ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.
రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ,
అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసి మురిసిపోయేదట. కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట. తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట.
ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ అమెతో ఇలా చెప్పాడు దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు, తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరిగించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని😆
చుట్టుకోవడంలో ప్రేమ లేదు నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది. నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు, నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది అని చెప్పాడట.
కొన్ని స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి.
ఇలాంటి స్నేహితులు కొంత మంది మనతోనే ఉంటారు. మనతోనే తిరుగుతారు. మన బలాలు, బలహీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు.
అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర జాగ్రత్త.🙏🙏🙏🙏🙏😆
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి