20, మే 2022, శుక్రవారం

ఆత్మస్వరూపం - కారు -డ్రైవరు

 ఆత్మస్వరూపం - కారు -డ్రైవరు 

నీవు ఒక భవంతి మీదనో లేక ఒక కొండమీదనో ఉండి దాని ప్రక్కనుండి వెళ్లే రోడ్డుని చుస్తున్నావనుకో నీకు అనేక రంగులతో అనేక కంపెనీల, అనేక మాడలు కార్లు వేగంగా వెళ్ళటం చూస్తుంటావు. నీవు ఆ ఎర్ర కారు మారుతి కారు ఈ నల్ల కారు టాటా కారు ఇంకోటి ఇంకో కారు అని గుర్తిస్తావు.  ఆ కారు చక్కగా వెళుతున్నది, ఈ కారు సరిగా నడవటం లేదని నీవు కార్లను ఉద్దేశించి చెపుతావు.  నిజానికి ఏ కారు కూడా తనంతట తానూ కదలదు కేవలం ఒక సమర్ధవంత డ్రైవరు దానిని నడుపుతేనే అది నడుస్తుంది.  ఇందాక నీవు ఆ కారు చక్కగా వెళుతున్నది, ఈ కారు సరిగా నడవటం లేదని అన్నావే అది నీవు కారుని ఉద్దేశించి చెప్పినదైన  నిజానికి అది కారుకి సంబంధించింది కాదు కానీ కారు డ్రైవరుకు ఆపాదించినది మాత్రమే.  కానీ బాహ్యంగా కారుని ఉద్దేశించినట్లు కనపడుతున్నది. మన మహర్షులు ఉపనిషత్తులో ఈ సంబంధమే ఆత్మ, దేహానికి అనువర్తించి చెప్పారు. 

నీవు కారు అనుకునేదే దేహం ఆ కారులో వున్న డ్రైవరే ఆత్మ. కారును నడిపే స్టీరింగ్, బ్రేక్, క్లచ్, యాక్సిలరేటరు, హారను మొదలైనవే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు ఆత్మ వల్ల దేహానికి జీవనవ్యాపారాలను (వృత్తులను) నిర్వహించేటట్లు అంటే కారును నడుపు తున్నాయి. స్టీరింగ్ చక్కగా నియంత్రించక పొతే కారు ఇష్టమొచ్చినట్లు వెళుతుంది. అదే విధంగా నీవు నీ మనస్సుని అదుపులో పెట్టుకోక పొతే అది ఇష్టమొచ్చినట్లు వెళుతుంది. ఇక యాక్సిలరేటరు, బ్రేకులు నీ ఇమ్మోషనులు అంటే రాగ ద్వేషాలు వాటిని అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి. ఇలా పంచేంద్రియాలను నియంత్రించి వుండే వాడే స్థిత ప్రాజ్ఞుడు అనిపించుకుంటాడు.  కేవలం స్థిత ప్రజ్ఞత వలననే మనిషి ఈ భవ సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందగలడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః

దేశద్రోహులేక్కడ

 *దేశద్రోహులేక్కడ*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


నా భరతమాత బిడ్డలకు నమస్కరించి :


*భారతీయ బ్యాంకుల నుండి డబ్బును దోచుకున్న 28 మంది జాతీయవాద వ్యాపారవేత్తల జాబితా ఇది*


 1) విజయ్ మాల్యా

 2) మెహుల్ చోక్సీ

 3) నీరవ్ మోడీ

 4) నిషన్ మోడీ

 5) లలిత్ మోడీ

 6) పుష్పేశ్ బైద్య

 7) ఆశిష్ జోబన్‌పుత్రా

 8) సన్నీ కలరా

 9) ఆర్తి కలారా

 10) సుంజయ్ కలారా

 11) వర్ష కలర

 12) సుధీర్ కలారా

 13) జతిన్ మెహతా

 14) ఉమేష్ పరిఖ్

 15) కమలేష్ పరిఖ్

 16) నీలేష్ పరిఖ్

 17) వినయ్ మిట్టల్

 18) ఏక్లవ్య గార్గ్

 19) చేతన్ జయంతిలాల్

 20) నితిన్ జయంతిలాల్

 21) దీప్తి బీన్ చేతన్

 22) సవియా సైత్

 23) రాజీవ్ గోయల్

 24) ఆల్కా గోయల్

 25) రితేష్ జైన్

 26) హితేష్ నాగేందర్‌భాయ్ పటేల్

 27) మయూరిబెన్ పటేల్

 28) ఆశిష్ సురేష్ భాయ్


ఈ దోపిడీ విలువ మొత్తం 

*₹10,000,000,000,000 / -*

*(రూ. పది ట్రిలియన్లు మాత్రమే)*


 *ప్రత్యేకత* 

 *వీరిలో ఎవ్వరు*:-

 *పరదేశి లేరు*

 *ముస్లిం లేరు*

 *ఉగ్రవాదిగా ప్రకటించబడిన వారు లేరు*

 *అర్బన్ నక్సల్ లేరు*

 *OBC  ప్రజలు లేరు.*

*SC ప్రజలు లేరు*

*STప్రజలు లేరు*

*ఒక్క విజయ్ మాల్యా తప్ప, అందరూ గుజరాత్ కు చెందినవారు!* అవ్వడం  గమనార్హం


 చట్టాలు శాసనాలు చేసే ప్రభుత్వాల సహాయం లేకుండా ఎవ్వరూ ఇంతవరకు దోపిడీలు చేయలేదు."

రావిచెట్టు,వేప చెట్టు

 అత్యంత పవిత్రమైన రావిచెట్టు,వేప చెట్టు జంట వృక్షాల మహిమను వింటే ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది…


ఈరోజు మనం విన్నంతనే సకల పాపాలు పోయే రావి చెట్టు, వేప చెట్టు జంట వృక్షాల మహిమల గురించి తెలుసుకుందాం! ఎక్కడైనా ఆలయాలలో లేదా ఇతర ప్రదేశాలలో ఇలా రావి చెట్టు, వేప చెట్టు కలిసి జంట వృక్షాలుగా కలిసి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ కలయిక కలిగిన జంట వృక్షాలు అయినా వేప రావి చెట్టు యొక్క మహిమ తెలుసుకున్న, విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి.


వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి విశిష్టత కలిగిన రావి, వేప జంట వృక్షాల గురించి పురాణాల వివరణలు ఈరోజు తెలుసుకుందాం!మీరు ఎప్పుడైతే ఈ విధంగా రావి, వేప చెట్టు కలిసిన జంట వృక్షాలను చూస్తారో, ఇలా చూసినంతనే ఎన్నో జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి.


అందుకే దేవాలయాలలో ఈ వృక్షాలు మనకు దర్శనమిస్తాయి, మీకు ఈ జంట వృక్షాలు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ జంట వృక్షాలకు ఒక నమస్కారం చేసి మీ మనసులోని కోరికను కోరుకుంటే చాలు. ఆ కోరిక త్వరగా తీరుతుంది, ఇలా జంట వృక్షాలు ఉన్న చోట కాసేపు కూర్చున్న చాలు మీ ఒంట్లో సమస్త దోషాలు పోతాయి, ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులు నరదిష్టి, దిష్టి దోషాలు మొత్తం పోతాయి, అలాగే మీ శరీరానికి చక్కటి ఆరోగ్యం వస్తుంది.


ఇక రావి- వేప చెట్టు యొక్క జంట వృక్షాల పురాణ వివరణ తెలుసుకుందాం! ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఇలా అడుగుతుంది స్వామి! భూలోకంలో తొందరగా దారిద్ర్యం తొలగి పోవడానికి, సంతానం పొందడానికి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఏం చేయాలి అని అడుగుతుంది. దానికి ఆ మహాశివుడు ఇలా చెప్తాడు దేవి! భూలోకంలో అన్ని బాధలు దరిద్ర బాధలు పోయి, సంతానం కలగాలంటే, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే రావి చెట్టు -వేప చెట్టు కలిసిన వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల అన్ని బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయని స్వయంగా పరమేశ్వరుడు వామకేశ్వరుడు అనే పేరుతో పార్వతిదేవికి చెప్పాడు. అంతేకాదు ఎవరైతే రావి చెట్టును -వేప చెట్టును ఒకేచోట ఇలా మొక్కలు నాటి పెంచుతారో వారు ఆలయాన్ని కట్టించిన మహా పుణ్యాన్ని పొందుతారని వివరిస్తాడు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నోవృక్షాలను దైవ సమానంగా భావిస్తాం. ఆ విధంగా దైవ సమానం గా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వృక్షాలలో రావి చెట్టు -వేప చెట్టు ఒకటి. ఈ రెండు చెట్లను పురాణ కాలం నుండి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు.


అయితే ఎక్కడైతే వేప చెట్టు రావి చెట్టు జంట వృక్షాలుగా కనిపిస్తాయో అక్కడ ప్రతి ఒక్కరూ పూజలు తప్పకుండా చేస్తారు. అందుకు కారణం ఉంది రావిచెట్టును పురుషుడుగా వేప చెట్టును స్త్రీ గా భావించి పూజ చేస్తారు. అంటే రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారం అయి కాపురం అన్యోన్యంగా సాగుతోంది. మన పురాణాల ప్రకారం ఈ రెండు జంట వృక్షాలు దైవ సమానమైనవి, కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు మరియు సంతానం లేని వారు పూజించడంవల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుంది. అందుకే నూతన దంపతులు ఇలా తప్పకుండావేప- రావి చెట్టు కలయిక కలిగిన దగ్గర ప్రదక్షణలుచేస్తారు. ఇలా జంట వృక్షాలకు ప్రదక్షణలు చేస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలిగేలా ఆ లక్ష్మీనారాయణులు దీవిస్తారని పురాణవచనం. అంతేకాదు చాలామంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు. ఈ విధంగా ఈవేప చెట్టుకు- రావిచెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి జీవితాంతం సుఖంగా జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావి చెట్టుకు -వేప చెట్టుకు వివాహం జరిపించడం వల్ల దోష ప్రభావం తొలగిపోయి తొందర్లోనే వారికి వివాహ గడియలు వస్తాయి.

రుణము

 1. దేవ రుణము :

యజ్ఞములు చేసి హవిస్సులు అర్పించుట ద్వారా దేవ ఋణము తీరుతుంది. 


2. ఋషి రుణము :

ఏ ఋషి పరంపర మనము అనుసరిస్తామో ఆ సూక్తముల/సూత్రముల  జీవన శైలి ఆచరణ ద్వారా ఋషి ఋణము  తీరుతుంది. 


3. పితృ ఋణము :

పితృ అర్పణములు, శ్రాద్ధ కర్మలద్వారా పితృ ఋణము తీరుతుంది.

ఆయుర్వేదం నందు ఔషధ సేవన

 ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ  -


  ఆయుర్వేదం నందు ఔషధాలను సేవించు విధానమును రోగాలకు బట్టి 10 రకాలుగా వర్గీకరించబడినది. ఈ విధముగా ఔషధాలను సేవించినచో ఆయా ఔషధాలు బలంగా పనిచేసి రోగి తొందరగా కోలుకుంటాడు. మరియు ఔషధాలను సూర్యోదయానికి ముందు , సూర్యాస్తమయం తరువాత సేవించిన మంచిఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఔషధసేవన గురువారం నందు మొదలు పెట్టిన త్వరగా రోగం నుంచి విముక్తి పొందవచ్చు.


  ఆయుర్వేదం వర్గీకరించిన 10 రకాల ఔషధసేవన కాలాలు  -


 * అనన్నౌషధ కాలము  -


        తినినట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తరువాత ఔషధాన్ని సేవించుట . రోగి బలవంతుడుగా ఉన్నప్పుడు కఫరోగం నందు దీనిని ఉపయోగించవలెను .


 * అన్నాదౌష్యధ కాలము  -


        ఆహారమును భుజించుటకు ముందు ఔషధమును తినినవెంటనే ఆహారమును భుజించుట . దీనిని అపానవాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * మధ్యోషధ కాలము  -


         ఆహారం తినునప్పుడు మధ్య సమయం నందు తినునట్టి ఔషధం . దీనిని సమాన వాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * అంతౌషధ కాలము  -


         ఆహారం భుజించుతూ ఉన్న సమయంలో చివరలో ఔషధం సేవించటం . దీనిని వ్యానవాతం ప్రకోపించినప్పుడు మధ్యాహ్న భోజనం చివర సమయంలో , ఉదాన వాతం ప్రకోపం చెందినపుడు రాత్రి భోజనం యొక్క చివరలో ఔషధం సేవించవలెను .


 * కబాలాంతరౌషధ కాలము -


          ఆహారం భుజించునప్పుడు మొదటిముద్ద తిని వెంటనే ఔషధమును భుజించిన పిదప మరలా ఒక ముద్ద అన్నము తినునట్టి ఔషధం . దీనిని ప్రాణవాతం ప్రకోపం చెంది ఉండునప్పుడు ఉపయోగింపవలెను.


 * గ్రాసగ్రాసౌషధ కాలము  -


          ప్రతి అన్నపు ముద్దతోను ఔషధం చేర్చి భుజించటం. దీనిని ప్రాణవాతం ప్రకోపం చెందినపుడు ఉపయొగింపవలెను.


 * ముహురౌషధ కాలము -


           అన్నము తిన్నను , తినకున్నను ఔషధమును అనేక పర్యాయాలు తీసుకోవడం . దీనిని విషదోషం , వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, శ్వాస , దగ్గు అను రోగములు కలవారికి ఉపయోగించవలెను .


 * స్నానౌషధ కాలము -


           ఆహారంతో కూడా చేర్చి తినునట్టి ఔషధము . నోటికి రుచిలేకపోవుట వంటి రోగముల యందు అనేక రకాల ఆహార పదార్ధములతో చేర్చి ఉపయోగించవలెను .


 * సాముద్గౌషధ కాలము -


           మొదట ఔషధమును తిని వెంటనే ఆహారంను భుజించి మరలా ఔషధమును సేవించుట . దీనిని ఆక్షేపక వాతము , ఎక్కిళ్లు , కంపవాతం అనగా పార్కిన్సన్స్ వ్యాధి నందు ఉపయోగించవలెను .


 * నిశౌష్యథ కాలము  -


           రాత్రి పడుకునే సమయం నందు తినునట్టి ఔషధము . దీనిని మెడకొంకులకు పై భాగమున పుట్టు రోగములు నందు ఉపయోగింపవలెను .


         పైన చెప్పిన విధముగా 10 రకములుగా ఔషధసేవన పద్ధతులు కలవు. ఔషధంతో పాటు ఔషధసేవన కాలం కూడా రోగాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించును.


   

    

         మరింత విలువైన సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వైశాఖ పురాణం

 _*


     _*🚩వైశాఖ పురాణం🚩*_

🌴_*19 వ అధ్యాయము*_🌴


🕉🌹🌷🌹🕉️🌹🌷🌹🕉️


*పిశాచత్వ విముక్తి*


☘☘☘☘☘☘☘☘


నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


*వైశాఖ పురాణం  పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం*       

     

           🌷 *సేకరణ*🌷

         🌹🌷🌹🌹🌷🌹

               *న్యాయపతి*

            *నరసింహా రావు*


🙏🙏🌷🙏🙏🌹🙏🙏🌷🙏🙏

కాశీమశీదులో శివలింగం

 చరిత్ర 

కాశీమశీదులో శివలింగం


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ


క్రీ. శ. 1823-26 మధ్య కలకత్తాలో తూర్పు ఇండియా వర్తక కంపెనీవారి అధికారిగా నుండి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధి హిందూ దేశమంతా తిరిగిచూసిన హెబరుగారు (Bishop Heber) తమ గ్రంథములో ఒక చిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.


1659–1707 మధ్య హిందూ దేశాన్ని పరిపాలించిన ఔరంగ జేబుచక్రవర్తి చాలా హిందూ దేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ, రాళ్ళతోటీ, దూలాలతోటీ నిర్మించబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.


ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆ దేవాలయంలో నుండిన అందమైన గొప్ప శివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదుకట్టారు. ఈశివలింగం నలభై అడుగుల ఎత్తుగల ఏకాండీశిల. దీని మీద అందమైన చెక్కడపుపని వుండేది. ఇది పూర్వం రెండు రెట్లు ఎత్తువుండేదనిన్నీ, క్రమ కమంగా భూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది భూమి మట్టానికి రాగానే అన్ని కులాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.


ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులను మంచి చేసుకొని, లోపలికి వెళ్ళి దీన్ని పూజిస్తూవుండేవారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లే పద్ధతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపుడని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పై చెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగా ఒక నంద సంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి. 


ఇలా వుండగా ఒక మాటు మొహరం పండుగ ఊరేగింపుల సందర్భంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతి పవిత్రంగా పూజించే యీ శివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒక మశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు  ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీ జలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములుచేసే 'ఇననకూప' మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.


అంతట కత్తిపట్టగల ప్రతి హిందువూ రోషావేశంతో కత్తులూ కఠారులూ పుచ్చుకుని కనబడిన తురక వాడి పైనబడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులే బహుసంఖ్యాకు లైనందువల్ల తురకలను రూపుమాపుతారేమో నన్నంత భయం కలిగింది.


కుంపినీఅధికారులు శీపాయీలను బయటికి తెచ్చి నిలపకపోతే ఇటు సూర్యు డటు పోయేలోపల ఊళ్ళో మశీదు లన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే,హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శీపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విష యంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శీపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులోని సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయులరక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.


ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగులు, గోసాయీలూ, బై రాగులూ మొదలైన సనాతనధర్మపరులే. వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని 'మొగాల పైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తల వెండ్రుకలు విరబోసికొని, జందెములు చేతపట్టుకొని తమతోడిహిందువులతోనూ, దేవుళ్ళతోనూ యుద్ధం చెయ్యబూనిన వారిని శాపనార్థాలు పెడుతూ వీరంతా ముందువరసలోనే వున్నారు. అయినప్పటికీ శీపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కుంపినీవారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధు వులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టు పెట్టుకొని సైన్యపుకొలువులో చేరిన ఈ శిపాయీలు అవసరమైతే బ్రాహ్మడి పైనకూడా తుపాకీని పేల్చడానికి సంసిద్ధులైనారు.


పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్వారం దగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కడ క్రిందపడి వున్న శివలింగాన్ని చూసి ఇలాగ అన్నాడు. “అయ్యో ! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగం శిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మంద రమూ ఒకే కులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం ఏమవుతుంది?" అన్నాడు. “బహుశఃకిరస్తానీమతం అవుతుం దేమో!" అని రెండవవాడన్నాడు.


కంపెనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.

ఈ కల్లోలం అణగిన తరు వాత మళ్ళీ ఆ సంగతి తలుచుకునేటప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. “పవిత్రమైన కాశీ క్షేత్రం అపవిత్రమైపోయింది. అతి పవిత్రమైన గంగాజలములో గోవుర క్తం కలిసింది. ఈ కాశీమాహాత్మ్యం పోయింది. ఇంక ఇక్కడ మోక్షం దొరకదు” అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతి రేఖలతో పై మీద బట్టలు కూడా లేకుండా దుఃఖసూచకంగా గంగానదీ తీరాన్నివున్న ముఖ్యఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూచుని మళ్ళీ ఇళ్ళకు పోకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్ర్రాణాల పై ఆశవిడిచి ప్ర్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు. 


ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలమంది మనస్సులు కరగినవి. వీళ్ళను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్ళకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికి తోచింది. ఈ సంగతిని వీరు కాశీలోని మేజిస్ట్రేటుల చెవిని వేశారు. అంతట కుంపినీ వారి ఆంగ్లేయోద్యోగులందరూ గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడి ఘట్టాలలో ఇలాగ వుపవాసం చేస్తూవున్న బ్రాహ్మణులను చూసి వగచి, తాము నివారిం చడానికి ఎంతోకష్టపడి ప్రయత్నంచినా లాభంలేక తమవశం తప్పిందని, జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్నీ, జరిగిన అక్రమాలకు కొంత ప్రతిక్రియ జరిగించేవున్నారుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించగా, వారందరూ చాలా దుఃఖించి తరువాత కొంత ఊరట చెందారు.


ఇంతటి అకృత్యం జరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ, కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్ తకర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగా వారు చెప్పిన సలహా బాగానే వున్నదని ఆఖరికి వారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.


ఆ సమయంలో ఈ రాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు’ గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకు కట్టినట్లు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1824 లో బిషప్ హెబరుగారికి ఈ సంగతులన్నీ చెప్పాడు.


Bishop Heber's Journal - Vol. 1 Pp. 428-32.

( కథలు - గాథలు బై దిగవల్లి వేంకట శివరావు గారి గ్రంథం నుండి )

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ

హనుమజ్జయంతి

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 


1. హనుమ - జననం - పొందిన వరాలు 


    హనుమంతుని తండ్రి పేరు కేసరి. 

    అంజన ఆ కేసరి యొక్క భార్య. 

    అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. 

    హనుమంతుడు, అంజనాదేవి గర్భాన -  వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. 

    అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు. 


జయంతి: 

వైశాఖ బహుళ దశమి 


హనుమ పొందిన వరాలు: 

     

    శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,

    సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం, 

    సూర్యునివద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో,       

    ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. 

    అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. 

    అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. 


    అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, 

    ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు. 

    వాయువుకి సంతోషం కలిగించడానికీ, 

   భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, 

   దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. 

    అప్పుడు, 


1. ఇంద్రుడు: 

    బంగారు పద్మహారమునిచ్చి, 

    హనుమ అని నామమిడి, 

    తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు. 


2. సూర్యుడు: 

    తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, 

     శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, 

    సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, 

    తద్వారా వాక్చతురుడు కాగలడనీ, 

    శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు. 


3. వరుణుడు: 

    తన పాశము వలనగానీ, జలములవలనగానీ, 

    లక్షలకొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు. 


4. యముడు: 

    తన దండము వలన మృత్యువు కలగదనీ, 

    ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, 

    యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు. 


5. కుబేరుడు:  

    సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు. 


6. శంకరుడు: 

    తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు. 


7. విశ్వకర్మ: 

    తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, 

    చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు. 


8. బ్రహ్మ: 

    ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ, 

    దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, 


 వాయుదేవునితో మారుతిని గూర్చి 

  - శత్రువులను గడగడలాడించగలడనీ, 

  - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, 

  - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, 

  - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, 

  - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, 

  - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, 

  - యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, 

    లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు. 


    ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు.


    జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు. 


    మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.   

    ప్రతిరోజూ ఆరాధిస్తూ, 

    సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. 

    మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)