2, సెప్టెంబర్ 2020, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీశుక ఉవాచ*

*21.1 (ప్రథమ శ్లోకము)*

*సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిర్హతస్వధామద్యుతిరావృతోఽభ్యగాత్|*

*మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః సనందనాద్యా నరదేవ యోగినః॥7095॥*

*శ్రీశుకుడు నుడివెను* భగవంతుని పాదపద్మము సత్యలోకమునకు చేరెను. దాని నఖకాంతిచే సత్యలోకము యొక్క ప్రకాశము వెలవెలబోయెను. బ్రహ్మదేవుడు మరీచి మొదలగు ఋషులతో, సనందనుడు మున్నగు నైష్ఠిక బ్రహ్మచారులతో, ఇంకను మహాయోగులతో గూడి ఎదురేగిరి.

*21.2 (రెండవ శ్లోకము)*

*వేదోపవేదా నియమాన్వితా యమాస్తర్కేతిహాసాంగపురాణసంహితాః|*

*యే చాపరే యోగసమీరదీపితజ్ఞానాగ్నినా రంధితకర్మకల్మషాః|*

*వవందిరే యత్స్మరణానుభావతః స్వాయంభువం ధామ గతా అకర్మకమ్|*

వేదములు, ఉపవేదములు, యమనియమములు, తర్కము, పురాణఇతిహాసములు, వేదవేదాంగములు మున్నగునవి అన్నియును మూర్తిమంతములై బ్రహ్మలోకము నందు నివసించుచుండెను. కొందరు యోగాగ్నిచే తమ కర్మల మాలిన్యములను భస్మమొనర్చి యుండిరి. వారు అందరు భగవంతుని పాదమునకు నమస్కరించుచుండిరి. ఆ పాదపద్మస్మరణచే తమ కర్మఫలమునుండి విముక్తులై బ్రహ్మలోకమునకు చేరిరి.

*21.3 (మూడవ శ్లోకము)*

*అథాంఘ్రయే ప్రోన్నమితాయ విష్ణోరుపాహరత్పద్మభవోఽర్హణోదకమ్|*

*సమర్చ్య భక్త్యాభ్యగృణాచ్ఛుచిశ్రవా యన్నాభిపంకేరుహసంభవః స్వయమ్॥7097॥*

శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని కీర్తి పవిత్రమైనది. విరాట్ పురుషుని పాదమును బ్రహ్మదేవుడు అర్ఘ్య పాద్యాదులచే పూజించి, కడిగెను. పిమ్మట భక్తితో స్తుతించెను.

*21.4 (నాలుగవ శ్లోకము)*

*ధాతుః కమండలుజలం తదురుక్రమస్య పాదావనేజనపవిత్రతయా నరేంద్ర|*

*స్వర్ధున్యభూన్నభసి సా పతతీ నిమార్ష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తిః॥7098॥*

మహారాజా! బ్రహ్మదేవుని కమండలము నందలి జలములు విశ్వరూపుని పాదప్రక్షాళనమొనర్చి మిగుల పునీతములయ్యెను. ఆ జలములే గంగానదియై ఆకాశమార్గమున భూమిపై బడి, ఆ పరమాత్ముని ఉజ్వలమైన పవిత్ర కీర్తివలె ముల్లోకములను పునీతము చేయుచున్నది.

*21.5 (ఐదవ శ్లోకము)*

*బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః|*

*సానుగా బలిమాజహ్రుః సంక్షిప్తాత్మవిభూతయే॥7099॥*

శ్రీహరి తన విరాడ్రూపమును ఉపసంహరించుకొని మరల వామనుడాయెను. అప్పుడు బ్రహ్మదేవుడు మొదలగు లోకపాలురు, వారి అనుచరులు సాదరముగా ఆ స్వామిని పూజించి, పెక్కు కానుకలను సమర్పించిరి.

*21.6 (ఆరవ శ్లోకము)*

*తోయైః సమర్హణైః స్రగ్భిర్దివ్యగంధానులేపనైః|*

*ధూపైర్దీపైః సురభిభిర్లాజాక్షతఫలాంకురైః॥7100॥*

వారు జలములను, ఉపహారములను, మాలలను, దివ్యపరిమళములను గుబాళించుచున్న అంగరాగములను, సుగంధిత ధూపములను, దీపములను, పేలాలను, అక్షతలను, ఫలములను, అంకురములను భగవంతునకు సమర్పించిరి.

*21.7 (ఏడవ శ్లోకము)*

*స్తవనైర్జయశబ్దైశ్చ తద్వీర్యమహిమాంకితైః|*

*నృత్యవాదిత్రగీతైశ్చ శంఖదుందుభినిఃస్వనైః॥7101॥*

భగవంతుని మహిమలను, ప్రభావములను తెలుపునట్టి స్తోత్రములతోను, జయఘోషలతోను, వాద్యయుక్తమైన, నృత్యగానములతోను, శంఖ, దుందుభి నాదములతోను ఆ పరమపురుషుని ఆరాధించిరి.

*21.8 (ఎనిమిదవ శ్లోకము)*

*జాంబవాన్ ఋక్షరాజస్తు భేరీశబ్దైర్మనోజవః|*

*విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్॥7102॥*

ఆ సమయమున భల్లూక ప్రభువైన జాంబవంతుడు మనోవేగముతో పరుగెత్తి అన్ని దిశలయందును, భేరీలను డోళ్ళను మ్రోగించుచు భగవంతునియొక్క విజయవార్తను చాటించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కార్తీకంలో వన భోజనం

కార్తీకంలో వన భోజనం ఎందుకు చేస్తారు?
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద పూజ చేసి వనభోజనం లు చేయాలి. ఈ రోజు శివునికి అన్నపూర్ణ దేవి చేసిన విందు, దుర్వాస-అంబరీషుల విందు భరద్వాజ - రామవిందు, శబరి రామునికి చేసిన విందు, క్రుష్ణుణి కి కుచేలునికి ఇచ్చిన ఆతిథ్యం గుర్తు చేసుకోవాలి.
యహ్ కార్తీక సితే
వనభోజన మాచరేత్
సయాతి వెష్ణవ ధామం
సర్వ పాపైహ ప్రముచ్యతే
కార్తీక పురాణం లోని పంచమాధ్యాయం వనభోజనాల విశిష్టతను చెప్పింది. కార్తీకమాసంలో వనభోజనం చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తులై దైవధామాన్ని పొందుతారు. సూతమహర్షి నైమీశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు మునులందరితో కలిసి ఉసీరి చెట్టు కింద భుజించారు. ఔషధ గుణాలు నిండిన ఉసిరి చెట్టు ను సరస్వతీ అంశగా చెబుతారు. కార్తీకమాసంలో ఈ ఉసిరి చెట్టు ను కార్తీక దామోదరునితో పాటు దేవతలందరూ ఆశ్రయించి ఉంటారు.
          కార్తీక సంప్రదాయాలు అన్నింటిలోనూ మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతను అందించే సంప్రదాయం వనభోజనం. ఈ కార్తీకమాసంలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా వనభోజనం చేయాలి. వివిధ జాతుల చెట్లు ఉన్న తోటలో ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న చోట ఆటపాటలతో గడిపి భోజనం చేయడం వనభోజన ఆచారం. దీనికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. ఉసిరి చెట్టు నీడ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఉసిరి చెట్టు కింద కూర్చొని పనస ఆకులో భోజనం చేయాలంటుంది శాస్త్రం. అంతకంటే ముందుగా ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అంటారు. సాలగ్రామ పూజ సాధ్యం కానప్పుడు లక్ష్మీ నారాయణుల ప్రతిమ గానీ ఫోటో కాని ఉంచి పూజించాలి. పసుపు గంధం, కుంకుమలతో ఉసిరి చెట్టు ను అలంకరించి 21నామాలను చదువుతూ పుష్పాలతో పూజించాలి. ఉసిరి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
ధాత్రేదేవీ నమస్తుభ్యం సర్వ పాపక్చయకరీ
పుత్రాన్ దేహి మహాప్రాఙ్ఞే యశోదేహి బలంచమే
ప్రఙ్ఞా మేథాంచ సౌభాగ్యం
విష్ణు భక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం
కురుసర్వదా
పిండి వంటలు తో షడ్రసోపేతమైన విందును సమకూర్చి ఉసిరి చెట్టు కు నివేదన చేయాలి. ఆ ప్రసాదాన్ని సహా పంక్తి లో అందరూ పంచుకొని తినాలి.. విశిష్ట పర్వాల లో అన్నదానం చేయడం వల్ల విశేషమైన ఫలం లభిస్తుంది. అన్నసమారాధనలో పాల్గొన్నా, మన వంతు సాయం అందించినా మంచిదే.

పంచభక్ష్య భోజనం

పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???

1) భక్ష్యము : నమిలి తినుట !
2) భోజ్యము : చప్పరిస్తే కరిగిపోయేది !
3) చోష్యము : పీల్చుకునేది / జుర్రుకునేది !
4) లేహ్యము : నాక్కుంటూ తినదగిన !
5) పానియము : త్రాగేది !

        ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .

      ......తీర్థ ప్రసాదాలు 4 రకాలు......

1) జల తీర్థం
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం

                 ......జల తీర్థం .....

ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు , ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....

             ......కషాయ తీర్థం .......
 
     ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....

    ..పంచామృత అభిషేక తీర్థం ..
   
     పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....

      ..పానకా తీర్థం ..

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి , అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు..

పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు.
   
 దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
 కొత్త చైతన్యం వస్తుంది !
దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
 రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
బుద్ది చురుకుగా పని చేస్తుంది !
జ్జాపకశక్తి పెరుగుతుంది !
      గోవింద !! గోవింద !! గోవింద !!
 అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం.

మహాభారతంలో

మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!

కానీ ఎంత సేపు జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం... వీటినే చూపెడతారు అవే చెబుతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన *నీతికథలు* ఎన్నో ఉన్నాయి...!!!

అందులో ఒకటి ఇది...

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.

 అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !

ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో...
ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!

ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.

ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు.

కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు...

రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు...

కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు... ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!!

తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!!

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు !!!*

మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో... ప్రజలు ఎప్పుడు మారుతారో...*


ఫోటో





ఫోటోలు

























జపాన్ సాథువు




_మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

2-9-2020 నుంచి 17.9.2020 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

*పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మధ్యకైలాశ్ ఆలయం

🎻🌹🙏మధ్యకైలాశ్ ఆలయం -- చెన్నై

చెన్నై నగరంలోని అడయార్ కస్తూరిభాయ్ నగర్ రైల్వేస్టేషన్ నుండి ఓఎంఆర్ రోడ్ కు వెళ్లే మార్గంలో కొలువై ఉన్న ఆలయం మధ్యకైలాష్. భక్తుల కొంగుబంగారమై కోర్కెలను తీరుస్తూ అలరిస్తోంది.

ఈ ఆలయంలో విగ్రహం చాలా ప్రత్యేకం. చూశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

 మధ్యకైలాష్ లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఇందులో సగం వినాయకుడు , సగం హనుమంతుడు కొలువై ఉన్నారు.

ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు. ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని ఆద్యంత ప్రభు అన్నారు.

హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే.

ఆలయ విశిష్టత

కొన్ని సంవత్సరాల క్రితం తిరువేంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కలసి ప్రస్తుతం మధ్యకైలాష్ ఆలయం వెలసిన చోట "చిన్న వినాయక విగ్రహాన్ని" ప్రతిష్టించాడు.

     ఇక బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది.

ఇద్దరు సింధూర ప్రియలు. ఒకవైపు ఆంజనేయస్వామి, మరోవైపు వినాయకుడు.

ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి.

శాస్త్ర విధానంలో నిర్మించిన ఈ దేవాలయం పరమ విశేషమైనది.

ఈ ఆద్యంత ప్రభును పూజిస్తే సకల శనిదోషాలు పోతాయని గణేశ పురాణంలో ఉంది.

ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు.

 అంతే కాకుండా ఇక్కడ హనుమంతుడు పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవులు కూడా కొలువై ఉన్నారు..🙏🌹🎻

పెళ్లి సందడి


తోటకూర



అమ్మా అట్టు పెట్టావా


బైటికి వెళ్ళి వస్తె


వెళ్లి పోతావు మనిషీ పాట


వినీల విపణి


శ్రీ గణేశభుజంగ పంచరత్నం


1) వ్యాళసూత్రధార్యమిందుకుందధవళతేజసం
  భక్తవందితాంఘ్రియుగళపార్వతీమనోజవం 
  దానవాసురాదిహంతచారుసింధురాననం
  యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం ||

2) చందనాదిచర్చితాంగమాణిక్యభూషణం
   సామగానలోలమత్తచిత్తశంకరాత్మజం 
   పాశమోదకాదిహస్తహాస్యచతురభాషణం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘనాయకం ||

3) గర్వమోహసర్వఖర్వప్రథమపూజ్యపాత్రతం
   ముద్గలాదిమౌనివర్యసతతపూజ్యవిగ్రహం
   కార్యసిద్ధిమేధబుద్ధిసకలవిద్యదాయకం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం ||

4) ఆనందహృదయవాసచారుశూర్పకర్ణకం
   ఇందిరాదివంద్యమానచారుఏకదంతకం
   భావరాగతాళయుక్తభవ్యనాట్యకోవిదం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం || 






5) భ్రాంతిభీతిభేదనాశభక్తహృదయమందిరం
     భావనాత్మసంతుష్టతుష్టిపుష్టిదాయకం
     కోటిసూర్యభాసమానషోడశాకళాత్మకం 
     యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం ||
 
      సర్వం శ్రీగణేశదివ్యచరణారవిందార్పణమస్తు

అమ్మగాజులు


భుజాన నన్నేసుకుని నాన్న తిరుగుతూ ఉంటే , అమ్మ కొంగు దోపుకుని ఇటుగా వస్తున్న గాజుల శబ్దం వినగానే, మాగన్నులోంచి కూడా ఏడుపు ఉబికి వచ్చేసేది , 'అమ్మకూచి' అని నన్ను అమ్మ చేతికి అందించి నాన్నతప్పుకునేవాడు!
.....
కథ చెప్తూ జోకొడుతూంటే , నే'నూకొడుతూ' నోట్లో వేలేసుకునేలోగా గాజులున్న చేయి అందించేది , ఆ గాజులనే ఒకటికి రెండుసార్లు మేధావిలా లెక్కేసి ఇది అమ్మ చెయ్యే..... అని నిర్థారణతో నిద్ర వచ్చేసేది .
........
జుట్టు దువ్వుకుంటున్న గాజులసడి విని అమ్మ ఇక్కడే ఉందిగా, కాసేపాగి లేద్దామని మళ్ళా దొంగనిద్రముసుగేసి ఇంకో కునుకు తీసేదాన్ని !!

ధూప సువాసన , సన్నని మంత్రోచ్చారణ , మృదువుగా గంటానాథం , మధురంగా గాజులరాగం.. కిటికీలోంచి చూస్తే అమ్మ తులసమ్మకి పూజ చేస్తోంది .. నా అలికిడి విని "ఏయ్ దొంగా, ఇటురా ! " అని పిలిచి గొల్లయ్య కి చెప్పి చేతికి పేస్ట్ వేసిన పందుం పుల్ల చేతిలో పెట్టించేది !!

జడలేస్తుంటే గాజుల సౌండ్ జోలపాటలా ఉండి మళ్ళీ నిద్రొచ్చేది , జోగితే తను మెత్తగా మొట్టేది ,అపుడు కొంచం గట్టిగా మోగేవి ..

ఆమ్.. తినేటప్పుడు నా దృష్టి అమ్మగాజులపైనే.... అలా ఎలా చక్కగా మోగుతాయ్ , అచ్చు గాలికి కదులుతున్న ధ్వజస్తంభం చిరుగంటల నాదంలా ?

ఎప్పుడూ వచ్చే గాజులమల్లారాన్ని అడిగా... అమ్మవి స్పెషల్ గాజులా అని ? ఒఖ్క నవ్వు నవ్వి ..... ' నేనిచ్చేవి వా..ఠ్ట్టి మట్టిగాజులే అమ్మలూ ' , నీకూ వేస్తా దా అని చేతికి డజను చొప్పున గాజులు వేసాడు...
గలగలలాడాయి కానీ అమ్మగాజుల మ్యూజిక్ రాలేదు ...
ఏడ్చాను...వరదలయ్యేలా ఏడ్చాను ..దొర్లి దొర్లి ఏడ్చాను ..

బామ్మ బుగ్గన వేలేసుకుంది, నాన్న తల పట్టుకున్నారు , బాబాయ్ పగలబడి నవ్వాడు, తాత కసురుకున్నారు.. 

అమ్మ మాత్రం చిరునవ్వు నవ్వి దా..అని తన గాజుల డబ్బాలోంచి రెండు గాజులు తీసి చేతికి వేసి అంది ,ఇవి పాప గాజులు , అచ్చంగా నీవి అంది ..
కానీ ఇవి నీలా లేవుగా,సౌండ్ బాలేదు అన్నాను ,
అమ్మగాజులు నీకు చాలవు అంది, చాలినా ఆ శబ్దం రాదు, అంది.
ఎందుకు? అనడిగాను.. నేను అమ్మని, నువ్వు పాపవి కదా...అందుకు ..అని నవ్వేసింది !!

నాన్న బాబుని భుజాన్నేసుకుని జోకుడుతున్నాడు , అమ్మ గాజుల సవ్వడికి కెవ్వని ఏడుపు అందుకుని నాన్నని వదిలి అమ్మ చేతిని అందుకున్నాడు...నీలానే వీడూ 'అమ్మకూచి' అని నవ్వుతూ బాబుని నా చేతికి అందించి వాళ్ళ నాన్న పక్కకి తప్పుకున్నాడు !!

 సారె లో అమ్మ ఇచ్చిన గాజులు నా చేతిన గలగలలాడాయి .......అచ్చు అమ్మలా !! 😊😊😊                       
                          --- విష్ణుప్రియ వేదాంతం.

సంధ్యావందనం


గాలిలో గణపయ్య


పాత సినిమా పాట


శ్రీకారం


సౌరాష్ట్ర

పితృదేవతా స్తుతి



శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!
పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!
మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!
రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!
మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

కేశవ నామాలు

కేశవ నామాలు సంకల్పబలాన్నిచ్చే దివ్య మంత్రాలు. హిందూ సంప్రదాయంలో ప్రధానమై, నిత్యం స్మరించే ఈ దివ్య నామాలను ఒక మేలుకొలుపు పాటగా పాడుకోవడం ఆనాటి స్త్రీలలో చాలామందికి ఆనవాయితీ.


1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు

వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన

వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల

కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది

శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు

మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము

నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా మేలుకో ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు

గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార

గోపాలబాలుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి

విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు

సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా మేలుకో ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి

మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె

వనరుహ లోచన మేలుకో || కృష్ణా మేలుకో ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు

విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము

చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||


8. వామన రూపమున భూదాన మడిగిన

పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన

కశ్యప నందనా మేలుకో || కృష్ణా మేలుకో ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర

యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది

పొడచూతువుగాని మేలుకో || కృష్ణా మేలుకో ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు

వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె

వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు

వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము

పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


12. దామోదరా యని దేవతలందరు

దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె

భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప

సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము

పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు

భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు

వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ

దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ

నాదరించిన దేవ మేలుకో || కృష్ణా మేలుకో ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు

అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ

దర్భశయన వేగ మేలుకో || కృష్ణా మేలుకో ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ

పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ

పూతన సంహార మేలుకో || కృష్ణా మేలుకో ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి

దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి

వందన మొసగెద మేలుకో || కృష్ణా మేలుకో ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల

కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి

శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు

కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన

లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా మేలుకో ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ

సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము

పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి

యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు

మురళీనాదవినోద మేలుకో || కృష్ణా మేలుకో ||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా

జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు

వనమాలికాధర మేలుకో || కృష్ణా మేలుకో ||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు

బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార

కంససంహరణా మేలుకో || కృష్ణా మేలుకో ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము

సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక

కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా మేలుకో ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె

నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె

గోపాల బాలుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

సంచలన నిర్ణయం

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం

హైదరాబాద్: ఆల్రెడీ ఓ స్కూల్లో చదువుకుంటూ... అక్కడ మానేసి... మరో స్కూల్లో చేరాలంటే... తప్పనిసరిగా కొత్త స్కూల్లో టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఐతే... తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీసీ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీని వెనకాల బలమైన కారణం ఉంది. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకొని... ప్రైవేట్ స్కూళ్లు... విద్యార్థులు, తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. దాంతో ఆ ఫీజులు చెల్లించలేక, తమ పిల్లల్ని వేరే ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ మాన్పిస్తామంటే... ఫీజు బకాయిలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కండీషన్ పెడుతున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.
లబోదిబో మంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు తమిళనాడులో భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి, ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని నెలలుగా తాము పడుతున్న ఆవేదనకు ప్రభుత్వం సరైన పరిష్కారం చూపిందని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ ఇవ్వకుండానే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పొందవచ్చు. అడ్మిషన్లు ఆలస్యం కాకుండా... అన్ని స్కూళ్లలో హెడ్‌మాస్టర్లు రెడీగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆర్డరేసింది.

ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారు, ఇంకా చాలా మంది చేరుతున్నారు. టెస్ట్ బుక్స్ రెడీగా ఉన్నాయి. పైగా ప్రభుత్వం 14 రకాల వస్తువుల్ని ఉచితంగా ఇస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రూల్ వస్తే బాగుండంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మన ఏపీ, మన తెలంగాణలో కూడా ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టైంలో తినడానికే డబ్బు లేనప్పుడు... ఇక ఫీజులెక్కడ చెల్లించగలం అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన రాష్ట్ర ప్రభుత్వము కూడా టీసీలతో పనిలేకుండా ప్రభుత్వ స్కూళ్లలో చేరొచ్చనే ఆర్డర్ ఇస్తే... వెంటనే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించే ఛాన్స్ ఉంటుంది సర్.

మన గ్రూపులో ఉన్న పెద్దలు కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళగలరని‌ ఆశిస్తున్నాను. 🙏🙏🙏🙏

*🌷(ఓ నీతి కథ)🌷*

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
 
ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది.

ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం, అనుకొని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది. అందులో ఉన్న అమ్మ. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి" అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో.

అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను, అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజూ నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో కళ్ళు పోయాయి. చూపు పోయింది.

అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లీ నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. "అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి" అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు అనగా అమ్మ కనుక కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు, వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి.

బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజూ ఆరంగా ఆరంగ త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగత్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడలి. బాగా త్రాగాలి అని అడిగాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.🙏

చూసేరా నిత్యం పూజలు చేస్తూ మధ్యలో నాస్తికవాదం లోకి మారితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. దేవుడిని వేడుకోక ముందు కష్టాలు ఉన్నాయి. వేడుకున్న తరువాత ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసిన పాపాలు ముందుగా తీసేస్తున్నాడు అని అర్థం. అంతేకాని అడిగిన వెంటనే సుఖం ఇచ్చి కోరిన కోర్కెలు తీరిస్తే సుఖంగానే ఉంటాం. కానీ మళ్లీ ఏదో ఒక సమయంలో కష్టాలు చుట్టుముడతాయి. మళ్లీ జన్మ ఎత్తాలి. అప్పుడు మళ్లీ మళ్లీ పరుగులుపెట్టాలి అవసరమా?

అదే మనం చేసిన పాపాలు ముందుగా ప్రక్షాళన అయిపోతే చివరివరకు సుఖంగా జీవిస్తావు. అలాగే మనం కోరుకునే కోరిక కూడా మనకి తగినది అవునా కాదా! అనేది కూడా తెలుసుకొని కోరుకోవాలి. కొందరు ఎంత వేడుకున్నా కోరికలు జీవితంలో తీరవు. ఎందుకంటే వాడు దానికి అర్హుడు కాదు.
నేను సీఎం అవ్వాలి అనుకుంటే అయిపోతుందా అవ్వదు, ఎందుకంటే నేను దానికి అర్హుడిని కాదు కాబట్టి ఆ కోర్కె తీరదు. కష్టపడతాను సాధిస్తాను అంటే జీవితకాలం కష్టపడుతూనే ఉంటావు. కోట్లమందిలో ఒక్కడికి మాత్రమే అవకాశం వస్తుంది. అది నేను ఎందుకు కాకూడదు అని పిడివాదం చేస్తే నాస్తికుడిలా మారిపోతావు. చివరికి భ్రష్టత్వం వస్తుంది.

మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు, మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలించే (మెచ్యూరిటీ) వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. నువ్వు పూజలు చేసినన్ని రోజులు కష్టాలు పడి నాస్తిక వాదంలోకి మారిపోగానే కలిసి వచ్చింది అనుకోవడం అజ్ఞానం. నువ్వు చేసిన వ్రత ఫలం అనుభవిస్తున్నావు. ఆవిషయాన్ని నువ్వు గ్రహించడం లేదు అంతే. ఎందుకంటే అప్పటికే నాస్తికవాదంలో కూరుకుపోయావు. దీని ఫలితం కూడా అనుభవించాల్సిందే. పాపానికి కూడా పరిపూర్ణత (మెచ్యూరిటీ) రావాలి కదా, భక్తి అయినా, నాస్తికవాదం అయినా పుట్టుకతో వస్తే దానిని అలా చనిపోయేవరకు తీసుకెళ్లాలి. నాస్తిక వాదం నుండి భక్తిలోకి వస్తే పర్లేదు, కాని భక్తి నుండి నాస్తికవాదం లోకి వెళితే వంశాలకి వంశాలు సర్వనాశనం అవుతాయి. కాబట్టి చేసిన పూజకి ఏనాటికైనా ఫలితం తప్పకుండా వస్తుంది. రాలేదని నాస్తికవాదంలోకి వెళ్ళకండి. సహనమే ప్రదానం.

దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్ష్యాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎచక్క
 ప్రతి క్షణం ఒకే స్థితి ఆనందమే ఆనందం
ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు 🙏

 శివయ్యా! అందరిని చల్లగా చూడు తండ్రీ! 🙏

మహాలయ పక్షము

🔥కర్ణుడు భూలోకంలో గడిపి.. స్వర్గానికి వెళ్లిన పక్షమే మహాలయ పక్షం!🚩


*♦మహాలయ పక్షం..*
*🔹 భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది.*
*🔹 ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి,*
*🔹 మీ పితృదేవతలను స్మరించి,*
*🔹 వారికి నమస్కారము చేస్తూ,*
*🔹 ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*
*🔹 ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.*
*🔹 భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో,*
*🔹 బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్ఠమైనది.*
*🔹 పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు.*


*♦ఈ పక్షం ముగిసే వరకు..*
*🔹 ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి.*
*🔹కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.*
 *🔹తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి.*
*🔹 తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి.*
*🔹 ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి.*


*♦దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి...*
*🔹 మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది.*
*🔹 ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి.*
*🔹 ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది.*
*🔹పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు.*
*🔹 ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.*
 *🔹ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.*
*🔹ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని..*
*🔹 సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు.*
*🔹 ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.*
 *🔹స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది.*
*🔹 దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా...*
*🔹 ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు.*
*🔹 చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు.*
*🔹 అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ,*
*🔹కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు.*
*🔹 అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.*


*♦కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా,*
*🔹 ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు.*
*🔹 నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి,*
*🔹అతడిని పెంచిన మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.*
 *🔹ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు.*
*🔹అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు.*
*🔹 పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.*


*♦ఎప్పుడైతే కర్ణుడు తిరిగి వచ్చి భూలోకంలో..*
*🔹 అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది*
*🔹ఆకలి తీరింది.*
*🔹 కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.*
*🔹ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.*🚩

పూజా - జప నియమాలు

పూజా - జప నియమాలు (ఋషిపీఠం విశిష్టసంచిక 2004)
పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.
నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.
ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.
ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.
గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు.   
పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.
పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది
తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.
ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు. తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు.
పూజలకు, జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.
జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.
నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి.
అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.
వట్టి నేలపై కూర్చొని జపించరాదు. పూజించరాదు. భుజించరాదు.
’పూజ’ అంటే "భోగములను ప్రసాదించునది" అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.
మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప, ధూపాలు, కుసుమాు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.
బహిష్ఠు స్త్రీలు మసలే చోట, వారి దృష్టిపడే చోట దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.

మనతెలుగు


౼౼౼౼౼౼౼౼
షట్ శాస్త్ర పాండితీ సంగ్రామవీరుల
     సంతానమందిన సాధువనిత
వేద షడంగాల విశ్వమ్ము వినుతించు
     పుత్రులన్ బడసిన పూతచరిత
షాణ్మాతురుడు మెచ్చి సన్మానమున్ సేయు
     శాస్త్రవాదులగన్న జ్ఞానభరిత
సార సారస్వతజ్ఞాన సంపన్నుల
      సుతులుగా గన్నట్టి సూరివినుత

భారతీయుల సందేహభారముడుపు
ధీ విశేషజ్ఞులను గన్న దివ్యమాత
శాంతి సత్కపోతమ్మైన,స్తవ్యమాత
తెలివికే తెలివినిడు మా తెలుగుమాత.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

పితృస్తుతి

శుభ...వందనాలు...!!💐శ్రీ💐
బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి..

ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు.

ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు.

దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారివద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.

బ్రహ్మ ఉవాచ:.💐

 నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు.

నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.

యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము.

ఫలశ్రుతి:.💐

ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

మరో శ్రీశైలం....పామాపురం



చుట్టూ పచ్చని వాతావరణం... వాగు మధ్యలో ధ్యానముద్రలో కొలువైన పరమశివుడు... ఎత్తైన కొండపైన కనిపించే పురాతన ఆలయంలో భ్రమరాంబ

సమేతంగా దర్శనమిచ్చే స్వామి... మరో శ్రీశైలంగా పిలిచే ఈ ఆలయాన్ని చూడాలంటే వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురానికి వెళ్లాలి.

శివుడికి ఎన్నో పేర్లు అంటారు. శ్రీశైలంలో స్వామి భ్రమరాంబ మల్లికార్జునుడిగా కొలువుదీరితే, పామాపురంలో శివుడు భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని అంటారు. రెండుసార్లు ఈ ఆలయం ఆనవాళ్లు కోల్పోయినా మళ్లీ కట్టారని చరిత్ర చెబుతోంది. స్థలపురాణం

ఈ దేవాలయం క్రీస్తుశకం 543 నుంచి 750 మధ్య కాలంలో చాళుక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించిన అతి ప్రాచీన కట్టడంగా పురావస్తుశాఖ పేర్కొన్నా.... ఇక్కడ స్వామి ఎలా, ఎప్పుడు వెలిశాడో, ఆలయం ఎవరు కట్టించారో ఎవరికీ తెలియదని అంటారు. ఒకప్పుడు ఈ గుడిని ముచ్చ రామనాథస్వామి ఆలయంగా పిలిచేవారట. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో గుడి శిథిలావస్థకు చేరుకుందట. అయితే కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఓసారి ఈ ప్రాంతంలో పర్యటించిందట. పచ్చని పంట పొలాలూ నిరంతరం ప్రవహించే వాగులూ జల సవ్వడులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణం చూసి ఆనందించిందట. అలా ఎత్తైన గుట్టపైకి వెళ్లినప్పుడే నామ రూపాల్లేకుండా ఉన్న ఆలయాన్ని చూసి దాన్ని మళ్లీ నిర్మించి శివలింగాన్ని పునః ప్రతిష్టించిందని అంటారు. ఆ తరువాత గుడి నిర్వహణ బాధ్యతలను పామాపురం

గ్రామానికి చెందిన తంబాల వంశస్థుడైన ఓ వ్యక్తికి అప్పగించిందట. అంతేకాదు ఆలయానికి కొంత భూమిని కూడా కేటాయించినట్లు చరిత్రలో ఉంది. అప్పటినుంచీ ఈ గుడిని రామేశ్వర ఆలయంగా పిలవడం మొదలు పెట్టారట. అది జరిగిన కొన్నేళ్లకు ఈ ఆలయం మళ్లీ ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరుకుందట. అలాంటి సమయంలో అంటే 1981 ప్రాంతంలో ఆలంపూర్ సంస్థానం రెడ్డి రాజుల వంశస్థులు సురేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ గుడికి వచ్చారట. ఆ తరువాత తండ్రి కోరడంతో ఈ గుడిని మళ్లీ కట్టించాలనుకున్నారట. దేవాదాయశాఖ అనుమతితో సచ్చిదానంద గణపతి స్వామీజీ పీఠాధిపతుల ఆశీర్వచనంతో 2017లో ఆలయ పునః నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరువాత ఇక్కడ శివలింగంతోపాటూ భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడంతో అప్పటినుంచీ ఈ గుడిని భ్రమరాంబ సమేత రామేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తున్నారు. .

ఎన్నో ప్రత్యేకతలు....

ఈ ఆలయంలో నిత్యపూజలతోపాటూ శివరాత్రి రోజున గిరిజా కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ సాయంత్రం జరిగే రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ

ప్రాంతాల నుంచి తరలిరావడం విశేషం. అదేవిధంగా నవరాత్రుల వేడుకలనూ అంగరంగ వైభవంగా జరుపుతారు. కార్తికమాసంలో స్వామికి చేసే అభిషేకాలూ అమ్మవారికి కుంకుమార్చన, నవగ్రహ పూజలతో కన్నులపండువగా ఉంటుందీ క్షేత్రం. ఇక్కడ ఉన్న శివలింగం కాశీలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుందని అంటారు. ఇక్కడ కేవలం శివాలయం మాత్రమే కాదు... నవగ్రహ మందిరం, జంటనాగుల మందిరం, సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ పుష్కరిణిలో ఉండే నంది విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం పక్కనే ఊకచెట్టు వాగు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వాగులో నీరు ప్రవహిస్తూనే ఉంటుందని చెబుతారు. ఈ నీటి మధ్యలో 18 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏడు అడుగుల పీఠం పైన కొలువై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలా చేరుకోవచ్చంటే...

హైదరాబాద్ నుంచి రావాలనుకునే భక్తులు కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పైన 143 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తకోట మండలం చేరుకోవచ్చు. అక్కడి నుంచి పామాపురం ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చేవారు నాటవెల్లి నుంచి పామాపురం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడినుంచి ఆటోలూ బస్సులూ తిరుగుతుంటాయి. - కాయల పూర్ణచందర్, ఈనాడు

మహబూబనగర్
SOURCE EENADU

చామరం_చమరీమృగం

💥💥💥💥💥💥💥💥💥💥💥💥
  #చామరం_చమరీమృగం(జడలబర్రె)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥

చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామర లాగ వీచే ఉపకరణం. కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు. దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమ రంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు. ఈ వెండ్రుకలు చమరీ మృగం తోకభాగం నుండి తీస్తారు. పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది.

చమరీ మృగం లేదా జడల బర్రె (ఆంగ్లం: Yak) పొడవైన వెండ్రుకలు కలిగిన క్షీరదాలు. వీటి శాస్త్రీయ నామం బాస్ గ్రునియెన్స్ (Bos grunniens). ఇవి దక్షిణాసియా హిమాలయ పర్వత ప్రాంతాలలో, టిబెట్ నుండి మంగోలియా వరకు విస్తరించాయి.

#జీవనశైలి:-

ఇవి ఎక్కువగా పెంపుడు జంతువులుగా జీవిస్తాయి. కొద్ది జీవులు అడవులలో ఉంటాయి.

చమరీ మృగాలు సమూహాలుగా జీవిస్తాయి. మగజీవులు సుమారు 2–2.2 మీటర్లు, ఆడజీవులు దానిలో మూడోవంతు పొడవుంటాయి. రెండింటికీ పొడవైన వెండ్రుకలు దట్టంగా శరీరమంతా కప్పి చలినుండి రక్షిస్తాయి. ఇవి గోధుమ, నలుపు, తెలుపు రంగులలో ఉంటాయి. రెండింటికీ కొమ్ములుంటాయి.

చమరీ మృగాలు సుమారు సెప్టెంబర్ మాసంలో జతకడతాయి. ఆడజీవులు ఇంచుమించు 3–4 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి ఏప్రిల్-జూన్ నెలల్లో దూడల్ని కంటాయి. వీటి గర్భావధి కాలం సుమారు 9 నెలలు. దూడలు సంవత్సర కాలం తల్లివద్ద పాలు త్రాగి, తర్వాత స్వతంత్రంగా 20 సంవత్సరాలు పైగా జీవిస్తాయి

చమరీ మృగాల్ని వాటినుండి లభించే పాలు, ఉన్ని, మాంసం కోసం పెంచుతారు. వీటిని బరువైన పనులు చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు. స్థానిక రైతులు, వర్తకులు వీటిని వస్తువులను ఎత్తైన పర్వతాల గుండా రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. పర్వతారోహణ, సాహసిక బృందాలు వీటిని తమ సామగ్రిని చేరవేయటానికి కూడా ఉపయోగిస్తాయి. వీటిని నాగలి కట్టి పొలాలు దున్నటానికి కూడా ఉపయోగిస్తారు. చమరీ మృగాల పేడను ఆవుపేడ వలె పిడకలు చేసి వంటచెరుకుగా, ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. చమరీమృగాల పాలనుండి చ్ఛుర్పీ (టిబెటన్, నేపాలీ భాషలు) లేదా బ్యాస్లాగ్ (మంగోలియన్) అనే ఒక రకం చీజ్ ను తయారుచేస్తారు. ఈ పాల నుండి తీసిన వెన్నను, టీలో కలిపి చేసిన బటర్ టీ ని టిబెట్ ప్రజలు విరివిగా తాగుతారు. ఈ వెన్నను దీపాలు వెలిగించటానికి, మత సంబంధ ఉత్సవాలలో ఉపయోగించే వెన్న శిల్పాలను సృష్టించడానికి కూడా ఉపయోగిస్తారు.

మృగాల మందలలో తరచూ చమరీ మృగాలకు, సాధారణ బర్రెల మధ్య సంకరం ద్వారా పుట్టిన సంకర జాతి జంతువులు కూడా కనిపిస్తుంటాయి. వీటిని టిబెటన్ భాషలో డ్జో లేదా డ్జోప్క్యో అంటారు. మంగోలియన భాషలో వీటినే ఖైనాగ్ అంటారు. సాధారణ బర్రెలలాగా అంబా రవమే శబ్దము కాకుండా చమరీమృగాలు హుంకరిస్తాయి.

చమరీమృగాలనుండి లభించే పోగులు మృదువుగా, నునువుగా ఉండి, బూడిద, గోధుమ, నలుపు, తెలుపు మొదలైన అనేక వర్ణఛ్ఛాయలలో లభ్యమౌతాయి. 1.2 అంగుళాల పొడవుండే ఈ పోగులను మృగాల నుండి దువ్వడం లేదా విదిలించిండం ద్వారా సేకరిస్తారు. ఇలా లభ్యమైన పోగులను యేకటం ద్వారా తయారైన మొత్తని తంత్రులను వడికి ఉన్ని దారాన్ని తయారు చేస్తారు. ఈ దారాన్ని అనేక ఉన్నివస్త్రాలను అల్లటానికి ఉపయోగిస్తారు. చమరీమృగాల వెంట్రుకల నుండి తాళ్ళు, రగ్గులు, అనేక ఇతర సామగ్రి తయారు చేస్తారు. ఈ జంతువుల తోలుతో బూట్లు, చేతిసంచుల తయారితో పాటు చిన్న పడవ నిర్మాణంలో కూడా ఉపయోగిస్తారు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

_**టీనేజ్ హోమ్స్**



వోల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.

షాకవుతున్నారా? అప్పట్లో వోల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటి ??????????

నమస్తే సార్ .

నమస్తే –రండి కూర్చోండి.
మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్ .

వెల్కం. అబ్బాయా అమ్మాయా ?

ఇద్దర్నీ జాయిన్ చేస్తా...

ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.

ఓకే సార్ .కట్టేస్తాం.

ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?

మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ...

అంటే?

ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు.

అంటే......? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?

అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది?అసలు నిద్రే పోవటం లేదు.

అంటే.......? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?

ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?

ఓహో......అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.

అవును.

మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?

అందుకే రెండు ఫోన్లు వాడుతున్నారు.

ఫోన్లు లాక్కో పోయారా?

మంచిగున్నారు. మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు.

ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట .మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.

అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం. బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం.

మరి అదే కంటిన్యూ చేయక పోయారా?
ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం ,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం.మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం.

ఓకే. అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?

మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..

గుడ్...... రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.

మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు.

ఓకే.... .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి.

అంత సీన్ అవసరం లేదు . మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు.
అలా అయితే పదివేలు కట్టండి చాలు.

ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?

ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి –ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు. తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం...

ఒక డౌట్ సార్ .

ఏంటది.?

ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?

అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.

ఎందుకు?

అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.
ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని అరిపోయి వుంటారు గనక.

🤣🤣🤣🤣😮😮😜😎😎

శ్రీ కృష్ణ మిత్రమా

శ్రీ కృష్ణ మిత్రమా సుధామా
పరమాత్మ చిన నాటి నేస్తమా
పురాణాలలోఎన్నోస్నేహా
బంధాలు చదివినాము
కానికుచేలా మీలాంటి స్నేహంలేదు
ద్రోణ ద్రుపదులస్నేహం
అనురాగంలేని స్నేహం
రామ సు గ్రీవుల స్నేహం
రమ్యమైన స్నేహం
దశరధ జటాయులస్నేహం
ఆద రణ తో కూడినస్నేహం
కర్ణధుర్యోధనులస్నేహం
చెడునడత గలస్నేహం
కాని కుచేల మీ స్నేహం
పరమపవిత్రమైనస్నేహం
కుచేలానీకు ఆదిదేవుని ఆహ్వనం
అమ్మవారు నీరుపోయటం
ఆదిదేవుడునీ పాదాలుకడగటం
నీవిచ్చిన అటుకులు తినటం
నీకు సంపదలు లివ్వటం
ఆహా సుధామా నీవు ధన్యడవు
పూజింపదగినవాడవు
కృష్ణ సఖా మీ స్నేహం
పరమపవిత్ర మైనది
ఆదర్శవంతమైనది
ఇట్లు
జయలక్ష్మి

మాదైవమా గొల్చెదన్.🙏

ఉన్నావీవె మనమ్మునన్ మిళితమై యున్నట్టి మాశక్తి మే

మెన్నన్ జేయుమ జ్ఞానదీప్తిని హరీ! యీ బాధలన్ బాపుచున్

నన్నున్ నీవుగ మార్చుమా దయను జ్ఞనంబున్ గృపన్ గొల్పి శ్రీ

మన్నారాయణ! బాధలన్ విడువనీ. మాదైవమా గొల్చెదన్.🙏

శివామృతలహరి శతకం

.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
తనలోనే పరమాత్మయున్నదను సత్యం బావగింజంతయున్
కనలేడాయెను జీవి; నిన్ను వెదకున్ కానల్ గుహల్ దూరుచుక్
మనసే అద్దము గాదె నిన్గనుటకున్ మాయామషిన్ బాయఁ ద్రో
చిన భవ్యంబగు యోగహస్తమున నో శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావము;
దేవుడు వెరెక్కడో లేడు, మనలోనే దాగి ఉన్నాడు అని మనిషి గ్రహించలేక, నీ కోసం అడవుల్లోనూ, కొండ గుహల్లోనూ వెతుకుతూ ఉంటాడు.
మనస్సు అనే అద్దంలో నీ దర్శనం ప్రతి నిత్యము దొరుకుతుంది కదా!
కాక పోతే మాయ అనే మసితో ఆ అద్దం మసక బారి ఉంటుంది. నిత్యం భక్తి ప్రపత్తులతో నిన్నే ధ్యానిస్తూ నీ మీద మనసుని లగ్నం చేస్తే గనుక, నీ దివ్య హస్తము తో మనసుకు పట్టిన మాయ అనే మసిని తుడిచి వేసి నీ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తావు కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!అని నాన్నగారి భావన.

రామాయణమ్. 49


...
కైక ముఖంలో కాఠిన్యం ప్రతిఫలిస్తుండగా రామునితో,
.
రామా! నీకు ఒక విషయం చెప్పాలి ! అది చెప్పుటకు నీతండ్రికి నోరు రావడంలేదు అందుకే ఆయన అలా ఉన్నాడు ,అంతేగానీ ఏవిధమైన ఆపద సంభవించలేదాయనకు.
.
అది నీకు అప్రియము కావచ్చును కానీ అది ఆయన ప్రతిజ్ఞా పాలనమునకు సంబంధించినది ,ఆయన ఇచ్చిన మాట చెల్లించే సమయం నేడు ఆసన్నమయినది..
.
నీతండ్రి పూర్వము నాకు ఒక వరము ఇచ్చి వున్నాడు ,ఆ వరము నాకిచ్చినందుకు సామాన్యమానవుడిలాగ విలపిస్తున్నాడు నేడు. అదేదో పాప కార్యమన్నట్లుగా భావిస్తున్నాడు.పశ్చాత్తాపం చెందుతున్నాడు..
.
సత్యమువచించుట ,ఇచ్చినమాట నిలబెట్టుకొనుట సత్పురుషుల లక్షణము ,నీ తండ్రి మాట చెల్లించగలనని నీవు మాట ఇచ్చినచో ఆయన నా కిచ్చిన వరము గురించి నీకు తెలిచేయగలను. ఈయన స్వయముగా నీకది చెప్పలేడు.
.
ఆవిధంగా మాట్లాడుతున్న పినతల్లిని చూసి మనస్సులో బాధపడుతూ ! ...ఛీ ఎంత కష్టము తల్లీ ! నా విషయములో నీవు ఇటుల మాటలాడవలదు!
.
నా తండ్రి ఆజ్ఞాపించినచో అగ్నిలో దూకెదను ,ఆయన కాలకూట విషమిచ్చి త్రాగు రామా! అన్నచో అది అమృతమువలే సేవించగలను.
.
తల్లీ నీ మనసు నెరిగింపుము!
.
రాముని వద్ద రెండు మాటలు లేవు ..
.
రామో ద్విర్నభిభాషతే!
(ఇప్పుడొక మాట తరువాత ఒక మాట లేవు !ఎప్పుడూ ఒకటే మాట !)....ఒకటే మాట!
.
రామా! నీ తండ్రి పూర్వము నాకిచ్చిన వరములను నేడు అమలుపరచమంటున్నాను దాని ప్రకారము ...భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను,...
...నేడే నీవు జటావల్కలధారియై దండకారణ్యములో పదునాల్గువత్సరములు నివసింపవలే!.
.
తండ్రి ఆజ్ఞ పాలింపుము.. నీ కొరకై ఏర్పరచిన అభిషేక సామాగ్రితో భరతునికి పట్టముగట్టవలే.
.
మరణశాసనము వంటి ఆ పలుకులు రాముని ఏ మాత్రమూ బాధించలేదు ! ప్రశాంతత చెడలేదు ! వ్యధ దరిచేర లేదు.
.
అమ్మా ! నీవు చెప్పినట్లే జరుగుతుంది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

*శరణాగతి*

*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*

సందేహం;- *శరణాగతి* అంటే ఏమిటి? దాని విధానం తెలపండి.

సమాధానం;- శరణాగతినే ప్రపత్తి అనీ, భరన్యాసం అనీ అంటారు.

భగవంతుడే రక్షకుడు, మోక్షోపాయము (శరణం) అనే దృఢ విశ్వాసం నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోవడమే *శరణాగతి*. నీ భారమంతా భగవంతునిపైన ఉంచడమే (న్యాసం) శరణాగతి చేయడం అంటే. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి  నివృత్తే ప్రపత్తి. *రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే* నిన్ను రక్షించాలనే అపేక్షతో భగవంతుడు సదా నిరీక్షిస్తుంటాడు. అది ఆయన ప్రవృత్తి. దానికి విరుద్ధంగా *నన్ను నేను రక్షించుకోగలను* అనే స్వతంత్ర ప్రవృత్తి నీకు ఉండకూడదు. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఇదే. ఇలా ఏ పరిస్థితుల్లోనూ సడలని విశ్వాసంతో ఉండడమే శరణాగతి, ప్రపత్తి.

శరణాగతి చేయడానికి రెండు ప్రధాన లక్షణాలుండాలి. మొదటిది ఆకించన్యము. రెండవది అనన్యగతి.

ఆకించన్యమంటే *స్వామీ! నేను ఎలాటి యోగ్యత, శక్తిలేనివాడిని, దీనుణ్ణి* అని ప్రార్థించడం.

అనన్యగతి అంటే *స్వామీ! నువ్వు తప్ప నాకు ఎవ్వరూ రక్షకులు లేరు, నువ్వే నాకు దిక్కు, దీపమూ* అని మహావిశ్వాసాన్ని ప్రకటించి, ఆచరణలోపెట్టడం.

*సకృదేవ ప్రపన్నాయ* అని శ్రీరాముడూ, *సర్వధర్మాన్, పరిత్యజ్య* అని శ్రీకృష్ణుడూ శరణాగతే సులభమైన, సుకరమైన మోక్షోపాయమని చెప్పారు. శరణాగతి ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు. సదాచార్యుల సమాశ్రయణం శరణాగతి మంత్రాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీరామాయణాన్ని *శరణాగతి వేదము* అనీ, విభీషణ శరణాగతిని *పరిపూర్ణ ప్రపత్తి* విధానమనీ పెద్దలు నిరూపించారు.

*శుభంభూయాత్*

*ఆచార్య సద్భావన*



దుఃఖపుటాలోచనలు మన ఆరోగ్యానికి, ఆనందానికి చాలా హాని చేస్తాయి. జయాపజయాలు, సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి, పోతాయి. అవి శాశ్వతంగా ఉండవు. అటువంటప్పుడు వాటిని ఎందుకు తీవ్రంగా పట్టించుకొని మనల్ని మనం విచార గ్రస్తులుగా చేసుకోవాలి? సూర్యుడు దేనికి చిహ్నం? కాంతికి, ఆనందానికి చిహ్నం. జీవితాన్ని ఆనందమయం చేసే ఆ ప్రకాశాన్ని మనలోనే కనుగొనాలని సూర్య తేజం మనకు బోధిస్తున్నది. అయితే సర్వదా మనల్ని పరిరక్షించే భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనలోని ఈ చిరుదివ్వెను ఉజ్జ్వలంగా ప్రకాశించేలా చేయగలం.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
మాలో ఉన్న దైవం నూతన అవగాహన మాలో కలిగించుగాక, మాలో శాశ్వతానందమును కలిగించుగాక, ఆ ఆనందజ్యోతి సకల అంధకారాన్ని, విచారాన్ని పారద్రోలుగాక, మా జీవితం ఇతరులకు ఆనందాన్ని పంచుతూ, దైవకృప, దైవ ఆశీస్సుల యొక్క విలువను మరీ మరీ నిరూపించుగాక.
సర్వేజనా సుఖినోభవంతు.

*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*

పురుషుడు ఎలా ఉండాలో

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...👍
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది👍💐

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

1.కార్యేషు యోగీ
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి

2. కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

విష్ణు సహస్ర నామాలు -

Vishnu Sahasranama-

104. Aarva yoga vinissritah: One who is beyond any attachment.

105. Vasuh: One who dwells in the hearts of His devotees.

విష్ణు సహస్ర నామాలు -

104) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.

105) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.

పోయిన ధనం

పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వం పునర్లభ్యం
న శరీరం పునః పునః।।

పోయిన ధనం మళ్లీ చేరుతుంది.
దూరమైన మిత్రుడు చేరువ అవుతాడు.
భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది. భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు.
అందుకే శరీరం ఖలు ధర్మ సాధనం అన్నారు. కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు. శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది. శరీరం ఉంటేనే హిత వాక్యాలు చెప్పవచ్చు. ఏ పని చేయడానికైనా శరీరం కావాలి. కనుక శరీరమును రక్షించుకోవాల్సింది మానవ జన్మ వచ్చిన వాళ్లే.

జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.
పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు.

బుద్ధి, ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. కనుక మనం అందరమూ శరీరాన్ని కాపాడుకోవాలి. అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా,
అతిగా దుఃఖం కలిగించినా
ఏదైనా అతి చేస్తే శరీరం కాస్త పుటుక్కుమంటుంది.
ఇక శరీరం చేజారి పోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు శరీరమును జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పాటించడమే మహౌషధంగా పనికి వస్తుంది.

విస్తరాకు

విస్తరి ఆకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము. బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.
తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి, దూరంగా పడేసి వస్తాము,
మనిషి జీవితం కూడ అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తారు.
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది.
విస్తరి ఆకుకు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !

సేవ చేసే అవకాశము వచ్చినపుడు చేయండి.

మరి ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగలవచ్చు. అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
యెంత సంపాదించి ఏమి లాభం ? ఒక్క పైసా అయినా తీసుకుపోగలమా?

విష్ణు సహస్ర నామాలు

Vishnu Sahasranama-98. Siddhah: One who is reachable and knowledgeable.

99. Siddhih: The Goal.

100. Sarvadih: The Origin or Cause of all things.

విష్ణు సహస్ర నామాలు -
98 సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99 సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100 సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ

గతంలో ... నేడు

గతంలో సంసారం 'చీకట్లోనే' జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి....

కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు...🤦‍♂

నాడు కొందరికే మందు, విందు అలవాటు
నేడు కొందరే వీటికి దూరం..

నాడు కష్టమొస్తే, కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు,
నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమౌతున్నారు..

నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం,
నేడు కదల కుండా కూర్చుని సంపాదిస్తూ....
 తిన్నది అరగడానికి వాకింగు శ్రమిస్తున్నాం,

నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము..
ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు..
ఇంక పిల్లలెక్కడ🙆‍♂
అందుకేగా అన్ని చోట్లా
సంతాన సాఫల్యకేంద్రాలు...

గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే.. మనసు మాత్రం సాఫ్టు
ఇప్పుడు అంతా
 'సాప్ట్ వేర్ ఇంజనీర్లే' మనసు మాత్రం హార్డు!!!!

అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి!
ఇప్పుడు తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది!!

నాడు దొంగలు 'నట్టింట్లో' పడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా 'నెట్ ఇంట్లో' దోచేస్తున్నారు....

ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక ..
ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు తున్నారు సైబరు నేరగాళ్ళు....

అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం,
ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం..

ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం..
ఇప్పుడు రెడీ మేడు చపాతీలు , పొంగలి దాంటో కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం...

చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువు లొచ్చేవి....
  నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యం తో సహా అక్కడినుంచే...

ఇది మనం సాధించిన పురోగతా............?
లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....?

ఈ పోస్ట్ కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు...
ఇలా ఉన్న వాళ్ళ మధ్యలోనే కదా మనం బతుకుతోంది... కాస్త ఆలోచించండి మీ మంచికే ! Please forward to others🙏�
      🙇🏻....

*ధార్మికగీత - 8*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                         
                                       *****
           *శ్లో:- న గృహం గృహమి త్యాహు: ౹*
                  *గృహిణీ గృహ ముచ్యతే* ౹
                  *గృహం తు గృహిణీ హీనమ్ ౹*
                  *అరణ్య సదృశం మతమ్* ౹౹
                                    *****
*భా:- పరివారం, సేవకగణము, వస్తువాహనములు, ధనకనక రాసులు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికిని ఆ ఇల్లు వాస్తవంగా "గృహము" అని వ్యవహరింపబడదు. మహాలక్ష్మిని పోలిన "గృహిణి " మహారాణిలా తిరుగాడు చున్నప్పుడే ఆ ఇంటిని నిజమైన గృహముగా పరిగణిస్తారు. అట్టి ఇల్లాలి ప్రాపులో సంతానం దినదిన ప్రవర్ధమానమై, వంశాభివృద్ధితో ఇల్లు కళకళ లాడుతుంది. బ్రహ్మచర్య, వానప్రస్థ,సన్న్యాసాశ్రమ వాసులకు, బంధుమిత్రులకు ఆత్మీయ అతిథిమర్యాదలలో కీలక పాత్రధారి ఇల్లాలే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఓర్పు, నేర్పు, సమర్ధత, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత , దయ, ధైర్యము, స్థైర్యము మూర్తీభవించిన అలాంటి "గృహిణి" లేని ఆ ఇల్లు అడుగడుగునా భయానకమై, అరణ్యాన్ని తలపిస్తుంది. కళాకాంతులు , భోగభాగ్యాలు, శాంతిసౌభాగ్యాలు లేక వెలవెల పోతుంది. గృహస్థుకు గృహమే ఒక స్వర్గసీమ. అందుకనే " ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే యీ జగతికి జీవనజ్యోతి " అన్నాడో సినీకవి*
                                     *****
                       *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*కృతిపతి నిర్ణయం*

*భాగవతామృతం*
*కృతిపతి నిర్ణయం*

1-13-ఉ.ఉత్పలమాల
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్
ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = మేలు సమకూరునట్లుగా.
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.
1-14-తే.తేటగీతి

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివుని = శివుడిని; పూబూజింపఁడు = పూజింపనివాడు; ఏని = ఐతే; నోరు = నోరు; నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి = విష్ణువుయొక్క; కీర్తి = శ్రవణము; నుడువఁడు = పలుకడు; ఏని = ఐతే; దయయు = దయ మఱియు; సత్యంబు = సత్యము; లోనుగాన్ = కలుగునట్లు; తలఁపఁడేనిన్ = ఎంచకపోతే; కలుగన్ = పుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; తల్లుల = వారి తల్లుల యొక్క; కడుపు = కడుపు; చేటు = చెడపుటకు.
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి
1-15-వ.వచనము
అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, యొక్క రాకా నిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని, సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, క్రుంకులిడి వెడలి, మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ, గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ
అని = అని పలికి; మఱియున్ = ఇంకా; మదీయ = నాయొక్క; పూర్వ = క్రితపు; జన్మ = జన్మలు; సహస్ర = వేలకొలదుల లోను; సంచిత = సంపాదించిన; తపః = తపస్సుల యొక్క; ఫలంబున = ఫలితము వలనను; శ్రీమన్ = శోభనకరమైన; నారాయణ = హరియొక్క; కథా = కథల; ప్రపంచ = మొత్తం సమూహాన్ని; విరచనా = రచించాలనే; కుతూహలుండను = బలీయమైన కోరికగల వాడను; ఐ = అయి; ఒక్క = ఒక; రాకా = పౌర్ణమి నాటి; నిశా = రాత్రి; కాలంబున = కాలంలో; సోమ = చంద్ర; ఉపరాగంబు = గ్రహణము; రాకన్ = వస్తుందని; కని = తెలిసికొని; సజ్జన = సజ్జనుల; అనుమతంబున = అనుమతితో; అభ్రంకష = ఆకాశామును; కష = ఒరసుకనేలా; శుభ్ర = శుభ్రమైన; సముత్తుంగ = పెద్ద; భంగ = అలలు కలది; అగు = అగు; గంగ = గంగానది; కున్ = కి; చని = వెళ్ళి; క్రుంకులు = మునుగుటలు - స్నానము; ఇడి = చేసి; వెడలి = బయటకువచ్చి; మహనీయ = గొప్పదైన; మంజుల = మనోహరమైన; పులిన = ఇసుకతిన్నెల; తలంబున = గట్టుమీద; మహేశ్వర = శివుని; ధ్యానంబు = ధ్యానం; సేయుచున్ = చేస్తూ; కించిత్ = కొంచెము; ఉన్మీలిత = తెరచిన; లోచనుండను = కన్నులుగలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడ = సమయములో.
వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. అవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఎత్తయిన తెల్లని ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను.
1-16-సీ.సీస పద్యము

మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి;
నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక;
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ;
బలువిల్లు మూఁపునఁబరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి;
ఘన కిరీటము దలఁ గలుగువాఁడు
1-16.1-ఆ.
పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య) / లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు = వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాఁడు = వాడు; వల్లీయుత = పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు = ప్రవర్తిల్లే; వాఁడు = వాడు; నీల = నీల; నగ = గిరి; అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగు = కల; వాఁడు = వాడు;
పుండరీక = పద్మముల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వాఁడు = వాడు; వెడఁద = విశాలమైన; ఉరము = వక్షముగల; వాఁడు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; వాఁడు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుఁడు = ముఖ్యమైనవాడు; ఒక్కరుఁడు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్ = కళ్ళ; గవ = జంట; కున్ = కు; ఎదురన్ = ఎదురగ; కానఁబడియె = సాక్షత్కరించెను;
ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగ ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్ర మండలంలోంచి కురిసే అమృత ధారలా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగవృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగ ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల దామరరేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో, ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు విందుచేసాడు.
1-17-వ.వచనము
ఏను నా రాజశేఖరుం దేఱి చూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా,”రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు" నని, యానతిచ్చి తిరోహితుం డయిన, సమున్మీలిత నయనుండనై వెఱఁగుపడి చిత్తంబున.
ఏను = నేను; ఆ = ఆయొక్క; రాజ = రాజులలో; శేఖరున్ = శ్రేష్ఠుని - మహారాజుని; తేఱి = తేరిపార; చూచి = చూచి; భాషింప = మాట్లాడుటకు; యత్నంబు = ప్రయత్నం; సేయు = చేస్తున్న; ఎడ = సమయంలో; అతఁడు = అతడు; తాన్ = తను; రామభద్రుండ = రామభద్రుండననియు; మన్ = నాయొక్క; నామ = పేరునకు; అంకితంబుగా = అంకితముగా; శ్రీ = శ్రీ; మహా = మహా; భాగవతంబున్ = భాగవతమును; తెనుంగు = తెలుగులోకి (అనువాదము); సేయుము = చేయయు; నీకు = నీకు; భవ = సంసార వలన; బంధంబులు = బంధనములు; తెగును = తెగుతాయి; అని = అని; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చి = వేసి; తిరోహితుండు = మాయము; అయిన = అవ్వగా; సమున్మీలిత = బాగాతెరచిన; నయనుండను = కళ్ళుగలవాడను; ఐ = అయి; వెఱఁగున్ = ఆశ్చర్యములో; పడి = పడి; చిత్తంబున = మనస్సులో.
అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే”నేను రామభద్రుణ్ణి. నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము.. నీ భవబంధాలు పటాపంచలౌతాయి” అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరచుకొని అంతా ఆశ్చర్యంగా చూస్తూ, నాలో నే నిట్లా అనుకున్నాను.
1-18-క.కంద పద్యము

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.
1-19-ఆ.ఆటవెలది

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.
భాగవతము = భాగవతమును; తెలిసి = తెలుసుకొని; పలుకుట = పలుకుట; చిత్రంబు = చిత్రమైనది; శూలి = శూలధారి శివుని; కిన్ = కి; ఐనన్ = ఐనప్పటికి; తమ్మి = పద్మము నందు; చూలి = పుట్టినవాని; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; విబుధ = విశేషమైన జ్ఞానముగల; జనుల = జనుల; వలనన్ = వలన; విన్న = వినిన; అంత = అంత; కన్న = చూసిన; అంత = అంత; తెలియవచ్చిన = తెలిసిన; అంత = అంత; తేట = తెలిసేలా; పఱతు = చేస్తాను.
అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.
1-20-క.కంద పద్యము

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.
కొందఱు = కొంతమంది; కున్ = కి; తెనుఁగు = తెలుగు {తెనుగు గుణమగు - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; కొందఱకును = కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబు గుణమగు - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; రెండున్ = రెండూ; కొందఱి = కొంతమంది; కిన్ = కి; గుణములగు = బాగుగ ఉంటాయి; నేన్ = నేను; అందఱ = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; కృతులన్ = రచనలలో; ఆయ్యై = ఆయా; ఎడలన్ = సందర్భానుసారంగా.
తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి వ్రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.
1-21-మ.మత్తేభ విక్రీడితము

ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
ఒనరన్ =ఇంపుగా; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.
1-22-మ.మత్తేభ విక్రీడితము

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
లలిత = చక్కని / అందమైన; స్కంధము = కొమ్మలతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / చక్కటి పద్య వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; ఆలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; ఐ = అయి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పవృక్షము; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; ఐ = అయి.
బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.
1-23-వ.వచనము
ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాత పాదపసమాశ్రయంబునను, హరికరుణావిశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె నని, బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురు వృద్ధ బుధ బంధుజనానుజ్ఞాతుండనై
ఇట్లు = ఈ విధంగా; భాసిల్లెడు = ప్రకాశించే; శ్రీ = శుభప్రదమైన; మహా = గొప్ప; భాగవత = భగవంతుని గురించిన; పురాణ = పురాణమనే; పారిజాత = పారిజాత; పాదప = వృక్షమును; సమ = చక్కగా; ఆశ్రయంబునన్ = ఆశ్రయించుట వలనను; హరి = విష్ణుని; కరుణా = దయయొక్క; విశేషంబునను = విశిష్టత్వంవలనను; కృతార్థత్వంబు = ప్రయోజనకరమైనది; సిద్ధించెనని = సిద్దించిందని; బుద్ధిని = బుద్ధియందు; ఎఱింగి = గ్రహించి; లేచి = లేచి (ధ్యానస్థానంనుంచి); మరలి = వెనుకకు వచ్చి; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్ = కు; ఏకశిలానగరంబున = ఏకశిలానగరాని; కున్ = కి; చనుదెంచి = చేరి; అందున్ = అందు; గురు = గురువులు; వృద్ధ = పెద్దలు; బుధ = జ్ఞానవంతులు; బంధు = బంధువులు; జన = ఐన జనులచే; అనుజ్ఞాతుండన్ = అనుమతి పొందినవాడిని; ఐ = అయి.
ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్ళకు ఏకశిలానగరానికి తిరిగివచ్చాను. అక్కడ గురువులూ, వృద్ధులూ, పండితులూ, బంధువులూ మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను.