25, సెప్టెంబర్ 2021, శనివారం

సంస్కృత మహాభాగవతం

 *25.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.9 (తొమ్మిదివ శ్లోకము)*


*స్తోకం స్తోకం గ్రసేద్గ్రాసం దేహో వర్తేత యావతా|*


*గృహానహింసన్నాతిష్ఠేద్వృత్తిం మాధుకరీం మునిః॥12508॥*


తుమ్మెద ఒక్కొక్క పుష్పమునుండి కొద్దికొద్దిగా మకరందమును ఆస్వాదించుచు జీవించుచుండును. అట్లే ముని ఒక్కొక్క గృహమున మాధుకరవృత్తి ననుసరించి కొంచము కొంచముగా తన దేహమును పోషించుకొనుటకు మాత్రమే ఆహారమును స్వీకరింపవలెను. ఆ విధమును పాటించినచో అతని దేహయాత్ర కొనసాగును, ఆహార ప్రదానము చేయునట్టి గృహస్థునకు ఎట్టిబాధయు కలుగదు.


*8.10 (పదియవ శ్లోకము)*


*అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః|*


*సర్వతః సారమాదద్యాత్పుష్పేభ్య ఇవ షట్పదః॥12509॥*


మధుపము (తుమ్మెద) పుష్పములు చిన్నవియైనను, పెద్దవియైనను వాటిలోని సారమును మాత్రమే గ్రహించును. ఆ విధముగనే ముని శాస్త్రములు అన్నింటినుండి సారమును మాత్రమే గ్రహింపవలెను.


*8.11 (పదకొండవ శ్లోకము)*


*సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితమ్|*


*పాణిపాత్రోదరామత్రో మక్షికేవ న సంగ్రహీ॥12510॥*


*8.12 (పండ్రెండవ శ్లోకము)*


*సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షుకః|*


*మక్షికా ఇవ సంగృహ్ణన్ సహ తేన వినశ్యతి॥12511॥*


సన్న్యాసి భిక్షాటనకు వెళ్ళినప్పుడు తేనెటీగవలె సాయంకాలము కొరకుగాని, మరునాటికిగాని మిగుల్చుకొను ఉద్దేశ్యముతో భిక్షాన్నమును సమకూర్చుకొనుటకు యత్నింపరాదు. తన కరముగాని, ఉదరముగాని నిండునంతవరకే భిక్షను స్వీకరింపవలెను. అట్లుగాక తేనెటీగవలె అవసరమునకు మించి సంగ్రహించినచో తేనెటీగ తేనెతో సహా నశించినట్లు అతడు తన ఆహారమును కోల్పోవును. తానునూ ఆపదల పాలగును.


*8.13 (పదమూడవ శ్లోకము)*


*పదాపి యువతిం భిక్షుర్న స్పృశేద్ దారవీమపి|*


*స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగతః॥12512॥*


భిక్షువు (సన్న్యాసి) కర్రతో చేయబడిన స్త్రీమూర్తినైనను పాదముతో సైతము స్పృశింపరాదు. అట్లు స్పృశించినచో అతడు ఆడు ఏనుగు సాంగత్య ప్రభావమున మగఏనుగువలె వ్యామోహములో పడిపోవును.


*గజ జిఘృక్షిభిః కాష్ఠతృణమృదాద్యా చ్ఛాతితగర్తో పరిస్థాపితయా|*


*దారుమయ్యాః కరిణ్యా అంగసంగాత్ యథా గర్తే పతితో బధ్యతే తద్వత్॥* (వీరరాఘవీయ వ్యాఖ్య)


మగ ఏనుగును బంధింపదలచినవారు ఒక పెద్దగోతిని త్రవ్వి దానిని కర్రలతో, గడ్డితో, మట్టితో కప్పివేసెదరు. దానిపై కర్రతో చేసిన ఒక ఆడు ఏనుగుబొమ్మను నిలిపెదరు. అంతట మగ ఏనుగు ఆడు ఏనుగుయొక్క సుఖస్పర్శకై ఆరాటపడుచు దానికడకు చేరును. అప్పుడు ఆ ఏనుగు గోతిలో పడిపోవును. పిమ్మట దానిని బంధింతురు.


*8.14 (పదునాలుగవ శ్లోకము)*


*నాఽధిగచ్ఛేత్స్త్రియం ప్రాజ్ఞః కర్హిచిన్మృత్యుమాత్మనః|*


*బలాధికైః స హన్యేత గజైరన్యైర్గజో యథా॥12513॥*


వివేకముగలవాడు ఎట్టి పరిస్థితిలోనైనను తరుణియొక్క రూపలావణ్యములకు ఆకర్షితుడై ఆమె దరికి చేరరాదు. అట్లొనర్చినవాడు తన మృత్యువును తానే కొనితెచ్చుకొనినట్లగును. గజము ఆడు ఏనుగును సమీపించినచో బలిష్ఠములైన ఇతర ఏనుగులు దానిని హతమార్చునుగదా!


*8.15 (పదిహేనవ శ్లోకము)*


*న దేయం నోపభోగ్యం చ లుబ్ధైర్యద్దుఃఖసంచితమ్|*


*భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థవిన్మధు॥12514॥*


పరమలోభియైనవాడు తాను నానాకష్టాలుపడి కూడబెట్టిన ధనమును తాను అనుభవింపడు. ఇతరులకు దానము చేయడు. తేనెటీగలు శ్రమపడి కూడబెట్టిన ధనమును ఇతరులు అనుభవింతురు. ( *అర్థవిత్ = తద్ధనగ్రహణోపాయాభిజ్ఞ-* ఆ ధనమును కాజేయుటకు ఉపాయము ఎరిగినవాడు).


*దానము, భోగము, నాశము, పూనికతో మూడు గతులు భువి ధనమునకున్|*


*దానము భోగము నెఱుగని, దీనుని ధనమునకు గతి తృతీయమె పొసగున్॥*


ఎప్పుడైనను తాను సంపాదించిన ధనమును ఇతరులకు దానము చేయవలెను లేదా అనుభవింపవలెను. ఇతరులకు దానము చేయక, తాను అనుభవింపక ఉన్నచో, అది (ఆ ధనము) నశించుటయో, ఇతరుల పాలగుటయొ తథ్యము. (సుభాషిత - నీతి శతకము -ఏనుగు లక్ష్మణకవి)


*8.16 (పదహారవ శ్లోకము)*


*సుదుఃఖోపార్జితైర్విత్తైరాశాసానాం గృహాశిషః|*


*మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినామ్॥12515॥*


పెక్కు తేనెటీగలు పలుదినములు ఎంతగానో ప్రయాసపడి తేనెను సమకూర్చుకొనును. తేనెలను సేకరించువాడు తేనెటీగల కష్టార్జితమును అవి అనుభవింపకముందే తాను తినివేయును. అట్లే సుఖజీవనమును కాక్షించు గృహస్థులు తాము అనుభవించుటకై దానిని (ధనమును) మిక్కిలి కష్టపడి సంపాదింతురు. వారి గృహములలోని అన్నపానాదులను వారు అనుభవింపకముందే బ్రహ్మచారులు మొదలగువారు తినివేయుదురు. దీనినిబట్టి చూడగా స్వార్థముకొరకై (కేవలము తమకొఱకై) సంపాదించుకొనిన వస్తువులు తమకు దక్కవు. కావున మానవుడు పరార్థదృష్టిగలిగి అనగా అంతయు భగవంతునిదే అను భావముతో దానిని సద్వినియోగము చేయవలెను. అప్పుడు అతని జీవితము సార్థకము అగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ఎంత సేపు పూజ

 🙏💥🙏

*ఎంత సేపు పూజ?*


*పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -* 

    *i) శ్రీహరి గుర్తుకు రావాలి*

   *ii) భూమికి నమస్కరించాలి*

   *iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*


*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*


*9) మంచి నీళ్ళు త్రాగేటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*


*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*


*11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*


*13) కనిపించే ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*


*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*


*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*

🙏🙏🙏🙏🙏

లంచగొండితనం ఖరీదు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*అవినీతి లేదా లంచగొండితనం ఖరీదు ఎంత ? - పవన్ కుమార్ సిద్ధి.* 

             🌷🌷🌷


అవినీతి లేదా లంచం అంటే కేవలం మనకు ఎదో ఒక సర్టిఫికెటు ఇవ్వడానికి తీసుకునే డబ్బో లేదా ఒక కాంట్రాక్టు ఇవ్వడానికి తీసుకునే డబ్బో లేదా ఒక రోడ్డో మరేదో వేస్తె అది సరిగ్గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చి డబ్బులు విడుదల చేయడానికి తీసుకునే పర్శంటేజ్ మాత్రమే కాదు , అది అంతటితో ఆగదు. దానికి మామూలు జనం అయిన మనం ఎంత మూల్యం చెల్లించాలో తెలుసా ?


సరే ఇది అందరికి బాగా అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెబుతాను. 


ఒక మునిసిపాలిటీ లో దాదాపు ఒక 15 ఏళ్ళ క్రితం ఆ ఏరియా మొత్తానికి ఒక పెద్ద వాటర్ ట్యాంకు నిర్మించి ఆ మునిసిపాలిటీ లో అందరికి రక్షిత మంచి నీళ్లు నల్లా ద్వారా ఇంటింటికి అందించాలని నిర్ణయించారు. ట్యాంకు బాగా ఎత్తుగా కట్టి కేవలం దానిని గ్రావిటీ ( గురుత్వాకర్షణ ) ప్రెషర్ ద్వారా అందరి ఇళ్లల్లో రెండవ అంతస్తు వరకు నీళ్లు ఎక్కేలా ప్రణాళిక రచించారు. దానిని కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి గొప్పగా ప్రచారం చేసి దాదాపు 5 కోట్ల ఖర్చు తో ఆమోదించారు. 


అది టెండరు జరిగి అధికారుల అలసత్వం తో ఒక సంవత్సరం దాకా లాగి దానిని ఆమోదించేసరికి ఆ మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపు 6 % పెరిగింది , సరే అలా ఆ ఆరుశాతం కూడా ఆమోదించారు ( అంటే వారి అలసత్వానికి మనం ఒక 6 % అప్పుడే ఎక్కువ చెల్లించాము ) సరే ఈ ఖర్చు మొత్తం అందరు కట్టే టాక్సులలో నుండే కదా నా ఒక్కడిదే కాదు కదా అని సర్దుకున్నాము.


ఆ పని దక్కించుకున్న కుర్ర సివిల్ ఇంజనీర్, బాగా పనిచేసి మంచి కాంట్రాక్టర్ గా పేరు తెచ్చుకుని పెద్ద సంస్థగా ఎదుగుదామని ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు. అదే అతడికి మొదటి కాంట్రాక్టు కావడం తో శ్రద్ధ గా పని మొదలెట్టాడు.


  పని మొదలవగానే ఆ కాంట్రాక్టర్ దగ్గరకు కౌన్సిలర్ గారి మనుషులు వాలిపోయారు అతడి దగ్గర , మా ఏరియాలో పని అవుతుంది కాబట్టి మాకు మా కట్ ఇవ్వాల్సిందే , లేకపోతె ఎదో ఒక గొడవ పెట్టి పని జరగ కుండా చేస్తాం , జనాలని పోగేసి నీ క్వాలిటీ బాగా లేదని ధర్నాలు చేసి నీ పరువు తీస్తాం అది జరగకుండా ఉండాలంటే మాకు 10 % ఇవ్వాలి అని వసూలు చేసుకుని వెళ్లారు. 


వాళ్ళు వెళ్ళగానే ఎమ్మెల్లే గారి మనుషులు వచ్చారు, వారు కూడా ఇలాగె బెదిరించి ఇంకో పది శాతం పట్టుకెళ్లారు. ఆ తరువాత మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేసే ఇన్స్పెక్టర్ గారు , బిల్లు పాస్ చేసే అకౌంట్ సెక్షన్ ఆఫీసరు ఇలా అందరూ వారి వారి వాటాలు వేసేసరికి మొత్తం 30 % కి చేరింది. పాపం నిజాయితీగా పని చేద్దామనుకున్న ఆ కాంట్రాక్టర్ కి తక్కువ క్వాలిటీ పని చేయడం తప్పలేదు. ఇంకేం అందరూ తినేస్తుంటే నేనొక్కడినేనా నిజాయితీ గా ఉండేది అంటూ తనుకూడా తక్కువ క్వాలిటీ పైపులు వాడడం మొదలెట్టాడు. ఎలాగూ అందరి చేతులూ తడిసాయి కాబట్టి అన్ని బిల్లులు శాంక్షన్ అయ్యాయి ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు అందాయి.


ఇక ఆ ప్రాజెక్ట్ ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన పత్రికలవాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు గురించి బాగా రాయడానికి మందు పార్టీ తో సహా వాళ్లకు కావలసింది వాళ్ళుకూడా దండుకున్నారు.


అసలు కథ ఇప్పుడు మొదలయింది.


ట్యాంకులో నుండి నీళ్లు వదలగానే మొదటి వారం లోనే ఆ ప్రెషర్ కి ఆ నాసిరకమైన పైపులు పగలడం మొదలెట్టాయి, దాంతో బెంబేలెత్తిన అధికారులు వదిలే నీటి ప్రెషర్ తగ్గించమని ఆదేశించారు. రెండు అంతస్తుల పైదాకా నీళ్లు చేరాలి అనే ఉద్యేశం తో మొదలెట్టిన ఆ ప్రాజెక్టు , అంత ఖర్చు పెట్టినా చివరకు గ్రౌండ్ లెవెల్ దాకా కూడా నీళ్లు పంప్ చేయలేకపోయింది.


దానితో జనాలు గుంతలు తోడి ఆ నల్లా ని ఐదు ఆరు ఫీట్ల కిందకు పెట్టడం మొదలెట్టారు , ఆ నీళ్లు పట్టడానికి కింద ఒక సంపు కట్టాల్సి వచ్చింది. దానికి ప్రతి ఇంట్లో దాదాపు ఐదు వేల లీటర్ల సంపు దాదాపు 20 వేల ఖర్చుతో కట్టుకోవలసి వచ్చింది.


ఇది ఆ అవినీతి కి జనాలు పర్సనల్ గా పెట్టుకున్న మొదటి ఖర్చు .


ఆ సంపు లో పడ్డ నీటిని పైన వున్న ట్యాంకులోకి పంపడానికి ఒక 1 hp మోటారు దానికి కావలసిన పైపులు వగైరా అన్నీ కలిపి ఇంకో 10 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది .


ఇది ఆ అవినీతికి పెట్టిన రెండవ ఖర్చు.


అందరూ నల్లాలు కిందకు చేసుకుని సంపులు కట్టడం తో ఎవరికీ సరిగ్గా నీళ్లు రాక , మళ్ళీ ఆ నల్లలకు డైరెక్ట్ గా మోటార్ పెట్టి నీళ్లు లాగడానికి , ఇంకో ఐదువేలతో మోటారు దానికి పైపులు కరెంటు ఖర్చు.


ఇది మూడవ ఖర్చు.  


ఇలా జనాలు కట్టిన ఆ సంపులు సరిగ్గా మైంటైన్ చేయక లేదా కొందరు కేవలం మట్టి తో కూడా కట్టినవాటిలో నీళ్లు నిండి , నీళ్ల సప్ప్లై ఆగినప్పుడు ఈ మట్టి సంపులలో వున్న నీరు కూడా రివర్స్ గా నీళ్ల పైపుల్లోకి చేరి ఆ మట్టి నీళ్లు జనాల పైపుల్లో వస్తున్నాయని దానికి వాటర్ ఫిల్టర్లు కెంట్లు పెట్టుకుని వచ్చే ఆ మంచి నీళ్లను మళ్ళీ మంచినీళ్ళుగా మార్చడానికి పెట్టె ఖర్చు.


ఇది కాకుండా ఆ నీళ్లు కలుషితమైతే ఆ నీళ్లు తాగి హాస్పిటళ్ళకు కట్టే బిల్లులు అందుకు పని మానేసి ఇంట్లో కూర్చుంటే వచ్చే నష్టం ఇవన్నీ బోనస్.


అంటే కేవలం ఒక చిన్నప్రాజెక్టు లో కొందరు చేసిన చిన్న స్థాయి అవినీతి అనే పిల్ల దయ్యం , ఇలా ఒక్కో స్టేజీలో తన ప్రతాపం చూపుతూ చివరకు ప్రజల తో కొన్ని వందల రెట్లు ఖర్చు చేయించేలా బ్రహ్మ రాక్షసి అవతారం ఎత్తింది.


ఇదంతా దాదాపు మనందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది కానీ మనం ఇది ఎవరో చేసిన ఆ అవినీతి వల్ల మనము పెట్టాల్సిన అనవసర ఖర్చు అనే విషయం కూడా ఆలోచించకుండా ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి ఉంటాము.


అంటే ఎవరో చేసిన అవినీతికి మనం కష్టపడి సంపాదించి టాక్సులు కూడా కట్టగా మిగిలిన అచ్చంగా మన సొంత డబ్బు కొన్ని వేలు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాల్సివచ్చింది. ఈ డబ్బులతో ఒకరి ఇంట్లో పిల్లలకు మంచి చదువుకోసం ఖర్చు పెట్టుకోగలిగేవారేమో , లేక వారు మంచి వాహనం లేదా ఇంట్లో సౌకర్యాలు సమకూర్చుకోగలిగేవారేమో. అంటే మన సౌకర్యాలన్నీ దొబ్బేసి మనలను పేదరికంలోనే మగ్గేలా చేసింది ఈ అవినీతి.

   

ఒక చిన్న ప్రాజెక్టు లో కొందరు చేసే చిన్న చిన్న అవినీతి కే ఇంతగా మన మీద ప్రభావం ఉంటే ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతి కి మనం ఎంతగా డబ్బులు కడుతున్నామో, వీటి వలన ఎంతమంది పేదరికంలోనుండి బయటపడలేకపోతున్నారో. 


ఇదండీ ఈ అవినీతి భూతం మనమీద చేయించే ప్రభావం. ఆలోచించండి మరి మనము ఏమి చేయాలో. భరించాలా లేక తిరగబడాలా. ఒకవేళ తిరగబడాలంటే ఎవరిమీద ఎలా తిరగబడాలి.

 దీనికి పరిష్కారం లేదా, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉన్నది. ఎవరు మారాలి..ఎలా మారాలి..వ్యక్తిగా మీరు ఏంచేయాలి.., మీరు మారడానికి సిద్ధమేనా?. ప్రగతి కోరుకుంటున్నారా..ఐతే ఖర్చు లేని, కష్టం లేని ,ఇబ్బందిలేని విధానం లో కి నేటి నుండి మారుదామా..నేను రెడీ..మరి మీరు రేడినా...,(,నాణ్యత లోపల పనులపై ఫిర్యాదులు చెయ్యండి.)

 ఈ దేశానికి ""యజమని""గా వుంటావా...కూలీగా, బానిసగా జీవిస్తవా, భవిష్యత్తు లో మీ పిల్లల ప్రగతికి దారులు వేస్తావా..అంధకారంలో కి, అప్పుల్లోకి నెట్టు తవా..

 ఓటర్ గా ప్రలోభాలకు, డబ్బు, మద్యానికి లొంగకుండా మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకో...., ఒక్క మంచి నిర్ణయం నీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది...

సేకరణ. డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి. వ్యవస్థాపకులు. నల్గొండ జిల్లా RTI మానిటరింగ్ కమిటీ సభ్యులు& సమాచార హక్కు వికాస సమితి. 9849649766.. మనం మారుదాం. మరింత మంది మారడం కోసం షేర్ చేద్దాం..జై భారత్, జై జై భారత్..

శ్రీమద్భాగవతము

 *25.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2272(౨౨౭౨)*


*10.1-1393-*


*క. చెల్లుబడి గలిగి యెవ్వఁడు*

*తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్*

*చెల్లింపఁ డట్టి కష్టుఁడు*

*ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్.* 🌺 



*_భావము: సాధన సంపత్తులు కలిగి యుండి కూడా, ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసి, వారి బాగోగులు చూడరో, అలాంటి క్రూరుడు, దుర్మార్గుడు అటు పిమ్మట తన మాంసము తానే తింటాడు."_* 🙏



*_Meaning: One who is resourceful, but does not serve and take good care of his parents, such cruel and bad character eats his own flesh."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కౌన్సిలింగ్

 మావయ్య గారు .... రేపు ఆదివారం మీ స్నేహితులతో ప్రోగ్రాంలు ఏవీ పెట్టుకోకుండా కొంచెం ఇంటి దగ్గరే ఉండండి ... బుజ్జి గాణ్ణి కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాలి .... సైక్రియాటిస్టు ఎవరో బాగా చూస్తారట ... ఆదివారం వెల్దామన్నారు .... మీ అబ్బాయి ... .... మళ్ళా మీరు మర్చిపోతారేమోనని ముందే చెప్పమన్నారు .... చిరునవ్వుతో సున్నితంగా చెబుతా ఉంటే .... సుబ్బారావు గారు ఆమె వంక అయోమయంగా చూస్తూ .... 

                  అదేంటమ్మా .... బుజ్జిగాడు బాగానే ఉన్నాడుగా ... వాణ్ణి కౌన్సిలింగ్ కు ఎందుకూ .... అందులోకి .... సైక్రియాటిస్టు దగ్గరకు ... అన్నారు కోడలివంక చూస్తూ ..... అదికాదు మావయ్య గారు ... ఈ మధ్య వాడు చాలా డల్ గా ఉంటున్నాడు ... ఏమడిగినా బుర్ర ఊపటమే గానీ మాట్లాడడు ..... వాడు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కెటట్టుంది.... దానికి తోడు కొంచెం ఊబ కాయం వస్తున్నాది కూడాను .... అన్నాది బాధ పడుతూ .... 

                  సుబ్బారావు గారు ..... కొడుక్కి కోడలికి అనేకసార్లు చెప్పారు .... పిల్లల్ని అస్తమానం చదువు చదువు అంటూ సతాయిస్తూ ..... ఆటపాటలకు పోనీయకుండా .... తమ ఈడు పిల్లలతో కలవనీయకుండా నిర్బంధిస్తే .... వాళ్లలో చలాకీతనం తగ్గిపోయి .... సృజనాత్మకత లోపించి .... రేప్పొద్దున్న రోబోల్లా తయారవుతారు .... వాళ్ళను అల్లరి చెయ్యనివ్వాలి .... తప్పులు చెయ్యనివ్వాలి .... కింద పడితేనే కదా పైకి ఎలా లేవాలో తెలుస్తాది .... మిమ్మల్ని మేము ఎలా పెంచామో వాళ్ళని కూడా అలాగే పెరగనివ్వండి ..... చీటికీ మాటికి వాడి భవిష్యత్తుని బైనాక్యూలర్స్ లో చూట్టం మానుకోండి ..... అంటూ ఎన్ని సార్లు చెప్పినా .... వినిపించుకోరు .... పైపెచ్చు .... అప్పట్లో మీరు .... ఇప్పటి తల్లిదండ్రుల్లా కేర్ తీసుకుని పెంచి ఉంటే ....నా తెలివితేటలకు .... నేను జిల్లా కలెక్టర్ అయ్యేవాణ్ణి ... అంటూ ఎద్దేవా చేస్తాడు ... కొడుకు రాఘవ .... 

                   ఆదివారం నాడు ... మొగుడు పెళ్ళాం .... బుజ్జి గాణ్ణి తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు .... సుబ్బారావు గార్ని ఇంటికి కాపలా పెట్టి .... సైక్రియాటిస్టు హాస్పటల్ ఖాళీగా ఉంటాదేమో.... ఒక గంటలో వెళ్లి వచ్చేయొచ్చు .... అనుకున్న రాఘవకి ... అక్కడ జనాల్ని చూసేసరికి మతిపోయింది ....ముందే అపాయింట్మెంట్ తీసుకోనందుకు బాధపడ్డాడు .... 

                      చింతపండు రాఘవ గారంటే మీరేనా సార్ .... అంటూ స్లిప్ పట్టుకుని అడుగుతున్న నర్సు ని .... డాక్టర్ గారు రమ్మంటున్నారు .... అనేసరికి .... ఆశ్చర్యంగా భార్యను, బుజ్జిగాణ్ణి తీసుకుని .... డాక్టర్ గారి రూంలోకి ప్రవేశించిన రాఘవని .... రారా చింతపండు .... స్లిప్ లో ఇంటిపేరు రాయించటం మంచిదయ్యింది .... గుర్తుపట్టావా ... నేన్రా కస్తూరి గాణ్ణి ... అంటూ సీట్లోంచి లేచి ఆలింగనం చేసుకున్న డాక్టర్ గార్ని చూసి ఆశ్చర్యపోయాడు రాఘవ ..... 

             నువ్వా కస్తూరి .... నేమ్ ప్లేట్ లో ..

.. కె. సుధాకర్ అని ఉంది ..... ఎంత అల్లరి చేసేవాడివి .... ఎన్ని ఆటలాడివాడే వాడివి .... డాక్టర్ అవుతావని కల్లో కూడా అనుకోలేదురా .... అంటూ ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోని రాఘవని చూసి పెద్దగా నవ్వేస్తూ ..... 

            వీడేనా ... మీ వాడు .... ఏం పేరు నాన్నా .... అంటూ బుజ్జిగాడికి షేక్ హ్యాండ్ ఇస్తూ .... ముభావంగా ఉంటాడు ... ఏమడిగినా నోటితో కాకుండా తల అడ్డంగానో నిలువుగానో ఆడిస్తాడు .... దీనికితోడు కొత్తగా ఊబకాయం తగలడుతోంది .... కార్పొరేట్ స్కూల్లో ..ఏసి రూముల్లో చదువుతున్నాడు.. 

మార్కులు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి .... ఇంట్లో చిన్న పని కూడా చెప్పరు .... బయటకెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేడు ... ఒక వేళ వెళ్లినా ..... ఉల్లిపాయలు డజనెంత అని అడుగుతాడు ..... 

                తాను చెప్పకుండానే .... బుజ్జిగాడికున్న కంప్లయింట్లు అన్నీ ఏకరువుపెడుతున్న డాక్టర్ని చూసి మూర్ఛపోయినంత పని చేశాడు రాఘవ ..... 

                ఇప్పుడు నా దగ్గర కొచ్చిన పిల్లలందరికీ ఇదే కంప్లయింట్ రాఘవా ..... ఇదంతా ఇప్పటి పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తుని ఇప్పటినుంచే .... కాదు .... ఇక్కడ్నుంచే బైనాక్యూలర్ లో చూట్టం వల్ల వచ్చిన రుగ్మత .... వాళ్ళని పిల్లల్లా కాకుండా ఫౌల్ట్రీ లో కోడి పిల్లల్లా పెంచుతున్నారు .... దీనికి మందూ లేదు .... ట్రీట్మెంటూ లేదు .... అచ్చం మనల్ని .... మన తల్లిదండ్రులు ఎలా పెంచారో .... మనం ఎలా పెరిగామో .... అలా పెంచటమే .... పెరగనివ్వటమే.... అంటూ ....రాఘవ భార్య కేసి చూస్తూ .... సెకండ్ ఒపీనియన్ కి .... వేరే డాక్టర్ దగ్గిరకు వెళ్లకండమ్మా ..... నన్ను నమ్మండి ... ప్లీజ్ ..... నేను వీడు అన్నట్టు చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగినా బాగానే చదువుకున్నాను .... నవ్వుతూ అంటున్న డాక్టర్ని చూసి భార్య భర్తలిద్దరూ నవ్వేశారు .....

రఘువంశం ప్రార్ధనా శ్లోకం

వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:

మనం ఎన్నో సంవత్సరాలుగా  వింటున్నాము ఆలపిస్తున్నాము ఈ చక్కటి శ్లోకాన్ని.  కానీ దీని గూర్చి మనలో ఎంతమందికి తెలుసు.  ఈ శ్లోకం కాళిదాసు వ్రాసిన రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.  కాళిదాసు రచన ఒక చక్కటి సరళమైన ధార కలిగి జనాకర్షణగా ఉంటుంది. ప్రతి పదం సుష్మముగా ఉన్నట్లు ఉంది అత్యంత అర్ధవంతంగా ఉంటుంది అని అనటానికి ఈ ఒక్క శ్లోకమే చాలు.  ఇటువంటి అనేక శ్లోకాలు పుంఖాను పుంఖంగా వ్రాసిన కాళిదాసు మనకు చిరస్మరనీయుడు. 

కోతి కథ

 ఒక ఊరిలో ఒక చెరువుండేదంట. చెరువు ప్రక్కన్నే ఒక చెట్టుండేదంట. చెట్టులో ఒక కోతి ఇల్లు కట్టుకొని ఉండేదంట. ఒక రోజు కోతికి పాయసం తాగాలనిపించింది. అక్కడ ఒక చోట బెల్లం ముద్దలు పడుతూ ఉండేవాళ్ళు. కోతి అక్కడికి పోయేసి, రెండు బెల్లం ముద్దలు ఎత్తుకునింది. ఒకటి ఎత్తుకుని, తినేసింది. ఇంకొకటి టెంకాయమానులో దాచి పెట్టేసింది.

 అక్కడే ఒక అవ్వ సామాన్లు ఎక్కువగా పెట్టుకొని అమ్ముతూ ఉండేది. కోతి అక్కడికి పోయి ఒక గుండా (పెద్ద గిన్నె) ఎత్తుకొనింది. రాళ్ళు పేర్చి పొయ్యి పెట్టేసింది. దాని మీద గుండా పెట్టింది. తరువాత అక్కడే ఉన్న కట్టెలు పేర్చి పెట్టేసింది. అన్నీ బాగా సమకూర్చుకుంది. "పొయ్యి వెలిగించటానికి అగ్గిపెట్టె కావాలి కదా!" అనుకుంది. అప్పుడు ఒక తాత కోతి ఉండే చెట్టు కిందికి వచ్చి, బీడీ తాగుతూ అగ్గిపెట్టెను ప్రక్కనే పెట్టేశాడు. కోతి వచ్చి మెల్లిగా అగ్గిపెట్టె ఎత్తుకొని వెళ్ళింది.

 ఇక కోతి సంతోషంగా కట్టెలని ముట్టించింది. కుండలోకి నీళ్ళు పోసింది. తర్వాత బెల్లం ముద్ద వేసింది. పాయసం పొంగు వచ్చింది; కానీ దాన్ని కలబెట్టేదానికి గంటె మాత్రం లేదు. అందుకని కోతి తన తోకతోనే కలబెట్టింది. ఇంక కోతికి మంట ఎత్తింది. అది అరుస్తూ, పొర్లుతూ, దొర్లుతూ, దారెంబడి పోతావుంటే దానికి నక్కబావ అడ్డం వచ్చినాడు: "ఏం కోతిబావా! అలా ఏడుస్తా వున్నావు?" అంటుందంట నక్క. "నాకు పాయసం తాగాలనిపించింది; పాయసం కలబెట్టేదానికి గంటె లేదు, అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను. అబ్బా! మంట!" అంది కోతి. అప్పుడు నక్కబావ "సరే, మా ఇంటికి రా! మా భార్య దగ్గరికి వెళ్దాం. మా ఇంట్లో ఏవేవో ఐటాలు ఉన్నాయిలే" అన్నది. కోతికి చాలా సంతోషం వేసింది. సంతోషంలోతోక మంటను కూడా మర్చిపోయింది. ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్ళారు. అప్పుడు నక్క బావ భార్యను పిలిచి-"కోతికి ఏమన్నా ఐటాలు పెట్టు" అన్నాడు. "నేను ఇంకా ఏమీ వంట చెయ్యలేదు, నువ్వు వెళ్ళి మునక్కాయలు కోసుకు రా, నీకు నచ్చేట్లు వంట చేసి పెడతాను " అన్నది నక్క భార్య కోతితో.

కోతి తొందర తొందరగా వెళ్ళి మున-క్కాయలు తెచ్చి ఇచ్చింది. నక్క భార్య వాటిని తీసుకొని లోపలికి వెళ్ళింది. నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు. ఇంక ఘుమ ఘుమ వాసనలు మొదలు అయినాయి. కోతికి నోట్లో నీళ్ళూరుతున్నాయి. కడుపులోఎలుకలు పరుగెత్తుతున్నాయి. నక్క భార్య ఇంకా పిలవలేదు భోజనానికి.

"నేను వెళ్ళి చూసి వస్తాను" అని చెప్పి, లోపలికి వెళ్ళాడు నక్కబావ. వెళ్ళిన వాడు ఇంక వెనక్కి రాలేదు. కోతికి మళ్ళీ మంటెత్తుకునింది. ఆగలేక, మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే- ఏముంది?! అక్కడ నక్కబావ, అతని భార్య- ఇద్దరూ బాగా తినేసి, గుర్రుపెట్టి నిద్రపోతున్నారు! మునక్కాయల పిప్పి కుప్పలు కుప్పలుగా పడిఉంది! గుండా అంతా ఖాళీ! "జిత్తులమారిదాన్ని నమ్మటం నాదే బుద్ధి తక్కువ" అనుకొని, కోతి ఆకలితోనే ఇంటి దారి పట్టింది.

సేకరణ 

ప్రశ్న పత్రం సంఖ్య: 34 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 34 జవాబులు కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

తం తో అంతమయ్యే పదాలు తెలపండి  

 క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.    

భాగవతం 

పంతం 

సొంతం 

కమతం 

లిఖితం 

ఊతం 

పునీతం 

అసాంతం  

విఘాతం 

ఘాతం 

సున్నితం 

ప్రణితం 

శ్రోణితం 

విస్తృతం 

పరివేష్టితం 

బాధితం 

ఆమోదితం 

కల్పితం 

భారతం 

వీరోచితం 

జీవితం 

గతం: 

స్వాగతం : 

పుస్తకం వనితా విత్తం పరహస్త __గతం____గతః 



నాలో నేను..!

 ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. నాలో నేను..!

...............,...,

ఎవరు వింటారు? ఎవరి అంతర్మథనం వారిది? దగ్గర వారు కూడా నీ అంతరంగం తెలుసుకోలేదు. అంత ఎందుకు? నీ మనసో, నీ ఆత్మో ప్రబోధం చేస్తున్నప్పుడు నువ్వు వినడానికి సిధ్ధంగా ఉన్నావా? అంత తీరిక మనకెక్కడిది? మరి మనకే లేని తీరిక..మనం చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వారికి ఎందుకు ఉంటుంది. బహుశా ఇది గ్రహించే మహానుభావులు ఆత్మావలోకనంలో మునిగిపోతారు. మాటను నియంత్రిస్తారు. ఎప్పుడో మరీ ప్రేమ ఎక్కువైతే ఒక ఆణిముత్యం లాంటి మాట విసురుతారు. అందుకే ఆత్మను ఆత్మతో నే ఉద్ధరించుకోవాలని దేవాదిదేవుడు కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అందరూ లోకోధ్ధరణ జరగాలనే మాట్లాడతారు. కానీ, తమను తాము ఉద్దరించుకునేందుకు ఇష్టపడరు. నేను కరెక్ట్ గానే ఉన్నాను..అని చెప్పని వ్యక్తి నాకు కనిపించడం లేదు (నాతో సహా). మరి..అందరూ ధర్మ పరాయణులు, సత్యసంధులు, నీతివంతులు అయితే మరి ఎందుకీ ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకీ మహమ్మారులు, సామాజిక వైరుధ్యాలు?. మరి ఏమి చేయాలి? ఒక చిన్న పని చేస్తే బాగుంటుందేమో? రోజులో నీకు విశ్రాంతి దొరికిన ఓ ఐదు, పది నిమిషాలు..ఏకాంతంలో నీ ఇష్టదైవంతో మాట కలుపు. కాసేపు సంభాషించు. ఆయనతో క్రీడించు. మనసు వివశ మవుతుంది. జాగ్రత్తగా కనిపెట్టు. ఆ అనుభూతి ప్రతి రోజూ నిలుపుకో. ఓం తత్ సత్.// ఆదూరి వేంకటేశ్వర రావు. 🙏

.

మొగలిచెర్ల

 *స్వామి పెట్టిన ప్రసాదం..*


"అయ్యా..నన్ను గుర్తుపట్టావా?" అంటూ ఓ డెబ్భై ఏళ్ల పెద్దాయన మూడేళ్ళ క్రితం శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవం జరిగిన తెల్లవారి నేనూ , మా సిబ్బందీ..ఆ ఉత్సవం తాలూకు అలసట లో ఉన్న సమయం లో నా దగ్గరకు వచ్చి అడిగారు..


అప్పటికి ఇంకా శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం భక్తులు వస్తూనే ఉన్నారు..తలెత్తి చూసాను..గోళ్ళ వెంగయ్య గారు..స్వామి వారిని ప్రత్యక్షంగా చూసి, మాట్లాడి, స్వామివారితో కలిసి భోజనం కూడా చేసిన వ్యక్తి..


వారిని ఎలా మర్చిపోతాను? ఆమాటే అన్నాను..స్వచ్ఛంగా నవ్వారు..


"ఓ 50 కేజీలు బియ్యం తెచ్చాను..అన్నదానానికి ఉపయోగించు.."


 "మహానుభావుడు, నను పక్కన కూర్చోబెట్టుకుని, అన్నం పెట్టాడు..ఈ జన్మకు ఆయన చేతి ముద్ద తిన్నాను..అంతకంటే భాగ్యమా! ఇప్పటికి 45 ఏళ్ళు గడిచినా ఆయన సత్యంగా నవ్వినట్టే గుర్తుందయ్యా!" అంటూ కుర్చీలో కూర్చుంటూ చెప్పుకొచ్చారు..


దగ్గరగా జరిగి కూర్చుని, ఆయన చేతిని నా చేతిలో పెట్టుకుని అడిగాను, "మీ అనుభవాలు చెప్పండి"అని..వయోభారం వల్ల కాబోలు, నన్ను ఆసరాగా పట్టుకుని చెప్పడం మొదలెట్టారు..


"మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మొగలిచెర్ల గ్రామానికి రాక మునుపు, లక్ష్మీ నృసింహ క్షేత్ర మైన మాలకొండలో తపస్సు చేసుకునేవారు..నేను శ్రీ చెక్కా కేశవులు గారు ఒక ఊరి వాళ్ళం..ఆయన ద్వారానే స్వామి పరిచయం అయింది..మీ నాయనా అమ్మా వాళ్ళు ముందునుంచే తెలుసుకానీ, స్వామి కాడికి రాబట్టినాకనే నాకు దగ్గరైనారు.." ఒక్కక్షణం చెప్పడం ఆపి, స్వామి వారి పటానికి నమస్కారం పెట్టుకున్నారు..


శ్రీ గోళ్ళ వెంగయ్య గారిది, ప్రకాశం జిల్లా పామూరు మండలం కంభాలదిన్నె గ్రామం..వ్యవసాయ కుటుంబం..మొదటినుంచీ దైవ భక్తి కొద్దిగా ఎక్కువే..స్వామి వారి శిష్యుడు, శ్రీ చెక్కా కేశవులు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు తాను వెళుతూ, వెంగయ్య గారిని కూడా తీసుకుని వెళ్లారు..ఆరోజు శనివారం..శనివారం రోజు మాలకొండకు భక్తుల తాకిడి ఎక్కువ కనుక, శ్రీ స్వామి వారు, తాను మామూలుగా తపస్సు చేసుకునే పార్వతీదేవి మఠం వద్ద కాకుండా, పై నున్న గుహలలోకి వెళ్ళిపోయి, అక్కడ తపస్సు చేసుకునేవారు..మాలకొండ మళ్లీ నిర్మానుష్యంగా మారిన తరువాతే, ఎప్పుడో రాత్రికి, తిరిగి మఠం వద్దకు చేరేవారు..వీళ్ళు వెళ్ళేసరికి, పార్వతీదేవి మఠం పూజారి గంగయ్య , "అయ్యా ఈరోజు స్వామి వారు ఇక్కడికి రారు కదా! మీరు అనవసరంగా వచ్చారే"అని అన్నారట..ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు, ఆయన వచ్చేదాకా ఉంటాము అని కేశవులు గారు చెప్పారు..


మధ్యాహ్నం 3గంటలైంది..ఆకలేస్తోంది.. పూజారి గంగయ్య కూడా గుడి మూసేసి వెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు..ఇక మనకు ఈరోజు ప్రాప్తం లేదు అనుకునే సమయంలో, ఆశ్చర్యకరంగా, స్వామి వారు, దిగంబరంగా, పైనుంచి దిగి వస్తూ , నేరుగా కేశవులు గారితో, "నన్ను ఇబ్బంది పెట్టినావే"అన్నారట..కేశవులు గారికి అర్ధం కాలేదు..మళ్లీ స్వామి వారే.."మీరొచ్చినారని అమ్మ చెప్పింది, మీరు ఆకలిగా ఉండారని కూడా అమ్మే చెప్పింది..ఇంక తపస్సు సాగలా..ఇదిగో లేచివచ్చాను.."


వింటున్న వెంగయ్య గారు చూస్తూ ఉన్నారు..ఆయన మాటల్లో చెప్పాలంటే, తనకేమీ తోచలేదట..స్వామి వారిని చూస్తుంటే, ఏదో తెలీని మైకం కమ్ముతోందట..


"అన్నం వండి ఉంది, అందరం తిందాము రండి, "అని స్వామి వారు చెప్పి, ఆకులిచ్చి, తానే గిన్నెలోంచి తీసి పెట్టారట..


అదిగో అలా మొదటి పరిచయం లోనే, స్వామి వారి అనుగ్రహం పొందిన ధన్యజీవి శ్రీ వెంగయ్య గారు..తరువాత స్వామి వారిని చాలా సార్లు కలిశారు..ఇప్పటికీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద అచంచల భక్తి విశ్వాసాలతో ఉన్నారు..


"గుడిలో చాలా మార్పులు చేసినావు..వచ్చే, పోయే..భక్తులకు ఇబ్బందిలేకుండా చూడు..ఎంతోమంది వస్తుంటారు ఈ స్వామిదగ్గరకు..అందరికీ సౌకర్యంగా స్వామి దర్శనం అయ్యేటట్లు చూడు..ఇప్పుడు బాగానే ఉన్నదిలే.." అన్నారు..మందిరము అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషించారు.. 


స్వామి వారి ఆరాధన సందర్భంగా వారి అనుగ్రహం పొందిన భక్తుని రాకతో, మాకందరికీ కొండంత తృప్తి కలిగింది..ఓపిక ఉన్నంతవరకూ మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వస్తూ ఉండమని కోరాను.."ఆయనే రప్పించుకుంటాడులే..ఈరోజు నువ్వు పిలిస్తే వచ్చానా చెప్పు? మళ్లీ సమయం వస్తుంది, వస్తాను" అంటూ.."అన్నదానం బాగా చేస్తున్నారు..ఈ నలభై రోజులూ దీక్ష తీసుకున్న స్వాములందరికీ రెండుపూటలా ఆహారం పెట్టే ఏర్పాటు చేశావట కదా.. జాగ్రత్తగా అందరికీ కడుపునిండా పెట్టు" అని చెప్పి, స్వామి వారికి మళ్లీ నమస్కారం చేసుకుని వెళ్లారు..


ఇప్పటికీ సంవత్సరం లో రెండుసార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు వెంగయ్య గారు..


సర్వం..

శ్రీ దత్త కృప.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం...మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం... ప్రకాశం జిల్లా..పిన్:523114.

..సెల్..94402 66380 & 99089 73699)

భగవద్గీత

 🌹🙏🌹శ్రీ శివాయగురవే నమః.🌹🙏🌹

 🌹🙏🌹శ్రీ పరమాత్మనే నమః. 🌹🙏🌹


           🌹🙏🌹భగవద్గీత🌹🙏🌹


ఏడవ అధ్యాయము,జ్ఞానవిజ్ఞానయోగము లోనుంచి

17వ శ్లోకము,పదచ్ఛేద,టీకా,తాత్పర్యసహితముగా.

   🌺🌺ఓం నమో భగవతే వాసుదేవాయ.🌺🌺


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ౹

ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ౹౹

                                                               ( 17 )


తేషామ్ , జ్ఞానీ , నిత్యయుక్తః , ఏకభక్తిః , విశిష్యతే ౹

ప్రియః , హి , జ్ఞానినః , అత్యర్థమ్ , అహమ్ ,

సః , చ , మమ , ప్రియః ౹౹ ( 17 )


తేషామ్ = వారిలో ;

నిత్యయుక్తః = నిరంతరము నాయందే

                      ఏకీభావస్థితుడును ;

ఏకభక్తిః = అనన్యమైన భక్తిగల ;

జ్ఞానీ = జ్ఞానియైనవాడు ;

విశిష్యతే = శ్రేష్ఠుడు ;

హి = ఏలనన ;

జ్ఞానినః = యథార్ధముగ నా తత్త్వమును ఎఱింగిన 

               జ్ఞానికి ;

అహమ్ = నేను ;

అత్యర్థమ్ = అత్యంతము ;

ప్రియః = ఇష్టుడను ;

చ = మఱియు ;

సః = అతడును ;

మమ = నాకు ;

ప్రియః = ఇష్టుడు .


తాత్పర్యము ౼ ఈ చతుర్విధభక్తులలో నిరంతరము

నాయందే ఏకీభావస్థితుడై , అనన్యభక్తియుతుడైన

జ్ఞాని అత్యుత్తముడు . ఏలనన వాస్తవముగ నన్ను

( నా తత్త్వమును ) తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి

ఇష్టుడను . అతడును నాకు మిక్కిలి ఇష్టుడు .

                                                          ( 17 )


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺కృష్ణం వందేజగద్గురుమ్.శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్.

🙏🙏🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏🙏🙏

🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

    అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

    మళ్ళీకలుసుకుంద్దాం.

  🌺🌼🌺సర్వేజనాః సుఖినోభవన్తు .🌺🌼🌺

              Yours.................

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi

list of people who robbed Indian banks and fled the country:-

 This is a list of people who robbed Indian banks and fled the country:-

  1. Vijay Mallya

  2. Mehul Choksi

  3. Nirav Modi

  4. Nishant Modi

  5. Pushpesh Padya

  6. Ashish Jobanputra

  7. Sunny Kalra

  8. Arti Cholera

  9. Sanjay Kalra

  10. Varsha Kalra

  11. Sudhir Kalra

  12. Jadin Mehta

  13. Umesh Thinly

  14. Kamlesh Thinness

  15. Nilesh Pariho

  16. Vinay Mittal

  17. Singular forged

  18. Chetan Jayantilal Dara

  19. Nitin Jayantilal Dara

  20. Deeptiban Chetan

  21. Savia Setha

  22. Rajiv Goyal

  23. Alka Goyal

  24. Lalit Modi

  25. Ritesh Jaini

  26. Hitesh Nagendrabai Patel

  27. Mayuribehan Patel

  28. Ashish Sureshbai

       

  Total Robbery: 10,000,000,000,000/- (Ten Trillion Rupees)


 -any of these

 Not from RSS.

 No one belongs to Bajrang Dal.

 No one belongs to Shri Ram Sena.

 No one belongs to the Hindu Vigilance Forum.

 None of these are from BJP.

 None of these belong to Vishwa Hindu Parishad.


  One more thing, none of them have taken loan from any bank since 1st May 2014.

 There was a period of bank robbery... 2004-2014 when the Antonia Congress was in power. And today all these shameless Congressmen call Modi a thief.

 whereas.....

 As soon as Modiji came, all the games stopped...


 Share as much as possible... If the country is to be saved, the traitors must be exposed.

స్పాండిలైటిస్ మరియు సయాటిక

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

సంస్కృత మహాభాగవతం

 *25.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*8.1 (ప్రథమ శ్లోకము)*


*సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవ చ|*


*దేహినాం యద్యథా దుఃఖం తస్మాన్నేచ్ఛేత తద్బుధః॥12500॥*


అవధూతయగు దత్తాత్రేయుడు పలికెను. "యదుమహారాజా! ప్రాణులకు ఇంద్రియములవలన కలిగే సుఖము స్వర్గమునందు లభించినట్లుగనే, నరకమునందు కూడా లభించును. కావున, వివేకవంతుడు ఇట్టి రహస్యమును గుర్తించి సుఖ-దుఃఖముల కొరకు ఆరాటపడకూడదు.


*8.2 (రెండవ శ్లోకము)*


*గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ వా|*


*యదృచ్ఛయైవాపతితం గ్రసేదాజగరోఽక్రియః॥12501॥*


యోగియైన వాడు లభించిన ఆహారముతో సంతృప్తి పడవలయును. అది రుచికరమైనది కావచ్చును లేక రుచిలేనిది కావచ్చును. అది అధికముగా లభింపవచ్చును లేక స్వల్పముగా లభింపవచ్చును. కావున అతడు అజగరమువలె అప్రయత్నముగా లభించినదానిని అనుభవించి, ఉదాసీనుడై ఉండవలెను. 


*8.3 (మూడవ శ్లోకము)*


*శయీతాహాని భూరీణి నిరాహారోఽనుపక్రమః|*


*యది నోపనమేద్గ్రాసో మహాహిరివ దిష్టభుక్॥12502॥*


ఆహారము పెక్కుదినముల వఱకు దొరకకపోయినను దానికై ఎట్టి ప్రయత్నమూ చేయక అజగరము (కొండచిలువ) వలె నిరాహారముగా ఉండవలెను. ప్రారబ్ధానుసారముగ లభించిన ఆహారముతో సంతుష్టి నొందవలెను.


*8.4 (నాలుగవ శ్లోకము)*


*ఓజః సహో బలయుతం బిభ్రద్దేహమకర్మకమ్|*


*శయానో వీతనిద్రశ్చ నేహేతేంద్రియవానపి॥12503॥*


రాజా! శరీరమునందు మనోబలము, ఇంద్రియబలము, దేహబలము ఉన్నప్పటికిని, ఇంద్రియములు కార్యసాధకశక్తి కలవైనప్పటికిని, నిశ్చేష్టుడై యుండవలెను. నిద్రారహితుడైనను అజగరమువలె నిద్రించుచున్నట్లు ఉండవలెను. సాధకుడు ఇంద్రియసుఖములకై ఆరాటపడక అజగరము వలె ప్రాప్తించినదానితో తృప్తిపడియుండవలెను.


*8.5 (ఐదవ శ్లోకము)*


*మునిః ప్రసన్నగంభీరో దుర్విగాహ్యో దురత్యయః|*


*అనంతపారో హ్యక్షోభ్యః స్తిమితోద ఇవార్ణవః॥12504॥*


ముని సముద్రమువలె బయటికి ప్రసన్నుడుగాను, లోపల గంభీరుడుగాను ఉండవలెను. 'ఇతడు ఇట్టివాడు' అని ఇతరులకు బోధపడరాదు. మిగుల ప్రతిభాశాలియై యుండవలెను. అపారమైన శక్తిసామర్థ్యములు కలిగి యుండవలెను. కామక్రోధాదులచే చలింపరాదు. సముద్రమువలె ప్రశాంతముగా ఉండవలెను.


*8.6 (ఆరవ శ్లోకము)*


*సమృద్ధకామో హీనో వా నారాయణపరో మునిః|*


*నోత్సర్పేత న శుష్యేత సరిద్భిరివ సాగరః॥12505॥*


సముద్రములోనికి వర్షాకాలమున నదీప్రవాహములు ఎన్ని వచ్చి చేరినప్పటికిని అది తన చెలియలికట్టను (తన హద్దును) దాటదు. గ్రీష్మకాలమునందు శుష్కింపదు. అట్లే ముని సంపదలు సమృద్ధిగా లభించినప్పుడు పొంగిపోడు, లభింపనప్పుడు కృంగిపోడు. అతడు (ముని) విషయవాంఛారహితుడై తన మనస్సును భగవత్పరము కావించును. సముద్రమునుండి గ్రహింపవలసిన నీతి ఇదియే.


*8.7 (ఏడవ శ్లోకము)*


*దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైరజితేంద్రియః|*


*ప్రలోభితః పతత్యంధే తమస్యగ్నౌ పతంగవత్॥12506॥*


మిడుత అగ్నిజ్వాలరూపమునకు ఆకర్షితమై మోహవశమున అందుపడిపోయి నశించును. అట్లే ఇంద్రియ సుఖలోలుడైన వ్యక్తి భగవన్మాయా ప్రభావమున స్త్రీరూపమునకు ఆసక్తుడై, ఆ వ్యామోహములో పడి, అంధకారమయమైన నరకకూపమున పడిపోవును.


*8.8 (ఎనిమిదవ శ్లోకము)*


*యోషిద్ధిరణ్యాభరణాంబరాదిద్రవ్యేషు మాయారచితేషు మూఢః|*

*ప్రలోభితాత్మా హ్యుపభోగబుద్ధ్యా పతంగవన్నశ్యతి నష్టదృష్టిః॥12507॥*


మానవుడు కామినీకాంచనములు, వస్త్రాభరణములు మొదలగు క్షణికములైన పదార్థములచే ఆకర్షింపబడి, మూర్ఖత్వముచే వాటిని పొందవలెనను ఆసక్తితో వివేకమును కోల్పోయి మిడుతవలె నశించును. ఐహికములైన క్షణికసుఖావేశములు పతన హేతువులు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*1000వ నామ మంత్రము* 25.9.2021


*ఓం లలితాంబికాయై నమః*


కిరణరూపులగు నవావరణ దేవతలను అతిక్రమించి ఉపరిభాగమందు దేదీప్యమానమైన కాంతిప్రకాశంతో భాసిల్లు లలితాపరమేశ్వరికి నమస్కారము.


సుకుమార, లాలిత్యములతో విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


తేజస్సు, లాలిత్యము, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, స్థైర్యము, ఔదార్యము అను ఎనిమిదిగుణములతో తేజరిల్లు జగదాంబికకు నమస్కారము.


సృష్టి, స్థితి,లయలను తన క్రీడావిలాసములుగా కొనసాగించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లలితాంబికా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం లలితాంబికాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులను, ఆ పరమేశ్వరి అనంతజ్ఞానసంపన్నులుగను, అచంచలమైన ధ్యానదీక్షాపరులుగను, ధర్మబద్ధులుగను ప్రవర్తిల్లజేసి తరింపజేయును.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి మొదటి మూడు నామములు శ్రీమాత యొక్క సృష్టిస్థితిలయలు చేయునదిగా చెప్పి ఆ తరువాత అమ్మవారు *పంచకృత్యపారాయణ* గా తెలియజేయబడినది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనునవి పంచకృత్యములు. లలితా సహస్ర నామావళి యందలి మొదటి తొమ్మిది వందల తొంబై తొమ్మిది నామములు అమ్మవారు విశేషముగా కీర్తింపబడినది. ఈ వెయ్యవ నామము అమ్మవారి తొమ్మిదివందల తొంబైతొమ్మిది నామములలో తెలుపబడిన కార్యములన్నియు విశేష్యమయిన శ్రీమాతగా చేసిన లలితయు, మరియు అంబికయు అయిన లలితాంబిక అని అనవచ్చును. ఆ తల్లి సకలలోకములను అతిక్రమించి ప్రకాశించినది అగుటచే ఆ తల్లి లలిత అను నామము కలిగినది. ఆవరణదేవతలు అందరూ కిరణస్వరూపులు. అమ్మవారు వీరినందరినీ అతిక్రమించి పైన బిందుస్థానమునందు ప్రకాశించుచున్నదని లలిత పదమునకు అర్థము. లలిత అను శబ్దమునకే అనేకార్థములు ఉన్నవి ఆ అర్థములన్నియు ఆ పరమేశ్వరికి ఉండుటచే ఆ తల్లి *లలితాంబికా* యని అనబడినది. ఇంకను చెప్పాలంటే శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము అనునవి పురుషులకు ఉండవలసిన లక్షణములని పెద్దలు చెప్పగా, లాలిత్యము దానితో బాటు సౌకుమార్యము స్త్రీ లక్షణములు. ఈ లక్షణములు అమ్మవారికి ఉన్నవి. అందుచే ఆ అమ్మ *లలితాంబికా* యని అనబడినది. *మనోరూపేక్షు కోదండా* యని పదియవ నామములో చెప్పియుండుటచే, ఆ అమ్మ మనస్సు చెఱకు విల్లువంటిది. అనగా అమ్మవారి విల్లు చెఱకు అయితే, ఆ చెఱకు వింటికి బాణాలు పుష్పాలు. ఈ విల్లు, ఆ బాణాలు లాలిత్యానికి ప్రతీకలు గనుక, అవి చేతబూనిన ఆ పరమేశ్వరి *లలితాంబిక* యని అనబడినది. అమ్మవారి పాదాల కాంతి సరోజములను (తామరపూలను) ధిక్కరించుటకూడా ఆ తల్లి పాదాల లాలిత్యమును తెలియజేయుటచే శ్రీమాత *లలితాంబికా* యని అనబడినది. అమ్మ స్థూలరూపము ఆ పాదమస్తకమూ సౌకుమార్యముగా వివరించబడియుండుటచే అవన్నియు లాలిత్యమునకు ప్రతీకలగుటచే పరమేశ్వరి *లలితాంబికా* యని అనదగినది. *లలితాంబిక* యనునది ఐదక్షరములు అయినను, బ్రహ్మకంఠంనుండి వెలువడిన *ఓం* కారము, మంగళమైనది గనుక, ఓంకారము లేక మంత్రం సత్ఫలితాన్ని ఇవ్వదు గనుక ఈ నామ మంత్రమునకు *ఓం* చేర్చగా, ఆ నామము ఆరక్షరాల నామ మంత్రమై *ఓం లలితాంబికా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లలితాంబికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐