29, మే 2023, సోమవారం

వేదాల్లో ఉన్నవే

 వేదాల్లో ఉన్నవే పాశ్చాత్యుల ఆవిష్కరణలు


సంస్కృతంలో అన్నీ ఎప్పుడో రాసి ఉన్నాయి.


• ఇస్రో చైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యలు


ఉజ్జయిని: గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం, ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి ఉండడంతో వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజమని 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాధ్ పేర్కొ న్నారు. అయితే ఈ విజ్ఞానమంతా కొన్నివేల ఏళ్ల తర్వాత పాశ్చాత్య శాస్త్రవే త్తల ఆవిష్కరణలుగా తిరిగి మన దేశానికి వచ్చాయని చెప్పారు. బుధవారం ఉజ్జయినిలో మహర్షి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయం' నాలుగో స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. "ప్రపంచంలోనే ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, శాస్త్ర సాంకే తిక రంగాలు, గణితం, ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దానిలో ఉన్నాయి. సూర్య సిద్ధాంత అనే గ్రంథంలో మాకు సంబంధించిన అంశాలున్నాయి. సౌర వ్యవస్థ, సూర్యుని చుట్టూ అవి పరిభ్రమించే తీరు, దానికి పట్టే సమయం వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి నుంచి అరబ్బుల వద్దకు, ఆ తర్వాత ఐరోపాకు వెళ్లి మళ్లీ మనకు వచ్చాయి. సున్నా, అనంతం, బీజగణితం, వైదా గరస్ సిద్ధాంతం వంటివాటి గురించి సంస్కృతంలో అత్యంత కచ్చితత్వంతో కవితాత్మకంగా ఎప్పుడో మన ప్రాచీనులు వివరించారు. విశ్వం కూర్పు, లోహ శాస్త్రం, వైద్య చికిత్సలు వంటివాటినీ సంస్కృతంలో పొందుపరిచారు. కంప్యూ టర్ భాషకూ ఇది చక్కగా సరిపోతుంది" అని సోమనాథ్ చెప్పారు.

ఆదివారం సెలవువద్దు*

 *ఆదివారం సెలవువద్దు*


ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం. ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం.


*అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |* 

*సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||*

*స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |*

*న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||*


తాత్పర్యం:

మాంసం తినడం, మద్యం త్రాగడం, స్త్రీతో సాంగత్యం, క్షవరం చేసుకోవటం, తలకు నూనె పెట్టుకోవడం, ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు. కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం.ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు. అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే... డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు. కుటుంబ సౌఖ్యం లేకపోవటం, అనారోగ్యంతో బాధపడటం కూడా.


ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే, అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి.


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో, ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు. చేస్తున్నాము.


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్నో ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు మన హిందూదేవాలయాలు వెలవెల బోతాయి.


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు. మద్యాన్ని త్రాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. విదేశీ సంస్కృతిని విడనాడండి. స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి.


యోగాభ్యాసం చేయండి. ప్రాణాయామం చేయండి. సూర్య_నమస్కారాలు చేయండి. సూర్యోపాసన చేయండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.


*ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి.*


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (2/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


ముల్లోకసంచారి యగు నారదుడు , వాల్మీకి మాటలను విని సంతోషించి “చెప్పెదను వినుము.” అనుచు ఇట్లు చెప్పెను.

“ఓ వాల్మీకిమునీ! నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభమైనవి. అయిననూ అట్టి గుణములన్నీ ఉన్న ఒక మహాపురుషుని గుర్తించి చెప్పెదను. వినుము.


_రాముని గుణవర్ణన_

ఇక్ష్వాకువంశమునందు జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్దుడు. అతడు మనోనిగ్రహవంతుడు. గొప్ప పరాక్రమము, కాంతి, ధైర్యము కలవాడు. ఇంద్రియములను వశములో ఉంచుకొన్నవాడు. 

రాముడు బుద్ధి, నీతి, మాటలాడుటలో నేర్చు, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు విశాలమైనవి. బాహువులు దీర్హములై బలిసి ఉన్నవి. కంఠము శంఖమువలె ఉండును. చెక్కిళ్ళ పైభాగము ఉన్నతముగా ఉండును. అతని వక్షస్థలము చాల విశాలమైనది. అతడి ధనుస్సు చాల గొప్పది. అతని మూపుల సంధులు పైకి కనబడవు. శత్రుసంహారకుడైన అతని బాహువులు మోకాళ్ళను స్పృశించునంతగా దీర్హమైనవి. అతడి నడక చూడముచ్చటగా ఉండును. అతడి శిరస్సూ, లలాటమూ కూడ మంచి లక్షణముతో ఒప్పుచుండును. 


అతడి శరీరము హెచ్చు తగ్గులు లేక సమముగా విభజింపబడిన అవయవములతో శోభించును. అతని శరీరము, మరీ పొట్టిగా గాని, పొడవుగా గాని కాకుండగా సమముగా ఉండును. అతడి శరీరపు ఛాయ చాల చక్కనిది. తేజస్సు ప్రశంసనీయమైనది. వక్ష్యస్టలము కండలు తేరి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణములన్నీ ఆతని శరీరములో కనబడును. 

అతడు సకల ధర్మములు తెలిసినవాడు. ఆడిన మాట తప్పనివాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండును. అతడు యశస్సు కలవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. పరిశుద్ధమైనవాడు-వ్యవహారములలో ఎన్నడూ ఎవరినీ మోసము చేయనివాడు. 

శ్రీమంతుడైన ఆ రాముడు బ్రహ్మదేవునితో సమానుడు. అందరినీ పోషించువాడు. శత్రువినాశకుడు. సమస్త ప్రాణీసముదాయమును రక్షించువాడు. ధర్మసంరక్షకుడు. 

అతడికి వేదవేదాంగముల రహస్యములన్నీతెలుసు. ధనుర్వేదములో అతడి ప్రావీణ్యము సాటిలేనిది. 

సకల శాస్త్రముల సారము తెలిసిన ఆ రాముని జ్ఞాపకశక్తి, ప్రతిభ చాల ప్రశంసనీయమైనవి. అతడు సకల ప్రజలకు ఇష్టుడు. సాధుస్వభావం కలవాడు. మనస్సులో ఎన్నడూ దైన్యమెరుగనివాడు. పనులలో మంచి నేర్పు కలవాడు.


నదులు సముద్రమును చేరినట్లు సత్పురుషులందరు ఎల్లవేళలా అతనిని చేరుచుందురు. ఈ విధముగా అతడు ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరివిషయమునందు సమముగా ప్రవర్తించువాడు. అతడి దర్శనము అందరికీ, ఒకే విధముగా, ఎల్లవేళలా ఆనందజనకమైనది. 

కౌసల్యానందవర్ధనుడైన ఆ రాముదొక్కడే సకలగుణములకు నిలయమైనవాడు. అతడు గాంభీర్యములో సముద్రమువంటివాడు. ధైర్యములో హిమవత్పర్వతమువంటివాడు. ఆతని మనస్సులోని భావము ఏమిటో ఎవ్వరూ గ్రహింపజాలరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరూ కదల్పజాలరు. 


అతడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చూచువారికి ఆనందము కలిగించుటలో చంద్రునివంటివాడు. క్రోధము వచ్చినచో ప్రళయకాలాగ్నితో సమానుడు. ఓర్పులో భూమితో సమానుడు. దానం చేయుటలో కుబేరునివంటివాదు. సత్యము విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే.

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (3/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*కైక వరములు*

దశరథుడు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్త సద్దుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజల హితమునే కోరుచుందువాడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్టకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. 


దశరథుని రాణులలో కైకేయి ఒకతె. పూర్వమెప్పుడో దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చియుండెను. రామాభిషేకముకొరకు సేకరించిన సంభారములను చూచి ఆమె తనకిచ్చిన వరములలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు దశరథుని కోరెను. 


దశరథుడు సత్యవాక్పాలన నియమము గలవాడు. అందుచే ధర్మపాశబద్దుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను. రాముడు, కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాటమా(త్రముగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. 


లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుదైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృస్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రామునివెంట వెళ్లెను. ఇట్లు ఉత్తమమైన కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను. 


*సీత వర్ణన*

జనకుని వంశమునందు పుట్టినదియు, రామునికి భార్యయు, దశరథునికి కోడలు అయిన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయవలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రికశాస్తములో చెప్పిన మంచిలక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్లిను. 


*రాముడు అయోధ్యను వీడుట*

పౌరులును, దశరథుడును వనవాసమునకు వెళ్ళుచున్న రామునివెంట చాల దూరమువరకు వెళ్ళిరి. ధర్మాత్ముడైన రాముడు గంగాతీరమునందు, శృంగిబేరపురము అనెడు పట్టణములో బోయజాతివారికి ప్రభువైన గుహుని కలుసుకొనెను. అచటినుండి రాముడు తన సారథియెన సూతుని వెనుకకు పంపివేసెను. 

సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వులవలె సుఖముగా నివసించిరి. 


రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచేత పీడితుడై, పుత్రునిగూర్చి విలపించుచు స్వర్గస్థుడయ్యెను. 


దశరథుడు మరణించిన పిదప వసిష్టాదులు రాజ్యము చేయుమని భరతుని ఆజ్ఞాపించిరి. తనకు రాజ్యము చేయు సామర్ధ్యమున్నను, భరతుడు రామునిపై నున్న గౌరవముచే రాజ్యమును పాలించుటకు ఒప్పుకొనలేదు. 


రాగద్వేషాదులు జయించిన భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళి, వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు రాముని చేరి, “నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అందుచేత నీవే రాజువు కావలెను.” అని ప్రార్ధించెను.


రాముడు తనను ఆశ్రయించినవారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నియు తీర్చును. అంతటి మృదుస్వభావుదైనను రాముడు, తండ్రియాజ్జను అనుసరింపవలెనను దీక్షవహించి యుండుటవలన భరతుడు ఎంత ప్రార్ధించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. 

“నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా భావించి రాజ్యము చేయుటకై నీవద్ద ఉంచుకొనుము.” అని చెప్పి, తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను. 


రాముని తిరిగి తీసికొని వెళ్లవలెనన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నంది గ్రామము అనెడు గ్రామములో నివసించి రాజ్యపాలనము చేసెను.

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (4/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*దండకారణ్యము*

భరతుడు వెళ్లగానే రాముడు, అయోధ్యాపౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకారణ్యమున ప్రవేశించెను. 

దండకారణ్యమును ప్రవేశించిన వెంటనే రాముడు విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష్ణ - అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనుస్సును, ఖద్గమును, తరగని బాణములుగల అమ్ములపొదులను రామున కీయగా అతడు సంతోషముగా వానిని గ్రహించెను. 

రాముడు శరభంగమహర్షి ఆశమములో నివసించుచుండగా ఆ చుట్టుప్రక్కలనున్నబుషులందరును, “అసురులను, రాక్షసులను సంహరింపుము.” అని ప్రార్ధించుటకై ఆతనివద్దకు వచ్చిరి. 

రాక్షసనివాసమైన ఆ అరణ్యములో అచ్చటి బుషులు చేసిన ప్రార్ధనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను.” అని అగ్నితుల్యతేజస్సులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చెను. 


*శూర్పణఖ*

దండకారణ్యములో జనస్థానము అను ప్రదేశములో నివసించు కామరూపిణియగు శూర్చణఖ అను రాక్షసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను. 


శూర్చణఖ విరూపితయైన పిమ్మట ఆమె మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకలరాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. దండకారణ్యమునందు నివసించునపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగువేలమందిని సంహరించెను. 

తన జ్ఞాతుల మరణవార్త వినిన రావణుడు మిక్కిలి కోపించి తనకు సాహాయ్యము చేయుమని మారీచుడను రాక్షసుని కోరెను, 


“రావణా! బలవంతుడైన రామునితో వైరము పెట్టకొనకుము.” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. మృత్యువు సమీపించి ఉండుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. 


*సీతాపహరణ*

మాయావియైన మారీచునిద్వారా రామలక్ష్మణులను పర్జశాలనుండి చాలదూరము వెళల్లిపోవునట్లు చేసి, రావణుడు రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును వధించెను. 

ప్రాణములు విడుచుటకు సిద్ధముగా ఉన్న జటాయువును రాముడు చూచెను. సీతను రావణుడు అపహరించినట్లు జటాయువు చెప్పగా విని, రాముడు మిక్సిలి దుఃఖితుదై ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను. 

రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసెను. 


*కబంధుడు*

పిమ్మట సీతకై వెదకుచు, ఆ వనములో వికృతమైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుదనెడి రాక్షసుని చూచెను. బలిష్టములైన బొహువులుగల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్లెను. 


అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, “రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పు కలదియు, ధర్మమును ఆచరించునదియు అగు ఒక శబర స్రీ సన్న్యాసాశమమును స్వీకరించి ఈ ప్రాంతమునందే యున్నది. ఆమె వద్దకు వెళ్ళుము.” అని చెప్పెను. 

రాముడు శబరి వద్దకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగ పూజించెను. 


*హనుమత్సుగ్రీవుల పరిచయము*

రాముడు పంపాసరోవరతీరమున హనుమంతునితో పరిచయ మేర్చరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను. రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండియు సుగ్రీవునకు, హనుమంతునకు చెప్పెను, సీతావృత్తాంతమును విశేషించి తెలిపెను. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయు విని, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసికొనెను. 


“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమునంతయు తెలిపెను. వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడ రామునకు వాలియొక్క బలమును వర్ణించి చెప్పెను.


*రామునికి పరీక్షలు*

సుగ్రీవుడు రాముని చూచినది మొదలు, “ఇతడు వాలిని చంపుటకు సమర్ధుడో, కాడో” అని సందేహించుచుందెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలెనున్న దుందుభి యను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను.


ఊహింపరాని బలము కల రాముడు ఎముకల పోగయి ఉన్న ఆ దుందుభి కళేబరమును చూచి, “ఇది ఎంత?” అన్నట్లు నవ్వి దానిని తన కాలి బొటనవేలితో ఎత్తి పదియోజనముల దూరము పడునట్లు విసరెను. సుగ్రీవునకు ఇంకను నమ్మకము కలుగుటకై ఒకే బాణముచే ఏడు మద్దిచెట్లను, ఒక పర్వతమును, పాతాళమును కూడ భేదించెను. 

రాముడు ఆ పనులు చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహవలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళ్లిను. 


*వాలివధ*

కిష్కింధ ప్రవేశించి సుగ్రీవుడు గర్జించెను. ఆ మవానాదమును విని వాలి గృహమునుండి బయటకు వచ్చెను. యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, వాలి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. అనంతరము సుగ్రీవుని వానరరాజ్యమునందు పట్టాభిషిక్తుని చేసెను.

విభూతి

 🎻🌹🙏 విభూతి ( భస్మం )....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి ( భస్మం ) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.


🌸వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. 


🌿విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.


🌸అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. 


🌿విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు.


🌸 హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), 


🌿గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి. విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అందురు.


🌸విభూతి ధరించే విధానం

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. 


🌿అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. 


🌸విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.


🌷విభూతి పేర్లు - వర్ణములు🌷


🌿1. భస్మం - శ్వేత వర్ణము


🌸2. విభూతి - కపిల వర్ణము,


🌿3. భసితము -కృష్ణ వర్ణము


🌸4. క్షారము - ఆకాశ వర్ణము


🌿5. రక్షయని - రక్త వర్ణము


🌸కొన్ని విశ్వాసాలు

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.


🌿హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.

హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి.


🌸భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:


🌷1.శ్రీ మహాగణపతి 🌷


🌿హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.


🌷2.శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.


🌷3.శ్రీ దుర్గా 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.


🌷4.శ్రీ ధన్వంతరి 🌷


🌿 హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.


🌷5.శ్రీ నవగ్రహ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.


🌷6.శ్రీ మహా మృత్యుంజయ 🌷


🌿హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.


🌷7.శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, 🌷


🌸శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.


🌷8.శ్రీ సుదర్శన 🌷


🌿 హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.


🌷9.శ్రీ లక్ష్మీ నారాయణ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.


🌷10.హోమ 🌷


🌿 భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.


🌸గమనిక : హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.


🌷విభూతి స్నానం :🌷


🌿స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.


🌸ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం.


🌿 రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం.

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు



బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు       

            (ఒక వాస్తవ గాథ)

               ➖➖➖✍️



అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు.


బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు.


ఇంతట్లో ఒకతను బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.

పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.

ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు

వెళ్లేవాళ్ళే. 


ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలిని టికెట్టు తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.


బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది. వానాకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో..?


అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా!"


ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!


కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు.


బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కునుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది? ఆమెకు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు..?

ఒంటరిగా ఉన్న ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే..?


ఇంతలో ముసలామె దిగే ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .


కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.


బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. 

కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.


అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.


"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు?" అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్  ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి! బస్సును నడపండి!" అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కి

ఆదేశాలు ఇచ్చారు.


"నాయనా! నీ పేరేంటి?" అని కండక్టర్ని అడిగింది ముసలామె.


"అవ్వా! నా పేరుతో నీకేమి పని?.. నా పేరు మహాదూ వేంగుర్లే కర్.”


"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా?"


"మాల్‌ వన్." అన్నాడు కండక్టర్ .


"నీకు సంతానం ఎంత మంది?"


"ఇద్దరు" అన్నాడు కండక్టర్ .


ఇంతట్లో ముసలవ్వ ఇంటిని(పూరి గుడిసె ను) చేరుకున్నారు. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.


ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది. ఆమెకు దగ్గరి బంధువులు అనేవాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!


ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది.  భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.


ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా, వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను. కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌' బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరిట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేల

రూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మల

కోసం వాడుకోండి. నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను." అని

అంది. 


సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.


ఇదేంటి సమస్య? ఈ మహాదు

వేంగుర్లే కర్ ఎవరు? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ దగ్గర  సెలవు తీసుకొని

వెళ్లి పోయారు.                 


రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ కన్నుమూసింది.


ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్ని పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్, కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.


ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కానుక కండక్టర్ కి అన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. 


ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది విన్న సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.


మహాదూ వేంగుర్లే కర్     పిలిచిన తారీఖున ఆఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.


అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. 


అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.


ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తన

పేరట వ్రాయటం అతడికి మతి

పోయినట్లు అయింది.!



అక్కడ సమీపం లో   పిల్లల గోల

వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా?" అని అడిగాడు

కండక్టర్.


"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తోంది." అని

చెప్పాడు సర్పంచ్ . 


"ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి

నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.


"ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ ముందుకు రావటం లేదు." అని జవాబిచ్చాడు సర్పంచ్.


వెంటనే కండక్టర్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ - "ఇదిగో సర్పంచ్ గారూ పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరిట బడికి ఒకదివ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి. మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి." 


గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.


కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. 


ఊరి జనం అతడిని కొంత దూరం

వెంబడించింది.


చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదే

ఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.


మనం జీవితంలో ఒకరికి చేసిన

చిన్న, పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.


మనిషి మనిషి కి  మధ్య  మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు ఒకరికొకరం పంపుకుందాం!!✍️

Forwarded as recvd.

.

గీతలోని సారాంశాన్ని

 గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.


 వన్ లైనర్ గీత -

 దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా?  ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు.  మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.


 వన్ లైనర్ గీత


 *అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*

 *అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*

 *అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*

 *అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*

 *అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*

 *అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*

 *అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*

 *అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*

 *9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*

 *అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*

 *అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*

 *అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*

 *అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*

 *అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*

 *అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*

 *అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

 *అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*

 *అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*

 (ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

                          

                   ||  ॐ తత్సత్ ||






 This book was published in 1916 by Benaras Hindu University...Not available now. All the copies got destroyed. One copy was available in the library of California University, which has been digitised by Microsoft.   It is a beautiful introduction to Hinduism, without any school affiliations. It is especially suited to youth. You may go through at leisure. It has 304 pages and share it further with your known younger generation kids.  This is a rare book on “Sanatana Dharma”  - Please READ and share it to our youth group as much as possible...                 https://kponline.in/sanatana-dharma/#pdf-sanatana-dharma/8/

ఎవరు సంతోషంగా ఉంటారు?’*

 ‘ *ఎవరు సంతోషంగా ఉంటారు?’* 


  తన భోజనాన్ని తాను వండుకునేవారు, అప్పులు లేనివారు, దూరతీరాలకు ప్రయాణించని వారు సంతోషంగా ఉంటారు.


మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు. పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెదుకుతుంటే, భారతీయులు ఉన్నదానితో సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద.

 

సహజంగా మనిషి ఆనందస్వరూపుడు. 

అతడికి గతంతోను, భవిష్యత్తుతోను సంబంధం ఉండదు. ఉన్నచోట, ఉన్నక్షణంలో సంపూర్ణంగా జీవించడమే ఆనందానికి మార్గమని గ్రహిస్తాడు. 

అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు.

 ఆనందస్వరూపుడైన వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు. 

అందుకే ప్రతి వస్తువుపట్లా సమభావం, సమదృష్టి కలిగి ఉంటాడు.


మానవ జన్మ లభించడమే ఒక వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. 

మనిషి లోకోత్తర ధర్మాలైన దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవరచుకుని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు.

 మానవసేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషీ ఇతరుల వెతలను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం.

 ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. 

మనిషిని మహానుభావుడిని చేస్తుంది!


శుభోదయం . మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

భార్య - భర్త!*

 *భార్య - భర్త!*

                   


భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు...


వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. 


ఆ సహాయకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. 


ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. 


ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి.


ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. 


ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు.


మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. 


వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. 


మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. 


ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సామాజిక ఒప్పందం మాత్రమే. 


కాని ఇక్కడ మనవారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.


మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. 


రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. 


మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. 


నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.


కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. 


మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు.




https://kutumbapp.page.link/XEoAarQUMdnfdtxg7?ref=F4LTY


 

నాగమల్లి పుష్పములు*

 *నాగమల్లి పుష్పములు*



శివలింగ వృక్షం శివుడి జటాజూటాకృతి లో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటుంది. ఈ చెట్టుకి పూచే పుష్పములు కొమ్మలకి పూయకుండా వెంట్రుకలలాంటి జడలకు పూస్తాయి. పువ్వు పైభాగాన నాగపడగ కప్పినట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి.అందుకే ఈ పుష్పాలను శివలింగపుష్పాలని, నాగమల్లిపుష్పాలని, మల్లికార్జునపుష్పాలని పిలుస్తారు. ఈ పుష్పాలు అద్భుతమైన సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయి.ఆ పరమేశ్వరుడు ఈ శివలింగ పుష్పం రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తారు. ఈ శివలింగ పుష్పాలు శివుడికి, మరియు సమస్త దేవతలకి ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో పూజ చేయడం శివభక్తులకి ఒక వరం. శివలింగ పుష్పాలతో ఆ పరమేశ్వరుని పూజ చేసినవారు జన్మరాహిత్యం పొంది చివరకు కైవల్యం పొందుతారని శివపురాణం లో ఉన్నది. 


*శివలింగ వృక్షం*


శివలింగ వృక్ష శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు.


ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు.

హృదయరంజకంగామాటలాడటంనేర్చుకో

 శుభోదయం🙏


మనోహరంగా మాట్లాడటం

ఒకకళ!!


మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్

మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్

మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్

మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగమున్;

    -చిలకమర్తి లక్ష్మీనరసింహం!

మనమాట మనజీవితానికి చక్కనిబాట.దాన్ని చక్కగా వాడటం నేర్చుకోవాలి.లేకపోతే కష్టమే!

        లోక వ్యవహారమంతామాటమీదే!నోరుమంచిదైతే ఊరుమంచిదౌతుంది.ఇత్యాదిగా సామెతలెన్నో.లోకమెరిగిన కవితనఅనుభవాన్ని రంగరించి మనకుచెప్పిన మంచిమాటలీపద్యంలోచోటుచేసికొన్నాయి.

       మంచిమాటల చేతనే

(స్తోత్రాదులు)దేవతలు వరాలిస్తారు.మాటలవలననేరాజులుమన్ననచేసిమాన్యాలిస్తారు.మాటలకుపొంగిపోయేమానినులుపరవశమందిసుఖాలు ప్రసాదిస్తారు.

       కాబట్టి మిత్రమా!మంచిగా హృదయరంజకంగామాటలాడటంనేర్చుకో!

       సరిగామాటలాడటం రాకపోతే, అందరిలో అవమానింపబడతావు.చిన్నతనంతప్పదు.ఆపైపరితాపంతప్పదు.

      కాబట్టి మధురంగా మాటలాడటం నేర్చుకో!

అని సందేశం!!!🙏🙏

ఎన్నో విధాల శ్లేషలు

 వసుచరిత్రలోని

     శబ్దచమత్కారాలు!!


      శుక్తిమతీ వర్ణనం!


శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం 

లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది.


జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయమెల్ల నచ్ఛతా 

పావనతా, గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వ ధా

త్రీ వలయ త్రికాల ఫల దేశిక ముల్నవ కంబు లెల్ల ము 

క్తావళి విభ్రమాస్పదము, లానది పెంపు నుతియింప శక్యమే     

 


అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ 


స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం 

జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.


    నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని 

అర్థం వుంది.)

జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల 

సమూహానికి ఆధారభూతమైన శంఖాలతో ప్రవేశించేవి. ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.

-------------------        స్వస్తి--👏👌

 

క్షీరేన వర్ధతే ఆయువు

మంసేన వర్ధతే మాంసహా

గ్రుతేన వర్ధతే జ్ఞ్యాననఁ

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 74*


. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

. ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 74*


'ఈ పావురం ఎవరిది ... ఎక్కడి నుంచి వచ్చింది ... ?' అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చంద్రుడు. 


చాణక్యుడు పావురాన్ని దోసిట్లోకి తీసుకుని దాన్ని వాత్సల్యంగా చుంబిస్తూ "చంద్రా ..! కాలం కలిసి వస్తే అన్ని శుభాలే ఎదురవుతుంటాయి.." అన్నాడు. 


చంద్రుడు మరింత ఆశ్చర్యంతో "ఎదురొచ్చిన శుభం ఏమిటి, ఆర్యా...?" అని అడిగాడు. 


చాణక్యుడు పావురం రెక్కచాటు నుంచి చిన్న లేఖా పత్రాన్ని తీసి చంద్రుని మీదికి విసురుతూ "నువ్వే చూడు..." అన్నాడు. చంద్రుడు ఆ పత్రాన్ని మడత విప్పి సందేశాన్ని చదువుకుని ఆనందంతో "గురుదేవా ! తమకి పుత్రికోదయమయ్యింది" అని చెప్పాడు. 


చాణక్యుడు ముసిముసిగా నవ్వుతూ "ఆ కాశీ పురాధీశ్వరి నా ఇంట అవతరించిందన్నమాట. సంతోషం" అంటే గబగబా చేతి వేళ్ళమీద గణికం, గ్రహస్థానాలు, గతులు లెక్కించి "శుభం ... మదీయ పుత్రిక నామదేయం ... అన్నపూర్ణ..." అంటూ అప్పుడే అప్పడికక్కడే ఏ ఆర్బాటాలూ లేకుండా తన కుమార్తెకి 'అన్నపూర్ణ' అని నామకరణం చేశాడు చాణక్యుడు. 


చంద్రగుప్తుడికి ఆ శుభవార్త ఎంత సంతోషాన్ని కలిగించిందో, అంత విచారాన్ని కలిగించింది. అతడు బాధతో తలదించుకుంటూ "గురుదేవా... ! నావల్ల కదా తమరు యీ సంతోష సమయంలో భార్యపుత్రికలకు దూరంగా వుండిపోయారు" అన్నాడు వేదనతో. 


చాణక్యుడు వాత్సల్యంగా అతని భుజం తట్టి "చంద్రా ! మమతలూ.. మమకారాలూ మానవ సహజం వాటికి స్పందించడం, సుఖదుఃఖాలను అనుభవించడం మానవ నైజం. నేనూ వాటికేమీ అతీతుడ్ని కాను... కానీ, వీటన్నిటికంటే ముఖ్యమైనది ధర్మం... ధర్మపరిరక్షణామార్గంలో మమతానురాగాలను పాటించకూడదని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించాడు. కనుక దూరంగా వున్న వాళ్ల గురించి విచారించడం మాని స్వ ధర్మాచరణకు తలోగ్గినవాడే నా దృష్టిలో మనిషి. నేనే ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాను" చెప్పాడు భావోద్వేగంతో. చాణక్యుని ధర్మాచరణ దృక్పధానికి చేతులు జోడించి నమస్కరించాడు చంద్రగుప్తుడు. 


ఇక చంద్రగుప్తునికి వివాహ ముహూర్తం నిశ్చయమైంది. పాంచాల భూపతి పురుషోత్తముడు సపరివార సమేతంగా వెంటరాగా చంద్రుని తోడ్కోని సింహపురానికి చేరుకున్నాడు చాణక్యుడు. నగర పొలిమేరలలోనే సింహాపురాధీశ్వరుడు విజయవర్మ వియ్యాలవారికి రాజోచిత లాంఛనాలతో స్వాగత సత్కారాలు జరిగాడు. 


పండితులు నిర్ణయించిన శుభముహూర్తానికి విజయవర్మ తన రాజ్యంతో సహా తన కుమార్తె శాంతవతిని చంద్రగుప్తునికి సాలంకృత కన్యాదానం మొనరించాడు. 'దేవ దుంధుబులు మ్రోగుతున్నాయా' అన్నట్లు మంగళతూర్యనాదాలు మిన్నుముట్టాయి. 


ఇరుపక్షాల వారికీ ఏకైక పెద్ద దిక్కుగా నిలిచి చాణక్యుడు అంతటా తానే అయి ఆ శుభకార్యాన్ని కన్నుల పండువుగా జరిపించాడు. వివాహానంతరం చంద్రగుప్తుడు, శాంతవతితో కలిసి సింహపురి సింహాసనం మీద పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నూతన వధూవరులకు కానుకగా తన పాంచాల రాజ్యాన్ని వేద మంత్రయుక్తంగా సమర్పించాడు. 


"సింహపుర, పాంచాల రాజేంద్రుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రగుప్త మౌర్యుల వారికీ... జై ..." అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అన్నం

 అన్నము గురించి సంపూర్ణ వివరణ -


 * అన్నం అగ్నిదీపనం చేయును .


 * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.


 * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.


 * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును. 


 * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును. 


 * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .


 * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును . 


 * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి. 


 * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .


 * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .


 * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధారుడ్యం కలుగచేయును . పథ్యకరం అయినది. దాహాన్ని తగ్గించును . 


 * శరీరానికి కాంతిని ఇచ్చును. మూత్రవృద్ధి చేయును . తేలికగా ఉండును. ముడిబియ్యపు అన్నం అగ్నిదీప్తి కలిగినవారికి మంచి శ్రేష్ఠమైనదిగా 

ఉండును . 


 * సన్నరకం బియ్యపు అన్నం దీపనకారిగా ఉండి దోషములను పోగొట్టును . ప్రశస్తమైనది , రోగములను హరించును .


 * మినపపప్పు గాని నువ్వుల గాని చేర్చి వండిన అన్నమును పులగం అందురు. బలమును కలుగచేయును . మలమును బంధించును . పెసరపప్పు , కందిపప్పు , శనగపప్పు వగైరా బియ్యముతో చేర్చి వండిన అన్నం శుక్రమును మరియు బలమును పెంచును . పుష్టిని కలిగించును. మలమును విసర్జింపచేయును . వాతాన్ని హరించును . పిత్తమును మరియు కఫాన్ని పెంచును.త్వరగా జీర్ణం అవ్వకుండా ఉండును.


 *  పాలలో బియ్యం , చెక్కర వగైరా కలిపి వండినదానిని పాయసం అనియు క్షీరాన్నం అనియు పరమాన్నం అని కూడా అంటారు. పాయసం త్వరగా జీర్ణం కాదు. బలమును , ధాతుపుష్టిని చేసి మలమును బంధించును . 


      ఇప్పుడు పప్పుల గుణములు కూడా మీకు వివరిస్తాను. 


      పెసరపప్పు వాతమును , కడుపు ఉబ్బరమును కలిగించును. పొట్టు తీసిన పెసరపప్పు మధురంగా ఉండును. దేహకాంతిని కలుగచేయును . గుల్మము , ప్లీహము,కాస , అరుచి , పిత్తము , ప్రమేహరోగము , గళ రోగమును హరించును .


            కందిపప్పు రుచిగా ఉండి మలబద్దకం, కుష్టు , జ్వరం , అతిసారమును హరించును . శనగపప్పు కడుపుఉబ్బరం కలుగచేయును . ఉలవపప్పు కఫపిత్తరోగములను , గుల్మొదరం , మూలవ్యాధి , వాతం , క్రిమిరోగం , కాసరోగం , ఆమవాతంను హరించును . అలసందపప్పు 

మధురంగా ఉండును. బలమును వృద్దిచేయును.


      కొందరు పొట్టుతీసిన పెసరపప్పు , పొట్టుతీయని కందిపప్పు విషతుల్యం అందురు. కారము మరియు కమ్మదనం కలిగిన పదార్థముల యందు పైత్యమును , పులుసు , వగరు కలిగిన పదార్థముల యందు శ్లేష్మము , తీపు మరియు చప్పదనం కలిగిన పదార్థముల యందు వాతము కలదని ఋషుల యొక్క అభిప్రాయం . కావున శరీరతత్వము మరియు రోగమును గుర్తించి పథ్యం పెట్టవలెను.

 

 

 మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

తెలుసుకోవడం కష్టం.

 .

               _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*విపత్తౌ కిం విషాదేన* 

*సమ్పత్తౌ హర్షణేన కిమ్।*

*భవితవ్యం భవత్యేవ*

*కర్మణో గహనా గతిః॥*

                  -సూక్తిసుధానిధిః


తా𝕝𝕝 

ఆపదలలో దుఃఖించడం ఎందుకు, సంపదలలో సంతోషించడం ఎందుకు? ఏది జరగనున్నదో అది జరిగితీరుతుంది....కర్మగతిని(ఏ కర్మ ఎపుడు ఏ ఫలం ఇస్తుందో) తెలుసుకోవడం కష్టం.

ఆవు

 1) ఆవు పంచకం ఒక్కసారి తీసుకుంటే అన్ని పాపములు తొలగి పోతాయి

ఆవు పాలు + ఆవు పెరుగు+ ఆవు నెయ్యి+ఆవు మూత్రం+ ఆవు పేడ

2) ఆవుకు ప్రదక్షిణము చేయడం = అమ్మ వారికి ప్రదక్షిణము చేయడం

3) ఆవు గొంతు తాకితే ఎంతో పుణ్యం

4) ఆవు తోకతో చిన్న పిల్లలకు దిష్టి తీయవచ్చు

5) ఎండ పెట్టిన ఆవు పేడతో విభూతిని /భస్మం తయారు చేస్తారు

6) ఆవు విభూతిని /భస్మమును తలపై చల్లుకుంటే స్నానం చేసిన పలితం వస్తుంది

7) ఆవు గోరచనముతో గుడిలో దీపం వెలిగిస్తారు

8) ఆవు కొమ్ముతో శివుడికి అభిషేకము చేస్తారు

9) పుట్టిన రోజున ఆవు పాలు+నల్ల నూగులు+బెల్లం కలిపి తీసుకోవాలి

10) అలా చేస్తూ సప్త చిరంజీవుల పేర్లు స్మరిస్తే మళ్ళీ పుట్టిన రోజు జరుపుకుంటారు

11) ఆవుకు ఎదైనా తినిపిస్తే, అది అమ్మ వారికి పెట్టిన పలితం వస్తుంది. 

అంత గొప్పది ఆవు

ఆవుకు అంత శక్తి ఉంది

కవితా విన్యాసం*

 *00000000000000000*


*సున్న పై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం*


*00000000000000000*


*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే 

*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!


*0* లేకుండా 

*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!


*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!

పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!


*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె! 

*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!  

*ఆంధ్రా* లో *అన్నబియ్యం* కూడా కిలో *రెండు* అయ్యె!


*పది* మధ్యలో దూరి 

*పంది* గా మారె!

*నది* మధ్యలో దూకి 

*నంది* గా మారె!


ప్రతి *కొంప* లోనూ 

అది తిష్ట వేసింది!

*0* లేనట్టి *సంసారమే* లేదు! 


*కాంగి* లోనూ దూరె! 

*దేశం* లోనూ దూరె!

*కమలం* లోనూ దూరే !

అది *రాజకీయం* కూడా నడుపుచుండె!

*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ! 


*గుండుసున్నా* 

అని ఎగతాళి చేయకు 

*గూండా* గా మారి రుబాబు చేయు!


*ఆరంభము* న *0*!  *అంత* మందున *0*!

*జననం* లో *0*! 

*మరణం* లో *0*!

*శూన్యం* లో *0*!  *అనంతము* లో *0*!


*ఇందూ*, *అందూ* 

అను సందేహమేల!

*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*!   


*సత్యం*, 

*శివం*, 

*సుందరం* 

అన్నింటిలోనూ అది అలరారుతోంది!


*0* తోటే ఉంది 

*అందం*!  *ఆనందం*!

*జీవితం* లో  చివరకి మిగిలేది *0* !


*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!

*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ! 

*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!

నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!


తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!

తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!


ఇంత మహిమ గల *0* - 

మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని 

దిగులెందుకన్నా!


*గుడి* లోన జేరి *గుండి* గా,

*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా! 

 

కనుక గుడి  *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి 

మోత మోగిస్తోందన్నా! 

ఆ మోత *నాదం* లోనూ *0*!


*కాలం* తోటే అది పరుగులిడుతోంది!

ప్రతి *గంట*, 

ప్రతి *దినం*, 

ప్రతి *వారం*,

ప్రతి *పక్షం*,  

ప్రతి *మాసం*, 

ప్రతి *సంవత్సరం*,

అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!


*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ

*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!


*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!

*కంటి* లోనూ *0*!  

*పంటి* లోనూ *0*!

*కంఠం* లో *0*! 

*కండరం* లో *0*!

*చర్మం* లో *0*!  

*రక్తం* లో *0*!

 

*దాహం* లో *0*! 

*మోహం* లో *0*!

*రాగం* లో *0*! *అనురాగం* లో *0*! 

*సరసం* లో *0*!  

*విరసం* లో *0*!

*కామం* లో *0*!  

*క్రోధం* లో *0*! 

*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!


*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!

*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ

*దేహం* తోటే అది దహనమగుననిపించె! 

తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!

మన గతులనే మార్చివేసి అదిi *గంతు* లేస్తోంది! 


*"జైహో సున్నా*

*జయ జయహోసున్నా" ౦*

అదృష్టవంతులు

 *60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు* ఎందుకంటే 100 కి   11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.

 మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు


 1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.


 2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో  మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .


3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*.


 4.  *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*.


 5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది  మీకు కోపం రాకుండా ఉంచుతుంది.  మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.


 6. ధనం పై  వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .


7 మీరు కోరుకున్నది  దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.


8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై  నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.


 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 


10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.


 ఈ 10 చిట్కాలు పాటించండి. 

గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో చూడండి ఒకే 🙏🙏🙏

చిట్టికథ


*చిట్టికథ*

 

ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు 


వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు .


రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు  

అతడి  చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు 


ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు .


అతనికి దగ్గటరలో  ఒక కట్టె కనిపించింది రాజుకి.

 అదేందుకు  అని అడిగాడు రాజు 

బయట నా భార్య ధాన్యాలను    వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .


ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి

 ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు 


ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.

వాళ్ళు ఎవరు అని అడిగారు  ??


పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు .

రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు అందుకు ఆ వ్యక్తి 


నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు .


రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !!


అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు .


రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .


సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి.


నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.


🌷🌷🌷🏵️🏵️🏵️🏵️🏵️

🌹🌹🌹🌹🌹🛟🛟🛟 ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/?efr=1