ఓం సర్వాధారాయై నమః.🙏
( శ్రీ లలితాసహస్రమున 659వ నామము)
కం. శర్వుని సృష్టిని సర్వము
నిర్వక్రముగా సతంబు నిర్వహణకునై
సర్వాధారంబయితివి
సర్వాధారా! నమామి. సన్నుత జననీ!
🙏
ఓం సుఖాజాతాయ నమః.
(శివ సహస్ర నామములలో 814వ నామము.)
సకలంబౌ సుఖమూలమీవెగ సుఖాజాతా! నమస్కారముల్.
నికరంబౌ వర భక్తితోడ నిను ధ్యానించన్ సుఖంబిచ్చుచున్
బ్రకటం బౌదువు సత్య తేజమున సద్భాగ్యంబుగా భక్తకో
టికి, సౌఖ్యంబు శుభంబులన్ గొలుప. నేడే నాకు కన్పించుమా.
🙏
అవాఙ్మానసగోచరులగు పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుతూ
చింతా రామకృష్ణారావు.
🙏🙏🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి