🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*వాడుకలోని సంస్కృత వాక్యాలు*
*వాటి పూర్తి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*పుస్తకం వనితా విత్తం*
*పర హస్తం గతం గత:।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*పూర్తి శ్లోకం :~*
*పుస్తకం వనితా విత్తం*
*పర హస్తం గతం గత:।*
*అధవా పునరా యాతి*
*జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:॥*
*భావము:~*
*పుస్తకము, స్త్రీ, ధనం వీటిని పోగొట్టుకున్నా, ఇంకెవరి వద్దనైనా ఉంచినా అవి తిరిగిరావు. ఒకవేళ తిరిగి యజమాని చేతికి వస్తే ‘పుస్తకం చినిగి, పేజీలు పోయి, నలిగి జీర్ణావస్థలో చేరుతుంది. స్త్రీ అవమానం పొంది, శీలం కోల్పోయి, యజమానిపై మనసు చచ్చి లేదా పిచ్చిదై రావచ్చు. ధనం వాయిదాల పద్దతిలో గాని, తక్కువ పరిమాణంలోగాని జగడాలతో, తొలి స్నెహాన్ని చెరచి అందుతుంది’. పై ప్రాణ సమాన విలువలున్న సంపదను 'ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవాలని, కాపాడుకోవాలని' శాస్త్రకారుని భావన.*
*కాలం మారింది, సాంప్రదాయాలు మారిపోయాయి, వ్యవస్థల్లో మార్పులొచ్చాయి, సాంకెతికాభివృద్ధి ఎంతగానో పెరిగినా మానవ నైజం మారలేదు. పై విలువైన ప్రాణప్రదమైన సంపద కు రక్షణ అనాదికాలములో ఎలాఉందో ఇప్పుడూ అలాగే ఉంది.*
*మనవద్ద ఎవరైనా పుస్తకం చదివి ఇస్తానని తీసుకుంటే 99% ఆ పుస్తకం మనం అడగందే తిరిగిరాదు. వచ్చినా నలిగిపోయి, పేజీలు చినిగి లేదా మాయమై, మనమిచ్చినప్పటి ఆకృతి కోల్పోయి రావటానికైతే తిరిగివస్తుంది. కాని మీకు ఆ రాకడలో సంతృప్తి ఉండదు.*
*ఇక వనిత గురించి చెప్పనవసరం లేదు. భారత రాజధానిలోనే నిర్భయ ఘటన, కేరళ లోని జెస్సీ, తమిళనాడ్ లో స్వాతి, ఆంధ్రలో జ్యోతి.....ఇలా అతివలు ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు, ఇక్కడ అక్కడ అనే తేడాలేదు.*
*బాంకులనుండే విత్తం, అంటే డబ్బు అప్పుగా తీసుకొని దేశాల సరిహద్దులు దాటే విజయ మాల్యాలు, వైభవం, భయం లేకుండా అనుభవించే కావూరి లాంటి వాళ్ళ సంఖ్యకు అంతేలేదు. మనమెవరికైనా డబ్బు ఇస్తే చాలు కొత్తగా శతృవు దొరికినట్టే. "సొమ్మూ పాయే శనిబట్టే" అనే సామెతకు అర్ధం పక్కాగా తెలుస్తుంది.*
*సుమారు 33000 యేళ్ళ క్రితం వ్రాయబడ్డ ఈ సంస్కృత శ్లొకం ఇప్పటికీ తాజా గానే ఉంది. ఇంత కాలం గతించినా కాలచక్ర భ్రమణం ఈ శ్లోకము లోని భావాన్ని ఇసుమంతైనా మార్చలేదు. అంతే భారతీయ సాహితీ విజ్ఞాన భాండా గార మంతా పరిశొధించి, పరిశీలించి, ప్రయోగాత్మకంగా చూసి రాయబడినవే. ప్రాచుర్యములోనికి వచ్చినవే. అందుకే భారతీయ సాహిత్యాన్ని సంపద తో పోల్చి సాహితీ సంపద అనే అంటారు.*
*శ్రీ గురుభ్యో నమః।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి