14, జూన్ 2023, బుధవారం

జమ్మలమడుగు

 🕉 మన గుడి : 





⚜ కడప జిల్లా : జమ్మలమడుగు


⚜ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి  ఆలయం



💠 శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో రాజవైభవంతో కొలువై ఉన్నారు. భగవంతుని దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. భగవంతుడు సాధారణంగా భక్తులకు వారి కోరికలను నెరవేర్చడానికి సులభంగా చేరుకోవడానికి వివిధ ప్రదేశాలలో ప్రత్యక్షమవుతాడు. 

కడప జిల్లాలో కూడా కొన్ని చోట్ల శ్రీవారు వెలసి  వివిధ పేర్లతో భక్తులకు అందుబాటులో ఉంటాడు.

పాలకొండలోని పాలకొండ ప్రభువుగా, 

కడపలో లక్ష్మీ వేంకటేశ్వర స్వామిగా ,

జమ్మలమడుగులో నారాపురం వెంకటేశ్వర స్వామిగా అందరిచే ఆరాధించబడతాడు. 

ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది.


⚜ చరిత్ర ⚜


💠 సంగమ వంశానికి చెందిన విజయనగర రాజ్యాన్ని పాలించిన వారిలో ప్రౌడ దేవరాయలు కూడా ఉన్నారు. 

అతని కొడుకు విజయదేవరాయలు విజయనగర రాజ్యంలోని ఉదయగిరి ప్రాంతాన్ని పాలించాడు.


💠 జమ్మలమడుగు ప్రాంతం ఆ రోజుల్లో ఉదయగిరి పాలకుల ఆధీనంలో ఉండేది. విజయదేవరాయల భార్య నారాయణమ్మ తన జీవిత భాగస్వామితో కలిసి ఈ ప్రదేశంలో పర్యటించింది. 

ఆ రోజుల్లో ఆమె ఈ ప్రదేశంలో ఒక గ్రామాన్ని మరియు ఆలయాన్ని నిర్మించాలనే కోరికను 

వెల్లడించింది


💠 అందుకే ఆమె తన పేరు మీద ఒక గ్రామాన్ని నిర్మించుకుంది. ఆ పేరు మీద 'నారాయణపురం' అని పిలిచేవారు. 

ఆమె అక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. క్రమంగా, నారాయణపురం వ్యక్తుల వినియోగంలో నారాపురంగా మారింది మరియు ఈ ఆలయంలో ప్రత్యక్షమైన వేంకటేశ్వరుడు 'నారాపురం వెంకటేశ్వర స్వామి'గా ప్రసిద్ధి చెందాడు.


💠 నారాయణపురం రాజకుటుంబం అక్కడ పన్నెండు బ్రాహ్మణ కుటుంబాలతో ఒక అగ్రహారాన్ని స్థాపించింది. 

దీనిని నారాయణపురం అగ్రహారం అని పిలిచేవారు. 

అనతి కాలంలోనే పెన్నా నది వరదల్లో అగ్రహారం కొట్టుకుపోయింది. వరదల కారణంగా ఆలయం కూడా ధ్వంసమైంది మరియు పదే పదే పునరుద్ధరించబడింది.


💠 ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమానికి సంబంధించి పూజలు మరియు ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. 


💠 గండికోట పతనం తరువాత, ఈ ప్రాంతం గోల్కొండ ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. అక్కన్న, మాదన్న అప్పట్లో గోల్కొండ తానీషా ఆధ్వర్యంలో మంత్రులుగా ఉన్నారు. 

పొదిలి లింగప్ప వారి మార్గదర్శకత్వంలో దక్షిణ ప్రాంత వ్యవహారాలను చూసేందుకు వినియోగించుకున్నారు. 

కంచనపల్లె రాజు రఘునాథ, అతను శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడు 


💠 సుమారు 1709 ప్రాంతంలో జమ్మలమడుగు గ్రామానికి  బాధ్యత వహించిన ఆకునూరు నరసన్న నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రాంగణం ప్రకారం నిర్మించారు. లోహ విగ్రహాలను తయారు చేసి, ఉత్సవాలను నిర్వహించాడు.


💠 ఆలయ నిర్వహణ బాధ్యతలు 23 అక్టోబర్ 2008 నుండి ప్రభావంతో AP ఎండోమెంట్స్ విబాగం నుండి TTDకి బదిలీ  చేయబడింది


💠  జమ్మలమడుగు పక్కన దొమ్మర నంద్యాలలో జైన మతస్తులు ఉండేవారని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు కూడా ఆ ఊరి శివాలయం ద్వారబంధం మీద జైన తీర్థంకరుని శిల్పం మనం గమనించవచ్చు.  ఆ ఊర్లో ఒక వ్యవసాయ బావిలో గోడలకి చాలా జైన శిల్పాలు తెల్ల రాతివి ఉండేవంట. 

ఈ ఊర్లో దొరికిన శాతవాహన కాలం నాటి సీసపు నాణేలు, పెద్ద పెద్ద ఇటుకలు మైలవరం మ్యూజియంలో ఉన్నాయి. 


💠 గండికోటలో ఒక జైన దేవాలయం ఉంది. జుమ్మా మసీదు వెనుక ఆ చిన్న జైన మందిరం, విజయనగర కాలం నాటిది. దొమ్మర నంద్యాల లాగా, ద్వార బంధం మీద జైన తీర్థంకరుడు అక్కడ చూస్తం. గర్భగుడిలో ఉందే జైన తీర్థంకరుడి విరిగిపోయిన విగ్రహం, గండికోట లోనే గోడౌన్ పక్కన ఉంది.


💠 గుడిలో స్థంభాలకి జైన తీర్థంకరుల చిత్రాలు ఎలా ఉంటుంది అని అలోచిస్తే, అక్కడ కూడా మొదట జైన మందిరం ఉండి ఉండొచ్చు అది కాలక్రమంలో శిథిలం అయితే, విజయనగర రాజులు ఆ గుడి స్థంభాలతోనే వైష్ణవ ఆలయం కట్టి ఉండొచ్చు అని అర్థం చేసుకోవచ్చు.


🔅 బ్రహ్మోత్సవాలు 🔅


💠 ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో  జరుగుతాయి. మరుసటి రోజు  వివాహ వేడుక (కళ్యాణోత్సవం) మరియు పక్షం రోజులలో రథోత్సవం భక్తులకు కన్నుల పండువగా జరుగుతోంది. 


💠 ఈ బ్రహ్మోత్సవాల్లో జమ్మలమడుగు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు.


💠 ఆలయంలో శ్రీ పద్మావతి కళ్యాణమండపంని టీటీడీ నిర్మించింది. మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహాలు మరియు కవుల సమావేశాలతో హాలు ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. 


💠 ఆలయ ప్రాంగణంలో గరుడ మరియు హనుమంతుని విగ్రహాలు దేవునికి ఎదురుగా ఉంటాయి.


💠 రథసప్తమి, వైకుంఠ ఏకాదశి మరియు ఇతర ఉత్సవాలు కూడా ఆలయంలో  నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.


💠 జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వర స్వామి గుడిలో స్థంభాలకి జైన తీర్థంకరుల శిల్పాలు.. & జమ్మలమడుగు చుట్టుపక్కల ఊర్లలో జైన మతం ఆనవాళ్ళు ఉంటాయి


💠 బస్సు ద్వారా : 

కడప నుండి జమ్మలమడుగుకి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. 

ఈ ఆలయానికి చేరుకోవడానికి జమ్మలమడుగు నుండి 15 నిమిషాలు పడుతుంది

హిందువుల్లో మార్పు రావాలి




 *హిందువుల్లో మార్పు రావాలి. సాయిబాబా అనే ఇస్లామిక్ తురక దేవుణ్ణి పూజించడం అవసరమా❓*    🙊🙉🙈☪️🐖🐖🐖🐖🐖🐖🐖✝️👹👹😭🐷🦓🐑🐑

*బదరీ పీఠాదీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య రాములవారి దర్శనానికి వెళితే ఆలయంలో ☪️సాయిబు బాబా జంజీర్ బాబా 🙊🙉🙈🐖😭🐑🦓🐷👹✝️🐧 విగ్రహాన్ని చూసి కన్నీళ్ళతో వెనుదిరిగి వెళ్ళిపోయారు....*


*అంతటి గొప్ప స్వాములే తురుకొన్ని సాయీబును {🙈🙉🙊Sai Baba Sai Ram🙈🙉🙊🐖🐑🦓👹) దేవుడుగా అంగీకరించకుండా వెళ్లిపోతే...* 

*మరి మన తెలుగు రాష్ట్రాలలో  పెద్ద, పెద్ద పేరున్న ప్రవచన కర్తలు... తెగ మోస్తూ  ప్రవచనాలుదంచుతున్నారు.... మీ మీ

స్వార్ధ పూరిత లాబాలకోసం, స్వాప్రయోజనాలకోసం, భావితరాల

విశ్వాసాలకు అఘతం కలిగించకండి. యీ దుష్ట శక్తులు మీ సహనానికి, ఓర్పుకు

మంచితనానికి, భక్తికి ఓ అగ్ని పరీక్ష ఇకనైనా జ్ఞానోదయం పొందుతారని, మీ మార్పు ఈ జగత్తుకే/ ప్రపంచానికే గొప్ప సందేశం స్ఫూర్తి*


అజ్ఞాని జ్ఞాని అవ్వడం ఏంత గొప్పో

జ్ఞాని ఒక్కడే సమత స్ఫూర్తి ప్రదాత ప్రపంచానికే ఆదర్శం మార్గదర్శం అవుదాం


సంకర జాతి బుద్ది మానుకొని 



ఇ కనైన మొలుకో ఓ భగవత్ స్వరూపుడైన

హిందూ భారతీయుడా 


*నేను సైతం* ✍️


🚩మేలుకో సనాతనా🚩

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఆచమనం అంటే

 


*ఆచమనం అంటే ఏమిటో..!*

*తెలిస్తే ఆశ్చర్యపోతారు*….!!

*పూజలు, వ్రతాల్లో* *”ఆచమనం”* *అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా* *హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు*. 


*కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు*

.

*సాధారణంగా గుడి వెళ్ళినప్పుడో, పూజా సమయంలోనో మనం ఈ ఆచమనాన్ని పాటించి ఉంటాం*. *సాంప్రదాయబద్ధంగానైతే రోజులో పలుమార్లు పాటిస్తారు*.

*ఉదయం లేచి స్నానం చేసిన* *తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే* *సమయంలో భోజనానికి ముందు*,

*తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం*, *కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు*.


*సంస్కృతంలో ”గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్” అని వర్ణించారు*. *అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, నీటిని పోసి, వాటిని తాగడం అన్న మాట.*

*చేతిలో పోసేనీళ్ళుకి కూడా కొలత ఉంటుంది. మూడు ఉద్ధరిణిల నీటిని మాత్రమే పోయాలి. అంటే ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు కొలత అంతే ఉండాలి*.


*ఎందుకు చేయాలి? ఏమిటి దాని వలన ప్రయోజనం అంటే, గతంలో మనం అనేక మార్లు భారతీయత, దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పది.*

*భక్తి మాత్రమే కాదు అనువణువునా శాస్త్రీయత*, *ఆరోగ్య సూత్రం ఇనుమడింపజేస్తాయి*. *భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఆచమనంలో కూడా అదే దాగి ఉంది*.

*మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి*. *దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది*.

*కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది*.

*ఏ చిన్న గాయం అయినా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి*.

*ఇవి ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారంలో మిళితమై ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి*.

*స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి*.

*స్వరపేటిక మహా సున్నితమైనది* 


*ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక*,

*గొంతు లోపలి భాగం, శ్వాస* *నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న* *ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి*.


*వీటికి బలం, వ్యాయం కలిగించి ఉత్తేజ పరచడమే ఆచమనం ప్రక్రియ. సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది*.

*ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు*. *శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఆచమనం పద్దతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది*.


*“కేశవాయ స్వాహా” అనడంలో ఆంతర్యమేమిటి అంటే అది గొంతునుండి వెలువడుతుంది. ఇక “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది*.

*చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదాలు మాత్రమే పలుకుతాయి*. *ఆచమనం ద్వారా గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది*

.

*ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలుగవచ్చు. మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది*.


*చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది*

.

*ఉద్దరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి*

.

*ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట..*!🙏

రసవాద విద్య

 రసవాద విద్య  -  మూలికలతో  బంగారం చేయు విద్య 


         ప్రాచీన కాలంలో వనమూలికలు తోను , పాదరసంతోను కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ప్రతీతి. 10 వ శతాబ్దంలో కృత్రిమంగా బంగారం రూపొందించే ప్రక్రియ వ్యవహారంలో ఉండేది . 11 వ శతాబ్దంలో ఆల్బెరూని అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడ సిద్దులు బంగారం తయారుచేసేవారని పేర్కొన్నాడు నాగర్జునికి ముందు, తరువాత కూడా ఎన్నొ గ్రంథాలలో బంగారం తయారుచేసే పద్దతులు, ప్రస్తావనలు ఉన్నాయి .దేశంలో కరువుకాటకాలు సంభవించినప్పుడు రసాయనాచార్యులు కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ఆ బంగారం వల్ల ప్రజలు ఆకలిచావుల నుంచి రక్షించబడే వారు అని అనేక గ్రంథాలలో ఉంది.


                  రాగి మొదలయిన చవుక లోహాలని సువర్ణం గా మార్చే విద్య ని రసవాద విద్య అని అంటారు. కొన్ని ప్రదేశాలలో " స్వర్ణ కరణి " పగార విద్య అని కూడా అంటారు. ఈ విద్యని ఉర్దూ భాషలో " కీమియా " అని , ఇంగ్లీషు భాషలో "ఆల్కెమీ " అని అంటారు.  ఆధునిక పరిశొధకులు బంగారం పదార్దం కదా ! దానిని సృష్టించుట యేమి అంటారు.పిచ్చి అనికూడా అంటారు.


          రసవాద విద్య ప్రకారం నీచ లోహాన్ని ఉత్తమలోహంగా మార్చే ఒక వస్తువుని " పర్శవేది " అంటారు. ఈ పరుశవేది రాయి అని, ద్రవపదార్ధం అని, గడ్డిలాంటిది అని తర్జనభర్జన చేసిన వారిలొ మనదేశియులే కాక " బ్రవున్ దొర " లాంటి విదేశీయులు ఉన్నారు .  రసవాద విద్యలో పాదరసాన్ని శుద్ది సంస్కార విధానాలతో ప్రభావితం చేసి చవుకలో బంగారంగా మార్చడం మరొక సామెత కూడా ఉంది. ఇతర విదానాలతో స్వర్ణం చేయడం సిద్ధించక బ్రష్టుడై పిచ్చివాడు కావొచ్చేమో కాని రసవాద విద్యలో భ్రష్టుడైనా ఫలితం ఉంటుంది. ఎందుకంటే రసవాద విద్య తెలిసినవాడు అనేక ములికలుపైన పరిశోదిస్తాడు కావున ఒక మంచి వైద్యంలో శ్రేష్టుడు అవుతాడు. అయితే ఆదునిక పరిశొధకులు అన్నట్లు బంగారం ఒక మూల పదార్దం ( ఎలిమెంట్ ) అణు సంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 సూచికా అన్నం A U కాంతి  లొహ సమ్భన్ధమైనధి. 


        రసవాద విద్య నందు ఆరితేరిన వారిలొ ఆదిమ చంద్రసేనుడు, లంకేశ్వరుడు ( రావణుడు )  మత్తమాన్డవ్య ఇంద్రధత్త కలంబి, నాగార్జునుడు , రుశిశృంగ, రసేన్ద్రతిలక, భాలుకి, మైధిల హరీశ్వర మొదలుగా గల 27 మహామహుల చేత ను , సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్బాట  చార్యుడు , వేమనయోగి ముఖ్యులు . 


  మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   

*శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్

 *శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్*


*రేపు జూన్ 14 బుధవారం యోగినీ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ ఆధ్యాత్మిక గ్రూపు సభ్యులకు ప్రత్యేకంగా...*


*ప్రతి ఒక్కరూ పారాయణం చేయవలెను, పారాయణం అనంతరం మా వాట్సాప్ నెంబర్ కి తెలియజేయగలరు.*


🌺🌺🌺 *శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్* 🌺🌺🌺


ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥


యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతం ।

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥


పూర్వ పీఠికా

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం ।

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ॥ 3 ॥


వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 4 ॥


అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।

సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥


యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ ।

విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥


ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే ।


శ్రీ వైశంపాయన ఉవాచ

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।

యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥


యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణం

స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం ॥ 8 ॥


కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।

కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ ॥ 9 ॥


శ్రీ భీష్మ ఉవాచ

జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం ।

స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః ॥ 10 ॥


తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ।

ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ॥ 11 ॥


అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం ।

లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ॥ 12 ॥


బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం ।

లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13 ॥


ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధిక తమోమతః ।

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥ 14 ॥


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః ।

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం । 15 ॥


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం ।

దైవతం దేవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా ॥ 16 ॥


యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ।

యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే ॥ 17 ॥


తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే ।

విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహం ॥ 18 ॥


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ॥ 19 ॥


ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ॥

ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ॥ 20 ॥


అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః ।

త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ॥ 21 ॥


విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం ॥

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం ॥ 22 ॥


🌺🌺🌺పూర్వన్యాసః🌺🌺🌺


అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ॥

శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః ।

అనుష్టుప్ ఛందః ।

శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా ।

అమృతాంశూద్భవో భానురితి బీజం ।

దేవకీనందనః స్రష్టేతి శక్తిః ।

ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః ।

శంఖభృన్నందకీ చక్రీతి కీలకం ।

శారంగధన్వా గదాధర ఇత్యస్త్రం ।

రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం ।

త్రిసామాసామగః సామేతి కవచం ।

ఆనందం పరబ్రహ్మేతి యోనిః ।

ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ॥

శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం ।

శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః ।


🌺🌺 కరన్యాసః 🌺🌺


విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః

అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః

బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః

సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః

నిమిషోఽనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః

రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః


🌺🌺 అంగన్యాసః 🌺🌺


సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః

సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా

సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్

త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం

రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్

శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్

ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః


🌺🌺 ధ్యానం 🌺🌺


క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం

మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః ।

శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః

ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః ॥ 1 ॥


భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే

కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।

అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః

చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥


ఓం నమో భగవతే వాసుదేవాయ !


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం ।

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥ 3 ॥


మేఘశ్యామం పీతకౌశేయవాసం

శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగం ।

పుణ్యోపేతం పుండరీకాయతాక్షం

విష్ణుం వందే సర్వలోకైకనాథం ॥ 4 ॥


నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।

అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥ 5॥


సశంఖచక్రం సకిరీటకుండలం

సపీతవస్త్రం సరసీరుహేక్షణం ।

సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం

నమామి విష్ణుం శిరసా చతుర్భుజం । 6॥


ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి

ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం ॥ 7 ॥


చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ॥ 8 ॥


🌺🌺 పంచపూజ 🌺🌺


లం - పృథివ్యాత్మనే గంథం సమర్పయామి

హం - ఆకాశాత్మనే పుష్పైః పూజయామి

యం - వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి

రం - అగ్న్యాత్మనే దీపం దర్శయామి

వం - అమృతాత్మనే నైవేద్యం నివేదయామి

సం - సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి


🌺🌺🌺 స్తోత్రం 🌺🌺🌺


హరిః ఓం


విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥


పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।

అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥


యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥


సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥


స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।

అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥


అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6 ॥


అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।

ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ॥ 7 ॥


ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥


ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥


సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।

అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥


అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।

వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥


వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।

అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥


రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।

అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥


సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥


లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।

చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥


భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః ।

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥


ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।

అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥


వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥


మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥


మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥


మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥


అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।

అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥


గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।

నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥


అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥


ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।

అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥


సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।

సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥


అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥


వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥


సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥


ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।

ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥


అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।

ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥


భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।

కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥


యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।

అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥


ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥


అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।

అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥


స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।

వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥


అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥


పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।

మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥


అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।

సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥


విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।

మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥


ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥


వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।

పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥


రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః ।

వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥


వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥


ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।

ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥


విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం ।

అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥


అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః ।

నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥


యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ॥ 48 ॥


సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।

మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥


స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥


ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥

అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥


గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥


ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।

శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥


సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥


జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః ।

అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥


అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।

ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥


మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।

త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥


మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥


వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥


భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః ।

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥


సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।

దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥


త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।

సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥


శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।

గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥


అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥


శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ॥ 65 ॥


స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।

విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥


ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥


అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।

అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥


కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥


కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।

అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥


బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥


మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।

మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥


స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥


మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥


సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥


భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥


విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥


ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం ।

లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥


సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।

వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥


అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥


తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥


చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।

చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥


సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥


శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।

ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥


ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।

అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥


సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।

మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥


కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।

అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥


సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।

న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥


సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।

అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥


అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥


భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।

ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥


ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।

అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92 ॥


సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥


విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।

రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥


అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।

స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥


అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥


అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః ।

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥


ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥


అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥


అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥


ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥


ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥


భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥


యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।

యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥


ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।

దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥


శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః ।

రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥


శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।


వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।

శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥


శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।


🌺🌺 ఉత్తర పీఠికా 🌺🌺


ఫలశ్రుతిః

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।

నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥


య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥

నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ॥ 2 ॥


వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥


ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।

కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజాం। ॥ 4 ॥


భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।

సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ 5 ॥


యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ ।

అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥ 6 ॥


న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।

భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥ 7 ॥


రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ ।

భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥ 8 ॥


దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమం ।

స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 9 ॥


వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।

సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం। ॥ 10 ॥


న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ।

జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 11 ॥


ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః ।

యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 12 ॥


న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।

భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ 13 ॥


ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః ।

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 14 ॥


ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసం ।

జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరం। ॥ 15 ॥


ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।

వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ 16 ॥


సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ।

ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 17 ॥


ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః ।

జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం ॥ 18 ॥


యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ ।

వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥ 19 ॥


ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।

త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥ 20 ॥


ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం ।

పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21 ॥


విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం।

భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవం ॥ 22 ॥


న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।


అర్జున ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।

భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ 23 ॥


శ్రీభగవానువాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।

సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥ 24 ॥


స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।


వ్యాస ఉవాచ

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం ।

సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ 25 ॥


శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ।


పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం ।

పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥ 26 ॥


ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 27 ॥


శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।


బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 28 ॥


శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।


సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 29 ॥


శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। ॥ 30 ॥


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 31 ॥


ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।

సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ 32 ॥


కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।

కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 33 ॥


యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్

తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ।

విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ

న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥


ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి, మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రం నామైకోన పంచ శతాధిక శతతమోధ్యాయః ॥

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తం ॥

ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ॥



🙏

దత్తాత్రేయుడి అవతారం

 "దత్తాత్రేయుడి అవతారం ఏ యుగంలోనిది? ఆయన తత్వం సామాన్యులకు అర్థం కాదంటారు. ఎందుకు?

శ్రీ దత్తాత్రేయులవారు అత్యంత ప్రాచీన భగవదవతారమన్నది ఒక్కటియే మనకు తెలియును. ఎప్పటి అవతారమో ఖచ్చితముగా చెప్పలేము. ఒక్కొక్క సంప్రదాయము ఆయనను ఒక్కొక్క విధముగా వర్ణించును. కొన్ని చోటులలో ఆయనను బ్రహ్మవిష్ణు మహేశ్వరుల సమ్మిళిత రూపముగా చెప్పిరి. వ్యక్తిగతముగా నా యెంచిక కూడ అదియే.

మఱికొన్నిచోటులందు ఆ విధముగా కాక ఒక ఋషిగా వర్ణించిరి. అందుచేత ఆయన స్వయంకృషి చేత భగవత్ స్థితిని అందుకొన్న గొప్ప సాధకుఁడని కొందఱు తలఁచిరి. పరమార్థమున ఏదైనను ఒకటియే. ఎందుకనఁగా ప్రతి సద్గురువు భగవంతుఁడే. తదన్యుఁడు కాఁడు. అయితే శ్రీ దత్తులు లోకోద్ధరణార్థము అవతారములెత్తుచుండుటయు, మిగితా ఋషులు ఎత్తకుండుటను బట్టి ఆయన ఋషుల కన్నను మిక్కిలి ఉన్నత స్థాయివాఁడని తెలియుచున్నది. ఆయనకు చావు లేదు. విసుగు, విరామము లేక భూమండలమంతట తిరుగుచునే ఉండును.

ఆయన స్థాయి వేఱు. మన స్థాయి వేఱు. కనుక శ్రీ దత్తుల తత్త్వము మనకు గహనమగుటలో ఆశ్చర్యము లేదు. శ్రీ దత్తుల అనుగ్రహము కలిగినప్పటి నుండి అనేక మంది దేవతలు తమంతట తామే సాక్షాత్కరింప సాఁగెదరు. ఆయన అనుగ్రహము తగ్గినచో ఎవఱును పలుకరు. కనుక ఆయన దేవతల మీఁద సైతము అధికారి అని తెలియుచున్నది. ఆయన దయామయుఁడే. కాని అదే సమయములో భక్తుల మంచి నడవడిక విషయములో రాజీ లేనివాఁడు. భక్తులు ఆర్తితో వేఁడినచో వారి నొసట బ్రహ్మ వ్రాసిన వ్రాతను కూడ తుడిపివేసి తన స్వంత వ్రాత వ్రాసి ఉద్ధరింపఁగల సమర్థుఁడు. ఎంతటి మహాపాపముల నైనను రద్దుచేయఁగల శక్తిమంతుఁడు. ఆయన నిర్ణయములకు యముఁడు, బ్రహ్మ కూడ తలయొగ్గి తీరవలెనన్నచో - ఆయన స్థితి ఏమిటి? ఆయన ఎవఱు? అన్నది చదువరుల నిర్ణయమునకే వదలిపెట్టుచున్నాను.

జన్మయే సార్థకం.

 .

                     _*సుభాషితమ్*_


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*ధిక్ తస్య జన్మ యః పిత్రా*

*లోకే విజ్ఞాయతే నరః।*

*యత్పుత్రాత్ ఖ్యాతిమభ్యేతి* 

*తస్య జన్మ సుజన్మనః॥*


*-- _మార్కణ్డేయపురాణమ్_ --1.101--*


తా𝕝𝕝

ఏ పుత్రుడు, తండ్రి యొక్క ఖ్యాతి చేత లోకానికి తెలియబడుచున్నాడో అతడి జన్మ వ్యర్థం. ఏ తండ్రి, పుత్రుడియొక్క జన్మ వలన కీర్తించబడుతున్నాడో ఆ తండ్రి జన్మయే సార్థకం.

వసుచరిత్రలో సవతుల కయ్యం



వసుచరిత్రలో సవతుల కయ్యం!


శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ

నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో

గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా

సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.


వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !


ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.

బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.


ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!


" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని

ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!

ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా,  శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.


కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము

ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!


అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.


ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)

వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!

                            .స్వస్తి!

🌷

 నాచన సోమనాథుని

కవితాశిల్పం!


 ‘ఉత్తర హరివంశం’లోని ఈ పద్యశిల్పంఅనల్పం. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకపోయినవారు ప్రబంధక కవులు!


మొల్ల తెనాలి రామకృష్ణులు ఈ చమత్కారాన్ని అందిపుచ్చుకున్నారు


తెనాలి రామకృష్ణకవి పేరడి


ఆతుకూరిమొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన తెలుగు కవయిత్రి. ఆమె కృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించినప్పుడు రాయలవారిని ఈ క్రిందిపద్యం తో ప్రస్తుతించింది. 


"అతడు గోపాలకుం డితడు భూపాలకుం, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,


పల్లెకాతండు పుట్టణ ప్రభువీతండు

స్త్రీల కాతండు పద్మినీ స్త్రీల కితడు

సురలకాతండు తలప భూసురులకితడు

కృష్ణుడతండు శ్రీమహాకృష్ణుడితడు"

                        మొల్ల;


శ్రీకృష్ణునకు - కృష్ణరాయలకు మధ్య ఉండే తేడాలను చూపిస్తు శ్రీకృష్ణునికన్నా కృష్ణదేవరాయలే మిన్న అని నిరూపిస్తున్న చాటుపద్యం ఇది.


మొల్ల పద్యాన్ని విన్న వికటకవి తెనాలిరామకృష్ణుడు తనసహజధోరణిలో దానిని అనుకరిస్తూ ఈ క్రిందిపద్యం చెప్పాడని అంటారు.


 బహుశః ఇదే మొట్టమొదటి పేరడి పద్యమేమో. 


ఈశ్వరునితో ఎద్దుని పోలుస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి.


అతడంబకు మగం డితడమ్మకు మగండె, లమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడమ్మున నేయు నితడు కొమ్మున డాయు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,


దాతయాతండు గోనెల మోత యితడు

దక్షుడాతండు ప్రజల సంరక్షుడితడు

దేవుడాతండు కుడితికి దేవుడితడు

పశుపతి యతండు శ్రీమహ పశువితండు


బాగుంది కదా!మొల్లపద్యాన్ని హేళనచేద్దామనుకున్నాడు.కానీ,

మొల్లపరిమళం దీనికి వచ్చిందా?


అభ్రంకషంబైన యాలపోతునీతండు

    త్రుంచినాడీతండు పెంచినాడు


సాధు సమ్మతముగా సామజంబునితండు

    గాచినాడీతండు త్రోచినాడు


బహిర్ముఖార్థమై పర్వతేశునీతండు 

    దాల్చినాడీతండు వ్రాల్చినాడు


ఫణపరంపరతోడి పన్నగంబు నీతండు

    మెట్టినాడీతండు సుట్టినాడు


నేడు నాడును నాడును నేడు మనకు

జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె

ననుచు కొనియాడు సంయమి జనులకొదవె

రజితగిరిమీద హరిహరారాధనంబు


     

 వర్ణించింది హరిహరనాథుణ్ని కదా! అతనెలా ఉన్నాడనుకున్నారు?


 ఒకవైపు భాగమేమో బాగా ఏపుగా ఉన్న- అభ్రంకషం అంటే చాలా ఎత్తయిన- ఆలపోతును చంపిందట, ఇంకో వైపున్న రూపమేమో ఆలపోతును పెంచుకుందట. కృష్ణావతారంలో అరిష్టాసురుడనే- ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుణ్ని సంహరించింది- హరి, ఇక ఎద్దును పెంచుకునేవాడు అంటే- నంది వాహనుడైన హరుడే. అదే రూపంలో ఒకవైపు భాగమేమో సామజాన్ని, అంటే ఏనుగును కాచిందట- రక్షించాడట! ఇది గజేంద్రమోక్ష ఘట్టం. అంటే శ్రీహరి రూపం. మరోవైపు ఏనుగును తోసేశాడట- గజాసురుణ్ని చంపటం. ఈ తలనే వినాయకుడికి అతికించారు. ఇది శివరూపం. ఆ మూర్తిలో ఒకభాగం పర్వతేశుణ్ని దాల్చిన రూపమట! ఇది గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడిది. ఇంకోవైపు పర్వతాన్ని- అది మేరుపర్వతం, చేతిలోకి విల్లుగా చేసుకున్న శివుడిది. పడగల వరుసతో ఉన్న పన్నగాన్ని ఒకాయనేమో మెట్టాడట- ఆయన శేషతల్పం మీద పవళించిన హరి, ఇంకొకాయనేమో భుజంగాన్ని చుట్టుకున్నాడట- ఆయన కైలాసాధీశుడైన హరుడు! ఇద్దరూ కలిసిందే హరిహర రూపం. ఈవిధంగా రజతగిరి మీద హరిహరారాధనం చేసే భాగ్యం మనకు దక్కించాడు సోమన. 

      రెండు మూర్తులు కలిసిన రూపాన్ని, రెండు అవతారాలకు సమానంగా ఉండే అంశాలతో పోలికపెట్టాడు నాచన సోమన. అంతేనా సంస్కృత మణులు, తెలుగు పగడాలను ఒడుపుగా ప్రయోగించి మణిప్రవాళంలో రచించాడు. శివకేశవులకు ఇలా అభేదం చెప్పడంలో సోమన చూపిన ప్రతిభ అసామాన్యం కదూ!!రసజ్ఞభారతి.సౌజన్యంతో-


 నచికేతుడు,తెలిసికొన్నఆత్మ రహస్యం!


  (ఇది గహనమైన వేదాంతం ఇష్టమైనవారు చదవండి)


  నచికేతుడు చిన్నవాడు. తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు. 


      గౌతముడు “విశ్వజిత్‌” అన్న యజ్ఞం చెయ్యాలనుకున్నారు. యజ్ఞం చెయ్యడానికి సమస్తం దానం చెయ్యాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమయిన, నిరుపయోగమయిన ముసలి గోవుల్ని దానం చేశాడు.


          స్వర్గ సుఖాల్ని ఆశిస్తూ పనికిరాని ముసలి పశువుల్ని దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడికి నవ్వు వచ్చింది. పైగా అది అనుచితమయిన చర్య అనిపించింది. 


     తన తండ్రిని సమీపించి “నాన్నగారూ! మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్నీ దానం చెయ్యాలి కదా! మీ సంపదలో నేనూ భాగాన్నే కదా! నన్నెందుకు దానం చెయ్యరు?” అన్నాడు.


          గౌతముడు యజ్ఞ కార్యాల్లో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు. కాని నిచికేతుడు పట్టిన పట్టు వదలని వాడు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడినా ఏమీ చెప్పకూడదనే గౌతముడు మౌనంగా ఉన్నాడు.

కానీ నచికేతుడు పట్టువదల్లేదు.


          “నాన్నగారూ! నేను మీకు సంబంధించిన సంపదలో భాగాన్నే కదా! మరి నన్ను ఎవరికి దానం చేస్తారు?’ అని అడిగాడు.


          చిరాకు పడిన గౌతముడు “నిన్ను మృత్యుదేవతకు దానంగా ఇస్తాను” అన్నాడు. అన్నాడే కాని మళ్ళీ ఎందుకామాట అన్నానా? అని గౌతముడు బాధపడ్డాడు.


          నచికేతుడు “మా నాన్న ఎందుకిలా అన్నాడు? మృత్యుదేవతకు నాతో ఏం లాభం? అని విచికిత్సకులోనయ్యాడు. కానీ నాన్న గారి మాట నెరవేర్చాలి” అని తీర్మానించుకుని మృత్యు దేవత దగ్గరకు బయల్దేరాడు. మృత్యు దేవత అంటే యముడే కదా! కాబట్టి యమపురికి బయల్దేరాడు.


           నచికేతుడు వెళ్ళే సరికి యమపురిలో యముడు లేడు. బ్రహ్మను సందర్శించి రావడానికి వెళ్ళాడు. మూడు రోజులకు కానీ తిరిగి రాలేదు. నచికేతుడు మూడు రోజుల పాటు ఎదురు చూశాడు. మూడు రోజులు గడిచాక యముడు వచ్చాడు.


     యముడు దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుణ్ణి చూశాడు. మూడు రోజుల నుంచీ నిరాహారుడివై వున్నందుకు మన్నించు. నీకు ఆతిథ్యం యివ్వ లేకపోయినందుకు అన్యథా భావించకు “దానికి పరిహారంగా, నీకు మూడు వరాలిస్తున్నాను, కోరుకో” అన్నాడు.


          నచికేతుడు “యమధర్మరాజా! నువ్వు చెప్పినట్లే మూడు వరాలు కోరుకుంటాను. వీటిల్లో మొదటిది నా తండ్రికి సంబంధించింది. ఆయన నేను వెళ్ళేసరికి ఆగ్రహంతో వుండకుండా, సౌమ్యంగా, ప్రేమగా నన్ను స్వీకరించేలా చేయి” అన్నాడు.


          యముడు “నచికేతా! తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నా” అన్నాడు.


          నచికేతుడు “ధన్యవాదాలు. ఇక రెండో కోరిక స్వర్గంలో మృత్యు భయముండదు, వృద్ధాప్యముండదు, భయముండదు, దుఃఖముండదు, ఆకలి దప్పలుండవు. అట్లాంటి స్వర్గాన్ని అందుకునే మార్గం “అగ్ని చయనం” అన్న యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు. నాకు ఆ “అగ్నిచయన” క్రతువు గురించి వివరించు” అన్నాడు. యముడు “తప్పక వివరిస్తాను” అని స్వర్గ ప్రాప్తినిపొందే అగ్నిచయన క్రతువు గురించి వివరించాడు.


          నచికేతుడు “నా పై దయతో రెండు వరాలని ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. మీకు రుణపడి ఉన్నాను. ఎప్పటి నించో నన్ను వేధిస్తున్న సమస్య వుంది. దానికి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని నమ్మకంతో వున్నాను” అన్నాడు.


          యముడు “తప్పక  నాకు వీలయితే చెబుతాను” అన్నాడు.


          నచికేతుడు “యమధర్మరాజా! మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడు? శరీరానికి వేరుగా ఆత్మ వున్నదని, శరీరం నశించిపోయినా ఆత్మవుంటుందని కొందరంటారు. కొందరు ఆత్మ లేదంటారు? ఈ విషయానికి సంబంధించిన నిజానిజాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే మిమ్మల్ని కోరే మూడోవరం” అన్నాడు.


          అతని ప్రశ్నతో యముడు నిరుత్తరుడయ్యాడు. “నచికేతా! ఆత్మ చర్చ అతి గహనమయింది. సూక్ష్మమయింది. ఈ విషయంలో దేవతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. నీకు ఇతర భౌతికానందాలు, స్వర్గ సుఖాలు ఎన్ని కావాలన్నాయిస్తాను. ఇది తప్ప ఇంకేదయినా వరం కోరుకో” అన్నాడు.


          ఎంత చెప్పినా నచికేతుడు పట్టు వదల్లేదు. చివరికి అతని పట్టుదలకు సంతోషించి యముడు “నచికేతా! మనిషికి రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయోమార్గం రెండోది ప్రేమోమార్గం. మొదటిది నివృత్తి మార్గం, రెండోది ప్రవృత్తి మార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు. నిర్మలమయిన నిగ్రహముంటే జనన మరణ చక్రమనే పునరావృతమయ్యే మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు. అట్లా ఆత్మని అన్వేషించే, ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా వుంటారు.


          సృష్టి మొదలయినప్పటి నుండి ఆత్మ మనసుతో, ఇంద్రియాలతో బాహ్యమయిన వస్తువులతో, బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది. అంతర్ముఖుడయిన వాడు మేలుకుని వున్నపుడు, నిద్రిస్తున్నపుడు కూడా అన్నిటి పట్ల సాక్షీ భూతుడుగా వుంటాడు. తనని తాను తెలుసుకుంటాడు.


          ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు. అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. అనంత ఆనంద కేంద్రంలో వుంటాడు.


          ఆత్మ అనంత వ్యాప్తం. ఆత్మని మాటల్లో వర్ణించలేం. చేతుల్తో తాకలేం. కళ్ళతో చూడలేం. నాలికతో రుచి చూడలేం. వాసన చూడలేం. తర్కానికి ఆత్మ అందదు. అది ఆది మద్యాంత రహితం, రూపరహితం. అది అణువు కన్నా చిన్నది, విశ్వం కన్నా విశాలమైంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువుని జయిస్తాడు.


       నచికేతా! జీవులు నిద్రపోయేటప్పుడు కూడా తాను మేలుకొని ఉండి, అనేక విషయాలను నిర్మిస్తూ, నిత్యమై, శుద్ధమై ఉండేదే పరబ్రహ్మం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి. దానిని దాటి ఎవరూ పోలేరు. ఆత్మ అంటే ఇదే. ఒకే అగ్ని వేర్వేరు కట్టెలలో వెలుగుతున్నట్టు ఆత్మ జీవులందరిలో వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. వాటికి భిన్నంగా కూడా ఉంటుంది. ఒకే వాయువు జీవులలో ప్రవేశించి వివిధ రూపాల్లో కనబడుతున్నట్టు అందరిలో ఉన్న పరమాత్మ భిన్నరూపాల్లో దర్శనం ఇస్తున్నాడు.


     లోకానికి అంతటికీ నేత్రంగా ఉన్న సూర్యుడు ఆ చర్మచక్షువుల రాగద్వేషాలకు అతీతంగా ఉన్నట్టు అందరిలో ఉన్న ఆత్మ స్వచ్ఛమై నిర్మలమై ఉంటుంది. 


   పరమాత్మ సకల జీవుల అంతరాత్మగా ఉంటూ భిన్నరూపాల్లో కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానులకు శాశ్వతానందం కలుగుతుంది. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిత్యమైన వాటిల్లో నిత్యంగా, చేతనాల్లోని చైతన్యంగా ఉండే పరమాత్మను తమ ఆత్మలో దర్శించగలిగిన ధీరులు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు.


     గురువర్యా! యమధర్మరాజా! నువ్వు చెప్పినట్టు రుషులు పొందే అనిర్వచనీయమైన ఆ పరమానందాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? అది స్వయంప్రకాశమా? మరొక వెలుగులో కనిపిస్తుందా?


  నచికేతా! అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మెరుపులు ఎవరూ ప్రకాశించరు. పరమాత్మ వెలుగులోనే ఇవన్నీ ప్రకాశిస్తాయి. 


    సనాతనమైన ఈ రావిచెట్టు వేళ్లు పైకి, కొమ్మలు కిందికీ వ్యాపించి ఉంటాయి. ఇదే పవిత్రమూ, శాశ్వతమూ అయిన పరబ్రహ్మం. ఎవరైనా ఏదైనా దీంట్లోనే ఉన్నాయి. ఇదే ఆత్మ, పరమాత్మ నుంచే సకల ప్రపంచం ప్రాణాన్ని పొంది మళ్లీ దానిలోకే లీనమౌతోంది. 


     పెకైత్తిన వజ్రాయుధంలా ఆత్మ మిరుమిట్లు గొలుపుతూ భయపెడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్నవారు జనన మరణాలకు అతీతంగా అమృతత్వాన్ని పొందుతారు. 


         నాయనా! భయంతోనే అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, మృత్యువు అందరూ తమ బాధ్యతలను నిర్వహించడానికి పరుగెత్తుతున్నారు.


         ఆ పరబ్రహ్మాన్ని శరీరం నశించకముందే దర్శించగలిగిన మానవుడు బంధాలనుంచి విముక్తుడు అవుతాడు. లేకపోతే జన్మలు తప్పవు.


       లోపల ఉన్న పరమాత్మ  పితృలోకంలో స్వప్నంలా, గంధర్వలోకంలో నీటిలో ప్రతిబింబంగా, బ్రహ్మలోకంలో వెలుగునీడలుగా కనిపిస్తుంది. ఇంద్రియాల విభిన్నతనూ, వృద్ధిక్షయాలనూ తెలుసుకొన్న ధీరుడు దేనికీ దుఃఖించడు.


        ఇంద్రియాలకన్నా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉత్తమం. బుద్ధికంటే విశ్వాత్మ, దానికంటే అవ్యక్త ప్రకృతి శ్రేష్ఠం. అవ్యక్త ప్రకృతి కంటే సర్వవ్యాపకుడూ, స్త్రీ పురుషాదిలింగరహితుడూ అయిన పరమపురుషుణ్ణి తెలుసుకోగలిగిన ప్రాణికి అమృతత్వం లభిస్తుంది. 


      ఆ పరమ పురుషునికి ఏ కోపమూ లేదు. కంటికి కనపడడు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధికి మాత్రమే కనపడతాడు. చూడగలిగిన వారికి జననమరణాలు ఉండవు.


        నచికేతా! మనస్సుతో సహా అయిదు జ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం)ఆత్మల్లో స్థిరమైనప్పుడు, బుద్ధి నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ‘పరమపదం’ అంటారు.


    ఇంద్రియాలను స్థిరంగా నిగ్రహించుకోవడమే ‘యోగం’. యోగి మనోవికారాలను అప్రమత్తతతో గెలుస్తాడు. యోగంలోనుంచి ఏ క్షణంలోనైనా పతనం కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. 


      ఆత్మను మాటలతో, కళ్లతో, మనస్సుతో చూడలేరు. అది ఉన్నదని తెలుసుకున్న వారి ద్వారానే తెలుసుకోగలరు. ‘అస్తి’ ‘నాస్తి’ అనే రెండు పదాల్లోనూ ‘అస్తి’ఉంది. అది తెలుసుకున్నవారికి తత్త్వ దర్శనం అవుతుంది.


       మానవుడు ఎప్పుడు కోరికలను నశింపజేసుకుంటాడో అప్పుడు మరణం ఉండి కూడా లేనివాడు అవుతాడు. శరీరం ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతాడు.

మానవుడు జీవించి ఉండగానే బంధాలను ఛేదించుకుంటే మరణం లేనివాడు అవుతాడని వేదాంతం బోధిస్తోంది. 


      మానవ హృదయంలో నూటొక్క గదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తలలోకి ప్రయాణిస్తుంది. దానిద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలిన నాడులు శరీరంలో అన్ని వైపులకి ప్రయణిస్తూ  అంతరించిపోతాయి. 


         బొటనవేలు పరిమాణంలో అన్ని ప్రాణుల్లోనూ ఉండే ఆత్మ గురించి మానవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే జంతువులలో నరజన్మ శ్రేష్ఠం. 


    ధీరుడైనవాడు వివేకంతో అంతరాత్మను దర్శించగలగాలి. అంతరాత్మయే స్వచ్ఛమూ, శాశ్వతమూ అని తెలుసుకున్న వాడు పవిత్రుడూ, శాశ్వతుడూ అవుతాడు. ఇదే బ్రహ్మవిద్య. బ్రహ్మజ్ఞానం.


       ఈవిధంగా యమధర్మరాజు చెప్పినదంతా శ్రద్ధగా విన్న నచికేతుడు నిర్మలుడై, మృత్యువును జయించి పరబ్రహ్మత్వాన్ని పొందాడు. 


         నచికేతుణ్ణి ఆదర్శంగా తీసుకుని కఠోపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానాన్ని గురువు సన్నిధిలో శ్రద్ధగా అధ్యయనం చేసి, అభ్యసించి, అనుభూతిని పొందినవారు జీవన్ముక్తులై బ్రహ్మజ్ఞులు అవుతారు.


ఓం సహనావవతు, సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు,

మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతి శాంతిః


ఓం నమః శివాయై చ నమః శివాయ !🙏🙏🌷👌🙏🙏

శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం

 🕉 మన గుడి : 


⚜ కడప జిల్లా : వెల్లాల


⚜ శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం.



💠 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపంలో గల వెల్లాల గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయం చాల పురాతనమైన మరియు శక్తి వంతమైన దేవాలయం . 

ఈ దేవాలయాన్నే సంజీవరాయ స్వామి దేవాలయం అని కూడా అంటారు 


💠 శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ‘వెల్లాల’ ఒకటి. 


💠 ఆంజనేయస్వామి సంజీవ పర్వత ప్రదేశానికి వెళ్తూ.. మార్గ మద్యలో ఆగి నదిలో స్నానమాచరించి సూర్య భగవానుని ఆరాధించిన ప్రదేశంలో వెలసిన మహిమాన్విత అలయమే శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం..


💠 ఇక్కడ హనుమంతుడు ‘సంజీవ రాయుడు’ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. 


⚜ స్థలపురాణం ⚜


💠 రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు..... సాయంత్రం అయ్యేసెరికి స్వామి వారు సంద్యా వందనం కోసం ఇక్కడ కుందూ నది  దగ్గర ఆగి ఆ నదిలో స్నానం చేశారు... అందువలన ఆ గుండానికి హనుమంతు గుండం అనే పేరు వచ్చింది.

గుండం దగ్గర రాతిమీద స్వామివారి పాదముద్రలు కనిపిస్తాయి.


💠 అక్కడ నది దగ్గరలో  ఉన్న మహర్షులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఆ అంజనేయస్వామి వారిని మీరు కాసేపు ఇక్కడ వుండమనగా,ఆ స్వామి వారు నేను  ‘వెళ్లాలి .. వెళ్లాలి’ అంటూ హనుమంతుడు ఆతృతను కనబరిచారు. 

అందువలన ఈ గ్రామానికి ‘వెల్లాల’ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు చెబుతుంటారు. 


💠 మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో కడప రాజ్యాన్ని పాలించిన  ‘హనుమంత మల్లు’ అనే రాజు  ఒకసారి వేటకు కుందూ నది సమీపంలో వెళ్ళారు.. వేట కు  వచ్చిన రాజు కు.. ఆరోగ్యం సహకరించలేదు

ఆరోగ్యం  బాగాలేక కొన్ని రోజులు ఈ అడవిలోనే కుందూ నది పరిసర ప్రాంతంలోనే నివాసం ఉన్నారు..


💠 ఆ రాజుకి   శ్రీ ఆంజనేయ స్వామి వారు కలలో కనపడి ..నేను ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నాను...నాకు ఒక ఆలయం కట్టించు అని చెప్పారు...దానికి ఆ రాజు అడవి అంత గాలించారు..చివరికి ఒక 3 అడుగుల స్వామి వారి రూపం దొరికింది..స్వామి వారి రూపం దొరకగానే ఆ రాజు ఆరోగ్యం బాగైంది..దాంతో

రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. 


💠 15 శతాబ్దం లో 3 అడుగులు ఉన్న విగ్రహం దినదినాభివృద్ది  పెరుగుతూ ఇప్పటికీ 16 అడుగులకు(సుమారుగా) చేరింది..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూపం పెరుగుతూ వచ్చింది..


💠 ఈ ఆలయంతో పాటు ఇక్కడ 

 శ్రీ చెన్నకేశవస్వామి, 

 శ్రీ భీమలింగేశ్వరస్వామి, 

 శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలు ఉన్నవి. 

ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులు కొలువుదీరినా సంజీవరాయునికున్న వైభవం చాలా గొప్పది.


💠 సంజీవరాయుని దర్శనం కోసం ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. గ్రహదోషాలను తొలగిస్తాడని, దీర్ఘవ్యాధి బాధలనుండి దూరంచేస్తాడని, కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం.


💠 ఇక్కడ నిత్య పూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. హనుమ జయంతి నాడు ప్రత్యేక ఉత్సవాలను జరిపిస్తారు.


💠 ప్రొద్దుటూరు నుండి 24 km, కడప నుండి 75km , అళ్ళగడ్డ నుండి 28 km, మైదుకూరు నుండి 40km

మోక్షపదం

 🔆🪷🔆🪷🔆🪷🔆🪷🔆

పదమూడో శతాబ్దంలో  జ్ఞానదేవ్ మహారాజ్ అనే సాధువు, కవి ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్షపదం. 


తెలుగులో పరమ పధ సోపాన పఠం  లేదా వైకుంఠ పాళీ అంటారు.


చిన్నతనంలో మనం అంతా కూడా వైకుంఠ పాళీ అడే ఉంటాం.


మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇంగ్లిషోడి కన్ను ఈ మోక్షపదం పై పడింది.


 ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వాడు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసాడు..


వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటు లోకి రావడం.


అలా మోక్ష పదం కాస్తా వైకుంఠపాళి గా రూపాంతరం చెందింది.


పాత కొత్త ఆటలో వంద చతురస్రములు ఉంటాయి.., తేడా వొచ్చి మన కవి ఋషీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో... 


12 వ చతురస్రం అంటే 'నమ్మకం' అని, 

51 వ చతురస్రం అంటే 'విశ్వసనీయత' అని...

57 వ చతురస్రం వొచ్చి 'దాతృత్వాన్ని' సూచిస్తుంది., అలాగే 

76 వ చతురస్రం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది...

78 వ చతురస్రం 'ముని వృత్తి'ని సూచిస్తుంది..


ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చెన ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.


అలాగే 41వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా,

 44 వ చతురస్రంలో పడితే 'అహంకారం' అని, 

49 వ గళ్లోకి పడితే 'అశ్లీలత' అని, 

52 వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 

58 వ గడిలో 'అబద్దలాడుట' అని, 

62వ చతురస్రంలో ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 

69 వ గదిలోకి అడుగు పెడితే 'అప్పుల పాలు' అని,

73 వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని,

 84 వ చతురస్రం లోకి వెళితే 'కోపిష్టి' అని,

 92 వ చతురస్రం 'దురాశ ను' 

95 వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి.. చివరగా 99 వ గడి 'కామాన్ని' సూచిస్తాయి.. 


ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు. 


ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ఋషీశ్వరులు చెప్పకనే చెప్పారు అని తెలుస్తుంది పిల్లలకు.. చెడు మార్గాన్ని ఎంచుకునే వారు అదఃపాతాళానికి చేరుకుంటారు.మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం.. 

100 వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే "మోక్షం"..


ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో, కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి..


ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజజీవితం లోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు.


అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్ర వేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశాడు బ్రిటిషోడు.. కాల మహిమ..

ఈ రోజు పద్యము:

 190వ రోజు: (భౌమ వారము) 14-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


సద్గోష్ఠి సరియు నొసగును 

సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా 

సద్గోష్ఠియె యెనగూర్చును 

సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!


 ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది. 


ఈ రోజు పదము. 

ఆడు చిలుక (Parrot) : కీరి, శుకి.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 90*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️



*పార్ట్ - 90*


రాజసభా భవనం క్రిక్కిరిసిపోయి ఉంది. 


రాజపురోహితులు, మంత్రులు, సేనానులు, సామంతరాజులు, పురప్రముఖులు, పాటలీపుత్ర ప్రజలు తదితరులతో సభాభవనం కిటకిటలాడుతోంది. చంద్రగుప్తుని పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించడానికి యావన్మందీ ఉత్కంఠతో నిరీక్షిస్తున్నారు. చాణక్యుడు తన ఆసనం మీదనుంచి లేచి సభాసదులకు నమస్కరించాడు. అంతవరకూ అక్కడక్కడా వినిపిస్తున్న కొద్దిపాటి గుసగుసలు కూడా నిలిచిపోయి సభాభవనమంటతటా గంభీర నిశ్శబ్దం ఆవరించింది. 


"నన్ను చాణక్యుడంటారు. తక్షశిలా విశ్వవిద్యాలయమునకు అర్థశాస్త్ర అధ్యాపకుడను..." చాణక్యుడు తనని తాను సభకి పరిచయం చేసుకుంటూ "నేడు సుదినం. మగధ మహాసామ్రాజ్య పౌరులూ చిరకాలంగా ఎదురుచూస్తున్న శుభదినం. మీ అభిమాన పాత్రులు, మగధ సార్వభౌములైన స్వర్గీయ మహానందుల వారు కలలు గన్న పర్వదినం..." అని చెప్పగానే యావన్మందీ ఒక్కపెట్టున "జోహార్... మహానంద సార్వభౌమా... జోహార్... జోహార్...." అంటూ శ్రద్ధాంజలులు ఘటించారు. 


చాణక్యుడు చెయ్యెత్తి వాళ్ళని వారిస్తూ "మాగధుల రాజభక్తి లోకోత్తరమని యావత్ ప్రపంచానికి తెలుసు. మీ అసాధారణ ప్రేమానురాగాలు, రాజభక్తి, విశ్వసనీయతలు, ధర్మనిరతులే మరల ఈ నాడు నందవంశజుడైన చంద్రగుప్తునికి ఈ మగధ సింహాసనాధీశుని చేస్తున్నాయి. ఇది మీరు కన్న కల. ఇది మీరు ఆశించిన విజయం. ఇది మీ అందరి అభిమాన వాత్సల్యానికీ, విజ్ఞతకీ నిదర్శనం" అని ఆగాడు. 


ఒక్కసారిగా కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి. ఆ చప్పట్లుహోరు సద్దుమణిగే దాకా ఆగి, గంభీర కంఠస్వరంతో తన ప్రసంగాన్ని కొనసాగించాడు చాణుక్యుడు. 


"నేటి విజయం... యీనాటి మీ ఆనందోత్సాహం శులభసాధ్యం కాలేదు... ఈ విజయం వెనక హృదయవిదారకమైన విషాదం వుంది. ఈ ఆనందం వెనక అసాధారణమైన ప్రయత్నం ఉంది. అదంతా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరవైనాలుగేళ్ళు వెనక్కి వెళితే... మీకు అత్యంత ప్రేమాస్పదుడు, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మీ మహారాజు మహానందుడు అంతు తెలియని దీర్ఘరోగంతో పరిపాలనకు దూరమయ్యారని మీకు తెలియజేయబడింది. కానీ, అసలు జరిగిందేమిటి...? 


మహారాజు నమ్మకంతో చేరదీసిన క్షురకుడు, రాణి సునందాదేవితో చేతులు కలిపి కుట్ర పన్నాడు. మహారాజుకి దీర్ఘరోగం వచ్చిందని పుకార్లు పుట్టించి ఆయన్ని, పట్టమహర్షి మురాదేవితో పాటు ఏకాంత దుర్గంలో నిర్బంధించాడు. పాలకులు లేని రాజ్యం పరరాజు పాలవుతుందంటూ మంత్రులనూ, సేనానులను భయపెట్టి లొంగదీసుకుని తాను మహాపద్మానందుడిగా పేరుమార్చుకుని సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రజల మద్దతు పొందడానికి మహానందుల వారి ద్వితీయ కళత్రం రాణి సునందాదేవిని వివాహమాడాడు. ఎనిమిది నందకుమారులను కన్నాడు. కానీ ... ఆ అక్రమ సంబంధం వల్ల పుట్టిన వాళ్లు నిజమైన నంద వంశజులవుతారా ? సింహాసనానికి అసలైన వారసులవుతారా....?" 


"కారు... కారు..." ప్రజలు పెద్ద పెట్టున ప్రతిస్పందించారు చాణక్యుని ప్రశ్నలకి... ఆర్యుడు మరలా ప్రారంభించాడు. 


"మగధని ఇష్టం వచ్చిన రీతిని ఏలుకున్నారు. ఈ విషయం నిర్బంధంలో ఉన్న మీ మహారాజుకి అనేక సంవత్సరాల తర్వాత తెలిసింది. ఆ గృహనిర్బంధంలో సంవత్సరాల తరబడి తన పట్టమహిషి మురాదేవి తప్ప మరో మానవమాత్రుని ముఖం కూడా ఎరుగక పరితపించిపోయిన మహారాజు  - తనకి క్షురకుడితో కలిసి సునంద చేసిన ద్రోహాన్ని తలుచుకొని కుమిలిపోయాడు. పగతో రగిలిపోయాడు. కానీ ఆ చెరనుంచి బయటపడే మార్గంలేదు. 'ఒకవేళ బయటపడినా, అధికారం చేతుల్లో లేదు. ఎలా ? తానా వార్ధ్యక్యదశలో ఉన్నాడు. తన పగతీరేమార్గం ఏమిటి ? అక్రమనందులతో కలుషితమైన మగధ సింహాసనాన్ని సక్రమ వారసుడిని ఎక్కడి నుంచి తేవాలి... ?' 


మహారాజు రోజుల తరబడి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన పట్టమహిషి, ఆదర్శ ధర్మపత్ని, మహాపతివ్రత అయిన మురాదేవితో సంప్రదించి... ఆ వయస్సులో... తన వంశాన్ని నిలబెట్టడానికి .... తన పగ తీర్చడానికి... తన వారసత్వ సింహాసనాన్ని అధిష్టించగల వారసునికి జన్మనిచ్చాడు... అతనికి చంద్రగుప్తుడని తానే పేరు పెట్టాడు... తన కుమారుని చేత నందులపై పగ తీర్పించమని, అదే తనకి ఆత్మశాంతి కలిగిస్తుందని చెప్పి మహారాణి మురాదేవి చేత ప్రమాణం చేయించుకున్నాడు మహానందుడు. అయితే... నందవంశాకురం జన్మించాడని తెలుసుకున్న సుంకర నందులు మీ మహారాజునీ, మహారాణినీ, వారి కుమారుడినీ హతమార్చడానికి ఆ ఏకాంత దుర్గాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అగ్నిప్రమాదాన్ని సృష్టించి... ఆ ప్రమాదంలో ... ఆ ప్రమాదంలో......." 


ఆ గాధని వింటున్న యావన్మందీ ఒక్కసారిగా బాధతో హాహాకారాలు చేశారు. వాళ్లకి కొద్ది క్షణాలు వ్యవధి యిచ్చి తన హావభావ ప్రకటనా చాతుర్యంతో ఆ కథనాన్ని కొనసాగించాడు చాణక్యుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :22/31

                   SLOKAM :22/31

           

శ్రీ నిత్యనాథుడు 

         

रथ्या चर्पट विरचित कन्थः,

पुण्यापुण्य विवर्जित पन्थः।

योगी योगनियोजित चित्तो,

रमते बालोन्मत्तवदेव॥२२॥

                    ॥भज गोविन्दं॥ 


రథ్యా చర్పట విరచిత కంథః

పుణ్యాపుణ్య వివర్జిత పంథః |

యోగీ యోగనియోజిత చిత్తో 

రమతే బాలోన్మత్తవదేవ ||22||

                    ॥భజ గోవిందం॥ 


    దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; 

    ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, 

    నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు 

  - ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. 


అనువాదం 


తిరుగు దారుల దొరికిన చింపి పేలికలను 

బొంతగ గుట్టి ధరించి మనసు కతీతుడై 

నిర్వికల్పచిత్తుడు జీవన్ముక్తుడునై 

దిరుగు యోగి, బాలు నున్మాదు బోలి తాను. 


    रथ के नीचे आने से फटे हुए कपडे पहनने वाले, 

    पुण्य और पाप से रहित पथ पर चलने वाले, 

    योग में अपने चित्त को लगाने वाले योगी, 

  - बालक के समान आनंद में रहते हैं॥२२॥


One who 

  - wears cloths ragged due to chariots, 

  - move on the path free from virtue and sin , 

  - keeps his mind controlled through constant practice, 

    enjoys like a carefree exuberant child. 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

మహనీయుల మంచి మాట*

 *మన మహనీయుల మంచి మాట*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                      

*"ఏ పనైనా కష్టపడితేనే పూర్తవు తుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనాముందుకుసాగదు. అడవికి రాజైనసింహానికైనానోరు తెరుచుకునికూర్చున్నoతమాత్రా న ఆహారం దాని నోటి దగ్గరకు రా దు కదా!!."*

   

*"కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు కా నీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రంఖచ్చితంగామారుతుంది."*


*పరుల వల్ల బాధ పడ్డానని చిం తించకు.  నీ వల్లా ఇతరులకు బాధ కలగకుంటే! అదే నీ వ్యక్తి త్వా వికాస మార్గం అవుతుంది*

      

*"లక్ష్యం కోసం అలుపెరగక శ్రమి స్తుంటే! నేడు కాకపోయినా రేపై నావిజయంసాధ్యమవుతుంది."*

       

*" ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నువ్వు ఇబ్బందు ల్లో వున్నావని తెలిసి నీ ఇంటి త లుపు తట్టినవాడే అసలైనబంధు వు..!"*


*"సహనాన్ని మించిన ఆయుధం లేదు. విశ్వాసాన్ని మించిన భద్రత లేదు. నవ్వును మించిన ఔషధం లేదు. ఈ మూడు ఉచితంగానే లభిస్తాయి."*


*"చేసిన తప్పుకు క్షమాపణ అడి గినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగినవా డు బలవంతుడు."*


*"నువ్వునిరుపేదవనిఅనుకోవద్దు,ధనంనిజమైనశక్తికాదు,మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి."*

  

      

*" ప్రపంచంలో నువ్వొకసాధారణ మనిషివే కావచ్చు..!కానీ కనీసం ఒక్కరికైనా నువ్వుప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు..! "*


*ఎవరు ఎంత ఇబ్బంది పడ్డా ప ర్వాలేదు నేను ఆనందం గాఉంటే చాలు అనుకోవడంరాక్షసగుణం*

 

*నావల్ల ఒకరు ఇబ్బంది పడకూ డదు అనుకోవడం దైవగుణం వా రికి భగవంతుడు ఎప్పుడు తోడు గా ఉంటాడు*


        *సర్వేషాంశాన్తిర్భవతు.*

భగవంతుడు

 🍁 *ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....*🍁


✍️


_*భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?*_


*🙏గురువు గారి జవాబు:*

ముఖం మన దగ్గరే ఉంది. 

కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,

అద్దంలో ప్రాణం లేదు, 

కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.


అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం. 

తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, *అదే విగ్రహం ....*


భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు. 

అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి. 

మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....

*అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....*

అందుకే గుడికి వెళ్ళాలి....


🌸 *దైవదర్శనం తరువాత* 🌸


మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.

అది ఏమిటంటే..!


"అనాయాసేన మరణం

వినా ధైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.


"అనాయాసేన మరణం"

*********************

నాకు నొప్పి లేక బాధ కానీ లేని

మరణాన్ని ప్రసాదించు.


"వినా ధైన్యేన జీవనం"

*********************

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,

నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


"దేహాంతే తవ సాన్నిధ్యం"

***********************

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను 

నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.  🌞🌹


"దేహిమే పరమేశ్వరం"

*********************

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు. 


3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా 

ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.ఆధ్యాత్మిక విషయాలు దైవ కార్యక్రమాలు దేవుళ్ల వివరాలు తెలుసు కొనుటకు జాయిన్ బటన్ నొక్కండి 


ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు  చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.👍 మీ 🙏 మీ మల్లేశ్వరరావు 🙏



స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి

 ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట. 

రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ,

అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసి మురిసిపోయేదట.  కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట.  తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట.

ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ అమెతో ఇలా చెప్పాడు దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు, తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరిగించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని😆 

చుట్టుకోవడంలో ప్రేమ లేదు నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.  నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు, నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది అని చెప్పాడట.

కొన్ని స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి.

ఇలాంటి స్నేహితులు కొంత మంది మనతోనే ఉంటారు. మనతోనే తిరుగుతారు. మన బలాలు, బలహీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు.

అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర జాగ్రత్త.🙏🙏🙏🙏🙏😆

సహజ స్థితి

 *శుభోదయం* 

🙏💐🙏💐🙏


*ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎలా దాన్ని పొందాలి?* 


👉 ఆనందం నా సహజ స్థితి అంటున్నారు. మరి, అది నా సహజ స్థితి అయినప్పుడు ఎక్కడో దానికోసం ఎందుకు వెతకాలి? 


👉 ఆనందం కోసం వెతుకుతూ కష్టాలు, కన్నీళ్లు ఎందుకు తెచ్చుకుంటున్నాను?

 

👉 బాధలు, సమస్యలలో ఎందుకు చిక్కుకుంటున్నాను? 


*నిజమే, ఆనందం నా సహజ స్థితి..*


👉 అహం దేహం అనుకుంటే కష్టాలూ, కన్నీళ్ళు, బాధలూ, సమస్యలు.. 


👉 అహం ఆత్మ అనుకుంటే ఉండేది ఆనందం ఒక్కటే.....


👉 అహం దేహంలో స్వార్థం ఉంటుంది.. 

అహం ఆత్మలో నిస్వార్థం ఉంటుంది...

 

👉 అహం ఆత్మగా అనుకోవడం కష్టమైతే, సాధన చెయ్యలేము అనుకుంటే, చాలా సులభతరమైన సాధన ఒకటి చెప్తాను... 

చేస్తారా? 


👉 ఆ సాధనే... ప్రేమను పంచడం...  


👉 *ప్రేమ అనేది భగవత్ స్వరూపము...* 

*అదే కృష్ణ తత్వం...* 


👉 ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే...


*ప్రేమలో స్వార్థం ఉండదు,ఉండకూడదు..*

*ఏదో ఆశించి చూపేది ప్రేమ కాదు...* 


*ప్రేమ అంటే రెండు మనసులు పొందే అనుభూతి, రెండు శరీరాల ఆకర్షణ కాదు..*

 

*ఒక పసివాడి బోసినవ్వు చూడగానే మనలో కలిగే అనిర్వచనీయమైన భావన పేరు ప్రేమ....*


*ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అయ్యో అని అప్రయత్నంగా నీలో కలిగే స్పందన పేరు ప్రేమ...*

 

*అప్రయత్నంగా నీవు చేసే సాయం పేరే ప్రేమ...*

 

*ప్రేమను పంచడంలో నావాళ్లు, పరాయివాళ్లు అనే భేదం ఉండకూడదు.  నీ శత్రువుపైన కూడా కన్న బిడ్డ పట్ల తల్లి చూపే ప్రేమను చూపగలగాలి..*


*ప్రేమలో మృదుత్వం మాత్రమే ఉంటుంది...*


*నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో, ఎదుటి వ్యక్తి పట్ల కూడా అలాంటి భావనను వ్యక్త పరచగలగటమే ప్రేమ...*

 

*ఆ ప్రేమ పేరే ఆనందం*

*ఆ ఆనందమే నా సహజ స్థితి....* 


*ఒక్కసారి ప్రేమను పంచి, ఆ ఆనందాన్ని అనుభవించి చూడండి... ఆ సహజ స్థితిలో ఒదిగిపోయి, ఆ అనుభూతిని మీరే ఆస్వాదిస్తారు.....*  


🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

తెలుసుకోవాలి

 ఈమధ్య నెల్లూరులో ఒక జైన్ మతం అమ్మాయుని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు తీసుకెళ్ళాడు( ఎత్తుకెళ్లాడు?).

ఆ జిల్లాలోవున్న జైన్ మతం కమ్యూనిటీ పెద్దలు అందరూ సమావేశం అయ్యారు.దానిలో తీసుకొన్న నిర్ణయం....."ముస్లిం లను  పనిలో నుండి తొలగించాలి...".అంతే,ఉన్న ఫలంగా 10,000 మంది ముస్లింలు ఉద్యోగం కోల్పోయారు.వెంటనే ముస్లిం పెద్దలు సమావేశం అయ్యారు.అమ్మాయు ఎక్కడ ఉందో గుర్తించారు. తొమ్మిదే గంటల వ్యవధిలో అమ్మాయిని జైన్ మతం వారికి అప్పగించారు. దీనినే " హిందూ సంఘటన శక్తి ప్రభావంతమైన విజయం " అంటారు.

       దీని నుండి మనకు అర్థమైంది ఏమిటి......?

      నాకులం,నా కుటుంబం ,నా

సంపద,....అనుకోకుండా ,ఇక నుండి "...హిందూవులంతా ఐకమత్యంగా ఉండాలి....." అని తెలుసుకోవాలి.