలి.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రతి మనిషి నిత్యం పూజ చేస్తున్నప్పుడు 16 గుణములను ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించాలి. అవి*


1.దీర్ఘాయువు


2.ఆరోగ్యం


3.కార్యసాఫల్యం


4.సంపద


5.వృద్ధి


6.స్థిరత్వం


7.వీర్యం (ధైర్యం)


8.ధర్మం


9.అర్థం


10. కామం


11. మోక్షం


12. భక్తి


13. జ్ఞానం


14.వైరాగ్యం


15.పాప భంజనం


16.పుణ్య ఆచరణం


*ఇవన్ని ఎలా అడగాలో మనకి తెలియదు కనుక ఒకవేళ తెలిసినా అడుగవలసిన వరుస గుర్తుండదు కనుక దేనితో దేనికి సంబంధం ఉంటుందో, దాన్ని సాధింపగల నామాన్ని గుణంగా తీసుకుని వినాయకుడి షోడశ నామాలుగా ఋషులు క్రోడీకరించారు.ఆ నామాలను శోక రూపంలో మనం నిత్యం పూజ చేసేటప్పుడు పఠించవచ్చు.*


*"సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః।*

*లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।*

*ధూమకేతు: గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః ।*

*వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః ।*


*షోడశైతాని నామాని పఠేశృణుయాదపి*

*విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా*

*సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే!!*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

సంస్కృత వాక్యాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *పుస్తకం వనితా విత్తం*

      *పర హస్తం గతం గత:।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*పుస్తకం వనితా విత్తం*

*పర హస్తం గతం గత:।*


*అధవా పునరా యాతి*

*జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:॥*


*భావము:~*


*పుస్తకము, స్త్రీ, ధనం వీటిని పోగొట్టుకున్నా, ఇంకెవరి వద్దనైనా ఉంచినా అవి తిరిగిరావు. ఒకవేళ తిరిగి యజమాని చేతికి వస్తే ‘పుస్తకం చినిగి, పేజీలు పోయి, నలిగి జీర్ణావస్థలో చేరుతుంది. స్త్రీ అవమానం పొంది, శీలం కోల్పోయి, యజమానిపై మనసు చచ్చి లేదా పిచ్చిదై రావచ్చు. ధనం వాయిదాల పద్దతిలో గాని, తక్కువ పరిమాణంలోగాని జగడాలతో, తొలి స్నెహాన్ని చెరచి అందుతుంది’. పై ప్రాణ సమాన విలువలున్న సంపదను 'ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవాలని, కాపాడుకోవాలని' శాస్త్రకారుని భావన.*


*కాలం మారింది, సాంప్రదాయాలు మారిపోయాయి, వ్యవస్థల్లో మార్పులొచ్చాయి, సాంకెతికాభివృద్ధి ఎంతగానో పెరిగినా మానవ నైజం మారలేదు. పై విలువైన ప్రాణప్రదమైన సంపద కు రక్షణ అనాదికాలములో ఎలాఉందో ఇప్పుడూ అలాగే ఉంది.*

 

*మనవద్ద ఎవరైనా పుస్తకం చదివి ఇస్తానని తీసుకుంటే 99% ఆ పుస్తకం మనం అడగందే తిరిగిరాదు. వచ్చినా నలిగిపోయి, పేజీలు చినిగి లేదా మాయమై, మనమిచ్చినప్పటి ఆకృతి కోల్పోయి రావటానికైతే తిరిగివస్తుంది. కాని మీకు ఆ రాకడలో సంతృప్తి ఉండదు.*

 

*ఇక వనిత గురించి చెప్పనవసరం లేదు. భారత రాజధానిలోనే నిర్భయ ఘటన, కేరళ లోని జెస్సీ, తమిళనాడ్ లో స్వాతి, ఆంధ్రలో జ్యోతి.....ఇలా అతివలు ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు, ఇక్కడ అక్కడ అనే తేడాలేదు.*


*బాంకులనుండే విత్తం, అంటే డబ్బు అప్పుగా తీసుకొని దేశాల సరిహద్దులు దాటే విజయ మాల్యాలు, వైభవం, భయం లేకుండా అనుభవించే కావూరి లాంటి వాళ్ళ సంఖ్యకు అంతేలేదు. మనమెవరికైనా డబ్బు ఇస్తే చాలు కొత్తగా శతృవు దొరికినట్టే. "సొమ్మూ పాయే శనిబట్టే" అనే సామెతకు అర్ధం పక్కాగా తెలుస్తుంది.*


*సుమారు 33000 యేళ్ళ క్రితం వ్రాయబడ్డ ఈ సంస్కృత శ్లొకం ఇప్పటికీ తాజా గానే ఉంది. ఇంత కాలం గతించినా కాలచక్ర భ్రమణం ఈ శ్లోకము లోని భావాన్ని ఇసుమంతైనా మార్చలేదు. అంతే భారతీయ సాహితీ విజ్ఞాన భాండా గార మంతా పరిశొధించి, పరిశీలించి, ప్రయోగాత్మకంగా చూసి రాయబడినవే. ప్రాచుర్యములోనికి వచ్చినవే. అందుకే భారతీయ సాహిత్యాన్ని సంపద తో పోల్చి సాహితీ సంపద అనే అంటారు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

ఆరోగ్య దినోత్సవ

 *అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

 🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻

 🄷🄴🄰🄻🅃🄷 🄳🄰🅈

 గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

 1. BP: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాస: 12-16

 5. హిమోగ్లోబిన్: మగ -13.50-18

 స్త్రీ - 11.50 - 16

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

 11. చక్కెర స్థాయి: పిల్లలకు (70-130) పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్: 1,50,000 - 4,00,000

 15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

 16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

 17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

 18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

  ప్రత్యేక చిట్కాలు:*

 *1- మొదటి సూచన:* మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు త్రాగాలి, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా. రోజుకు కనీసం 2 లీటర్లు.

 *2- రెండవ సూచన:* శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి, నడక, ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఉండాలి.

 *3-3వ చిట్కా:* తక్కువ తినండి... ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి... ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాన్ని తగ్గించండి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా వాడండి.

 *4- నాల్గవ సూచన:* ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు. మీరు కిరాణా సామాను తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే, మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

 *5- 5వ సూచన* కోపాన్ని విడిచిపెట్టండి, చింతించడం మానేయండి, విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి. సమస్యాత్మక పరిస్థితులలో మునిగిపోకండి, అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ యొక్క కీర్తిని తీసివేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి.

 *6- ఆరవ సూచన* 

 మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, నవ్వండి మరియు మాట్లాడండి!  

 *7-7వ గమనిక* మీరు సాధించలేని దేని గురించి గురించి చింతించకండి.

 దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

 *8- ఎనిమిదో నోటీసు* డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం;

 ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది.

 *9- తొమ్మిదవ చిట్కా* ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. జ్ఞాపకాలను సృష్టించండి!

 *10- 10వ సూచనలు* మీ చిన్నారులను ప్రేమ, సానుభూతి మరియు ఆప్యాయతతో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి!

 గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అందరితో కలిసిపోండి!


 *ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

హైందవం వర్ధిల్లాలి 12*

 *హైందవం వర్ధిల్లాలి 12*


 *ఆధునికత, నాగరికత పేరుపై ఆచార వ్యవహారాల భ్రష్టత్వం కూడదు*.iv ):- కేశములు = కేశాలంకరణ :- 

కేశముల నానార్థములు:- శిరోజాలు, కురులు, కుంతలములు, జుట్టు, శిఖ. మన భారత దేశంలో పురుషులు, బాలురు కత్తిరించబడిన జుట్టుతో, స్త్రీలు, బాలికలు పొడవాటి జుట్టుతో సంప్రదాయంగా ఉంటారు, ఉండాలి. భారత దేశంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కలదు. మహిళలు, బాలికలు విలక్షణమైన మధ్య పాపిడితో సొగసైన కేశాలంకరణలతో, ఒంటి పువ్వు (ఒక గులాబి, ఒక చామంతి) సింగారంతో, మరోసారి వాలు జాడ, ఆసాంతం పువ్వుల దండ అన్వయంతో, మరికొన్ని సార్లు అర్ధ చంద్రాకారపు కొప్పు, వాటిపై తెల్ల మల్లెలు, సన్న జాజులతో చిన్నా పెద్దా అను భేదం లేకుండా చూపరులందరికి దేవ కన్యలలా అగుపడి మంత్ర ముగ్ధుల్ని చేసేవారు. హిందూ సంప్రదాయం అటువంటి పరిపూర్ణ అందాన్ని సమకూరుస్తుంది. *మరాళ కుంతలులైన నీల వేణుల సౌందర్యం వర్ణించతరమా* 

అన్నాడొక కవి. పురుషుల గిరిజాలకు, మీసాలకు, గడ్డాలకు గూడా ప్రశస్తి ఉండేది. శౌర్య వీర ప్రతాపాలకు మీసం ఒక చిహ్నంగా ఉండేది. *ఈ కేశముల వలననే శ్రీ మహా విష్ణువు కేశవుడని, పరమ శివుడు ఝటా ఝూటదారి అని నామాంకితులైనారు*. 


ఇంతటి చరిత్ర గల హైందవ సంప్రదాయ కేశ సంపదను వెంట్రుక ముక్కలాగా తీసివేస్తూ పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతున్నారు నేటి యువత. మన ప్రయాణం ఎటో ఎంతవరకు సమంజసమో సభ్యులే ఆలోచించాలి. 


గత నాలుగు దశబ్దాలుగా మన దేశంలో, స్త్రీ మరియు పురుష కేశ విధానాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషులవుతే రింగు రింగు జుట్టు, హిప్పీ జుట్టు, హాఫ్ కట్, మెషీన్ కట్, నున్నటి గడ్డాలు, తల్వార్ మీసాలు ఇత్యాది. స్త్రీలలో Harry cut, koi pure styling, Bridal hair style, Pony tail, Trendy style, Western look ఇంకా ఎన్నెన్నో. అవుతే, ఇవన్నీ వారికి క్షేమ సౌకర్యాలా... అంటే అది చెప్పలేని స్థితి. "*కేశ క్లేశాల" వివరాలు గూడా ఉన్నాయి*. అతి నవీనత కొరకు Beauty parlor లకు వెళ్లి ఉన్న కేశాలు నష్ట పోయిన ఉదంతాలు గూడా సామాన్యమే. 


సభ్యులందరూ ఆలోచించాలి. మనం ఎటు పయనిస్తున్నాము. అన్ని విషయాలలో హిందూ సంప్రదాయాలు పాటించి సంఘటితమవుదామా లేక ఇచ్చ వచ్చిన జీవన విధానాలననుసరించి బలహీన పడదామా. మీ వద్ద నుండి బలమైన సమాధానం సంప్రదాయాలు పాటిద్దామనేకదా!. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

గురువారం*🌷 🌹 *సెప్టెంబర్,26, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

🌹 *సెప్టెంబర్,26, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*

                 

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి     : నవమి* మ 12.25 వరకు ఉపరి *దశమి*

*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పునర్వసు* రా 11.34 వరకు ఉపరి *పుష్యమి*


*యోగం  : పరిఘ* రా 11.41 వరకు ఉపరి *శివ*

*కరణం  : గరజి* మ 12.25 *వణజి* రా 12.48 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 09.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*రా 09.03 - 10.43*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.23*


*వర్జ్యం      : ఉ 10.59 - 12.38*

*దుర్ముహూర్తం  : ఉ 09.58 - 10.46 మ 02.47 - 03.35*

*రాహు కాలం :మ 01.29 - 02.59*

గుళికకాళం      : *ఉ 08.58 - 10.28*

యమగండం    : *ఉ 05.57 - 07.27*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.57* 

సూర్యాస్తమయం :*సా 06.00*

*ప్రయాణశూల   : దక్షిణం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.57 - 08.21*

సంగవ కాలం   :*08.21 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.11*

అపరాహ్న కాలం:*మ 01.11 - 03.35*

*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ దశమి*

సాయంకాలం  :  *సా 03.35 - 06.09*

ప్రదోష కాలం  :  *సా 06.00 - 08.23*

రాత్రి కాలం     :  *రా 08.23 - 11.35*

నిశీధి కాలం     :*రా 11.35 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


*గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః* |

*గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః*


   *ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🌹🌹🌿🍃🌹