3, జూన్ 2024, సోమవారం

మధుమేహం

 మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.


       మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది.  మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది .  మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము.  జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.


   మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -


   పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద  గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.


  తీసుకోకూడని ఆహారపదార్థాలు -


       తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .


 మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు -


 *  పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.


 *  ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని  ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.


 *  నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.


 *  మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక  లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.


 *  ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .


 *  త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.


 *  తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.


 *  రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.


 *  మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.


 *  ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.


 *  లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.


  నా అనుభవ యోగాలు  -


 *  మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.


 *  పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను .


        పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు . 


         ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.


     

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

విద్యార్థి

 

విద్యార్థి

సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షల ముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్ యఅంశాలను చదవాలి వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఎంతో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తాను ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నా, భోజనం చేస్తున్నాకూడా తాను చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తాను చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచి ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిధి జాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.

 

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |

క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

 

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు నిద్రను తొలగించి జ్ఞానం అనే ప్రకాశం వైపు నడువు దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి సిద్ద గురువును ఆశ్రయించు అని ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది

 

సద్గురువు ఎవరు:

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ ,లక్షల కొద్ది శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకర్షిస్తున్నారు . వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము స్వామీజీని నమ్ముకున్నాము. ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది. ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి గురువు సేవనమే తన జీవిత పరమావధి భావంచి తన అమూల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్న ద్రవ్యాన్ని తస్కరించి రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో అనేక ఆశ్రమాలను నిర్మించి ప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అందుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తి మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు వచ్చినా  కూడా సాధ్యం కాదేమో అని సాధకునికి  అనిపిస్తున్నది. ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది

 

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి . ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటిన తరువాత మనకు పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా ఉపయోగపడతాడుగురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను మనమే కొనసాగించాలి. అంతే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. సాధకుడు ఒక విషయాన్నీ సదా గుర్తుంచుకోవాలి సాధకుని ప్రయాణం ఎప్పుడు ఒంటరి ప్రయాణం మాత్రమే. ఎవరి సాధన వారిది ఎవరి గమ్యం వారిది.

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలంటే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. . గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి. అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి ఉండ కూడాదు. అంటే విషయాలమీద ఆసక్తి, అనురక్తి,మోహము, కామము లేని వాడై ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి. ఒక్క విషయం సాధకుడు సదా గుర్తుంచుకోవాలి. సద్గురువుకు చుట్టూ వందలకొద్దీ, వేలకొద్దీ శిష్యగణం వుండరు. అలావున్నారంటే గురువు ను మనం డాంబిక గురువుగా అభివర్ణించవచ్చు. రోజుల్లో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఆశ్రమాలను నెలకొల్పుకొన్న అనేకమంది స్వామీజీలను చూస్తున్నాము. వారు కేవలం డాంబికులు కానీ మరొకరు కాదు. సద్గురువు ఎటువంటి వస్త్రాలను ధరించాడు. కౌపీనం కేవలం సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ధరిస్తాడు కానీ అతనికి అదికూడా అవసరం లేదు.

 

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తాను త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతః కరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. అదేమిటంటే తాను చేసే పూజలు మాత్రము కాక ఇంకా ఏదో చేయాలని. ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే భావన  ఉదయిస్తుంది. భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు

 

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే. కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా అకుంఠిత దీక్షతో మోక్షార్ధులు కమ్ము

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః    

మీ భార్గవ శర్మ 

 

మహాభారతంలో

 మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది.


అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు.


ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.

చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.


తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.


పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.


ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.


నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.


ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.


మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు,సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి,స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.


ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.


మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.


దివ్యాత్మస్వరూపులారా!


ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి.సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది.సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు.