కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, శ్రీకృష్ణ పరమాత్మ, పాండవుల వద్ద వీడ్కోలు తీసుకుని ,ఉద్దవుడిని ,సాత్యకిని వెంటబెట్టుకుని ద్వారకకు బయలుదేరేందుకు రథం ఎక్కుతున్నాడు. ఆ. సమయంలో, కృష్ణుడి చెల్లెలు సుభద్రాదేవి కోడలు- ఉత్తర, పరుగు పరుగున వచ్చి , ఒక ప్రళయ భీకర బాణం ఏదో ఒకటి తనవైపు దూసుకువస్తున్నదని ఆ బాణం నుంచి తనను రక్షించమని వేడుకుంటుంది....
****
"ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ
డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు
న్నది, దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు, నీ
పదపద్మంబులె కాని యొండెఱుఁగ, నీ బాణాగ్ని వారింపవే.
****
“దేవదేవా! శ్రీకృష్ణా! ప్రళయాగ్ని జ్వాలలతో భయంగొల్పే బాణ మొకటి ఎక్కటినుంచో కళ్లకు మిరుమిట్లు గొల్పుతూ వచ్చి, నా కడుపులో ఉన్న పిండాన్ని కాల్చేయాలని చూస్తోంది. ఈ భయంకర బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు వేరెవరూ లేరు. నీ చరణ కమలాలనే నమ్మి శరణుజొచ్చాను. కరుణించి ఈ బాణాగ్నిని ఆపు, పరమాత్మా, పరంధామా అని వేడుకుంది.
🏵️ పోతన పద్యం🏵️
పరమాత్మ చరణాలను చేర్చే దివ్య పథం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి