3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆనెకాయలు హరించుటకు సులభ చిట్కాలు -

 ఆనెకాయలు , పులిపిరులు , కాలిపగుళ్ళు హరించుటకు సులభ చిట్కాలు - 


 * ఉత్తరేణి చెట్టు సమూలం తెచ్చి ఎండబెట్టి దానిని భస్మం చేసి దానికి సమానంగా హరిదళం కలిపి నూనెతో నూరి లేపనం చేయుచుండిన యొడల ఆనెకాయలు , కాళ్ళు , చేతులు పగుళ్లు హరించును. కలిపేప్పుడు ఏ నూనెని అయినను వాడవచ్చు.


 * దాల్చినచెక్క బూడిద , సున్నం సమానంగా నూనెతో కలిపి నూరి రాయుచుండిన యొడల ఆనెలు , కాళ్లు , చేతులు పగుళ్లు హరించును.


 * గుగ్గిలముని వెన్నపూసతో కలిపి మర్దించి లేపనం చేసిన యెడల కాళ్లు , చేతుల పగుళ్లు హరించును. 


          

ఇదే తెలు 'గత్తయ్యా

 *ఇదే తెలు 'గత్తయ్యా!*


*అత్త*: ఇదిగో కోడలు పిల్లా!

ఓ సారిలా రా!


*కోడలు*: వస్తున్నా నత్తయ్యా!


*అత్త*: అత్తయ్యా అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా

అనకపోతే ...


*కోడలు*: నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని

ఉన్నారు, అబద్ధమాడ కత్తయ్యా! మైల పడిపోతారు.


*అత్త*:ఇప్పుడే మన్నావ్! కత్తయ్యా అనలేదటే! పరమ

సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా!


*కోడలు*: అయ్యో! నా ఖర్మకొద్దీ దొరికా రత్తయ్యా మీరు!


*అత్తయ్య*: మళ్లీ ఇంకో కొత్త కూత! రత్తయ్యా అన్నావా లేదా?


*కోడలు* : అయ్యో! నా రాత! అది సంధి. మీరు తెలుగు

సరిగా చదువుకోలే దత్తయ్యా!


 *అత్త* :మరో మాయదారి కూత. దత్తయ్యా అట! వాడెవడు? అయ్యో! అయ్యో! నేను నీలాగ చదువుకోలేదని

నన్ను నత్తయ్యా, కత్తయ్యా, రత్తయ్యా, దత్తయ్యా అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే! అబ్బాయిని, ఇంటికి రానీ! చెబుతా నీ సంగతి!!!


*కోడలు*: అలా ఉడికి పోయి ఆయాసం

తెచ్చుకోకండి. బీపీ పెరుగుతుంది. మీరనుకున్నవన్నీ 'ఉకారసంధి' వలన

 ఏర్పడిన పదాలత్తయ్యా!


*అత్త* : ఓరి దేవుడో! నన్ను మళ్ళీ

లత్తయ్యంటోంది నాయనో!


🔹 *తెలుగు భాషా దినోత్సవం* సందర్భంగా (వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి)

సంస్కృత మహాభాగవతం*

 *3.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.17 (పదిహేడవ శ్లోకము)*


*ఏత ఆత్మహనోఽశాంతా అజ్ఞానే జ్ఞానమానినః|*


*సీదంత్యకృతకృత్యా వై కాలధ్వస్తమనోరథాః॥12340॥*


ఇట్టి ఆత్మఘాతకులకు ఎన్నడునూ, ఏమాత్రమూ మనశ్శాంతియే యుండదు. అట్టివారు అజ్ఞానులేయైనను తమను తాము జ్ఞానులునుగా భావించుకొనుచుందురు. వారు పరమాత్మప్రాప్తికై లభించిన అమూల్యమైన ఈ మానరశరీరమును (మానవజన్మను) ఐహిక భోగములయందే వినియోగించుచు వ్యర్థము చేసికొనుచుందురు. అంతేగాక వారి కోర్కెలును తీరవు.


*5.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*హిత్వాత్యాయాసరచితా గృహాపత్యసుహృచ్ఛ్రియః|*


*తమో విశంత్యనిచ్ఛంతో వాసుదేవపరాఙ్ముఖాః॥12341॥*


వీరు భగవంతునియెడల విముఖులై (దైవభక్తి రహితులై) పెక్కు కష్టములకు ఓర్చుకొని సమకూర్చుకొనిన ఇండ్లువాకిండ్లను, భార్యాపుత్రులను, బంధుమిత్రులను, ధనధాన్యాది సంపదలను సైతము విధిలేని పరిస్థితులలో (తమ మనస్సు ఒప్పుకొనకున్నను) వదలిపెట్టయే పోవలసివచ్చును. కడకు వారు నరకముపాలే యగుదురు. రాజా! 'భగవంతుని సేవింపనివారిగతి ఏమగును?' అని నీవడిగిన ప్రశ్నకు నేను ఇట్లు వివరించితిని".


*రాజోవాచ*


*5.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*కస్మిన్ కాలే స భగవాన్ కిం వర్ణః కీదృశో నృభిః|*


*నామ్నా వా కేన విధినా పూజ్యతే తదిహోచ్యతామ్॥12342॥*


*అంతట నిమిమహారాజు ఇట్లు ప్రశ్నించెను* 'యోగిపుంగవులారా! పరమాత్ముడు ఏయేకాలములయందు, ఏయే వర్ణముల, ఆకారములను స్వీకరించు చుండును? మానవులు ఆ స్వామిని ఏ పేర్లతో, ఏయే రీతులలో పూజించుచుందురు? దయతో వివరింపుడు'.


*కరభాజన ఉవాచ*


*5.20 (ఇరువదియవ శ్లోకము)*


*కృతం త్రేతా ద్వాపరం చ కలిరిత్యేషు కేశవః|*


*నానావర్ణాభిధాకారో నానైవ విధినేజ్యతే॥12343॥*


*'కరభాజనుడు' అను తొమ్మిదవ యోగీశ్వరుడు ఇట్లు నుడివెను* "నిమిమహారాజా! కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను నాలుగు యుగములయందును భగవంతుడు పలు వర్ణములు, పెక్కు నామములు (పేర్లు), వివిధములగు ఆకారములు కలిగియుండును. అట్టి ప్రభువును జనులు అనేకవిధములుగా పూజించుచుందురు.


*5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*కృతే శుక్లశ్చతుర్బాహుర్జటిలో వల్కలాంబరః|*


*కృష్ణాజినోపవీతాక్షాన్ బిభ్రద్దండకమండలూ॥12344॥*


కృతయుగమునందు భగవంతుడు శ్వేతవర్ణముగలిగి చతుర్బాహురూపమున విలసిల్లుచుండును. శిరస్సున జటాజూటముచే ఒప్పుచు, వల్కలములను వస్త్రములుగా దాల్చి, కృష్ణాజినాధారియై విరాజిల్లుచుండును. యజ్ఞోపవీతమును, రుద్రాక్షమాలలను, దండకమండలాదులను ధరించి అలరారుచుండును.


*5.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మనుష్యాస్తు తదా శాంతా నిర్వైరాః సుహృదః సమాః|*


*యజంతి తపసా దేవం శమేన చ దమేన చ॥12345॥*


ఆ యుగమునందలి మానవులు భగవంతుని ఆరాధించుచు మిగుల శాంతస్వభావము గల్గియుందురు. వారి మధ్య ఎట్టి వైరభావములకును తావుండదు. సకల ప్రాణుల హితము కోరుతూ, సమదృష్టిని కలిగియుందురు. వారు ఇంద్రియ నిగ్రహమును, మనోనిగ్రహమును గలిగి ధ్యానరూప తపస్సుద్వారా పరమాత్మను సేవించుచుందురు.


*5.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*హంసః సుపర్ణో వైకుంఠో ధర్మో యోగేశ్వరోఽమలః|*


*ఈశ్వరః పురుషోఽవ్యక్తః పరమాత్మేతి గీయతే॥12346॥*


ఆ యుగములో హంస, సువర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగేశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్మ - అను నామములతో జనులు ఆ స్వామిని కీర్తించుచుందురు.


*5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*త్రేతాయాం రక్తవర్ణోఽసౌ చతుర్బాహుస్త్రిమేఖలః|*


*హిరణ్యకేశస్త్రయ్యాత్మా స్రుక్స్రువాద్యుపలక్షణః॥12347॥*


త్రేతాయుగము నందు భగవంతుడు ఎఱుపు వన్నెతో చతుర్బుజుడుగా శోభిల్లుచుండును. కటిభాగము త్రిమేఖలధారియై ఒప్పుచుండును. ఆ స్వామి కేశములు బంగారు వన్నెతో అలరారుచుండును. వేదప్రతిపాదితమైన యజ్ఞరూపమును దాల్చి స్రుక్కు, స్రువము మున్నగు హోమహాధనములతో శోభిల్లుచుండును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి

 *🙏🌹🌿కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం🌿🌹🙏*


🔸 సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.


🔸 ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు.

(ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )


🔸 ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా

వినాయకుడు" దర్శనమిస్తాడు.

(ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు)


🔸 కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.


🔸 కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి.


🔸 కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి) 


అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు

గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది , భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.


అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు 


*🙏 ఓం శ్రీ మాత్రేనమః 🙏*

చాణుక్యుడు అర్థశాస్త్రం

 చాణుక్యుడు అర్థశాస్త్రం వ్రాసాడని 19వ శతాబ్దము దాకా అందరికీ తెలుసు, కానీ ఆ పుస్తకప్రతి ఎవరి వద్దా దొరకలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ!! 


భరధ్వాజముని వైమానిక శాస్త్రం కూడా అంతే. వీటి ప్రస్తావనలు కథలలో పురాణాలలో ఉంటాయేమో కానీ, ఆ పుస్తకాలు ఎక్కడా దొరికేవి కావు. 


అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రధార కూడా దొరకదు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి వైజ్ఞానిక గ్రంథాలు ఎన్నో. ఎన్నెన్నో. 


ప్రస్తుతానికి చాణిక్యుని అర్థశాస్త్రం ఎలా దొరికిందో అన్న విషయాన్ని పరిశీలిద్దాము.

అందరూ అర్థశాస్త్రం ఉండేదని చెప్పేవారే కానీ, అందులో ఏముందో తెలిసిన వారు అసలు ఎవరూ 19వ శతాబ్ది నాటిదాకా ఎవరూ లేరట. భరతావని పైన ఇస్లాముక్రైస్తవ మతస్తుల దాడులలో మన ఆర్షవిజ్ఞాన ప్రతులను నాశనం చేయడమే కాదు, అవి నేర్చుకున్నవారిని కూడా చంపేసారు (ఇలా చంపడం, నాశనం చేయడం వంటి దుర్మార్గాలు కేవలం భారతదేశంలోనే కాదు, ఈ దుష్టులు వెళ్ళిన ప్రతి దేశంలోనూ ఇలాగే చేసారు). చివరికి మన ఆర్షవిజ్ఞానం నేర్చుకున్నవారు కూడా అది తమకు తెలుసునని చెప్పుకోవడానికి కూడా జంకే పరిస్థితిని ఏర్పరచారు.


 అలా కాలక్రమేణా హిందువులకి విజ్ఞానమన్నదే లేదని, అలా మనవారి చేతనే నమ్మించారు. హిందువులకు దేవుడి గురించి మూఢనమ్మకాలే తప్ప వారికి విజ్ఞానశాస్త్రాలేవీ తెలియవు అని మనచేతే నమ్మబలికించారు. దానితో ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకున్నవారు, కనీసము వాటి పట్ల ఆసక్తి కనబరచినవారు కూడా కరువైపోయారు ఆరోజుల్లో. 


తరువాత బ్రాహ్మణులు మీ విజ్ఞానాన్ని ఎవరికీ నేర్పలేదు, అందుకే అవి మీకు అందలేదు అని అబద్దాలను కూడా వ్రాయిపించి, మిగితా కులాల వారిని బ్రాహ్మణులపైకి రెచ్చగొట్టి, "డివైడ్ అండ్ రూలు" అన్న కుయుక్తిని ప్రయోగించారు. దీనితో బ్రాహ్మణులపైన కొద్ది పాటి గౌరవమైనా మిగిలి వుంటే, అది కూడా తుడిచి పెట్టుకు పోయింది. ఇదే సమయాన్ని కొంతమంది బ్రాహ్మణకులస్టులు వారికి అనువుగా మార్చుకున్న పరిస్థితులుగూడా అవగతమే.


 ఇంత అకృత్యాలు చేసినా హిందూ ధర్మం ఇంకా నిలబడే ఉంటోందన్న కసితో, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎందరో బ్రాహ్మణులను ఇస్లాముక్రైస్తవ పాలకులు ఊచకోత కోసి చంపేసారు.(టిప్పు సుల్తాన్ & ఆయన తండ్రి హైదారలి పరిపాలనలో 10000 మంది వేద పండితులు ఊచకోత కోయబడ్డారు).


వారి వైజ్ఞానిక పుస్తకాలను నాశనం చేసారు. అయినా సరే కొందరు బ్రాహ్మణులు ప్రాణాలకు తెగించి, రహస్యంగా వేదవిద్యలను, ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకుని, వాటిని తమలోనే బ్రతికించుకుంటూ వచ్చారు. పైన చెప్పిన అర్థశాస్త్రము, సమరాంగణ సూత్రధార, వైమానిక శాస్త్రము వంటి గ్రంథాలు నేడు మనకు అందుతూ వున్నాయీ అంటే అది వీరి చలువే. వీరి బలిదానము వల్లనే అలనాటి విజ్ఞానము కొంతమటుకు ఐనా ఇంకా దొరుకుతూనే వుంది. వేదాలు కూడా ఇంకా దొరుకుతూ ఉన్నాయి అంటే అవి వీరు మౌఖికముగా తరువాతి తరాలుకు అందించుకుంటూ రావడమే కారణము. 


పుస్తకాలలో కనుక వేదాలను భద్రపరిస్తే అవి ఎప్పుడో తగులబెట్టేసి వుండేవారు ఆ దుర్మార్గమతస్తులు. 

  

బ్రాహ్మణులు తాళపత్రాలపైన ఈ గ్రంథాలను వ్రాసి, దాచి పెట్టుకుని, ఆ తాటాకులు కాలక్రమంలో పాడైపోతూ వుంటే వాటిని తిరిగి మళ్ళీ క్రొత్త తాటాకులపైన వ్రాసి దాచుకునేవారు. తరువాతి తరాలవారు ఇవి తమకు అర్థమయినా కాకపోయినా సరే, వాటిని తిరిగి కొత్త తాటాకులపైన మళ్ళీ వ్రాసి భద్రపరచుకుని భావితరాలకు అందించాలనే నిష్ఠతో జీవించారు. నిజానికి ఇది ఎవరిచేతా గ్రుర్తింపబడని సామాజిక సేవే. ఇలా దాచుకున్నవి కూడా కొన్ని పాశ్చాత్యమతస్తుల చేతుల్లో దొరికి నాశనము చేయబడ్డాయి.


కానీ కాలక్రమంలో మన అదృష్టం బాగుండి, ఒక మంచి బ్రిటీషు అధికారి వచ్చి, తనకు దొరికిన కొన్ని పురాతన తాళపత్రాలని నాశనం చేయకుండా, అవి ఏమిటో అని పరిశీలించడానికి ప్రయత్నించాడట. బ్రిటీషువారిలో కూడా అప్పుడప్పుడు కొందరు మంచి వారు వస్తూవుండేవారు. వారు ఈ తాళపత్రాలని పరిశీలించి అందులో ఏముందో చెప్పమని, రుద్రపట్నం శ్యామాశాస్త్రి అనే ఒక సంస్కృత పండితుడిని నియమించారట. అందులో ఎన్నో పాడైపోయిన తాళపత్రాలు .... ... ఒక్కో తాళపత్రం ఒక్కో గ్రంథంలోనివి, ... ఒక్కో తాళపత్రం ఒక్కోలిపిలో ఉన్నవి, ... కొన్ని మంచి వ్రాతలు, కొన్ని పిచ్చివ్రాతలు, ... .. ఇలా ఇటువంటివన్నీ ముందేసుకుని ఆయన తన పరిశోధనలు సాగిస్తూవుంటే, అనుకోకుండా ఒక అద్భుతం జరిగిందట. 


ఒక అజ్ఞాత బ్రాహ్మణ రైతు తనవద్ద ఒక తాళపత్రాలకట్ట వున్నాయి అని, అవి శ్యామాశాస్త్రికి ఇచ్చాడట. మీరు ఏదోమంచి పని చేస్తున్నారు అని విన్నాను, ఈ తాళపత్రాలు కూడా మీకు పనికొస్తాయేమో చూడండి, అని ఇచ్చి వెళ్ళిపోయాడట ఆ గుర్తు తెలుపని పేద బ్రాహ్మణుడు. తరువాత ఎప్పుడో శ్యామశాస్త్రి ఈ బ్రాహ్మణుడిచ్చిన గ్రంథమేమిటో చూద్దామని చూస్తే, అది గ్రంథాలిపిలో ఉంది అని నిర్థారించాడట, కానీ ఆ గ్రంథాలిపిని చదువలేక పోయాడట.


 ఒక కథనం ప్రకారం అది చదవటానికి కావలసిన జ్ఞానము శ్యామశాస్త్రిగారికి స్వప్నావస్థలో దైవానుగ్రహం వల్ల కలిగిందట. వెంటనే నిద్రలేచి చదవటం మొదలు పెడితే అది మొత్తం చదివేయగలిగాడట. అదే చాణిక్యుని అర్థశాస్త్రంగా ఆయన అప్పుడు గుర్తించాడట. ఇలా ఇది 1905వ సంవత్సరములో అనుకోకుండా జరిగింది. అప్పటినుంచీ అంటే 1905వ సంవత్సరము నుంచీ మళ్ళీ మనకు మన చాణిక్యుని అర్థశాస్త్రం దొరుకుతూ వచ్చింది. ఎప్పటి చాణిక్యుడు,ఎప్పటి అర్థ శాస్త్రము? దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత మళ్ళీ పునర్దర్శనం కలిగింది భారతీయులకు.  


అలాగే, 1918–1923 సంవత్సరాల మద్య పండిత్ సుబ్బరాయ శాస్త్రి అనే ఒక పండితుడు, తనకు భరధ్వాజముని స్వప్నంలో దర్శనం కలిగించి, వైమానిక శాస్త్రాన్ని బోధించారని చెప్పాడు. అలా సుబ్బరాయ శాస్త్రి నేర్చుకుని చెబుతుంటే విని, ఆయన శిష్యులు వ్రాసుకున్నదే నేడు మనకు లభించే భరధ్వాజముని విరచిత వైమానిక శాస్త్రము. 


ఇది నమ్మలేని వారికి సుబ్బరాయ శాస్త్రిగారి వంశస్తులు గుప్తంగా అనేక వేల సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఒర్చి గుప్తంగా దాచుకుని, మౌఖికముగా వంశపారపర్యముగా అభ్యసించి భద్రపరచి, మనకు అందించిన అసలు విషయమే ఈ భరద్వాజ వైమానిక శాస్త్రము.


 ఏదైతేనేమి 19వ శతాబ్దిదాకా ఈ పుస్తకం కూడా మరుగున పడాల్సివచ్చింది. శాస్త్రిగారి వంటివారి కృపచేత మళ్ళీ మనకు లభించింది.  


అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రధార భారతదేశంలో ఎక్కడా దొరకదు. కానీ అమెరికాలోని వాషింగ్టన్ లైబ్రరిలో ఒక ప్రతి లభ్యమవుతుంది అని వినికిడి. బ్రిటిషువారి ద్వారా వారి కాలంలో ఎలాగో అలాగ అమెరికావారు దీన్ని సంపాదించుకుని వుంటారు. ఈ మన విజ్ఞానం మళ్ళీ మనకెప్పుడు దొరుకుతుందో మరి. దొరికినా వీటిని మన యూనివర్సిటీలు ఎప్పటికి నేర్పుతాయో?? 


మొన్న భారతీయ వైమానికశాస్త్రం గురించి ఒక సైన్సు కాంఫరెన్సులో ఒక మినిస్టరుగారు మాట్లాడినందుకే మన హిందూ వ్యతిరేక మేధవులు సెక్యులరులంతా పిచ్చిగా అరచి గగ్గోలు పెట్టారు. ఆత్మాభిమానమే లేని ఈ కుహనా మేధావులు, ఇది సైన్సు సభా లేక హిందూ సభా అని కాకిగోల చేసారు.


 ఇక ఆర్షవిజ్ఞానాన్ని యూనివర్సిటీల ద్వారా ప్రపంచానికి అందనిస్తారా? వీటిని ప్రాచుర్యం లోకి రానిస్తారా? చూద్దాం.

(శ్రీమాన్ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారి సంకలనం నుండి)

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:*

 *03.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2250(౨౨౫౦)*


*10.1-1363-*


*క. శౌరి నెఱిఁజొచ్చి కరములఁ*

*గ్రూరగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్*

*శూరుం గలహ గభీరున్*

*వీరుం జాణూరు ఘోరు వితతాకారున్.* 🌺



*_భావము: మహావీరుడు, మల్లయుద్ధనిపుణుడు, భయంకరాకారుడగు ఆ చాణూరుని శ్రీకృష్ణుడు చాకచక్యంగా తన బాహువులతో బంధించి, గట్టిగా పట్టి పైకెత్తి, దారుణంగా తిప్పి తిప్పి నేలకేసి కొట్టాడు._* 🙏



*_Meaning: Sree Krishna tactfully held gigantic Chanura, the great warrior and wresting expert firmly in his sturdy arms, lifted him atop, twirled and twisted and threw him on the ground with tremendous power._*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

*జై గోమాత.🙏*

 *ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు...గోవు వానిని చూసి నవ్వింది.*


*దాన్ని చూసి కసాయి అడిగాడు. నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?అని అడిగాడు.*


*అప్పుడు గోవు ఇలా చెప్పింది.*


*నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.*


*అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.*


*పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.*


*పాలతో వెన్న చేసుకున్నారు. వెన్నతో నెయ్యి చేసుకున్నారు. నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.*


*ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.*


*కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్... నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.*


*ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్. కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.*


*నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.*


*నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?*


*నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే.* 


*మీకు, మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో.* 


*మాకే... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు... మీ కెక్కడి మనుగడ,అందుకే* 


*నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.*

➖➖➖ ➖➖➖ ➖➖➖

*(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)*


*జై గోమాత.🙏*

*అందరికీ గోమాత విశిష్టత తెలియజేయండి.*

🙏🙏🌹 🌹❤🌹 🌹🙏🙏



Hot Coconut water

 *Hot Coconut water​ 

 Dr. Rajendra A. Badwe, TATA Memorial Hospital stressed that if *everyone who receives this newsletter can forward ten copies to others, surely at least one life will be saved back...* I have already done my part, hope You can also help with your part. thank!


*Hot coconut water can save you a lifetime*


*Hot coconut ~ only kill cancer cells!*


Cut *2 to 3 thin coconut flakes in a cup, add hot water, it will become "alkaline water", drink every day, it is good for anyone.*


*Hot Coconut water releases an anti-cancer substance, which is the latest advance in the effective treatment of cancer in the medical field.*


Hot coconut juice *has an effect on cysts and tumors. Proven to remedy all types of cancer.*


This type of treatment with *coconut extract only destroys malignant cells, it does not affect healthy cells.*


In addition, the amino acid and coconut polyphenol in coconut juice *can regulate high blood pressure, effectively prevent deep vein thrombosis, adjust blood circulation and reduce blood clots.*


After reading, *tell others, family, friends, spread love!* Take care of your own health. 🙏🏻💖

track for racing

 8 boys were standing on a track for racing.


Ready !


Steady !


Go .... !


With sound of Pistol all boys started running.


Hardly had they covered 10 to 15 steps, 1 boy slipped & fell.


 He started crying due to pain.


When other 7 Boys heard him, all of them STOPPED running..


STOOD for a while, 


turned BACK & RAN

towards him.


All the 7 Boys LIFTED the Boy,

pacified him, joined hands together, walked together &

reached WINNING Post.


Officials were shocked. 


Many Eyes were

filled with tears.


It happened at Pune.


Race was conducted by

National Institute of

Mental Health...


All participants were

Mentally RETARDED.


What did they teach ?

Teamwork,

Humanity,

Sportsman spirit, 

Empathy, 

Sympathy,

Love,

Care,

&

Equality..... 


We Surely can NEVER Do this,


because...


We have Brains.... 

We have Ego...

We have Attitude ...

We have Complexes ....... with little or no place for the above virtues ! And we call them mentality retarded..... ??


👌👌👌👌👌👌👌👌


One of best messages I've received.

ఎంగిలి దోషం

 *🌻ఎంగిలి దోషం🌻*



🍃🌺మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. 


🍃🌺ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 


🍃🌺ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం....


🍃🌺పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. 


🍃🌺పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది క్షమించు గాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 


🍃🌺ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది. 


🍃🌺పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. 


🍃🌺వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. 


🍃🌺ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?! 


🍃🌺వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. 


🍃🌺కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. 


🍃🌺ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధా చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. 


🍃🌺ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు. 


🍃🌺ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.


1. చిలక కొరికిన పండు,


2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.


3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.


🍃🌺వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.

ఒప్పుకోలేము

 ఒప్పుకోలేము గానీ...

చింతచిగురు దెచ్చి రోట్లో దంచేసి 

వరి అన్నములోన వేసికొని తిన్నామా

విటమిన్ 'సి' అందడానికి...


ఒప్పుకోలేము గానీ....

ఎండు మిరపకాయ వెల్లుల్లి తొక్కేసి

జొన్నజావలోన నంజుకొని తిన్నామా

'యాంటీవైరస్' పెరగడానికి...


ఒప్పుకోలేము గానీ....

వేకువ జామునే లేచి

సూర్యకాంతి సోకేలా 

ఆరుబయట నిలచి

ఒళ్ళంతా కదిలేలా 

పదినిమిషాలు నడిచామా

విటమిన్ 'డి' పొందడానికి...


ఒప్పుకోలేము గానీ....

ఉట్టిమీద సద్ది సట్టిలోని 

చల్లపచ్చి ఉల్లిపాయ 

కలుపుకొని తిన్నామా

'ఇమ్యూనిటీ' అభివృద్ధి చెందడానికి...


ఒప్పుకోలేము గానీ...

గోవు పేడ దెచ్చి గొబ్బెమ్మలుబెట్టి

ఇండ్ల ముందు అంతా 

కళ్ళాపి చల్లారా

'శానిటైజర్' అవసరం 

లేకుండా పోవడానికి...


ఒప్పుకోలేము గానీ...

మండువేసవిలోన 

సెలయేటి సెలమల్లో

ఊరిన నీటిని తోడుకొని 

తాగామా

కడుపు చల్లబడి సలవజేయడానికి...


ఒప్పుకోలేము గానీ....

వెన్నెల్లో ఆడినారా 

పందిట్లో పాడినారా

పదిమంది కలసి 

ఒకచోట కూడినారా 

సామాజిక ఐక్యత పెంపొందడానికి.....


ఒప్పుకోలేము గానీ...

నానమ్మ కథలేవి? 

తాతయ్య మాటలేవి? 

బంధాలు పెరిగి 

బంధుత్వం నిలవడానికి...


ఒప్పుకోలేము తప్పుకుంటాము

సాకులెన్నెన్నో వెతుక్కుంటాము       

నిప్పులాంటి నిజాల్ని గుప్పిట దాస్తాము.

ప్రయాణం చాలా చిన్నది.*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

      🙏 *ఒక నీతి కథ* 🙏

                🌷🌷🌷


*జీవితమనే మన ఈ* *ప్రయాణం చాలా చిన్నది.*

💐💐💐💐💐💐💐💐

ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. తరువాతి స్టాప్ వద్ద, ఒక బలమైన, క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 


వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగింది.?


వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు, *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.* కాబట్టి, నేను తరువాతి స్టాప్‌లో దిగబోతున్నాను కాబట్టి, అసభ్యంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు.


ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది: "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. *పనికిరాని వాదనలు, అసూయ, ఇతరులను క్షమించకపోవడం, అసంతృప్తి* మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.


మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? ప్రశాంతంగా ఉండు. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మీకు ద్రోహం చేశారా, బెదిరించారా, మోసం చేశారా లేదా అవమానించారా? విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడి కి గురికావొద్దు."అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? దాన్ని వదిలేయండి. దాన్ని విస్మరించండి. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


 ఎవరైనా మీతో విభేదించారా, బాగా ఆలోచించండి...? గట్టిగా ఊపిరి తీసుకోండి. అతన్ని / ఆమెను విస్మరించండి. మన్నించి మరచిపోండి. "ఎంత ముఖ్యమైనా మీ మనసుకు నచ్చని, నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. వారికి దూరంగా మనశ్శాంతి తో ఉండండి, కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *🌹ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మనకు అన్ని సమయాలలో అండగా ఉండే స్నేహితులను అభినందిద్దాం.

మనం గౌరవంగా, దయగా, క్షమించేలా ఉందాం.

తద్వారా, మనం కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిపోతాము. చివరికి గుర్తుంచుకోవాల్సింది. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


*ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.. ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. విర్రవీగకు.*


*నీతి:- మన మనశ్శాంతిని మించిన సంతోషం ఏదీ లేదు. మనశ్శాంతిని దూరం చేసే ఏది అయినా తృణప్రాయమే…*

🙏🙏🙏


 *సర్వేజనాః* *సుఖినోభవంతు*

సంస్కృత మహాభాగవతం

 *3.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.9 (తొమ్మిదవ శ్లోకము)*


*శ్రియా విభూత్యాభిజనేన విద్యయా త్యాగేన రూపేణ బలేన కర్మణా|*


*జాతస్మయేనాంధధియః సహేశ్వరాన్ సతోఽవమన్యంతి హరిప్రియాన్ ఖలాః॥12332॥*


ధనాదిసంపదలు, ఐశ్వర్యము (భూములు, గృహములు మొదలగునవి), అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించుట), పాండిత్యము, దానము, దేహసౌష్ఠవము, బలము, కర్మలు మొదలగువానిని కలిగియుండుటవలన గర్వితులై వివేకహీనులై భగవంతుని, భగవద్భక్తులను, సత్పురుషులను అవమానింతురు.


*5.10 (పదియవ శ్లోకము)*


*సర్వేషు శశ్వత్తనుభృత్స్వవస్థితం యథాఖమాత్మానమభీష్టమీశ్వరమ్|*


*వేదోపగీతం చ న శృణ్వతేఽబుధా మనోరథానాం ప్రవదంతి వార్తయా॥12333॥*


ఆకాశమువలె పరమాత్మ సర్వవ్యాపియై, సకలదేహధారులలో (ప్రాణులలో) అంతర్యామిగా విలసిల్లుచు, వెలుపలగూడ వెలుగొందుచుండును. ఈ విషయములను వేదములు పదేపదే వక్కాణించి యుండెను. కాని అజ్ఞానులు వాటిని వినుటకు ఉత్సాహము చూపరు సరిగదా! వారు సర్వదా తమ ఐహికవాంఛలను గూర్చియే ముచ్చటించుకొనుచు సమయమును వృథా చేయుచుందురు.


*5.11 (పదకొండవ శ్లోకము)*


*లోకే వ్యవాయామిషమద్యసేవా నిత్యాస్తు జంతోర్న హి తత్ర చోదనా|*


*వ్యవస్థితిస్తేషు వివాహయజ్ఞసురాగ్రహైరాసు నివృత్తిరిష్టా॥12334॥*


ప్రాణులకు స్త్రీ సంగమము, మాంసభక్షణమ, మద్యసేవనము అను వానియెడ స్వాభావికముగా ప్రవృత్తి (ఆసక్తి) ఉండును. వీటికి ప్రేరణ-ప్రోత్సాహములతో పనిలేదు. కానీ ఇవి పతనహేతువులు. వివాహానంతరము ధర్మపత్నితో శాస్త్రసమ్మతమైన సంగమము ఉచితమైనది. యజ్ఞాచరణమునందు పశువులను స్పృశించవలెనేగాని, మాంసభక్షణము తప్పుకాదని శాస్త్రములందు నియమము చెప్పబడలేదు. అట్లే సౌత్రామణి యజ్ఞమునందు సురను ఆఘ్రాణించుటవరకే చెప్పబడినది కాని, సురాపానముచేయుటకు శాస్త్రనియమము ఏర్పడలేదు. కావున ఇందుకు వ్యతిరేకముగ వ్యవహరింపకుండుటయే శాస్త్రముల ముఖ్యతాత్పర్యము. అంతేగాక, పరస్త్రీ సంగమము, మాంసభక్షణము, సురాపానము అను వ్యసనప్రవృత్తి నుండి దూరముగ నుంచుటకై నివృత్తిని బోధించుటయే శాస్త్రముల నిశ్చితాభిప్రాయమని తెలియవలెను. ఈ విధముగా మానవుల లౌల్యప్రవృత్తికి శాస్త్రములు తగిన హద్దులను ఏర్పరచినవి.


*5.12 (పండ్రెండవ శ్లోకము)*


*ధనం చ ధర్మైకఫలం యతో వై జ్ఞానం సవిజ్ఞానమనుప్రశాంతి|*


*గృహేషు యుంజంతి కలేవరస్య మృత్యుం న పశ్యంతి దురంతవీర్యమ్॥12335॥*


ధనమును భగవత్ప్రీతికరమైన ధర్మకార్యముల యందు వినియోగింపవలెను. ధర్మకార్యములను చేయుటవలన విజ్ఞానసహితమైన జ్ఞానము కలుగును. దీనివలన ప్రశాంతి లభించును. ఈ సత్యమును ఎఱుగక కొందరు తమ ధనమును గృహనిర్మాణాదులకును, ఐహిక సుఖభోగములకును వ్యయము చేయుదురు. తిరుగులేనిశక్తిగల మృత్యువు తమను ఎప్పుడు కబళించునో అను సంగతిని వారు ఎఱుగరు కదా!


*5.13 (పదమూడవ శ్లోకము)*


*యద్ఘ్రాణభక్షో విహితః సురాయాస్తథా పశోరాలభనం న హింసా|*


*ఏవం వ్యవాయః ప్రజయా న రత్యా ఇమం విశుద్ధం న విదుః స్వధర్మమ్॥12336॥*


సౌత్రామణి యజ్ఞమునందు సురాఘ్రాణము (వాసన చూచుటయే భక్షణము) యుక్తము అని చెప్పబడినది. సురాపానము గాదు. యజ్ఞమునందు పశువును స్పృశించుటయే విధానము. దానిని హింసించుటగాదు. భార్యాసంగమము, పితృఋణమును దీర్చుటకై సత్సంతాన ప్రాప్తికై విధింపబడినది. రతిసుఖము కొరకుగాదు. ఈ విశుద్ధ ధర్మమును భక్తిహీనులు ఎరుగరు.


*5.14 (పదునాలుగవ శ్లోకము)*


*యే త్వనేవంవిదోఽసంతః స్తబ్ధాః సదభిమానినః|*


*పశూన్ ద్రుహ్యంతి విశ్రబ్ధాః ప్రేత్య ఖాదంతి తే చ తాన్॥12337॥*


అవినీతిపరులు, తమను తాము సాధువులుగా భావించుకొనువారు, ఐన దుష్టులు ఇట్టి విశుద్ధ ధర్మమును ఎరుగక, ఏ మాత్రమూ సంశయము లేకుండా పశువులను హింసింతురు. వారు చనిపోయిన పిమ్మట ఆ పశువులే వారిని భక్షించును.


*5.15 (పదునైదవ శ్లోకము)*


*ద్విషంతః పరకాయేషు స్వాత్మానం హరిమీశ్వరమ్|*


*మృతకే సానుబంధేఽస్మిన్ బద్ధస్నేహాః పతంత్యధః॥12338॥*


వారు నశ్వరమైన తమ దేహముమీదను, భార్యాపుత్రాది పరివారము పైనను ప్రగాఢమైన ప్రేమాను రాగములను కలిగియుందురు. వారు తమయందును, ఇతరుల (ఇతర ప్రాణుల) శరీరములలో అంతర్యామిగా ఉన్న భగవంతుని ద్వేషించుచుందురు. అట్ఠివారు అధోగతి పాలగుచుందురు.


*5.16 (పదహారవ శ్లోకము)*


*యే కైవల్యమసంప్రాప్తా యే చాతీతాశ్చ మూఢతామ్|*


*త్రైవర్గికా హ్యక్షణికా ఆత్మానం ఘాతయంతి తే॥12339॥*


జ్ఞాననిష్ఠ అబ్బనివారు, మూఢత్వముయొక్క పరాకాష్ఠకు చేరినవారు (పరమమూర్ఖులు) క్షణభంగురములైన ధర్మార్థకామములనే ప్రధానముగా భావించుచు, కామ్యకర్మల యందే నిమగ్నులై ఆత్మఘాతకులగుచుందురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*988వ నామ మంత్రము* 3.9.2021


*ఓం అద్భుత చారిత్రాయై నమః*


ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చరిత్రలు గలిగిన లలితాంబికకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అద్భుత చారిత్రా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం అద్భుత చారిత్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు ఉపాసకులు కీర్తిప్రతిష్టలతో బాటు, భౌతికముగా శాంతిసౌఖ్యములు, పారమార్థికముగా భగవత్ చింతనతో వర్ధిల్లుదురు.


జగన్మాత అద్భుతమైన చరిత్ర గలిగినది. ఆ తల్లి భూకంపము, ఉపద్రవములనుండి అనంతకోటి జీవరాశులను కాపాడియున్నది. *దేవకార్య సముద్యతా* యను లలితా సహస్ర నామావళి యందలి నామ మంత్రమునందు చెప్పినటులు దేవతల కార్యములకై, ధర్మసంస్థాపనార్థము అద్భుతమైన కార్యక్రమములను చేయుటకు మరల మరల జన్మించినది. భండాసురుడు, మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించుటలో తన రణతంత్ర వ్యూహములను రచించుటలో ఆమెకు ఆమెయే సాటి. ఆ తల్లి విశేషమైన పరాక్రమమును చూపి రాక్షససంహారము చేసినది. తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి నారాయణుని పది అవతారములను ఉద్భవింపజేసి దుష్ట శిక్షణకు మరింత దోహద పడినది. సృష్టి, స్థితి, లయ, తిరోదాన, అనుగ్రహములను పంచకృత్యములను నెఱపినది. తారకాసుర సంహారంలో దేవతలకు సరైన మార్గదర్శకత్వము అనుగ్రహించినది. ఈ విధంగా జగన్మాత ఆదిపరాశక్తిగా, పరమేశ్వరిగా ఎన్నో అద్భుత కృత్యములను ఒనర్చినది గనుకనే ఆ తల్లి *అద్భుత చారిత్రా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అద్భుతచారిత్రాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

టీనేజ్ హోమ్స్

 **టీనేజ్ హోమ్స్**



ఓల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.

షాకవుతున్నారా ? అప్పట్లో ఓల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటనేగా!


ఈ సంభాషణ వినండి..


 P: Parent, 


TH: Teenage Home Manager : 


P: "నమస్తే సార్ ".


TH: నమస్తే –రండి కూర్చోండి.


P: "మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్". 


TH: వెల్కం. అబ్బాయా అమ్మాయా?


P: "ఇద్దర్నీ జాయిన్ చేస్తా..." 


TH: ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.


P: "ఓకే సార్ .కట్టేస్తాం". 


TH: ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?


P: "మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ..."


TH: అంటే?


P: "ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు".


TH: అంటే......? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?


P: "అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది? అసలు నిద్రే పోవటం లేదు". 


TH: అంటే.......? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?


P: "ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?". 


TH: ఓహో......అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.


P: "అవును".


TH: మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?


P: "అందుకు రెండు ఫోన్లు వాడుతున్నారు". 


TH: ఫోన్లు లాక్కో పోయారా?


P: "బావుంది, మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు".


TH: ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట, మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.


P: "అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం. బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం".


TH: మరి అదే కంటిన్యూ చేయక పోయారా?


P: "ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం. మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం". 


TH: ఓకే, అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?


P: "మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..". 


TH: గుడ్...... రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.


P: "మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు". 


TH: ఓకే.... .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి.


P: "అంత సీన్ అవసరం లేదు. మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు". 


TH: అలా అయితే పదివేలు కట్టండి చాలు.


P: "ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?".


TH: ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి–ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు. తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం...


P: "ఒక డౌట్ సార్".


TH: ఏంటది?


P: "ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?".


TH: అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.


P: "ఎందుకు?".


TH: అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.


ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని ఆరిపోయి వుంటారు గనక...

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 39

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 39

                           SLOKAM : 39

                                                

क्षीरसागरतरङ्गशीकरा –

सारतारकितचारुमूर्तये ।

भोगिभोगशयनीयशायिने

माधवाय मधुविद्विषे नमः ॥ ३९ ॥  


క్షీరసాగర తరంగశీకరా- 

సారతారకిత చారుమూర్తయే I   

భోగిభోగ శయనీయశాయినే

మాధవాయ మధువిద్విషే నమ: ॥ 39    


    క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు, 

    శేషభోగ శయ్యపై పవళించిన మధుసూదనుడగు మాధవునికి నమస్కారము.


    Obeisances to Lord Mādhava, enemy of the Madhu demon. 

    His beautiful form, lying on the couch of the serpent Ananta, is speckled by the shower of spray from the milk ocean’s waves.  



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

శ్రీ దత్తాత్రేయ స్వామివారు

 *దండము..కమండలము..పాదుకలు..*


శ్రీ దత్తాత్రేయ స్వామివారు, తమ తపోసాధనలో భాగంగా కొన్నాళ్ల పాటు ఏర్పేడు వ్యాసాశ్రమంలో గడిపారు..(వ్యాసాశ్రమ విశేషాలను ఇంతకు ముందు శ్రీ స్వామివారి చరిత్ర లో చదువుకొని వున్నాము..పాఠకులకు గుర్తువుండి ఉంటుంది..) సాధన చేసే క్రమంలో దండ కమండలాలు చేత బూనడం, పాదుకలు ధరించడం మున్నగు అలవాట్లు శ్రీ స్వామివారికి వ్యాసాశ్రమం లో ఉన్నప్పుడే అలవడ్డాయి..వ్యాసాశ్రమం నుంచి బైటకు వచ్చిన తరువాత..తనతో పాటు దండ కమండలాలు, పాదుకలను కూడా తనతో పాటే తీసుకొని వచ్చారు..


చిత్తూరు జిల్లా పాపానాయుడుపేట లో శ్రీ బాలబ్రహ్మాచారి వద్ద గురుబోధ పొంది, ప్రకాశం జిల్లా లోని పుణ్యక్షేత్రం మాలకొండ లో తపోసాధన కొనసాగించడానికి శ్రీ స్వామివారు నిశ్చయం చేసుకొని..మాలకొండ లో గల శ్రీ పార్వతీదేవి మఠాన్ని తన ఆవాసంగా మలచుకున్నారు..శ్రీ పార్వతీదేవి మఠం పై భాగం లో ఉన్న శివాలయం లో సాధన చేసుకునే వారు..జన సంచారం ఎక్కువగా వున్న సమయాల్లో..శివాలయం కు పై భాగాన ఉన్న గుహల్లో కి వెళ్లిపోయేవారు..మాలకొండ చేరిన తరువాత దండ కమండలాలు మాత్రం తపోసాధనలో వినియోగించారు కానీ..పాదుకలను మాత్రం ధరించేవారు కాదు..వట్టి కాళ్ళతోనే సంచరిస్తూ వుండేవారు..


మొగలిచెర్ల గ్రామం శివార్ల లో ఉన్న ఫకీరు మాన్యం లో ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దీ రోజుల పాటు శ్రీధరరావు ప్రభావతి గార్ల గృహం లో శ్రీ స్వామివారు వున్నారు.. ఆ సమయం లోనూ పాదుకలను ధరించలేదు..ఆశ్రమ నిర్మాణం జరిగే రోజుల్లోనూ ఆ ప్రదేశమంతా అలానే తిరిగేవారు కానీ..పాదుకలు ధరించలేదు..తనతో తెచ్చుకున్న వస్తువులలో పాదుకలు మాత్రం భద్రంగా ఉంచుకునేవారు..


ఆశ్రమ నిర్మాణం పూర్తయిన పిదప..ఆశ్రమంలో తన తపోసాధన కొనసాగించే రోజుల్లో మళ్లీ ఆ పాదుకలు వాడటం మొదలు పెట్టారు..అప్పటి నుంచీ చివరి వరకూ అంటే..తాను కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే రోజు దాకా..ఆశ్రమ ప్రాంగణం లో తిరిగినా..లేదా..ఆశ్రమం బైట వ్యాహ్యాళికి వచ్చినా ఖచ్చితంగా పాదుకలు ధరించే వుండేవారు..


మొగలిచెర్ల గ్రామానికి చెందిన శ్రీ తాళ్ళూరి నరసింహారావు అనే భక్తుడు, శ్రీ స్వామివారికి వెండి పూతతో చేసిన పాదుకలు బహూకరించి, వాటిని ధరించమని ప్రాధేయపడ్డారు..శ్రీ స్వామివారు నవ్వి..ఆ భక్తుడి తృప్తి కోసం ఒక్కసారి తన కాళ్లకు ధరించి.."ఇవి బాగా బరువుగా ఉన్నాయి నాయనా!.." అని చెప్పి ప్రక్కన పెట్టేసారు..ఆ వెండి పూతతో ఉన్న పాదుకలను ఆశ్రమం లోనే వుంచమని చెప్పి, నరసింహారావు వెళ్లిపోయారు..ప్రస్తుతం పల్లకీ సేవలో ఆ పాదుకులనే శ్రీ స్వామివారి విగ్రహం తో పాటు ఊరేగిస్తున్నాము..ఒక్కసారి శ్రీ స్వామివారి పదస్పర్శ తగిలిన ఆ పాదుకులకు చిరస్థాయిగా పల్లకీ సేవలో ఊరేగే భాగ్యం కలిగింది!..


వ్యాసాశ్రమం వీడిన రోజునుంచీ..మళ్లీ మొగలిచెర్ల లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో చేరేదాకా పాదుకలను ఎందుకు వాడకుండా ఉన్నారో ఇప్పటికీ అంతుచిక్కని విషయం..


శ్రీ స్వామివారు వాడుకున్న దండము, కమండలము, పాదుకలు..భద్రంగా శ్రీ స్వామివారి సమాధి వద్ద భద్రపరచబడి ఉన్నాయి..ఒక మహనీయుడి తపోసాధనకు ఉపయోగపడిన ఆ వస్తువులు.. అత్యంత పవిత్రమైనవిగా మేము భావిస్తాము..శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్లకద్దుకుంటారు..తమ తమ కోర్కెలు నెరవేరాలని ఆ పాదుకలకు శిరస్సు ఆనించి మ్రొక్కుకుంటారు..


ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఈ వస్తువుల భద్రత గురించి ఆలోచించాల్సి వస్తోంది..ఎందుకంటే కొన్ని తరాలపాటు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉన్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).