3, జూన్ 2024, సోమవారం

నేడు వ‌రల్డ్ సైకిల్ డే*

 జై శ్రీమన్నారాయణ..

03.06.2024, సోమవారం



*ఆయుష్షు పెంచే ఆరోగ్య సాధనం 'సైకిల్'..* 

*నేడు వ‌రల్డ్ సైకిల్ డే*


‘చలో చలో సైకిల్‌.. బిరబిర బిరబిర బిరబిర పరుగులు తీసే చలో చలో సైకిల్‌.. ఆనంద సీమలకు హాయిహాయిగా చలో చలో సైకిల్‌’ పాట 1945 నాటి ‘స్వర్గసీమ’ సినిమాలోది. ఇప్పుడు బైక్‌, కార్లు ఛేజింగ్‌ మాదిరిగానే అప్పటి సినిమాల్లోనూ సైకిల్‌ ఛేజింగ్‌ దృశ్యాలుండేవి. ఇప్పటి తరానికి ఆ అనుభూతి లేకపోవచ్చును గానీ, సైకిల్‌ ఓ మధురమైన జ్ఞాపకం. ఇక, సైకిల్‌ నేర్చుకోవడానికి పడిన తంటాలు, తిన్న గాయాలు తియ్యని జ్ఞాపకాలే. దాదాపు 20ఏళ్ల క్రితం వరకు యువతరానికి ఇదో మోజు. సొంత సైకిల్‌ ఉందంటే అదో హోదా. స్కూలు, కాలేజీలకు డాబుగా సైకిల్‌పై వెళ్లడం…. బెల్‌ గణగణమంటూ మోగిస్తూ… వలయాకారంలో తిప్పుతూ రకరకాల ఫీట్లు చేయడం… కిర్రుమని బ్రేకులు వేయడం ఒకప్పటి సరదా. ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. సూర్యోదయానికి ముందే ఇంటి ముందు ట్రింగ్‌…ట్రింగ్‌ మని సైకిల్‌ బెల్‌ మోగిందంటే… పేపర్‌ బోయ్ అని, మరికాసేపటికి అదే శబ్దం వస్తే పాలుపోసే వ్యక్తి అనో, కాస్త పొద్దెక్కిన తర్వాత వినిపిస్తే పోస్ట్‌మ్యాన్‌ అనో బెల్‌ శబ్దాన్ని బట్టి పోల్చుకోగలిగేంతగా సైకిల్‌ జన జీవనంలో మమేకమైపోయింది.


జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం జరుపుకొంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది.

ప్రస్తుత రూపంలో ఉన్న సైకిలును 1817లో కనిపెట్టారు.


మధుమేహం కంట్రోల్‌


డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి శారీరక వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది


సైకిల్‌ తొక్కడం ద్వారా మంచి వ్యాయమం..


ఇక సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయమానికి సైకిల్‌ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పని చేస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు...


ఊపిరితిత్తులు బలోపేతం


సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి.


సమాజంలో సైక్లింగ్‌ సంస్కృతిని ఎంతో డెవలప్‌ చేయడానికి, ప్రోత్సహించడానికి కావాల్సిన ఉత్తమ పద్దతులను సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపర్చడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడడానికి సైకిల్‌ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది...

కామెంట్‌లు లేవు: