29, మే 2023, సోమవారం

ఎన్నో విధాల శ్లేషలు

 వసుచరిత్రలోని

     శబ్దచమత్కారాలు!!


      శుక్తిమతీ వర్ణనం!


శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం 

లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది.


జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయమెల్ల నచ్ఛతా 

పావనతా, గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వ ధా

త్రీ వలయ త్రికాల ఫల దేశిక ముల్నవ కంబు లెల్ల ము 

క్తావళి విభ్రమాస్పదము, లానది పెంపు నుతియింప శక్యమే     

 


అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ 


స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం 

జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.


    నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని 

అర్థం వుంది.)

జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల 

సమూహానికి ఆధారభూతమైన శంఖాలతో ప్రవేశించేవి. ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.

-------------------        స్వస్తి--👏👌

కామెంట్‌లు లేవు: