2, సెప్టెంబర్ 2020, బుధవారం

భువనేశ్వరి మంత్ర విశిష్టత



*అస్యశ్రీ భువనేశ్వరీ మహామంత్రస్య* | *వేదవ్యాసో భగవాన్ ఋషిః* | *అనుష్టుప్ ఛందః* | *శ్రీ భువనేశ్వర్యంబా దేవతా* |

*హ్రీం బీజం* | *శ్రీం శక్తిః* | *ఓం కీలకం* | *జపే వినియోగః* ||

*న్యాసము* : *హ్రాం* *హ్రీం* *హ్రూం* *హ్రైం* *హ్రౌం* * హ్రః*

*ధ్యానము* : *ఉద్యద్భాస్వత్సమాభాం విజిత నవజపా మిందుభండావతంసాం*

*జ్యోతిరౌళింత్రినేత్రాం వివిధమణి లసత్కుండలాం పద్మహస్తాం*
*హారగ్రైవేయ కాంచీ గుణమణివలయో ద్యద్విచిత్రాం బరాధ్యాం*
*దేవీం పాశాంకుశాధ్యా మభయవరకరా మంబికాం తాం నమామి*

💐భువనేశ్వరి మూల మంత్రం💐

1.మంత్రము : *ఓం శ్రీం హ్రీం శ్రీం*

2. భువనేశ్వరి అష్టాక్షరి 

"ఐం శ్రీo హ్రీం క్లీo క్లీo హ్రీం శ్రీo క్రోo "

3. ఏక బీజాక్షర యుక్త భువనేశ్వరి మంత్రం

"హ్రీం భువనేశ్వరియే నమః"

4. చతురాక్షర బీజయుక్త భువనేశ్వరి మంత్రం..

"ఓం హ్రీం శ్రీo క్లీo భువనేశ్వరియే నమః"

ఈ మంత్రోపాసన ధన, ధాన్య, విద్యా, ఐశ్వర్య, విజయ ప్రాప్తికరము.

*జగజ్జనానందకరీం జయాఖ్యాం*
*యశస్వినీం యంత్ర సుయజ్ఞ యోనిం*
*జితామితామిత్ర కృతప్రపంచాం* 
*భజామహే శ్రీభువనేశ్వరీం తామ్*

పై నాలుగు మంత్రములు మూల మంత్రములు కావును ఉపదేశం తో సాధన చేయాలి మీకు తెలిసిన గురువు దగ్గర ఈ మూల మంత్రాలలో ఒక దానిని ఉపదేశం తీసుకుని చేయండి గురువు లేని వారు ఒక మంత్రం పేపర్ లో రాసి శివుని ముందు గాని దక్షణామూర్తి దగ్గర కానీ పెట్టి గురువుగా భావించి జపం చేయవచ్చు. లలితా సహస్త్ర నామం 108 సార్లు పైనే పారాయణ చేసిన వారు లలితా నామం లక్ష జపం చేసినట్టు కనుక వారికి ఈ మంత్ర జపం ఉపదేశం పొందే అర్హత ఉంది.

ఈ జప సమయంలో ఆహార నియమాలు ఏమీ లేదు..శక్తి కొద్దీ జపం చేయవచ్చు, తర్పణము, హోమము, అన్నశాంతి కూడా చేయిస్తే మంచిది.

🌷శ్రీ మాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: