22, సెప్టెంబర్ 2024, ఆదివారం

సోమవారం*🕉️ 🌹 *సెప్టెంబర్,23, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🕉️ *సోమవారం*🕉️

🌹 *సెప్టెంబర్,23, 2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి     : షష్ఠి* మ 01.50 వరకు ఉపరి *సప్తమి*

*వారం:సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : రోహిణి* రా 10.07 వరకు ఉపరి *మృగశిర*


*యోగం  : సిద్ధి* రా 03.10 తె వరకు ఉపరి *వ్యతీపాత* 

*కరణం  : వణజి* మ 01.50 *భద్ర* రా 01.09 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 02.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  :*రా 07.02 - 08.35*

అభిజిత్ కాలం  : *ప 11.35 - 12.24*


*వర్జ్యం        : మ 02.25-03.58 & రా 03.40-05.15 తె*

*దుర్ముహూర్తం  : మ 12.24 - 01.12 & 02.49 - 03.37*

*రాహు కాలం : ఉ 07.27 - 08.58*

గుళికకాళం      : *మ 01.30 - 03.01*

యమగండం  : *ఉ 10.29 - 12.00*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *వృషభం*

ఉ 05.56 

సా 06.03

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం    :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం   :*08.22 - 10.47*

మధ్యాహ్న కాలం :*10.47 - 01.12*

అపరాహ్న కాలం :*మ 01.12 - 03.37*

*ఆబ్ధికం తిధి : తిథి ద్వయం షష్ఠి/సప్తమి*

సాయంకాలం  :  *సా 03.37 - 06.03*

ప్రదోష కాలం   :  *సా 06.03 - 08.25*

రాత్రి కాలం       :  *రా 08.25 - 11.36*

నిశీధి కాలం      :*రా 11.36 - 12.23*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️


జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం 

తనోతు నః శివః శివమ్


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

      *న్యాయపతి వేంకట*

     *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

Panchaag


 

గుర్తించని వారికి చేసే సేవ

 🔔 *అనగనగా...* 🔔


ఒక కిరాణా షాపువాడు ...తన షాపు కట్టేస్తూ ఉండగా...అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బునోట్లు ఉన్నాయి. 


షాపువాడు ఆశ్చర్యపోతూనే...

లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు. 


అది అక్కడినుంచి కదిలింది. 

షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. 


కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్ లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్ రాగానే ఎక్కింది. 


కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. 


తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి, ఇంటిమెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. 


అది ఎత్తుగా ఉండటం తో అందలేదు. కాళ్ళతో తలుపుని కొట్టింది. 


ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంట. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు.


కుక్క ఇంటి పక్కవైపు వెళ్ళి... బెడ్ రూం కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాదసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. 


షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు. 


అప్పుడే నిద్రలోంచి లేచి బయటకొచ్చిన

ఇంటియజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్న సాగాడు.


ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి 


ఏం చేస్తున్నావయ్యా నువ్వు? 

అసలు బుద్దుందా? ఏమైనా తెలుస్తుందా? 


ఈ కుక్క అద్బుతమైన తెలివి తేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలిలాంటి తెలివైనకుక్కని ఈ ప్రపంచం లోనే చూడలేం" అన్నాడు చాలా ఉద్వేదంగా. 


ఆ యజమాని దానికి సమాదానం ఇస్తూ..


" ఇది తెలివైందా???

ఇది బయటికి వెళ్తున్నప్పుడు... 

ఇంటి తాళం చెవి తీసుకు వెళ్ళకుండా వెళ్ళి, తిరిగొచ్చి ,పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండో సారి" అన్నాడు.


"నీతి:  

*******


మనకి ఎన్ని తెలివితేటలు వున్నా.. 

మనం ఎంత కష్టపడినా ..

గుర్తించని వారికి చేసే సేవ వృధా .. 

అలా వృధా సేవలు చేసేకన్న.. దైవ నామ స్మరణ చేసుకోడం మిన్న 🙏🏻




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

భరోసా

 *అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కూడా వెళదాం అనుకున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే చూసి, అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేసాడు.*

నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!

కానీ కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒకే ఒక్క భరోసా వాళ్లిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది.


నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. అదే నేను ఉన్నాను అనే "భరోసా".

ఒక్క మాట సాయం.. ఏమీ కాదు.. 'నేను ఉన్నా' అనే చిన్న మాట చెప్పి చూడండి. మనిషికి ఎంత బలం వస్తుందో.!

ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు.


ఓసారి ఓ పెద్దాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూచూస్తే ఓ రైతు కనిపించాడు. పరిస్థితి చూసిన రైతు, "ఉండండి సారూ, నా ఎద్దుతో కారును బైటకు లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!


రైతు ఎద్దుని కారు ముందువైపు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ.. తిన్నదంతా ఏమైందిరా, బండిని లాగండిరా..." అని ఉత్సాహంగా అదిలించాడు.

అంతే! రాజు ఆ కారుని ఒక్క ఉదుటున బయటకు లాగేసింది.

అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యంతో " ఏమండీ, ఉన్నది ఒక ఎద్దేకదా? మీరేంటీ‌.. అన్ని పేర్లు పెట్టి అదిలించారు?" అన్నాడు.

అప్పుడారైతు "ఈ రాజు బక్కచిక్కిందే కాదండీ.. గుడ్డిది కూడా.! ఐతే, తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంతే!" అని సమాధానమిచ్చాడు.

'పూర్తి నమ్మకంతో చేస్తే.. ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!' రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు.!


పూర్వం పదిమంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే.. అలాంటి ధైర్యమే కారణం.

ఉమ్మడి కుటుంబాలలో "మేమున్నాం" అనే భరోసా.!

కానీ నేటి రోజుల్లో ఒక్క పిల్లో, పిల్లోడో చాలురా దేవుడా!

అనుకోవటానికి కారణం..

'మేమున్నాం.. మంచీ చెడు చూస్కోటానికి' అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మనచుట్టూ లేకపోవటమే.


*కష్టంలో ఉన్న మనిషికి 'నేనున్నాను' అనే ఒక భరోసా ఇవ్వండి.*

_అదీ కుదరక పోతే.. కనీసం ఒక్క మాట సాయమైనా చేయండి._

*ఎందుకంటే మనిషికి మనిషే కదా భరోసా.*

*మనలో ఒకరికి ఒకరం* 

*`ఐక్యతే మనందరి బలం.`*

అదృష్టం అనేది

 అదృష్టం అనేది మన చేతుల్లో ఉండదు, కేవలం నిర్ణయాలు మాత్రమీ ఉంటాయి, మనం తీసుకునే నిర్ణయాలే అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని నిర్ణయిస్తాయి .

శుభ ఆదివారం 🌹🙏🏻🌹Happy Sunday

సమస్యకు పూరణ.

 *కల్ప యంచుc జెప్పుకొనcగా దగు భారత గాథ చిత్రమే*

ఈ సమస్యకు నాపూరణ. 


అల్పు లబద్ధముల్ సతము నాడెద రన్నియు శుష్కవాదనన్


నిల్పెద రన్ని వేళలను నిందల జేతురు నేమకంబుగా


కల్పన యంచుc జెప్పుకొనcగా దగు భారత గాథ చిత్రమే


మల్పులు త్రిప్పి నూత్నకథ మార్పులు కావవి మాయ జేయుటే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

23. " మహాదర్శనము

 23. " మహాదర్శనము "-- ఇరవై మూడవ భాగము " -- పూర్ణపు దారి శాస్త్రము


23.-- ఇరవై మూడవ భాగము --- పూర్ణపు దారి శాస్త్రము 



          ఆచార్యుడు , బుడిలులతో పాటు ఇంటికి బయలు దేరినాడు . దారిలో వారు అప్పుడపుడు మాట్లాడినారు , ’ ఆచార్యా , అపరిగ్రహమంటే ఏమనుకున్నావు ? ఎంతెంత ప్రయత్నించినా  అధీనమునకు రాని ఇంద్రియమనే మదపుటేనుగుకు అదే అంకుశము "  బుడిలులకు ఇంకా అపరిగ్రహపు జాడ్యము వదలలేదు . 


ఆచార్యుడు , "నేనొక మాట అనవచ్చునా ? " అని వినయముతో అడిగినాడు .


        బుడిలులు , " అడగవయ్యా , అడిగేవన్నీ అడగియే తీరవలెను . లేకుంటే అదే శలాక లాగా మారి, ఎప్పుడో ఒకసారి హృదయము శల్యమగును . " అన్నారు .


          " సరే , తమరు చెప్పేది ,  ఇంద్రియ జయము అనేది తప్పక సాధించవలసిన విషయము అని నమ్మిన వారికి . దానిని నమ్మక , ఇంద్రియ లోలత్వమే జీవనపు ముఖ్యోద్దేశము అని నమ్మినవారికి , అటులే ఆచరించువారికి ఈ అపరిగ్రహము వలన ఏమి ప్రయోజనము ? "


        బుడిలులు పకాలున నవ్వేశారు . " అదే మరి ! చీకట్లో కనబడక , గాడిద పిల్లను తెచ్చి మేకల మందలో కలిపేస్తే , గాడిద మేక అవుతుందా ? " 


" కాదు " 


          " అలాగే ఇది కూడా ! ఐతే చూడు , మానవ మాత్రుడన్నవాడు ఎవడైనా సరే , ఎల్లపుడూ ఇంద్రియ జయమునే అపేక్షించును . అలాగ లేనివాడెవడైనా ఒకడున్నాడంటే , వాడు దారితప్పి , మనిషిగా మారిన మృగము అనవచ్చు . స్వభావమనునది , మృగము వలె ఇంద్రియ లోలత్వము కాకుండా ఆటంకములను కలిగించును .. అలాగే మనిషి ఒకవేళ ఇంద్రియ లోలుడైతే అతడి స్వభావము ఏదో ఒక అడ్డమును తెచ్చి రంగములో వదలును . "


" ఈ కార్యము చేయుటలో స్వభావమునకెందుకు అంత శ్రద్ధ ? "


         " చూడు ఆచార్యా , స్వభావానికి శ్రద్ధాలేదు , అశ్రద్ధా లేదు . ప్రతి ఇంద్రియ కార్యమునకూ మనము కొంత విలువ నివ్వవలెను . అంటే , ఆ విలువకు తగిన శక్తి ఖర్చు అగుచుండును .  అంగడిలో వ్యాపారము చేయునపుడు , మనము తీసుకువెళ్ళిన ధనము చాలకపోతే అప్పుచేసి వస్తాము కదా ? అలాగే జన్మమెత్తునపుడు మనము కొంత శక్తిని తెస్తాము . అది సత్కార్యముల వలన వృద్ధియగును . దుష్కార్యముల వలన క్షీణించును . ఈ జన్మలో మనము చేయు కార్యములకు మనము తెచ్చుకున్న శక్తి చాలకపోతే , మన స్వభావము మనకు కొంత ఇచ్చును . అదికుడా చాలకపోతే , అప్పుడు ఇంద్రియ దౌర్బల్యము మొదలైనవి వస్తాయి . కానీ అది ఈ జన్మలోనే కావచ్చు , లేదా జన్మాంతరములో కావచ్చు . "


" జన్మాంతరము ఉన్నదని ఎలా నమ్మేది ? " 


         " ఆలోచన చేయగలవారందరూ నమ్ముతారు . ఒకవేళ నమ్మరనుకుందాము , నష్టమేమిటి ? సముద్రమును చూడనివాడు సముద్రము రెండు కొబ్బరిచెట్ల లోతు ఉందంటే నమ్మేదెలా అని శంకిస్తే , సముద్రపు లోతుకేమి నష్టము ? దానివలెనే , వదిలేయి . ఇంకేమి , మీ ఇల్లు కూడా వచ్చింది , ఈ పనికిరాని మాటలు ఇక్కడే వదిలేద్దాం . "


         ఆచార్యుని ఇల్లు వచ్చినది . ఆచార్యుడు పరుగెత్తివెళ్ళి తాను కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు , ఆ వేళకు వాకిలికి వచ్చిన ఆలంబిని బుడిలులకు పాద్యమునిచ్చి అర్ఘ్య ఆచమనములను తెచ్చిపెట్టింది . ఆచార్యుడు వచ్చి , బుడిలులను పిలుచుకువెళ్ళి కృష్ణాజినము వేసిన వేత్రాసనములో కూర్చోబెట్టాడు . అల్పాహారపు ఉపచారము కూడా అయినది . 


బుడిలులు అడిగినారు , " ఎక్కడ మన యాజ్ఞవల్క్యుడు ? " 


" ఇప్పుడే లేచి కాళ్ళు ముఖం కడుక్కుని వస్తున్నాడు . " 


        అంతలో యాజ్ఞవల్క్యుడు వచ్చి బుడిలులకు సాష్టాంగ నమస్కారము చేసినాడు . బుడిలులు , " సుఖీభవ ’ అని ఆశీర్వాదము చేసి , వాడిని తనవైపుకు ఎత్తుకున్నారు . వారి ముఖము ఉదయించు సూర్యునివలె విస్తారమైనది . ప్రకాశముగా కూడా అయింది . వాడిని ఎత్తుకొని తమ తొడపై కూర్చోబెట్టుకొని యథోచితంగా సత్కరిస్తూ , " సందేహము లేదు ఆచార్యా , నీ కొడుకు ఈ వయసుకే విప్రుడైనాడు . మన దూరపు ఆశ నెరవేరింది . ఇక వీడు దేవుని దయ వలన సర్వజ్ఞుడగును . ఈ చుట్టు పక్కల దేశములలో వీడిని గెలువగల విద్వాంసులే కాదు , వీడితో సమానులైన విద్వాంసులు కూడా ఉండరు . " అని తమ సంతోషమును ప్రకటముగా వ్యక్తపరచినారు . 


యాజ్ఞవల్క్యుడు ఏమీ తెలియనివాడివలె , " తాతా, నేను మిమ్మల్ని చూడాలనుకున్నాను " అన్నాడు


బుడిలులు విస్మయపు నవ్వు నవ్వుచూ , " కారణము ? " అన్నారు . 


         యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " నేను తమరిని రెండు మాటలు అడగవలెననుకున్నాను . అదేమో , మా తండ్రిగారిని అడుగలేదు . మీరు ఊ అంటే మిమ్మల్ని అడుగుతాను : లేదంటే వారినే అడుగుతాను " 


" నువ్వేమనుకున్నావు ? "


        " నాకు మా తండ్రి సగము చెప్పినారు , మిగతా సగము వారే చెప్పనీ అన్నారు . తమకు ఇష్టమైతే అలాగే కానివ్వండి , నేను తెలుసుకోవాలి , అంతే ! అది ఇక్కడినుండీ అయితేనేమి , అక్కడినుండీ అయితేనేమి ?  నాకెందుకు ?  " అన్నాడు . 


      బుడిలులు ముసిముసిగా నవ్వుతూ ఆచార్యులవైపు చూచినారు . ఆచార్యుడు , " నేనేమీ చెప్పించలేదు , అవన్నీ వాడి స్వంత మాటలు " అన్నాడు . 


     బుడిలులు యాజ్ఞవల్క్యుని వీపు నిమురుతూ , " అలాగేనయ్యా , అడుగు , పెరిగే ఈ చెట్టుకు నన్ను కూడా ఒక చెంబు నీరు పోయనీ " అన్నాడు.


        యాజ్ఞవల్క్యుడు  అన్నాడు , " నిన్న మా హోమధేనువు, ’ ప్రాణము అన్ని దేహములలోనూ ఉంది , ఈ జగత్తులో అంతటా ఉంది ’ అన్నది . దానిని సాక్షాత్కరించుకొనుట ఎట్లు ? ఇది మొదటిది , రెండోది , శాస్త్రమంటే ఏమి ? మనము దానిని తెలిసికొనుట ఎట్లు ? అది తెలిసినదనుదానికి గుర్తేమి ? " 


        బుడిలులు గంభీరులైనారు . " చూడయ్యా , యాజ్ఞ వల్క్యా , ప్రాణము గురించి విను , అది దేహములో నున్నపుడు అగ్ని అవుతుంది . అందుకే మనము అగ్ని పూజ చేసేది . అది కార్యము చేయునపుడు వాయువగును . దేహములో అయితే దానిని ప్రాణమంటాము , బయటికి శ్వాసిస్తూ ఉంటే దాన్ని వాయువు అంటాము . అదే , ఆకాశములో సర్వ ప్రాణధారియైన ఆదిత్యుడు కూడ. నువ్వు అగ్నిహోత్రమును స్వతంత్రముగా చేయు వరకూ ఇలాగే ధ్యానము చేస్తూ ఉండు , ఇక శాస్త్ర విషయము చెప్పేదా ? "


" చెప్పండి " 


         "చూడయ్యా , మనము వ్యవహారము చేసేది బహిర్ముఖము , అంతర్ముఖము అని రెండు విధములు . బహిర్ముఖమంటే , మనకన్నా విశాలమైన ఈ జగత్తులో ఇంద్రియ మనో బుద్ధుల చేత వ్యాపారము చేయునది . అది జాగ్రత్తు . ఒకవేళ అది తప్పిందనుకో , అప్పుడేమవుతుంది ? కలలా అవుతుంది . మేలుకుని ఉన్ననూ , కంటికి ఏమో కనిపిస్తుంది , చెవికి ఏమో వినిపిస్తుంది . అలాగ , విని , చూచుటలో ఒక నియమము ఉంది . , ఆ నియమానుసారముగా  కళ్ళు చూచి , చెవులు వింటే అప్పుడేమవుతుంది ? అప్పుడు అంతర్ముఖమవుతుంది . సామాన్యముగా మనమందరమూ బహిర్ముఖులము , ఎందుకో తెలుసా ? "


" యమధర్మ రాజు నచికేతునికి చెప్పినాడు కదా , తాతా ? " 


         " ఔనయ్యా , నాకు తెలిసినంతవరకూ అదొక్కచోటే దీనిని ప్రస్తావించినది . బ్రహ్మ , ఇంద్రియములను బహిర్ముఖంగా ఉంచాడట ! అందుకే మనము బహిర్ముఖులమే అయ్యాము . అయితే  , ధీరుడైన ఒకడు , అంటే , ఇంద్రియముల వశుడు కాకుండా , ఇంద్రియములను తన వశము చేసుకున్నవాడు అంతర్ముఖుడగును . అలాగ అంతర్ముఖుడయినాక ఏమవుతుందో తెలుసా ? " 


       యాజ్ఞవల్క్యుడు గంభీరముగా ఆలోచించినాడు : " ఇంద్రియములకు వశుడు కాక, ఇంద్రియములను వశపరచుకొన్నవాడు....? " 


          బుడిలులు పిల్లవాడి గంభీరమైన ఆ భావమును చూచి , తూష్ణీ భావముతో ఊరికే  కూర్చున్నారు . ఆలంబిని, ఆచార్యులు అక్కడే నిలుచున్నారు . వారు తమకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనట్టే , స్థంభముల వలె అవాక్కై నిలచి వింటున్నారు . 


          బుడిలులు కొనసాగించారు , " అలాగ ఇంద్రియములను వశపరచుకొన్నవాడు అంతర్ముఖుడగును. బహిర్ముఖ వ్యాపారములలో కళ్ళు ముఖ్యమైనవి . కళ్ళతో చూచుట సరే , కానీ కళ్ళతో చూచినదంతా , చెవితో విన్నపుడు ఆవృత చక్షుడవగలడు . అప్పుడు , చెవితో విన్నపుడే , అది శాస్త్రము . అంతవరకూ అది శాస్త్రమైననూ కానట్టే . అలాగ కళ్ళతో చూచినదానిని చెవితో విన్నప్పుడేమవుతుందో తెలుసా ? అంతవరకూ తాను చూచినది చెపుతున్న వాడు , శాస్త్రమును తెలుసుకొని తత్త్వజ్ఞుడగును . అంటే , తాను చూచిన మర్మపు అర్థమును తెలుసుకొని చెప్పువాడగును . " 


" మరి అంతవరకూ ? "


         " అప్పుడే చెప్పితిని కదా ? చూచినది తనకు తోచినట్లు చెప్పుతుండును . మనసుకు తోచినదానిని బుద్ధితో వివేచన చేసిననూ , అది అతత్త్వమే అవుతుంది కానీ తత్త్వమెలా అవుతుంది ? అలాగు తత్త్వజ్ఞుడగువరకూ ఆత్మజ్ఞుడెలా అవగలడు ? ఆత్మజ్ఞుడగువరకూ బ్రహ్మజ్ఞుడెలా అవగలడు ? బ్రహ్మజ్ఞుడగు వరకూ సర్వజ్ఞుడెలా అవగలడు ? కాబట్టి , తత్త్వజ్ఞుడు కావలెనని , చూచినదాని ’ దాని తనము ’ కనుక్కోవలె ననుకొన్నవాడు ,  శాస్త్రమును ఆశ్రయించును . అంతర్ముఖుడగు వరకూ శాస్త్రమును ఆశ్రయించడు . ఆవృత చక్షుడగు వరకూ అంతర్ముఖుడు కాలేడు , ఇంద్రియ మనో బుద్ధులు స్వతః తమకు  తోచినట్లు వర్తించు వరకూ ఆవృతచక్షుడు కాలేడు . ... కాబట్టి అన్నిటికన్నా ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకోవలెననునది మనకు ఆదేశము . అనంతరము మనసు  , తరువాత బుద్ధి .....ఇలాగ ఒకటొకటీ అదుపులోకి రాగలవు . కాబట్టి , తత్త్వమును చెప్పునది శాస్త్రము ! ఇంద్రియ మనో బుద్ధులు తన అధీనములో ఉన్నవాడికి మాత్రమే అది అర్థమగును . తెలిసిందా ? "


         యాజ్ఞవల్క్యుడు అనన్యసాధ్యమైన ఏకాగ్రతతో వింటున్నాడు : " అంటే , మా తండ్రిగారు చెప్పినట్లు , ఈ చివరలో నున్న శ్రేయస్సును పట్టుకున్న వాడికి శాస్త్రము ! దాని ఆ చివర పూర్ణము . పూర్ణమునకు పోవు దారి శాస్త్రము , అంతేనా ? " 


         బుడిలులు బహు సంతోషపడినారు : " బహు సులభముగా , గొప్పగా నిరూపించినావు , చూడు ఆచార్యా , వాడు చెప్పినది ఎంత సరళముగా ఉందో ! తనకు తోచినట్లు పోయే ప్రేయస్సు యొక్క దారి వదలి , శ్రేయస్సు వైపుకు తిరిగినవాడికి శరణమైనది శాస్త్రము . దాని చివర పూర్ణము . పూర్ణపు దారి శాస్త్రము !!  భలే  బాగా చెప్పావయ్యా ." 


         బుడిలులు అ మాటనే ఆలోచిస్తున్నవారిలాగా ఒక్క ఘడియ అదే ధ్యానములోనున్నారు . మూసిన కళ్ళు తెరచి , " ఆచార్యా , నీ కొడుకు సర్వజ్ఞుడగుటకే పుట్టినవాడు . గర్భాష్టమము వరకు వేచియుండవద్దు . గర్భ పంచమములోనే ఉపనయన సంస్కారము చేసెయ్యి " అన్నారు. 

Janardhana Sharma

సయాటికా నొప్పి -

 సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు - సూచనలు - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  గమనిక - 


        పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . డైరెక్టుగా ఫొన్ చేయగలరు .  


      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

హైందవం వర్ధిల్లాలి 8*

 *హైందవం వర్ధిల్లాలి 8*




సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థ మెరుగు పర్చుకోవాలి (v) :-  

క్రమం తప్పని దేవాలయ సందర్శనలు, సామూహిక తీర్థ యాత్రలు, పండుగల, పబ్బాల, పర్వ దినాల నిర్వహణ భారతీయ సంస్కృతిలోముఖ్యమైనవి.  మన విలువలు, భావోద్వేగాలు, ఆనందాలు, ఐక్యత పొందడానికి, అనుభవించడానికి ఇవన్నీ ఒక వేదిక,  ఒక మార్గం. ప్రభుత్వం గూడా ఇవన్నీ గమనించి ప్రజల సౌకర్యార్థం ముఖ్యమైన పండుగలకు సెలవులు ప్రకటించి ఉన్నది. *ఇట్టి సెలవులను సద్వినియోగం చేసుకో వలసి ఉన్నది, ఉంటుంది*. 


అందరికీ తెలిసిన విషయమే దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన, శక్తిమంతమైన ప్రార్థనా స్థలం, ఆధ్యాత్మిక కేంద్రం, పూజా నిర్వహణలకు ఆలయం. తమ తమ ఇష్ట దైవాలను ఆరాధించడానికి, భగవత్ దర్శన సంతృప్తి  పొందడానికి, మానసికొల్లాసానికి  తమ శ్రమైక జీవన సౌందర్యానికి కృతజ్ఞతలు భగవంతునికి తెలుపడానికి *ప్రతి హిందువు దేవాలయం వెళుతాడు*.  అన్ని మతాలవారు దేవాలయాలకు వెళ్తారు, *వారి వారి సంస్కృతులకు ప్రతినిధులుగా నిలుస్తారు*. 


*హిందువులలో ప్రతి వ్యక్తి దేవాలయాలకు క్రమం తప్పకుండా వెళ్ళాలన్న సంకల్పబలం  రావాలి, పెరగాలి.* ప్రతి రోజూ దేవాలయ సందర్శన అదృష్టమే, అద్భుతం కూడా. అవుతే ఆ అవకాశం అందరికి లభ్యము కాక పోవచ్చును. ఆయా దేవతా వారములు పునః స్మరణ చేసుకుందాము. 

ఆదివారం సూర్య దర్శనం (సూర్య దేవాలయాలు అరుదుగా ఉండవచ్చును, అటువంటప్పుడు ఏ  దేవాలయానికైనా వెళ్ళవచ్చును). సోమవారం శివాలయాలు మరియు చంద్ర దర్శనం. మంగళవారం 

శ్రీ ఆంజనేయ స్వామి, దుర్గా అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. బుధవారం

 శ్రీ వినాయక మందిరం, 

శ్రీ సరస్వతీ దేవాలయం,

 శ్రీ మహా విష్ణువు. గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ  దక్షిణా మూర్తి దేవాలయం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామి,

 శ్రీ ఆంజనేయ స్వామి, 

నవ గ్రహ దేవాలయాలు. ప్రజలు ఒంటరిగా లేక కుటుంబ సభ్యులతో వెళ్లి రావడం ఒక్కటే అనుసరణీయం కాదు. దైవ దర్శనం తదుపరి తోటి భక్తులతో అరమరికలు లేకుండా అభిమానంగా, ఆప్యాయంగా,  గౌరవంగా దైవ చర్చలు గాని ఇష్టా గోష్ఠి గాని నెరపాలి. 


*హిందువులందరు సమైక్యంగా ఉన్నప్పుడే క్షేమంగా ఉండగలరు, కావలసినవి సాధించుకోగలరు*. 

ప్రతి హిందువు *బలగం పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి, భద్రంగా ఉండాలి, తన జాతిని క్షేమంగా ఉంచాలి* *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

_సెప్టెంబరు 22, 2024_*

 ॐ 卐 ॐ

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌞 *_సెప్టెంబరు 22, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *పంచమి* రా9.21

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *భరణి* ఉ6.32

*కృత్తిక* తె5.23

యోగం: *హర్షణం* మ3.01

కరణం: *కౌలువ* ఉ10.22

*తైతుల* రా9.21

వర్జ్యం: *సా5.57-7.28*

దుర్ముహూర్తము: *సా4.19-5.07*

అమృతకాలం: *రా3.05-4.37*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.52*

సూర్యాస్తమయం: *5.57*

 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉