*మన బతుకంతా రామమయం*
మన జీవితాలలో *రాముడు* ఎలా కలిసిపోయాడో చూడండి.......
ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి .
అలాంటి గ్రంథమే మన *రామాయణం*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇంగ్లీషు వాడు వచ్చాక మన రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ *రాముడు మనవెంట నడిచిన దేవుడు*
మన విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన *ఆదర్శ పురుషుడు మన రాముడు*
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం *మన రాముడు*
ధర్మం పోత పోస్తే *రాముడు*
ఆదర్శాలు రూపుకడితే *రాముడు*
అందం పోగుపోస్తే *రాముడు*
ఆనందం నడిస్తే *రాముడు*
వేదోపనిషత్తులకు అర్థం *రాముడు*
మంత్రమూర్తి *రాముడు*
పరబ్రహ్మం *రాముడు*
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు *మన రాముడు*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎప్పటి త్రేతాయుగ రాముడు?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా *మన రాముడే!*
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
*శ్రీరామరక్ష సర్వజగద్రక్ష*
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
బొజ్జలో ఇంత 🍼పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -
*రామాలాలీ - మేఘశ్యామా లాలీ*
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు *శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా*
వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ*
భరించలేని కష్టానికి పర్యాయపదం -
*రాముడి కష్టం*
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు*
కష్టం గట్టెక్కే తారక మంత్రం -
*శ్రీరామ*
విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ*
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట -
*అన్నమో రామచంద్రా!*
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
*కృష్ణా రామా !*
తిరుగులేని మాటకు - *రామబాణం*
సకల సుఖశాంతులకు - *రామరాజ్యం*
ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన*
ఆజానుబాహుడి పోలికకు - *రాముడు*
అన్నిప్రాణులను సమంగాచూసేవాడు- *రాముడు*
*రాముడు ఎప్పుడు మంచి బాలుడే*
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
*రామా కిల్డ్ రావణ*
*రావణ వాజ్ కిల్డ్ బై రామా*
💐💐💐💐💐💐💐💐💐💐💐
ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు*
గొప్ప కొడుకు - *రాముడు*
అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు*
గొప్ప విద్యార్ధి - *రాముడు*
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు)
📖📖📖📖📖📖📖📖📖📖📖
మంచి మిత్రుడు - *రాముడు*
(గుహుడు చెప్పాడు)
మంచి స్వామి *రాముడు*
(హనుమ చెప్పారు)
సంగీత సారం *రాముడు*
(రామదాసు, త్యాగయ్య చెప్పారు)
🎼🎻🎷🎺🎸🎼🎻🎷🎺🎸🎼
నాలుకమీదుగా తాగాల్సిన నామం *రామ నామం*
(పిబరే రామ రసం) సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ).
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు*
👀👀👀👀👀👀👀👀👀👀👀
నోరున్నందుకు పలకాల్సిన నామం - *రామ నామం*
చెవులున్నందుకు వినాల్సిన కథ - *రామ కథ*
👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻👂🏻
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు*
*రామాయణం పలుకుబళ్లు*
మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది.
*తెలుగులో కూడా అంతే*
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే
*రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని*
అడిగినట్లే ఉంటుంది ...?
చెప్పడానికి వీలుకాకపోతే -
*అబ్బో అదొక రామాయణం*
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే -
*సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ*
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
*అదొక పుష్పకవిమానం*
కబళించే చేతులు, చేష్ఠలు
*కబంధ హస్తాలు*
వికారంగా ఉంటే -
*శూర్పణఖ*
చూసిరమ్మంటే కాల్చి రావడం *హనుమ*
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
*అంగదుడి అంగలు*
మెలకువలేని నిద్ర -
*కుంభకర్ణ నిద్ర*
పెద్ద ఇల్లు -
*లంకంత ఇల్లు*
ఎంగిలిచేసి పెడితే -
*శబరి*
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు*
అల్లరి మూకలకు నిలయం -
*కిష్కింధ కాండ*
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
*అగ్ని పరీక్షలే*
పితూరీలు చెప్పేవారందరూ -
*మంథరలే*
యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే*
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
*రావణ కాష్ఠాలే*
కొడితే బుర్ర *రామకీర్తన* పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).
*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు*
బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.
ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.
ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు.
*ఒంటిమిట్టది ఒక కథ*
*భద్రాద్రిది ఒక కథ*
అసలు *రామాయణమే మన కథ*
*రాస్తే రామాయణం*
*చెబితే మహా భారతం*
అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు.
*హిందుయిజమ్ ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం!*
అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో *రామాయణం* ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. *రామాయణకథలు* మనకంటే చక్కగా muslim majority దేశమైన *ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.*
*జై శ్రీ రామ్*
*శ్లో || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ||*
*సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||*
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క *విష్ణు సహస్రనామ పారాయణ* ఫలితం లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి