*హైందవం వర్ధిల్లాలి 12*
*ఆధునికత, నాగరికత పేరుపై ఆచార వ్యవహారాల భ్రష్టత్వం కూడదు*.iv ):- కేశములు = కేశాలంకరణ :-
కేశముల నానార్థములు:- శిరోజాలు, కురులు, కుంతలములు, జుట్టు, శిఖ. మన భారత దేశంలో పురుషులు, బాలురు కత్తిరించబడిన జుట్టుతో, స్త్రీలు, బాలికలు పొడవాటి జుట్టుతో సంప్రదాయంగా ఉంటారు, ఉండాలి. భారత దేశంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కలదు. మహిళలు, బాలికలు విలక్షణమైన మధ్య పాపిడితో సొగసైన కేశాలంకరణలతో, ఒంటి పువ్వు (ఒక గులాబి, ఒక చామంతి) సింగారంతో, మరోసారి వాలు జాడ, ఆసాంతం పువ్వుల దండ అన్వయంతో, మరికొన్ని సార్లు అర్ధ చంద్రాకారపు కొప్పు, వాటిపై తెల్ల మల్లెలు, సన్న జాజులతో చిన్నా పెద్దా అను భేదం లేకుండా చూపరులందరికి దేవ కన్యలలా అగుపడి మంత్ర ముగ్ధుల్ని చేసేవారు. హిందూ సంప్రదాయం అటువంటి పరిపూర్ణ అందాన్ని సమకూరుస్తుంది. *మరాళ కుంతలులైన నీల వేణుల సౌందర్యం వర్ణించతరమా*
అన్నాడొక కవి. పురుషుల గిరిజాలకు, మీసాలకు, గడ్డాలకు గూడా ప్రశస్తి ఉండేది. శౌర్య వీర ప్రతాపాలకు మీసం ఒక చిహ్నంగా ఉండేది. *ఈ కేశముల వలననే శ్రీ మహా విష్ణువు కేశవుడని, పరమ శివుడు ఝటా ఝూటదారి అని నామాంకితులైనారు*.
ఇంతటి చరిత్ర గల హైందవ సంప్రదాయ కేశ సంపదను వెంట్రుక ముక్కలాగా తీసివేస్తూ పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతున్నారు నేటి యువత. మన ప్రయాణం ఎటో ఎంతవరకు సమంజసమో సభ్యులే ఆలోచించాలి.
గత నాలుగు దశబ్దాలుగా మన దేశంలో, స్త్రీ మరియు పురుష కేశ విధానాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషులవుతే రింగు రింగు జుట్టు, హిప్పీ జుట్టు, హాఫ్ కట్, మెషీన్ కట్, నున్నటి గడ్డాలు, తల్వార్ మీసాలు ఇత్యాది. స్త్రీలలో Harry cut, koi pure styling, Bridal hair style, Pony tail, Trendy style, Western look ఇంకా ఎన్నెన్నో. అవుతే, ఇవన్నీ వారికి క్షేమ సౌకర్యాలా... అంటే అది చెప్పలేని స్థితి. "*కేశ క్లేశాల" వివరాలు గూడా ఉన్నాయి*. అతి నవీనత కొరకు Beauty parlor లకు వెళ్లి ఉన్న కేశాలు నష్ట పోయిన ఉదంతాలు గూడా సామాన్యమే.
సభ్యులందరూ ఆలోచించాలి. మనం ఎటు పయనిస్తున్నాము. అన్ని విషయాలలో హిందూ సంప్రదాయాలు పాటించి సంఘటితమవుదామా లేక ఇచ్చ వచ్చిన జీవన విధానాలననుసరించి బలహీన పడదామా. మీ వద్ద నుండి బలమైన సమాధానం సంప్రదాయాలు పాటిద్దామనేకదా!. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి