“వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:
మనం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాము ఆలపిస్తున్నాము ఈ చక్కటి శ్లోకాన్ని. కానీ దీని గూర్చి మనలో ఎంతమందికి తెలుసు. ఈ శ్లోకం కాళిదాసు వ్రాసిన రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. ఆ శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు. కాళిదాసు రచన ఒక చక్కటి సరళమైన ధార కలిగి జనాకర్షణగా ఉంటుంది. ప్రతి పదం సుష్మముగా ఉన్నట్లు ఉంది అత్యంత అర్ధవంతంగా ఉంటుంది అని అనటానికి ఈ ఒక్క శ్లోకమే చాలు. ఇటువంటి అనేక శ్లోకాలు పుంఖాను పుంఖంగా వ్రాసిన కాళిదాసు మనకు చిరస్మరనీయుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి