20, మే 2022, శుక్రవారం

రావిచెట్టు,వేప చెట్టు

 అత్యంత పవిత్రమైన రావిచెట్టు,వేప చెట్టు జంట వృక్షాల మహిమను వింటే ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది…


ఈరోజు మనం విన్నంతనే సకల పాపాలు పోయే రావి చెట్టు, వేప చెట్టు జంట వృక్షాల మహిమల గురించి తెలుసుకుందాం! ఎక్కడైనా ఆలయాలలో లేదా ఇతర ప్రదేశాలలో ఇలా రావి చెట్టు, వేప చెట్టు కలిసి జంట వృక్షాలుగా కలిసి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ కలయిక కలిగిన జంట వృక్షాలు అయినా వేప రావి చెట్టు యొక్క మహిమ తెలుసుకున్న, విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి.


వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి విశిష్టత కలిగిన రావి, వేప జంట వృక్షాల గురించి పురాణాల వివరణలు ఈరోజు తెలుసుకుందాం!మీరు ఎప్పుడైతే ఈ విధంగా రావి, వేప చెట్టు కలిసిన జంట వృక్షాలను చూస్తారో, ఇలా చూసినంతనే ఎన్నో జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి.


అందుకే దేవాలయాలలో ఈ వృక్షాలు మనకు దర్శనమిస్తాయి, మీకు ఈ జంట వృక్షాలు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ జంట వృక్షాలకు ఒక నమస్కారం చేసి మీ మనసులోని కోరికను కోరుకుంటే చాలు. ఆ కోరిక త్వరగా తీరుతుంది, ఇలా జంట వృక్షాలు ఉన్న చోట కాసేపు కూర్చున్న చాలు మీ ఒంట్లో సమస్త దోషాలు పోతాయి, ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులు నరదిష్టి, దిష్టి దోషాలు మొత్తం పోతాయి, అలాగే మీ శరీరానికి చక్కటి ఆరోగ్యం వస్తుంది.


ఇక రావి- వేప చెట్టు యొక్క జంట వృక్షాల పురాణ వివరణ తెలుసుకుందాం! ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఇలా అడుగుతుంది స్వామి! భూలోకంలో తొందరగా దారిద్ర్యం తొలగి పోవడానికి, సంతానం పొందడానికి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఏం చేయాలి అని అడుగుతుంది. దానికి ఆ మహాశివుడు ఇలా చెప్తాడు దేవి! భూలోకంలో అన్ని బాధలు దరిద్ర బాధలు పోయి, సంతానం కలగాలంటే, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే రావి చెట్టు -వేప చెట్టు కలిసిన వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల అన్ని బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయని స్వయంగా పరమేశ్వరుడు వామకేశ్వరుడు అనే పేరుతో పార్వతిదేవికి చెప్పాడు. అంతేకాదు ఎవరైతే రావి చెట్టును -వేప చెట్టును ఒకేచోట ఇలా మొక్కలు నాటి పెంచుతారో వారు ఆలయాన్ని కట్టించిన మహా పుణ్యాన్ని పొందుతారని వివరిస్తాడు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నోవృక్షాలను దైవ సమానంగా భావిస్తాం. ఆ విధంగా దైవ సమానం గా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వృక్షాలలో రావి చెట్టు -వేప చెట్టు ఒకటి. ఈ రెండు చెట్లను పురాణ కాలం నుండి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు.


అయితే ఎక్కడైతే వేప చెట్టు రావి చెట్టు జంట వృక్షాలుగా కనిపిస్తాయో అక్కడ ప్రతి ఒక్కరూ పూజలు తప్పకుండా చేస్తారు. అందుకు కారణం ఉంది రావిచెట్టును పురుషుడుగా వేప చెట్టును స్త్రీ గా భావించి పూజ చేస్తారు. అంటే రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారం అయి కాపురం అన్యోన్యంగా సాగుతోంది. మన పురాణాల ప్రకారం ఈ రెండు జంట వృక్షాలు దైవ సమానమైనవి, కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు మరియు సంతానం లేని వారు పూజించడంవల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుంది. అందుకే నూతన దంపతులు ఇలా తప్పకుండావేప- రావి చెట్టు కలయిక కలిగిన దగ్గర ప్రదక్షణలుచేస్తారు. ఇలా జంట వృక్షాలకు ప్రదక్షణలు చేస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలిగేలా ఆ లక్ష్మీనారాయణులు దీవిస్తారని పురాణవచనం. అంతేకాదు చాలామంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు. ఈ విధంగా ఈవేప చెట్టుకు- రావిచెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి జీవితాంతం సుఖంగా జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావి చెట్టుకు -వేప చెట్టుకు వివాహం జరిపించడం వల్ల దోష ప్రభావం తొలగిపోయి తొందర్లోనే వారికి వివాహ గడియలు వస్తాయి.

కామెంట్‌లు లేవు: