*హోమం యొక్క ప్రాముఖ్యత*
1. ఫ్రాన్స్కు చెందిన ట్రైలే అనే శాస్త్రవేత్త హోమం మీద పరిశోధన చేశారు. దీనిలో ఆయనకు తెలిసింది: హోమం ప్రధానంగా మామిడి చెక్కపై జరుగుతుందని, మామిడి కలప కాలినప్పుడు, ఫార్మిక్ ఆల్డిహైడ్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మ జీవులను చంపి వాతావరణాన్ని 5 శుభ్రపరుస్తుంది. ఈ పరిశోధన తరువాతే శాస్త్రవేత్తలకు ఈ వాయువు గురించి మరియు దానిని తయారు చేసే విధానం గురించి తెలిసింది. బెల్లం కాల్చినప్పుడు కూడా ఈ వాయువు ఉత్పన్న మువుతుంది.
2. టౌటీక్ అనే శాస్త్రవేత్త హోమంపై తాను నిర్వహించిన పరిశోధనలో కనుగొన్నది ఏమనగా, అర్ధగంట సేపు హోమంలో కూర్చున్నా లేదా హోమం నుండి వెలువడే పొగలచే ఈ శరీరము సంపర్కం చెందినా టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి మరియు శరీరం కూడా శుభ్రపడుతుంది.
3. హోమము యొక్క మహత్వమును దృష్టిలో వుంచుకొని లక్నో కి చెందిన రాష్ట్రీయ వనస్పతి అనుసంధాన సంస్థ శాస్త్రవేత్తలు కూడా ఒక పరిశోధన చేసారు. హోమము చేయడము వలన వాతావరణ శుద్ధి జరుగుతుందా లేదా మరియు జీవాణువులు నాశనము అవుతాయా లేదా అన్న అంశము పైన పరిశోధన జరిపారు. వీరు గ్రంథాలలో వర్ణించబడిన హోమ సామాగ్రిని కలిపి మండించడము ద్వారా ఈ విషకణములు నశిస్తాయని తెలుసుకున్నారు. తరువాత వీరు విభిన్నరకాల పొగల మీద పని చేసారు. కేవలం ఒక కిలో మామిడి కర్రను మండించడము వలన గాలిలో వ్యాపించి ఉన్న విషాణువులను మరీ ఎక్కువగా తగ్గించలేదని, కానీ ఎప్పుడైతే దాని మీద అరకిలో హోమసామాగ్రిని పోసి మండించగా ఆ కక్ష లోని బాక్టీరియా స్థాయి గంట వ్యవధిలో 94% తగ్గిందని నిర్ధారించారు. ఇది మాత్రమే కాకుండా ఆపైన, కక్ష తలుపులు తెరిచి పొగలు విడుదలైన 24 గంటల తరువాత కూడా జీవాణువుల స్థాయి సాధారణము కంటే 96% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తరువాత కూడా అనేక సార్లు పరీక్షించిన పిమ్మట హోమపు పొగల యొక్క ప్రభావము నెల రోజుల వరకు ఉంటుందని నిర్ధారించారు. 30 రోజుల తరువాత కూడా ఆ కళ్లలోని విషాణువుల స్థాయి
సాధారణం కంటే చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడించారు. ఎథ్నోఫార్మాకాలజీ (ఎథోనోఫార్మా కాలజీ 2007 యొక్క రీసర్చ్ జర్నల్) యొక్క పరిశోధనా పత్రంలో ఈ నివేదికను డిసెంబరు 2007లో ప్రచురింప బడినది..
హోమము చేయుట వలన మనుష్యులకే కాకుండా చెట్లకు మరియు పంట పొలములకు హాని కలిగించే బాక్టీరియా కూడ నశిస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.
ఇందువలన పొలములలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించవచ్చు.
హోమం కొరకు ఏ కలప వాడుతారు?
సమిధల రూపంలో మామిడి కలపను వాడటం సర్వ సాధారణమే, కానీ ఇతర కలపలను కూడా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సూర్యుని కొరకు జిల్లేడు యొక్క కలప, చంద్రునికి మోదుగ, మంగళ గ్రహానికి ఖైర్ (ఖదిరము) యొక్క కలప, బుధునికి ఉత్తరేణి, బృహస్పతికి రావి, శుక్రునికి మేడి, శనికి షామి (జమ్మి), రాహువుకి దుర్వా దర్భ మరియు కేతువుకి కుషా దర్భ అనే వివిధ వృక్షాల కలపలను గుర్తించారు.జిల్లేడు సమిధ వ్యాధిని నాశనం చేస్తుంది. మోదుగ సర్వ కార్యములను సిద్ధింప చేస్తుంది, రావి సమిధలు సంతానం కలిగిస్తుంది, జమ్మి పాపాలను నశింప చేస్తుంది, దుర్వా దీర్ఘాయువును ఇస్తుంది మరియు కుషా అన్ని సమస్యలను దూరం చేస్తుంది మరియు కోరికలను తీరుస్తుంది.
హోమంలో వాడే ద్రవ్యాల రకాలు :
ప్రతీ ఒక్క ఋతువులో ఆకాశంలో వాయు మండలాలు వివిధ రకాలుగా మారుతూ వుంటాయి. చలి, వేడి, తేమ, గాలి బరువుగా లేక తేలికగా వుండుట, దుమ్ము , పొగ, మంచు మొదలైన వాటితో ఆకాశము నిండి వుంటుంది. వివిధ రకాల సూక్ష్మ జీవుల పుట్టుక, పెరుగుదల మరియు మరణం యొక్క క్రమం కొనసాగుతూనే ఉంటుంది. అందువలన, వాతావరణం కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటుంది. మరి కొన్నిసార్లు అనారోగ్యంగా మారుతుంది. అటువంటి మలినాలను తొలగించి, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి, హోమంలో ఇలాంటి ఔషధ గుణాలున్న
ద్రవ్యములను ఉపయోగిస్తారు. ఈ ప్రయోజనం బాగా ఉపయోగపడుతుంది.
హోమం యొక్క ద్రవ్యాలు :
హోమ-ద్రవ్యాలు లేదా హోమ- సామాగ్రి అనగా మండ గలిగే పదార్ధాలు అని అర్ధం. వాటిని యజ్ఞం (హోమం) యొక్క అగ్నిలో మంత్రాలతో పాటు సమర్పిస్తారు..
1. సుగంధ ద్రవ్యాలు : కుంకుమ, అగర్, టగర్, గంధపు చెక్క, ఏలకులు, జాజికాయ, జాపత్రి
2. నిశ్చిత ద్రవ్యాలు : కరిగించిన వెన్న, గుగ్గులు, ఎండిన పండ్లు, బార్లీ, నువ్వులు, బియ్యం, తేనె మరియు కొబ్బరి మొదలైనవి.
3. పటిక బెల్లం, ఎండు ద్రాక్ష మొదలైనవి.
4. వ్యాధి నాశక ద్రవ్యాలు: తిప్ప తీగ, జాజికాయ, సోంపల్లి సాంబ్రాణి, తులసి, ఎండు కొబ్బరి, నువ్వులు, ఉసిరి, మల్కంగ్ని, బే ఆకు, ప్రెంఖానము, కుంకుమ, తెల్ల చందనము, తగర మొదలైనవి.
పైన పేర్కొన్న నాలుగు రకాల వస్తువులను తప్ప కుండా హోమంలో వాడాలి. ఆహార ధాన్యాలని హోమంలో వాడుట వలన మేఘాలు ఎక్కువగా వర్తిస్తాయి. అందువలన ధాన్యం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. సుగంధ పదార్ధాలతో ఆలోచనలు శుద్ధి చేయబడతాయి, తీపి పదార్థాలు శరీరానికి పుష్టినీ మరియు ఆరోగ్యాన్ని అందిస్తాయి, కావున నాలుగు రకాల పదార్ధాలకు సమాన ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఒకవేళ ఇతర వస్తువులు అందుబాటులో లేని ఎడల, ఎప్పుడూ వుండే నువ్వులు, బార్లీ, బియ్యంతో మాత్రమే హోమం తలపెట్టవచ్చు.
సాధారణంగా వాడే ధూప సామాగ్రి:
నువ్వులు, బార్లీ, తెలుపు గంధపు పొడి, అగరు, టగరు, గుగ్గులు, జాజికాయ, దాల్చినచెక్క, తాలిసపత్రి, పనాడి, లవంగాలు, పెద్ద ఏలకులు, గోలా, ఎండు ద్రాక్ష, ఇంద్ర బార్లీ, కర్పూరం కల్తీ, ఉసిరి, తిప్ప, జాజికాయ, బ్రాహ్మి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి