ఆత్మస్వరూపం - కారు -డ్రైవరు
నీవు ఒక భవంతి మీదనో లేక ఒక కొండమీదనో ఉండి దాని ప్రక్కనుండి వెళ్లే రోడ్డుని చుస్తున్నావనుకో నీకు అనేక రంగులతో అనేక కంపెనీల, అనేక మాడలు కార్లు వేగంగా వెళ్ళటం చూస్తుంటావు. నీవు ఆ ఎర్ర కారు మారుతి కారు ఈ నల్ల కారు టాటా కారు ఇంకోటి ఇంకో కారు అని గుర్తిస్తావు. ఆ కారు చక్కగా వెళుతున్నది, ఈ కారు సరిగా నడవటం లేదని నీవు కార్లను ఉద్దేశించి చెపుతావు. నిజానికి ఏ కారు కూడా తనంతట తానూ కదలదు కేవలం ఒక సమర్ధవంత డ్రైవరు దానిని నడుపుతేనే అది నడుస్తుంది. ఇందాక నీవు ఆ కారు చక్కగా వెళుతున్నది, ఈ కారు సరిగా నడవటం లేదని అన్నావే అది నీవు కారుని ఉద్దేశించి చెప్పినదైన నిజానికి అది కారుకి సంబంధించింది కాదు కానీ కారు డ్రైవరుకు ఆపాదించినది మాత్రమే. కానీ బాహ్యంగా కారుని ఉద్దేశించినట్లు కనపడుతున్నది. మన మహర్షులు ఉపనిషత్తులో ఈ సంబంధమే ఆత్మ, దేహానికి అనువర్తించి చెప్పారు.
నీవు కారు అనుకునేదే దేహం ఆ కారులో వున్న డ్రైవరే ఆత్మ. కారును నడిపే స్టీరింగ్, బ్రేక్, క్లచ్, యాక్సిలరేటరు, హారను మొదలైనవే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు ఆత్మ వల్ల దేహానికి జీవనవ్యాపారాలను (వృత్తులను) నిర్వహించేటట్లు అంటే కారును నడుపు తున్నాయి. స్టీరింగ్ చక్కగా నియంత్రించక పొతే కారు ఇష్టమొచ్చినట్లు వెళుతుంది. అదే విధంగా నీవు నీ మనస్సుని అదుపులో పెట్టుకోక పొతే అది ఇష్టమొచ్చినట్లు వెళుతుంది. ఇక యాక్సిలరేటరు, బ్రేకులు నీ ఇమ్మోషనులు అంటే రాగ ద్వేషాలు వాటిని అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి. ఇలా పంచేంద్రియాలను నియంత్రించి వుండే వాడే స్థిత ప్రాజ్ఞుడు అనిపించుకుంటాడు. కేవలం స్థిత ప్రజ్ఞత వలననే మనిషి ఈ భవ సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందగలడు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి