25, సెప్టెంబర్ 2021, శనివారం

నాలో నేను..!

 ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. నాలో నేను..!

...............,...,

ఎవరు వింటారు? ఎవరి అంతర్మథనం వారిది? దగ్గర వారు కూడా నీ అంతరంగం తెలుసుకోలేదు. అంత ఎందుకు? నీ మనసో, నీ ఆత్మో ప్రబోధం చేస్తున్నప్పుడు నువ్వు వినడానికి సిధ్ధంగా ఉన్నావా? అంత తీరిక మనకెక్కడిది? మరి మనకే లేని తీరిక..మనం చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వారికి ఎందుకు ఉంటుంది. బహుశా ఇది గ్రహించే మహానుభావులు ఆత్మావలోకనంలో మునిగిపోతారు. మాటను నియంత్రిస్తారు. ఎప్పుడో మరీ ప్రేమ ఎక్కువైతే ఒక ఆణిముత్యం లాంటి మాట విసురుతారు. అందుకే ఆత్మను ఆత్మతో నే ఉద్ధరించుకోవాలని దేవాదిదేవుడు కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అందరూ లోకోధ్ధరణ జరగాలనే మాట్లాడతారు. కానీ, తమను తాము ఉద్దరించుకునేందుకు ఇష్టపడరు. నేను కరెక్ట్ గానే ఉన్నాను..అని చెప్పని వ్యక్తి నాకు కనిపించడం లేదు (నాతో సహా). మరి..అందరూ ధర్మ పరాయణులు, సత్యసంధులు, నీతివంతులు అయితే మరి ఎందుకీ ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకీ మహమ్మారులు, సామాజిక వైరుధ్యాలు?. మరి ఏమి చేయాలి? ఒక చిన్న పని చేస్తే బాగుంటుందేమో? రోజులో నీకు విశ్రాంతి దొరికిన ఓ ఐదు, పది నిమిషాలు..ఏకాంతంలో నీ ఇష్టదైవంతో మాట కలుపు. కాసేపు సంభాషించు. ఆయనతో క్రీడించు. మనసు వివశ మవుతుంది. జాగ్రత్తగా కనిపెట్టు. ఆ అనుభూతి ప్రతి రోజూ నిలుపుకో. ఓం తత్ సత్.// ఆదూరి వేంకటేశ్వర రావు. 🙏

.

కామెంట్‌లు లేవు: